శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి 611 వ జయంత్యుత్సవం....! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
" అన్నమాచార్యులవారి సంకీర్తన " అనే మాట వినపడకుండ, ప్రపంచవ్యాప్తంగా కొలువైన సంగీతసాహిత్యారాధకులకే కాకుండా, కేవల లౌకిక ప్రశాంతత కోసమైనా కీర్తనలు వినేవారికి సైతం ఏ రోజు గడవదు....
ఆచార్యులను, వారి ఆనతిని, బాహ్యమున శ్రీవేంకటహరిలీలావిలాసభరిత గౌణములై ఆంతరమున గంభీరమైన అధ్యాత్మ శరణాగతిబోధ తత్వసూచికలై అలరారే వారి సంకీర్తనా సంపుటిని, వాటిద్వార భక్తభాగవతులకు సమకూరే అమేయమైన శ్రీనివాసానుగ్రహాన్ని యథోచితంగా స్మరించి వారికి కృతజ్ఞ్యతలను అర్పించుకోవడం కోసం ప్రత్యేకంగా వారి జయంతిగా జరుపబడే ఈ రోజు ప్రశస్తమైనందున విశేషించి ఎందరో సంగీతసాహిత్యోపాసకులకు చాల ప్రియమైన రోజు...... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
మనకు బాగా దెగ్గరివారై బర్త్ డే రోజని తెలిసి కూడా ఎవరైన విష్ చేయకుంటే మనం ఎంతగా వారి యొక్క విస్మృతికి విస్మయం చెందుతామో.....
అట్లే ఈ కలియుగపు భక్తభాగవతుల్లెలరికి ఎంతో ఆప్తులై, అందరికి ధర్మార్థకామ్యమోక్షములనే చతుర్విధపురుషార్ధాలను అత్యంత సులభంగా ఆర్జించి పెట్టే హరిభక్తిసౌలభ్యాన్ని ప్రతిపాదించబడిన సంకీర్తనసంపుటుల అనుగ్రహవిశేషంచేత మనజీవితాలను సుఖప్రదం చేసే వారి వాంజ్ఞ్మయ యజ్ఞ్యాన్ని ఇవ్వాళ విశేషంగా స్మరించకుంటే, ఆచార్యులు కూడా అట్లే విస్మయం చెందవలసిందే కదా. ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
శ్రీవైష్ణవ భాగవతాగ్రేసరులై స్వామిని నిత్యం తమ పదకవితల పుష్పాలతో శ్రీపాదార్చనగావించే పనిలోనే నిమగ్నమై ఉండే ఆచార్యశిఖామణులు అలా భావించవలసిన పనిలేకపోయినా, ఆ భగవంతుడు మాత్రం ఫీల్ అవుతాడు మన విస్మృతికి అని నా భావన...... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
ఎందుకంటే, ఈ కలియుగపు లక్షణాలను, లుప్తమైపోయే స్వచ్ఛతతో, బాహ్యాంతర మనోశరీర వాతావరణ సామాజిక ఆచారవ్యవహార ఆహార ఆహార్య భావ భవ కాలుష్యంతో సతమతమవుతూ, మందబుద్దితో, రోగగ్రస్త జీవనంతో, భౌతిక మరియు ఆధ్యాత్మిక ఐశ్వర్యలేమితో ఇక్కట్లమధ్య గడిచే మనుజుల దైనందిన జీవితాన్ని ద్వాపరం నాడే భాగవతాంతర్గతంగా ఈ లోకానికి తెలిపి, కలియుగంలో వాటన్నిటికి విరుగుడు నిత్యం భగవద్ నామరూపగుణవైభవ సంకీర్తనమే అని తెలిపి, మానవాళికి ఆ భాగ్యం సాధికారికంగా సశాస్త్రీయంగా అందివ్వడానికి ఎందరెందరో పుణ్యజీవులను సద్గురువులుగా, సంకీర్తనాచార్యులుగా, ఈలోకంలో ఆయా దేశకాలానుగుణంగా ప్రభవింపజేసి,
" సకృదేవప్రపన్నాయతవాస్మీతీచయాచతే అభయంసర్వభూతేభ్యో దదామియేతద్వ్రతం మమ " అని తన త్రేతాయుగం నాడు కోదండరాముడిగా శ్రీరాముడిగా ఇచ్చిన అభయాన్ని, ఈనాటి కలియుగ పర్యంతం వరకు కూడా కోనేటిధాముడిగా శ్రీవేంకటరాముడై నిలుపుకుంటున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు....
