At a recent visit to Thousand Pillar Temple , Warangal ShreeBhadrakaali Temple, and Inavolu MallikaarjunaSwaami temple... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
శ్రీ మల్లన్న మాహాత్మ్యం... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
శ్రీరుద్రేశ్వరస్వామి వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ శ్రీభద్రకాళి ఆలయం మరియు ఐలోని మల్లన్న ఆలయం
( ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయం) దర్శనభాగ్యాంతర్గతంగా సాగిన కొంత ఆధ్యాత్మిక విషయవిశ్లేషణ....
( ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి ఆలయం) దర్శనభాగ్యాంతర్గతంగా సాగిన కొంత ఆధ్యాత్మిక విషయవిశ్లేషణ....
శ్రీశైల చెంచు మల్లన్న ( శ్రీ మల్లికార్జున స్వామి),
ఓదెల మల్లన్న, ( ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి )
ఐలోని మల్లన్న, ( ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి )
కొమ్రెల్లి మల్లన్న, ( కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి),
ఇంకా చాలా చోట్ల వివిధ " మల్లన్న " పేర్లతో తెలంగాణ ప్రాంతమంతా కూడా మల్లికార్జునస్వామి గా శివున్ని ఆరాధించడం మనకు కనపడుతుంది....
కొమ్రెల్లి మల్లన్న మినహా, మిగతా ముగ్గురు మల్లన్నల దర్శనభాగ్యం లభించడం నా జన్మాంతర సుకృతంగా భావిస్తూ, అసలు ఈ మల్లన్న పేరుతో సాగే శివయ్య అరాధన వెనక ఉన్న ఆధ్యాత్మికత ఏమి అని స్వామిని ధ్యానిస్తే లభించిన కొన్ని సమాధానాలు....
శైవ / శివశక్త్యారాధకులైన తెనగ/తెనుగు/తెలగ/తెలుగు అనే పేర్లతో వ్యవహరించబడే సామాజిక వర్గం వారు ఎక్కువగా నివసించడం వల్ల ఈ ప్రాంతానికి తెలగాణ --> తెలంగాణ అనే పేరు రావడం, శ్రీశైలం, కాళేశ్వరం, దక్షారామం అనే 3 ప్రఖ్యాత శివాలయాలు హద్దుగా ఉండే త్రిలింగ దేశంగా ఖ్యాతి గడించి తెనుగు / తెలుగు నేలగా ఈ ప్రాంతం ప్రాచీనత సంతరించుకోవడం, ఇలా ఈ తెలుగు నేల యొక్క విశ్వవిఖ్యాత వైభవం అందరికి తెలిసిందే....
ద్రవిడ సంప్రదాయం లా, ఈ నేలపై జన్మించిన ప్రాచీన కవులు, రాజులు, తెనుగు భాషా వైభవాన్ని శిఖరాయమానమైన కీర్తితో సాహిత్యారాధన గావించి భావి తరాలకు అందించడం అందరికి విదితమైన చారిత్రక సత్యములు...
కవిత్రయం గా వినుతికెక్కిన "నన్నయ-తిక్కన-ఎర్రన" గారి ఆంధ్రమహాభారతం నుండి సాటిలేని మేటి గ్రంథరాజమైన శ్రీ బమ్మెర పోతనామాత్యులవారు తెనిగించిన "శ్రీమద్భాగవతం" వరకు, ఆంధ్రభోజుడిగా, అపర సాహిత్యారాధకుడిగా పేర్గాంచిన శ్రీకృష్ణదేవరాయల వారు అష్టదిగ్గజాలుగా కవులను తమ రాజసభలో శాశ్వత సారస్వతసచివులుగా ఆదరించడం, వారే స్వయంగా
" ఆముక్తమాల్యద " అనే కావ్యాన్ని రచించడం, ఇత్యాదిగా అక్షరభారతికి ఈ నేలపై సాగిన సాహితీసుమార్చన విశేషాలు అందరికి తెలిసినవే కదా...
" ఆముక్తమాల్యద " అనే కావ్యాన్ని రచించడం, ఇత్యాదిగా అక్షరభారతికి ఈ నేలపై సాగిన సాహితీసుమార్చన విశేషాలు అందరికి తెలిసినవే కదా...
