Wednesday, May 15, 2019

Happy birthday to you my dear Harita - 27-04-2019.👏🍔🍟🍦🍧🍨🙌

Vinay Kumar Aitha is feeling festive with Harita Baddula.
హరిణచయములు హొయలొలికించు హరితవనాన విరబూసిన విరిసరముల వన్నెలునీవైతే....
వాటి సౌరభాలకు కారకుడనైన సారంగుడను నేను.... 😊
హిమగిరిసానువులకు సొబగులనలదే తుహినకలికలునీవైతే....
వాటికి వెలుగుజిలుగులును కూర్చే భాస్కరుని భవ్య భాసను నేను...😊
నిశీధి కన్యకు జతవై వెన్నెల కిరణాలను ఆస్వాదించగోరే చకోర కాంతవునీవైతే...
నీ నయనారవిందములమెరిసే కాంతి రేఖలకు కారకుడనైన శరత్కాల రజనీకరుడను నేను... 😊
కర్ణపేయమైన కలకూజితముల కోయిలవు నీవైతే... ....నీలో పులకింతకు కారణమైన లేలేత వసంత వికసిత రసాల పల్లవమును నేను....😊
శ్రీశ్రీనివాసుని శ్రీచరణాలను అలంకరించి ఆనందించగోరే భౌమవాసరపు అష్టదళపసిడిపద్మము నీవైతే....నీ దళములకు తావిని అలదిన స్వర్ణకారుడను నేను...😊
ఆ సప్తగిరుల శ్రియఃపతి గోవిందుని అనుగ్రహంతో మరెన్నో పుట్టినరోజులను నువ్విలా నవ్వుకుంటూ జరుపుకోవాలని అభిలషిస్తూ, ఆంగ్ల జన్మదినోత్సవ శుభాకాంక్షలతో కూడిన నీ శ్రీవారి శుభాశీస్సులు.....😊
Happy birthday to you my dear Harita......👏🍔🍟🍦🍧🍨🙌

No comments:

Post a Comment