Monday, July 29, 2019

శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి 88 వ జయంతి.... :)

శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు..... ( పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీతలు శ్రీ సి.నా.రె గారిగా సాహితీ లోకానికి సుప్రసిద్దులు )
తెనుగు సాహితీ జ్యోతులను దిగ్దిగంతముల పర్యంతం దేదీప్యమానంగా ప్రజ్వలనం గావించి, తెలుగు భాషావైభవాన్ని యుగయుగాలకు తరతరాలకు వన్నెతరగని ఆచంద్రతారార్క దీప్తివోలే స్థిరీకరించిన మహర్షుల 88 వ జయంతి నేడు.....
అలనాటి మన మేటి పూర్వకవుల అమర సాహితీ సరాలకు, సరళమైన సద్విమర్శనాత్మక పదబంధనములను అందించి, అవి ఈనాటి నవయుగ సాహితీప్రియులకు సులువుగా జీర్ణమయ్యేలా తమ కలం నుండి జాలువార్చబడిన రచనలు ఎన్నో ఉన్నా, శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారు తెనిగించిన శ్రీమద్భాగవత గీర్వాణరాజమునకు వారు తమ
' మందారమకరందాలు ' అనే రచనలో ఎంతో హృద్యమైన రీతిలో ఆ భాగవతోత్తముల భావలహరుల మంజరులై ప్రభవించిన భవహరమైన భావోద్వేగ భావుకత భరిత అమృతభాండములైన పద్యగద్యాలకు, తమదైన శైలిలో వ్యాఖ్యానం గావించి, ఆ శ్రీమద్భాగవతమనే మధురఫలాన్ని మరింత రసరమ్యంగా భక్తులకు భోక్తం గావించి అందించిన విషయం ఎల్లరికి విదితమే.....
భక్తుడి శరణాగతికి భగవంతుడు ఎంతగా లొంగిపోతాడో అనే సార్వకాలిక సత్యానికి ఉనికిపట్టైన భాగవత కథ, శ్రీప్రహ్లాదచరితం.....
అందులోని ఒకానొక పద్యంలో,
" లౌకికమైన విద్యలు ఎన్ని నేర్చినను, వాటన్నిటికి సార్ధకతను చేకూర్చే శ్రీహరిని గురించిన చింతన నేర్చుటయే చదువులన్నిట్లోకెల్లా ఉత్తమమైన చదువు..... "
అని బోధించే ప్రహ్లాద ఉవాచను ఎంత ఘనంగా అభివర్నించారో ఈ పోస్ట్ కి జత చేయబడిన ప్రతిలో చదువరులు గమనించవచ్చు.... 
వారి అమరసాహిత్యపు సౌగంధికలు సాహితీలోకంలో సదా తమ సౌరభాన్ని వెదజల్లుతూ భావితరాలను ప్రభావితంచేస్తూ వర్ధిల్లు గాక... 
( డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదువుకోడానికి, ఆసక్తి గలవారు నావద్ద నున్న ' మందారమకరందాలు 'పి.డి.ఎఫ్ ఈ-పుస్తకం కొసం పింగ్ చేయగలరు....  )

Indian Railways' various ticket concession categories.....

It's interesting to know that Indian Railways has such a huge array of concessions lined up for the various categories mentioned in there.... Be informed of the same should any of your friends or kin & kith be eligible for the same but are unaware of.... 
About This Website
NDTV.COM
IRCTC train ticket Concession: Railways concession is applicable only on basic fare and not on charges like superfast surcharge, reservation fee.

ఓం శాంతిః శాంతిః శాంతిః .....