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి గారి శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గతస్ఫురితమైన అధ్యాత్మసాహిత్యసౌరభాన్ని ఆధారంగాచేసుకున్నప్పుడు ధ్యానగోచరమైనవి ఈ క్రింది కొన్ని విషయాలు...
శివుడిని " మల్లన్న " అని సంబోధించి ఆరాధించేక్రమంలో ప్రాచీన విజ్ఞ్యాన ఘనులు ఎన్నో సత్యాలను అందులో నిక్షిప్తం గావించారు...
" మల్ల + అన్న = మల్లన్న "
అనే పద బంధనం వాడుక సంప్రదాయంలో ఎములాడ రాజన్న (వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి), భద్రగిరి రామన్న (భద్రాచల శ్రీరామచంద్రమూర్తి), ఏడుకొండల ఎంకన్న (తిరుమల సప్తాచల శ్రీశ్రీనివాస సార్వభౌముడు), యాదగిరి నరసన్న (యాదాద్రి శ్రీలక్ష్మినరసిమ్హస్వామి), అనేలా ధ్వనించినా ఇక్కడ గమనించగలిగితే సాహిత్యపరంగా మరికొంత విశిష్టత కూడా ఉంది...

మల్లి అన్న = మళ్ళీ అన్నాను...
మల్లి అన = మళ్ళీ అనను...
మల్లన్నో మల్లన్న = మళ్ళీ మళ్ళీ అన్నాను...
మల్లి అన = మళ్ళీ అనను...
మల్లన్నో మల్లన్న = మళ్ళీ మళ్ళీ అన్నాను...
అంటే.. " ఆశల యావతో కావించిన పాపపుణ్యకర్మల సంచిత ప్రారబ్ధకారణంగా నీలో ఐక్యం కాలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే వచ్చాను...
అందుకే ఓ ఈశ్వర నిన్ను ఇప్పుడు మళ్ళీ పిలవాల్సివచ్చింది....
అందుకే ఓ ఈశ్వర నిన్ను ఇప్పుడు మళ్ళీ పిలవాల్సివచ్చింది....
ఇకనైనా నీ కృపతో మల్లియ లాంటి ( మల్లె పూవు) నా మనసును నీ నిరంతర పూజాసుమంగా స్వీకరించి నా కర్మసంచయాన్ని సమూలంగా దగ్ధంచేసి నిన్ను మళ్ళీ మళ్ళీ పిలిచే అవసరం లేకుండా అంటే మళ్ళి పుట్టకుండా నీలోకి నన్ను కలిపేస్కోవా...." అనే భావం తో మోక్షగామియై ఈశ్వరున్ని పిలుస్తూ అర్ధించడం...!
గ్రామీణప్రాంతాల / పల్లెప్రజల ఆరాధనావిధానాన్ని కొంచెం గమనిస్తే " శివయ్య " అనే నామం కంటే " మల్లన్న " అనే నామం తోనే ఆ భోళాశంకరుని ప్రార్థనలు ఎక్కువగా ఉంటాయి...
మన సనాతన సంప్రదాయం లో తండ్రి తర్వాత అంతటి స్థానం, గౌరవం అన్నకు ఇవ్వబడింది.... అక్కచెల్లెల్లకు, తమ్ముళకు తండ్రి తర్వాత తండ్రి ఆన్న కాబట్టి, ఆ విలువ తెలిసిన వారు అన్నకు ఇచ్చిన మరియాదలా, ఈశ్వరున్ని కూడా " అన్న " పదం/శబ్దంతో అన్వయించి ప్రార్ధించడంలో, ఆ అందరికి మాతాపితలైన ఆదిదంపతులు ఉమామహేశ్వరులనే, అన్నయ్య లో అయ్య లా, వదినమ్మ లో అమ్మ లా, ఉండి కరుణించి ఇంకొంచెం ఎక్కువ వాత్సల్యంతో జీవుడి బాధ్యత తీసుకొమ్మని ప్రార్ధిస్తున్నట్టు ఇక్కడ మనం భావించవచ్చు....
