Saturday, February 23, 2019

శ్రీకృష్ణ కరకలిత నవనీతమే తెలుగు భాషా రసగీతం...😊

Vinay Kumar Aitha shared a photo.
4 mins
తెనుగు భాషే తోరణాలుగా తొలినాటి కవులెందరో కట్టిరి కమనీయ కవన కదంబ కుసుమాల కావ్యకలికలు....
తెరిపిలేని పదబంధనతటముల తెలుగు వెలుగులు విరజిమ్మే తేట పద్యాల శతకాలను అందించిరి ఆనాటి నుండి ఈనాటి వరకు మాన్యులెందరో...
సామాన్యులకు సైతం తెలుగు తియ్యందనము సదా రసస్ఫోరకమై పరిఢవిల్లు రీతిలో రాసిరి రచయితలెందరో రమణీయ రాగప్రయుక్త మధురగేయాలు...
మరే భాషకి లేనంత ప్రాముఖ్యతని, మహిమ్నతను, దైవత్వాన్ని, తనలో ఇముడ్చుకొని
యుగయుగాలకు జగజగాలకు వన్నె తరగని పద్యగద్య గీర్వాణంతో అలరారే, శ్రీ బమ్మెర పోతనామాత్యులవారు తెనిగించిన శ్రీమద్భాగవతం, ఏ సారస్వత సాహిత్య శిఖరాలకు అందనంత ఎత్తులో తెలుగు భాషా వైభవాన్ని స్థిరీకరించడం జగద్విదితమే...!
కలియుగ ప్రత్యక్ష దైవమైన సప్తాచల శ్రీశ్రీనివాస పరదైవాన్ని స్తుతిస్తూ రచించబడిన కృతులతో శ్రీ తాళుల పాక అన్నమయ్యంగారి కలంలోకి చేరిన తెలుగు భాషావైభవం ఏ కొలమానాలకు అందనిది... అన్ని కాలాలకీ కాలాతీతమైన ఖ్యాతి గడించిన శ్రీకృష్ణ కరకలిత నవనీతమే తెలుగు భాషా రసగీతం...😊
-ఇట్లు
- సాక్షాత్ శ్రీరామచంద్రులు తమ భుజస్కందములపై వంటపాత్రలను మోసుకొచ్చి, " శ్రీ పమిడిఘంటం వేంకటహరిదాస్ " అనే నిరతాన్నదానశీలి అయిన ఒక మహా భక్తుని కోసం శ్రీవైకుంఠమునండి భద్రగిరిపైకి నడిచివచ్చిన తెలుగు నేలపై జన్మకు నోచుకున్న వినయకుమారుడు అనే ఒక ధన్యజీవుడు... 😀
Brahmasri Chaganti Koteswara Rao Garu
తెలుగుభాషను గూర్చితెలుగులిపిని గూర్చి కొంత పరిశీలిద్దాం. ఈ రెంటిలోనూ కొన్ని విశేషా లున్నవి. పరాశక్తి యంత్రానికి తెలుగులిపి ఉపయోగింపబడ్డది. పరాశక్తి స్త్రీస్వరూపిణి. అమ్మవారికి వామావర్త పూజ ఏర్పడిఉన్నది. తెలుగులిపి కూడా వామావర్తమైనది. అనగా ఎడమప్రక్క చుట్టివ్రాయబడేది. తక్కినవి దక్షిణావర్తమైనవి. అనగా కుడిప్రక్కకు చుట్టివ్రాయబడేది. ఆవర్త మనగా చక్రం. తెలుగు వర్తులాకారలిపి, అందులోనూ వామావర్తం. వామావర్తపూజ లందుకొనే అమ్మ వారి యంత్రంలోనూ చక్రంలోనూ తెలుగులిపి వున్నది. అందుచే తెలుగులిపి పరాశక్తి ప్రధానమై ఉన్నది. తెలుగుభాష శివప్రదానం. లిపి శక్తిస్వరూపం. భాష శివ స్వరూపం. వాగర్థాలు పార్వతీపరమేశ్వరులనికదా కాళిదాసు రఘువంశంలో అన్నాడు. తెలుగుభాష శివప్రధానమైన దని గుర్తించినది అప్పయదీక్షితులవారు. వారు పరమశివభక్తులు. దక్షిణాదిని, ఆరణి (తమిళనాడు) అనుఊరికి సమీపంలోఉన్న ఆడెయపాలెం వారు పుట్టినఊరు.దక్షిణ భారతాన శివోత్కృష్టత స్థాపించినవారు. ఈక్రిందిశ్లోకం చెప్పారు.
ఆంధ్రత్వ మాంధ్రభాషా చా ప్యాంధ్రదేశః స్వజన్మభూః,
తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్||
ఆంధ్రం త్రిలింగదేశం. దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినది. దక్షిణాన దక్షిణకాశి కాళహస్తిక్షేత్రం ఉన్నది. పడమట శ్రీశైలక్షేత్రమున్నూ, ఉత్తరమున కోటిలింగక్షేత్రమున్నూ ఎల్లలుగాకలది ఆంధ్రదేశం. అట్టి త్రిలింగదేశంలో తాను జన్మించలేదన్న విషయమూ ఆంధ్రభాష తన మాతృభాష కాకపోయినదే అన్నసంగతీ ఆయనకు కొరతయట. ఇవి రెండేకాక మరొక్క కొరతకూడా ఆయన కున్నదిట.
ఆంధ్రులు శైవులైనా సరే, వైష్ణవులైనాసరే, అక్షరాభ్యాస సమయంలో ''ఓం నమః శివాయ'' అని చదువు ప్రారంభిస్తారు. జన్మతారకమైన శివపంచాక్షరి జీవితానికి ప్రథమ సోపానంగా ఈభాష నేర్చేవారికి ఏర్పడిఉన్నది. పంచాక్షరి, యజుర్వేదమధ్యంలో ఉన్నది. అంటే యజుర్వేదం శివసంబంధమైనది. దానికి తగినట్టు తెలుగువారిలో యజుఃశాఖేయులు ఎక్కువమంది. అంటే యజుర్వేదం పఠించేవారు ఎక్కువ. సామశాఖీయులులేనేలేరు. ఋగ్వేదుల సంఖ్యకూడా తక్కువ. ఇట్లా సామశాఖేయులున్నూ పరమశివ భక్తులు అయిన అయ్యప్ప దీక్షితుల వారు శివసంబంధమైన తెలుగు దేశంలో జన్మించకపోతినే అని విచారపడేవారట. తెలుగుకు లిపి శక్తిస్వరూపమై, భాష శివస్వరూపమై ఎల్లలుత్రిలింగములై, వేదము యజుర్వేదమై ఒప్పుతుండడం ఒక విశేషం.

No comments:

Post a Comment