శ్రీ ----- గారు, పొద్దున లేచినది మొదలు సమాజం లో అందరిచేత నమస్కారాలు పొందే ఫలాన పెద్దమనిషి, ఒకప్పుడు కూటికి గూడుకి కూడా సరిగ్గ నోచుకోని వారు ఇవ్వాళ ఒక పెద్ద పేరు ఉన్న వారిగా పూర్వకృత పుణ్యబలం వల్ల మరియు ఆ భగవంతుడి దయవల్ల ఉన్నారన్నది ఎంత సత్యమో, ( ఆ పేరు నలుగురిని ముంచి, బెదిరించి, మాఫియాలు చేసి వచ్చిందా లేక నిజంగా ఎవ్వరికి అన్యాయం చేయకుండ కష్టార్జితంగా వచ్చిందా అనే లౌకిక సత్యాన్ని కాసేపు పక్కన పెడితే....)
ఒకనాడు లేనిది ఇవ్వాళ వచ్చింది అన్నది ఎంత సత్యమో.....ఇవాళ ఉన్నది మరోనాడు ఉండకుండా అవ్వగలదు అనేది కూడా అంతే సత్యము....
ఒకటవమెట్టుపై ఉన్న వ్యక్తి మెట్లపైనుండి జారితే కలిగే బాధ స్వల్పమే...
కాని పదవ మెట్టు పై నిల్చున్న వ్యక్తి జారితే ఆ బాధ చాలా దుస్సహమైనది.....
అట్లే సమాజం లో కాని, వృత్తిలోకాని, మరేఇతరమైన దాంట్లో కాని, ఒక సమున్నతమైన స్థానంలో ఉన్న వారికి, తమకు సంబంధం లేని ఇతరుల జీవితాలను అనవసరంగా ఇబ్బంది పెట్టకుండ ఉండడం గౌరవప్రదమైన జీవనవిధానం..... ఆ గౌరవాన్ని, పెద్దరికాన్ని, నిలుపుకునేలా జీవించడంలోనే జీవనఔన్నత్యం ఉంది.....
తద్విరుద్ధంగా, ఇతరులను సరదాకో, హాస్యానికో కష్టపెట్టడమే లక్ష్యంగా జీవించిన నాడు, భగవంతుడి కరుణతో వేటికీ లోటు లేకుండ సాగిన జీవితం, ఓడలు బండ్లు, బండ్లు ఓడలు ఐనట్టుగా మారి, లేమితో ఉండి తిన్నది అరగకుండ అవస్థపడేంత దయనీయ స్థితికి చేరి, ఇన్నాళ్ళు ' నమస్తే అన్నా...' అంటూ దండాలు పెడుతూ చుట్టూ తిరిగిన వ్యక్తులే, పలకరించకుండా మొహంతిప్పుకొని వెళ్ళిపోతారు...
మీ అధికార ఐశ్వర్య ఆరోగ్యాలు జారిపోయిన మరుక్షణమే....!
అదేంటి అని ఎవరైనా అడిగితే...
' మంచి చెడులు మరిచి నీతి ధర్మాన్ని విడిచి ఇన్నాళూ మందిని ముంచి సంపాయించడమే వారికి జీవితం...... అప్పుడంటే ఏదో అధికారం+డబ్బులు ఉన్న పెద్దమనిషిగా ఏదో పేరు ఉంది కాబట్టి నమస్కరించడం తప్పలేదు......ఇప్పుడు ఏముందని ఆయనకు నమస్కారం చేయడానికి..... సమాజంలో కనీసం ఒక్కరైనా సరే ఆయన చేసిన ఒక్క మంచిపని గురించైనా చెప్పలేరు...... అటువంటప్పుడు ఆ జీవితానికి ఎవరు మాత్రం గౌరవం ఇవ్వగలరు...."
అనే జవాబులే ఉంటాయి.....
చేతనైతే వీలైన సహాయం చేయండి...గుర్తుపెట్టుకొని గౌరవిస్తారు...... ఎవ్వరికి ఏ మంచి చేయలేకపోతే అందరు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకోండి చాలు....అదే ఒక మహా పుణ్యకార్యం....