ఇందులో మరో విశేషం, శివలింగ స్వరూపంగా అరూపరూపియై, సర్వవ్యాపియై ఉండే నిరాకారుడైన శివుడికి, మల్లన్న గా సాకార రూపాన్ని అన్వయించి ప్రార్ధించడం... శివుడు ' కోరమీసాల మల్లన్న ' గా వివిధ మల్లికార్జున క్షేత్రాల్లో సాకారపరమాత్మగా ఉండడం చూస్తూనేఉంటాం కదా... మల్లె / మల్లియ / మల్లిక జాతి పుష్పములకు మత్తెక్కించే పరిమళము అధికము...
భోళాశంకరుడి గా, ఆదియోగి గా, సదాశివుని గా, దేహమంతా విభూతిధారియై ఉండే శివుడి తిరుమేనికి కూడా అటువంటి మత్తెక్కించే దైవిక పరిమళము అధికము... అందుకే ఆయన అడగకపోయినా సరే వివిధ దేవతా సర్పాలు మేము నీతోనే ఉంటాం అంటూ ఠక్కున ఆయనకు వచ్చి చుట్టుకుంటాయి... ఏ క్షేత్రంలోనైనా నాగాభరణుడిగా కాకుండా, నాగుపడిగెల కవచం / శిరస్త్రానం / ఆచ్ఛాదన లేకుండా శివయ్య ఉండడం చాలా చాలా అరుదు...అయ్యొ పాపం అన్ని పాములు వచ్చి చుట్టుకుంటే స్వామికి ఇబ్బందిగా ఉండదా అనుకోవడానికి లేదు...
అన్ని లోకాలను తృటిలో దగ్ధం చేయగల ప్రళయాగ్నిసమమైన క్షీరసాగరమథనజనిత హాలహలాన్నే కంఠమందు నీలమణిగా స్వీకరించిన శివుడికి అదేం పెద్ద విషయం కాదనుకోండి..![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
భోళాశంకరుడి గా, ఆదియోగి గా, సదాశివుని గా, దేహమంతా విభూతిధారియై ఉండే శివుడి తిరుమేనికి కూడా అటువంటి మత్తెక్కించే దైవిక పరిమళము అధికము... అందుకే ఆయన అడగకపోయినా సరే వివిధ దేవతా సర్పాలు మేము నీతోనే ఉంటాం అంటూ ఠక్కున ఆయనకు వచ్చి చుట్టుకుంటాయి... ఏ క్షేత్రంలోనైనా నాగాభరణుడిగా కాకుండా, నాగుపడిగెల కవచం / శిరస్త్రానం / ఆచ్ఛాదన లేకుండా శివయ్య ఉండడం చాలా చాలా అరుదు...అయ్యొ పాపం అన్ని పాములు వచ్చి చుట్టుకుంటే స్వామికి ఇబ్బందిగా ఉండదా అనుకోవడానికి లేదు...
అన్ని లోకాలను తృటిలో దగ్ధం చేయగల ప్రళయాగ్నిసమమైన క్షీరసాగరమథనజనిత హాలహలాన్నే కంఠమందు నీలమణిగా స్వీకరించిన శివుడికి అదేం పెద్ద విషయం కాదనుకోండి..
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
పాములకు ఉన్న ప్రత్యేకత శివయ్యకు అలా వాటిని ఆభరణాలుగా ఉండే అదృష్టం కలిగించిందేమో...
మరే జీవులకు లేని విధంగా సర్పాలకు ఎన్నెన్నో ప్రత్యేకతలు....
భూమిపై ఇతర అన్ని ప్రాణుల్లాగ ఉండగలగడం, పుట్టల్లో / భూమి బొరియల్లోనూ ఉండగలగడం, చెట్లపైకి పాకి పక్షుల్లాగా ఉండగలగడం, నీటిలో జలచరాల్లాగా ఉండగలగడం, అరుదైన దేవసర్పాల జాతికి చెందినవి అమూల్యమైన నాగమణిని కలిగిఉండడం, కామరూపులుగా/ఇచ్ఛారూపులుగా ఉండగలగడం, వడిలిపోయిన దేహ ఉపరితలాన్ని కుబుసంగా వదిలేసి నూతన చర్మ శరీరనిర్మాణాన్ని చేసుకోగలగడం, అసలు నాగుల కోసం ప్రత్యేకంగా ఒక నాగలోకమే ఉండడం, ఇలా భౌతికంగా పాములప్రత్యేకతలు ఎన్నెన్నో...

ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, ప్రతి మనుష్యప్రాణియొక్క జన్మకు మూలకారణమైన వీర్యకణముల వ్యవహార శైలి అచ్చం పాములను పోలినట్టే ఉండడం, అసలు ప్రతిప్రాణియొక్క విశిష్ట గుర్తింపైన జీవకణజాల జన్యురూపం కూడా పాముల వలెనె ఉండడం, ప్రతి మనుష్యుడికి మూలాధారచక్రంలో చుట్టచుట్టుకొని పడుకున్న నాగులా కొలువైఉండే కుండలిని శక్తిని, యోగసాధలో ఆత్మానుభవానికి తీసుకువచ్చే క్రమంలోని షడ్చక్రభేదనం సర్పగతిలోనే సాగడం, (ఇది కేవలం యోగ్యులైన సద్గురువుల అనుగ్రహం / తర్ఫీదు తో మాత్రమే సాధ్యం సుమా..), ముఖ్యమైన నాగ దోష నివారణకు సుబ్రహ్మణ్యస్వామిని ఊర్ధ్వగమన జంటనాగుల ప్రతిరూపంగానే ఆరాధించడం, ఒక ఆలయంలో కొలువైన దైవం యొక్క కృపావీక్షణం దర్శించే భక్తుడిపైకి సర్పగతిలోనే ప్రసరించడం, ఇలా ఎన్నెనో విషయాలకు పాములతో గాఢమైన సంబంధం ఉండడం మన చూస్తూనేఉంటాం కద...
ఎంతోమంది పాములంటే భయ / ద్వేషభావనతోనే చూస్తారు...
కాని అది నిజంకాదు.. చాలావరకు నాగజాతులు స్నేహశీలమైనవి... అనవసరంగా ఎవ్వరి జోలికి వెళ్ళకుండా వాటిపని అవే చేసుకుని జీవించే ప్రాణులు...అన్నదాత అయిన రైతుకు తన పంటను ఎలుకలు / ఇతర జీవులు పాడుచేయకుండా రక్షించే మొదటి మితృడు సర్పమే... ప్రార్ధించిన వారి జన్మజాతకస్థిత ఎన్నెనో దోషాలను హరించి వారిని అన్నివిధాల అనుగ్రహించే ఉదాత్త జీవులు నాగులు...అందుకే ఎంతోమంది దైవ భావంతో ఆరాధిస్తారు...
కాని నాగులు ఎంత స్నేహపూరితమైనవో అంతే విశేషమైన శక్తిగల ప్రాణులు కూడా...కావాలని వాటిని వివిధరకాలుగా ఇబ్బంది పెట్టి వేధించిన వారిని జన్మజన్మలకు సైతం గుర్తుపెట్టుకొని మరీ తమకు కలిగిన బాధకు జవాబిస్తాయి...యెల్లవేళలా భౌతికంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా, దైవికంగా అవి తమదైన శైలిలో సమాధానపడేంతవరకు సమాధానమిస్తాయి.... కాబట్టి నాగులను ఈశ్వరాభరణాలుగానే భావించి మెలగడం శ్రేయస్కరం...
శ్రీమహావిష్ణువుకు తల్పంగా, ఛత్రంగా, ఇత్యాదిగా ఆదిశేషుడు ఎంతో ఆప్తుడు, సదాశివునకు తనువెల్లా ఆభరణాలుగా నాగులు ఎంతో ఆప్తులు, గణపతికి దైవిక యజ్ఞ్యోపవీతంగా నాగు మంచి మితృడు, ఇక షణ్ముఖుడు జంటనాగుగా ఆరాధనలు స్వీకరిస్తుంటాడు, అసలు మన భూమిని తన ఫణములపై దయతో ఆదిశేషుడు మోస్తున్నందుకే కదా మన జీవనంసాగేది... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png)
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ
నమః శివాయ .. 🙏🙏🙏🙏🙏 ☺️
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై “న” కారాయ
నమః శివాయ .. 🙏🙏🙏🙏🙏 ☺️
No comments:
Post a Comment