ఆస్మద్ గురుదేవుల "శ్రీఅరుణాచలవైభవం" ప్రవచనం విన్నవారికి తెలిసినట్టుగా, ఒక విదేశీయుడు ఎంతో కాలంగా మోక్షగామియై శ్రీరమణుల ఆశ్రమానికి వచ్చి కొన్ని సంవత్సరాల తరబడి ఎదురుచూసినతర్వాత,
"ఇక ఈయన నోరు తెరిచి మనకు ఏమి చెప్పేలా లేరు.....
ఇక వెళ్ళిపోదాం మన దేశానికి....."
అని అనుకుంటున్న సమయంలో, రమణులు కేవలం తమ తీక్షణమైన దృష్టిని వారిపై ప్రసరించి, కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలితంగా మాత్రమే సిద్ధించే అద్వైతానుభవాన్ని ఆ భక్తునికి మీనాక్షి తత్వంతో అనుగ్రహించి, ఉత్తర క్షణంలో వారు ఇన్ని సంవత్సరాలుగా దేనికోసం పరితపించారో అది లభించడం,
శ్రీరమణులు శ్రీదక్షిణామూర్తివలె తమ సందేహాలన్నీ నివృత్తి చేయడం, వారు ఇక అప్పటినుండి కోరుకున్నప్పుడల్లా అద్వైతభావనలో మనోస్థిరీకరణ సాధించి ఆత్మానుభవాన్ని పొందగలగడం, ఇవన్నీ జరిగాయి.....

ఇక్కడ సాధకులు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నయి...
1. ఆశ్రమానికి వచ్చిపోయే ఎందరో విదేశీయులు మరియు అక్కడే ఉండే ఎందరో స్థానికులు....
వీరందరిని పక్కనబెట్టి కేవలం ఆ ఒక్క భక్తునికే శ్రీరమణులు కైవల్యసిద్ధికి మార్గాన్ని ఎరుకపరచుట తగునా...?

2. పైకి అందరిలా ఆ విదేశీయుడు గొప్ప ఆస్తికుడిగా పూజలు పునస్కారాలు చెసినట్టు ఏమిలేదు కదా, మరి అంతటి అర్హత ఎట్లుఒనగూరెను ...?
3. మరలా అటువంటి మోక్షసిద్ధిని
తమ మాతృమూర్తికి ఆఖరి గడియల్లో అనుగ్రహించి జన్మాంతర కర్మలను మనోమయకోశంలోనే అనుభవానికి గురిచేసి, కైవల్యాన్ని అనుగ్రహించిన శ్రీరమణమహర్షి, ఎందుకని చుట్టూ నిరంతరం ఉండే అసంఖ్యాక భక్తజనులకు, తమకు అబ్బిన ఆ అద్వైతానుభవ స్థితిని అనుగ్రహించలేదు... ?

అంటే ఇక్కడ సాధకులు అర్ధంచేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు..
1. తమ ఎదుటనున్న జీవికి పూర్వపు జన్మపరంపరలో
ఎక్కడివరకు ఏ భక్త భాగవత సద్గురువుల సాన్నిధ్యంలో తమ సాధనసాగిందో మరియు
ఏ స్థాయిలో ప్రస్తుతం తమ పుణ్యపాపాలకు అతీతమైన చిత్తశుద్ధితో ఈశ్వరున్ని తమ హృదయఫలకంపై కొలువైయ్యెలా సాధన సాగించి, అన్నిటా ఆ ఈశ్వరున్నే దర్శించే స్థాయికి ఎదిగారు, అన్నది కేవలం ఈశ్వరునకు మరియు తన ప్రతినిధికి అనగా ఒక సద్గురువునకు తప్ప, అన్యుల ఐహికజ్ఞ్యానసంపత్తికి అందనిది ఆ అద్వైతసత్యం...

2. భక్తి/కర్మ మార్గము, జ్ఞ్యాన మార్గము, రెండూ ఈశ్వరున్ని దరిజెర్చే రెండు సమాంతర సంగమ మార్గములైనప్పుడు, సర్వస్వతంత్రుడైన ఈశ్వరునకు తప్ప ఎవరు ఏ దారిలో ఎంతదూరం ఆ జన్మాంతర ప్రయాణం సాగించారన్నది అన్యులకు అగోచరం.....
కాబట్టి బాహ్య శారీరక సూచీలను బట్టి మన
భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా, ఆంతర మనోసూచీలను బట్టి ఉండే ఈశ్వరాభిప్రాయం ఉండాలనుకోవడం
అన్నివేళలా కుదరని పని...

3. ఇక అనుగ్రహ నిర్ణయాధికారానికి వచ్చేసరికి అది కేవలం ఏకదిశాత్మకమైన ఈశ్వరసంకల్పం
మాత్రమే కాని, అందులో జీవుడికి, జీవధారకుడికి ఎట్టి ప్రమేయం ఉండబోదు....
కావున
" ఎందుకు వారికి మాత్రమే...? "
అనే మన ప్రశ్నకు ఇక్కడ సమాధానం
దుర్లభం...! 🙂🙏

No comments:
Post a Comment