అంతే తప్ప స్వల్పమైన అధికార ఐశ్వర్యాలు రాగానే, దర్పాన్ని ప్రదర్శించడం, ఆ అధికారాన్ని దుర్వినియోగపరిచి మందిమార్బలం ఉందనే అహంకారంతో ఇతరుల జీవితాలలోకి ఒక పరిధి దాటివెళ్ళి వాళ్ళను శాసించాలనుకోవడం అంత శ్రేయస్కరం కాదు.....అది అల్పబుద్ధి గల అధముల జీవితంలా ఉంటుంది....
కేవలం కట్టలకు కట్టల డబ్బులు సంపాదించడమే మీ జీవిత ధ్యేయమైతే, వచ్చిన ఇబ్బందిఏమిలేదు.....
హాయిగా మీ బిజినెస్ లు మీరు చేసుకోండి....
పొయ్యేలోపు పది కాకపోతే వంద కోట్లు సంపాదించుకోండి...... పొయ్యాక బంగారు వస్త్రాలను కప్పుకొని మరుభూమికి పోయ్యేంతగా సంపాదించుకోండి..ఎవ్వరికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదు....
అంతే తప్ప ఇతరుల జీవితాలను
ఒక పరిధిదాటి మరీ మీచేతిలోకి తీసుకొని మీరు అనుకున్నట్టే వారి జీవితాలు ఉండాలి అనేంత మూర్ఖంగా మాత్రం బ్రతకకండి....అది ఏమాత్రం శ్రేయస్కరంకాని జీవనవిధానం....
ఎవరికి ఎవరు శ్రేయోభిలాషులో ఎవరికి వారు నిర్ణయించుకునే వ్యక్తిగతమైన అంశం....
" మీరు ఫాలాన వారితో ఉండాలి....ఫలాన వారు చెప్పిందే వినాలి....." అని ప్రత్యక్షంగా చెప్పడానికో, పరోక్షంగా చెప్పించడానికో మీది సద్గురువుల స్థానంకాదు....ఇతరులది మీ శిష్యుల స్థానంకాదు....
ఒక తప్పు చేసి ఒకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టుంటే అది అక్కడితో వదిలేయండి.....సరిపోతుంది....
కాని అది కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉండాలనుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు ప్రమాదకరం కూడా.....
ఎవరి ఆరోగ్యాన్ని వారు, ఎవరి కుటుంబాన్ని వారు చక్కగా చూసుకుంటే చాలు.....
మీ సంపాదనకు, స్థాయికి తగ్గట్టుగా ధార్మికంగా మీ జీవితాలను మీరు చక్కబెట్టుకుంటే చాలు.....
ఇతరుల జీవితాలు, వారి కుటుంబాలు, వారు చూసుకోగలరు...
అవి కూడా మీనెత్తిన వేసుకోవలసిన పని అవసరంలేని శ్రమ....
కాబట్టి శ్రమతో సతమవుతూ బ్రతకడంకంటే....
వీలైన ఒకటో రెండో మంచి పనులు చేసుకుంటూ, మనం వెళ్ళిపొయ్యాక కూడా సమాజంలోని ఓ నలుగురైనా తలుచుకొని మనకు నమస్కరించి గౌరవించేలా జీవిస్తే చాలు....
అదే పెద్దరికం అంటే.....
అదే గొప్పదనం అంటే.....
అదే సదరు వ్యక్తి యొక్క ఔన్నత్యానికి, ధార్మిక జీవనానికి ఉండే కొలమానం.....!
--------------------------------------------------------------
ఇది ఎవరికోసం ఉద్దేశించి నేను రాసాను అనేది అనవసరం...... ఇది వారికి చేరి వారి నడవడి చక్కదిద్దబడాలనేదే నా అభిమతం....కాబట్టి ఈ నా పోస్ట్ కి ఎవ్వరు ఎటువంటి లైకులు, కామెంట్లు ఇవ్వొద్దని చదువరులకు నా మనవి...
ఓం శాంతిః శాంతిః శాంతిః ..... 🙏