ఆ భగవద్ అనుగ్రహన్ని సద్గురువుల ద్వారా, ఆచార్యులద్వారా అందిపుచ్చుకొని జీవితాలను నిలుపుకోవడమే మన విహిత కర్తవ్యం....![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
" సకృదేవప్రపన్నాయతవాస్మీతీచయాచతే అభయంసర్వభూతేభ్యో దదామియేతద్వ్రతం మమ " అని తన త్రేతాయుగం నాడు కోదండరాముడిగా శ్రీరాముడిగా ఇచ్చిన అభయాన్ని, ఈనాటి కలియుగ పర్యంతం వరకు కూడా కోనేటిధాముడిగా శ్రీవేంకటరాముడై నిలుపుకుంటున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు....
ఆ భగవద్ అనుగ్రహన్ని సద్గురువుల ద్వారా, ఆచార్యులద్వారా అందిపుచ్చుకొని జీవితాలను నిలుపుకోవడమే మన విహిత కర్తవ్యం....
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
అన్నమాచార్యుల పౌతృలు చినతిరుమలాచార్యుల వారు రచించిన " అప్పని వరప్రసాది అన్నమయ్య " అనే కృతిలో,
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
వేదవిభాగం గావించిన శ్రీవేదవ్యాసమహర్షులవలే,
దేవభాష అయిన సంస్కృతం లో శ్రౌతవిద్యగా మహర్షులకు, యోగులకు, జ్ఞ్యానఘనులకు మాత్రమే అందివచ్చిన వేదప్రతిపాదిత భగవద్ తత్వాన్ని ఒడిసిపట్టి,
దేవభాష అయిన సంస్కృతం లో శ్రౌతవిద్యగా మహర్షులకు, యోగులకు, జ్ఞ్యానఘనులకు మాత్రమే అందివచ్చిన వేదప్రతిపాదిత భగవద్ తత్వాన్ని ఒడిసిపట్టి,
పండిత పామర భేదంలేకుండ ప్రతిఒక్కరు పాడిపరవశించే విధంగా ఎంతో సరళమైన మధురాతిమధుర తెనుగుమాండలిక పదకవితల్లోకి ఒలికించి,
అధ్యాత్మ, శృంగార, వైరాగ్య సంకీర్తనలుగా వాటిని విభాగించి, మానవాళికి అందించిన అభినవ వ్యాసులువారు అంటూ అన్నమాచార్యుల ఔదార్యాన్ని, వారి సంకీర్తనల అనుగ్రహవిశేషాన్ని మనకు తెలుపుతూ, తుదకు
అధ్యాత్మ, శృంగార, వైరాగ్య సంకీర్తనలుగా వాటిని విభాగించి, మానవాళికి అందించిన అభినవ వ్యాసులువారు అంటూ అన్నమాచార్యుల ఔదార్యాన్ని, వారి సంకీర్తనల అనుగ్రహవిశేషాన్ని మనకు తెలుపుతూ, తుదకు
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాథునీచ్చే
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాథునీచ్చే
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
అంటూ భగవంతుడు కొందరికి మాత్రమే అందే ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి దాహార్తిని తీర్చే ఆషాఢనీలమేఘం వంటివాడు, కాబట్టి మనుజానీకాన్ని తరింపచేసే ఆ స్వామి అస్టాక్షరి మంత్రం కేవలం తనకు మాత్రమే కాదు, ప్రతిఒక్కరికి చెందాలి అని గుడి గోపురంపైకెక్కి మరీ అలనాడు చాటి చెప్పిన శ్రీరామానుజుల సిద్ధాంతాలాను అందిపుచ్ఛుకొన్న మార్గాన్ని అవలంబించి, ఈ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రతి ఒక్కరికి పసందైన విందు లాగ అనుగ్రహించారు
అన్నమాచార్యులు అంటూ తెలిపి, ఆ శ్రీవేంకటహరిని మనం కూడా ఆచార్యుల వారిలా సేవించి తరిద్దామని సెలవిచ్చారు.....![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
అన్నమాచార్యులు అంటూ తెలిపి, ఆ శ్రీవేంకటహరిని మనం కూడా ఆచార్యుల వారిలా సేవించి తరిద్దామని సెలవిచ్చారు.....
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/ta5/1.5/16/1f642.png?_nc_eui2=AeEjg0htOjOo15xEUla2dgHVLVdABpSKQY7AdS52S2dvRJZdKDhLBH2sjTuW_JOlKsOko_NNEGlPxQryAANLXiySYexWukhkxyQo7BVH6LNxlw)
అన్నమాచార్య దివ్యతిరువఢిగళే శరణం.....🙏
No comments:
Post a Comment