" Chandrayan-2 ", ISRO's Moon exploration saga continues successfully....

Some interesting info on the various components the geo synchronous launch vehicle is comprised of, which together make up the glorious Chandrayaan2....
For Sat-Com engineers out there, it is indeed interesting to see that the orbital placement of the spatial command unit is fixed at 100 kms of radial distance from moon's surface despite the fact that moon's gravity is at 1/6th of earth's gravity, in enabling the closest possible vigilance without being affected by the moon's gravitational pull.... 👏
About This Website
TWITTER.COM
“CHANDRAYAN 2 GOING WHERE NO ONE HAS GONE BEFORE 1.LAUNCHER 2.LUNAR ORBI

బోనమెత్తిన భాగ్యనగరం.....☺ అత్తారింట్లో అల్లుడి ఆషాఢ సమ్రంభం.....😁 - 2019 Bonaalu

శ్రీకరి నీకు బోనమెత్తినామమ్మో.....ఎత్తినామమ్మో
మా బాధలను బాపే భవానివై తరలిరావేమమ్మా.....
శుభకరి నీకు శాక పోసినామమ్మా...పోసినామమ్మా....
మాకు శాంతిని కలిగించే శాకంబరివై నడిచిరావేమమ్మా.....
కాత్యాయనీ నీకు కమ్మనిఫలహారము
ఆరగింపుచేసినామమ్మా... చేసినామమ్మా.....
మా కష్టాలను కరిగించే కాదంబరివై కదలిరావేమమ్మా.....
ఎల్లమ్మ నీకు ఎలుగెత్తి దండాలు పెట్టినామమ్మ.... పెట్టినామమ్మ....
మా ఇలవేల్పై ఉండ ఇలకు దిగిరావేమమ్మా.....
భద్రకాళి నీకు వేప బోనం ముట్టిందమ్మా..... ముట్టిందమ్మా....
మా వెంటే దుర్గమ్మై ఎల్లకాలం ఉండిపోవమ్మా.....😊
* * * * * * * * * * * * * * * *
బోనమెత్తిన భాగ్యనగరం.....
అత్తారింట్లో అల్లుడి ఆషాఢ సమ్రంభం.....😁

Saturday, July 20, 2019

శ్రీమహారాజ్ఞి అయిన ఆదిపరాశక్తి యొక్క ఆషాఢ బోనాల ఉత్సవం....!

శ్రీమహారాజ్ఞి అయిన ఆదిపరాశక్తి యొక్క ఆషాఢ బోనాల ఉత్సవంలో చిన్నప్పుడు మా బస్తిలోని పోచమ్మ గుడిలో దిగిన పిక్......
నాన్నకు ఇరువైపులా నేనూ ( చిలకపచ్చరంగు షర్ట్ లో 😁 ) , తమ్ముడు, ఉన్న ఈ పిక్లో మా వెనకాల పోచమ్మ గుడిగోడపై ఉన్న కాళికా అమ్మవారి చిత్రాన్ని చూసారు కదా....అలా ఎన్నో చోట్ల బోనాల పండగ రాగానే, అన్ని గ్రామదేవతల గుళ్ళకు కొత్త రంగులు, చిత్రాలు, వేసి వేపాకుల తోరణాలు కట్టి, " అమ్మ బైలెల్లినాదే...జగదంబా బైలెల్లినాదే....." అంటూ వివిధ జానపద పాటలతో హోరెత్తి ఉండే ఆ ఆషాఢ జాతర కోలాహలం అందరికి తెలిసిందే......
ఇది నా 5త్ క్లాస్ లోని పిక్ అనుకుంటా...ఇప్పుడున్నట్టు కాకుండ అప్పుడు మా ప్రగతి నగర్ బస్తి కేవలం ఒక 50 కుటుంబాలవరకు ఉండే చిన్న స్లం ఏరియ...
అన్నీ ఖాలి ప్లాట్లు, పిచ్చి చెట్లు, మొక్కలతో ఉండేవి మా గల్లీలన్నీ.....
ఐ.డి.పి.ఎల్ కాలనిలో ఉండే బంధువులైన మా తాత  ఒకరు మరియు కీ.శే శ్రీ పెంటయ్య అనే ఇద్దరు పెద్దలు కలిసి ఈ బస్తి యొక్క లేయౌట్ వేసి పేదలందరికి భూమి పట్టాలను అందించారు.....
మూసాపేట్ దెగ్గరి భరత్నగర్ లో కిరాయికి ఉంటూ, సనత్నగర్ లోని ఆల్ల్విన్ కంపెనీలో ఒక చిరుద్యోగి అయిన మా నాన్న కి కూడా ఒక ప్లాట్ ఇవ్వడంతో, అందులో ఒక 50 గజాల్లో చిన్న రేకుల రూం వేసుకొని ఇక్కడికి మకాం మార్చడంతో 1991 నుండి మా జీవితాలు ఇక్కడ స్థిరపడ్డాయి....
పెద్దగ ఏ సదుపాయాలు లేని రోజులవి....మట్టి రోడ్లు...అప్పుడప్పుడే వేయబడుతున్న విద్యుత్ స్తంభాలు, సర్కార్ బోరింగ్లు....
పక్కన ఉన్న అస్బెస్టాస్ కాలనిలో కూడా అప్పుడు మంజీరా నీళ్ళ సౌకర్యంలేదు....వాళ్ళకి కూడా ఉప్పునీళ్ళే వచ్చేవి....
త్రాగునీటి కోసం నేను ప్రతి ఆదివారం మా నాన్న అట్లస్ సైకిల్ కి వెనకాల రెండు S ఆకారపు ఇనప కొండీలకు నల్లడబ్బాలను తగిలించి ' కైంచి ' తొక్కుకుంటూ (పొట్టిగా ఉన్నందుకు కాళ్ళు అందేవి కావు కాబట్టి...) గుట్ట పైప్లైన్ రోడ్ చౌరస్త దెగ్గర ఉండే మునిసిపల్ వాటర్ టాంక్ దెగ్గర పెద్ద లైన్లో గంటకుపైగా నిలబడి రెండు డబ్బాలు నింపుకుని ఇంటికి తెచ్చేవాణ్ణి....ఎన్ని సార్లు కిందపడి మోకాళ్ళు మోచేతులకు దెబ్బలు తగిలాయో నాకు ఇప్పటికీ బాగానే గుర్తు.....ఉప్పునీళ్ళు తాగలేక ఎంత కష్టమైనా సరే అలా ఇంటిల్లిపాదికి మంజీరా నీళ్ళు తెచ్చేవాణ్ణి...
కొన్ని సంవత్సరాలకు పక్కన ఉన్న అస్బెస్టాస్ కాలనిలో మంజీరా నీళ్ళు రావడంతో ఇక ఇక్కడే చుట్టూ ఉండే తెలిసిన వాళ్ళింట్లల్లో బిందెలు, డబ్బాలతో మోసుకొచ్చేవాణ్ణి.....ఆ తరువాత మంజీర వాటర్ టాంకర్లు మా బస్తీకి ప్రతి గల్లీకి వారానికి రెండుసార్లు రావడంతో ఆ బాధ కొంచెం తగ్గింది.....
నా ఇంజనీరింగ్ రోజుల్లో, మా బస్తిలోని ఇంటింటికి మంజీర నల్లలు రావడంతో మంచినీటి కోసం 12 సంవత్సరాలు పడిన ఆ బాధలకు శాశ్వతంగా తెరపడింది...
ఆరోజుల్లో మా బస్తి తో పాటుగా, నేను తిరిగే అన్ని ప్రాంతాల్లో అంటే జగద్గిరిగుట్ట, హనుమాన్ నగర్, అస్బెస్టాస్ కాలని, ఆల్విన్ కాలని, ఇత్యాది ప్రాంతాల్లో గ్రామదేవతగా ఉండే అమ్మవారి గుడి గోడలపై ఉండే చిత్రాల్లో కాళికా స్వరూపం, అత్యంత రౌద్రమూర్తిగా తన పతి అయిన ఈశ్వరుడిపైనే తన పాదాన్నిమోపి నిలిచి ఉండడం నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది...
అమ్మవారు రాక్షసులను చంపి, వారి తలలను పెకిలించి రక్తమోడుతున్న ఆ శిరస్సులను తన హస్తాల్లో పట్టుకొని వీరవిహారం చేయడం వరకు ఉన్న ఉగ్రత్వం అర్ధమయ్యేది కాని, అలా ఈశ్వరున్ని కూడా తన కాలితో అదిమిపెట్టడం ఏంటి అనే సందేహం మాత్రం చిన్నపటినుండి కూడా అట్లే ఉండిపోయింది....
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనంలో అమ్మవారి వైభవాన్ని వినేంతవరకు ఆ సందేహం నివృత్తికాలేదు...!
"రక్తబీజుడు ఇత్యాది ఎందరెందరో దుష్ట అసురులను తన కాళికా అంశ తో సమ్హరించిన అమ్మవారు అదే మహోగ్ర రూపంతో తన ప్రళయతాండవాన్ని కొనసాగిస్తు ఉండడం, అంత ఉగ్రంగా ఉన్న అమ్మవారి ఎదుట నిలిచి శాంతపరిచే సాహసం ఎవ్వరు చేయలేకపోవడం తో ఇక సాక్షాత్ ఆ పరమశివుడే తన అర్ధాంగిని శాంతింపజేసే ప్రయత్నంలో అలా క్రింద పరుండి, ఆమ్మవారి పాదమును తనపై మోపేలా చేయడంతో, "మహాకమేశమహిషి" గా ఉండే ఆ చండిక తన పతి తిరుమేని స్పర్శసోకగానే తన ఉగ్రత్వం ఆ లయకారుడిలోకి లయించిపోయి శాంతమూర్తిగా స్థిరపడింది....." అనే సమాధానం లభించడంతో నా దశాబ్దకాల సందేహంకూడా నివృత్తి అయ్యిందన్నమాట.....😊
ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.....
"నియంత్రి నిఖిలేశ్వరి....." గా ఉండే అమ్మవారు తనని తాను నియంత్రించుకోలేక పోవడమేంటి అనే సందేహం వస్తుంది చాలామందికి....
ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి తెలిసినట్టుగా, A.C కంటే కూడా D.C చాల ప్రమాదకరమైన విద్యుత్శక్తి.....
Alternating Current Sine wave కాబట్టి తరంగదైర్ఘ్యం / పౌనహ్పున్యం ( Frequency / Wavelength ) సిద్ధాంతానుగుణంగా ఆ విద్యుత్ శక్తి యొక్క neutralization కి ఎంతో కొంత గ్రౌండింగ్ ఇచ్చి  క్రమంగా మన అధీనంలోకి తీసుకురావొచ్చు...
కాని Direct Current యొక్క తరంగదైర్ఘ్యం సున్నా కాబట్టి హై వోల్టేజ్ లో ఉన్న D.C షాక్ కొడితే రెప్పపాటులో ఆ జీవి / వస్తువు బూడిదకుప్పగా మారిపోతుంది.....
ఎందుకంటే 0 wavelength అనగా infinite / అనంతమైన పౌనహ్పున్యం ( Frequency = 1 / wavelength ) ....
ఆ అనంత పౌనహ్పున్యం తో విరుచుకుపడే విద్యుత్శక్తిని నేరుగా నిలువరించడం అసాధ్యం.... అంతకు సమానమైన లేదా అంతకంటే కొంచెమైనా సరే అధికమైన తద్భిన్నధృవశక్తిని ఏకబిగిన అడ్డువేయగలిగినప్పుడు మాత్రమే ఆ విద్యుత్శక్తిని అధీనంలోకి తీసుకురావడం సంభవమయ్యేది.... ఏమాత్రం తేడావచ్చినా ఆ దుస్సహమైన శక్తిముందు భస్మీపటలం అవ్వడమే..!
అదేవిధంగా ఇక్కడ జగద్రక్షణకోసం ఆదిపరాశక్తి, ఒకానొక సందర్భంలో నిలువరించ సాధ్యపడని ఆసురిశక్తిని అంతమొందించడానికి అంతటి మహోగ్రమైన శాక్తేయకళను తన కాళికా అంశలోకి ఆవహింపజేసి దైత్యసమ్హార ప్రక్రియను పూర్తిగావించడం ఐతే అయ్యింది కాని అదే పొటెన్షియల్ లో పర్సిస్ట్ అయి ఉన్న ఆ విద్యుత్శక్తి తనంతతానుగా స్టేబిలైజ్ అవ్వడం కుదరలేదు..... అలా అమ్మవారు అత్యుగ్రశక్తిగా ఉండిపోవడం లోకానికి శ్రేయస్కరం కాదుకాబట్టి, తనలో అర్ధభాగమైన ఆ శక్తిని నిలువరించే స్థీరీకరణ శక్తి కేవలం ఆ అర్ధనారీశ్వరుడికి మాత్రమే కలదు కాబట్టి, తనను ఒక కొలమానంలేని యానోడ్ గా మలిచి (ఈ భూగోళం మొత్తం కలిపితే ఎంత గ్రౌండింగ్ క్యపాసిటి ఉంటుందో అంతకంటే కూడా ఎన్నో రెట్లు శక్తివంతమైన గ్రౌండింగ్ ఫ్యాక్టర్ గా తన దేహాన్ని మలిచి ), ఒక గైగాంటిక్ క్యాథోడ్ గా ఎగజిమ్ముతున్న ఆ పరాశక్తి లోని ఉగ్రశక్తిని ఒక్కసారిగా తన హృదయ మండలం లోకి లయించి వేసి ఆ పరమేశ్వరుడు లోకాన్ని అనుగ్రహించాడు....!  ఇదన్నమాట స్థూలంగా అమ్మవారి దశమహా అవతారాల్లో ఒకటైన కాళికా వైభవం...  🙏🙏🙏🙏🙏
**************** **************** ****************
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
**************** **************** ****************