శ్రీచాగంటి సద్గురువుల చాంద్రమాన జన్మదినోత్సవం (ఆషాఢ శుద్ధ నవమి) మరియు రాబోయే శ్రీవ్యాసపౌర్ణిమ / గురుపౌర్ణిమ పర్వదిన శుభాభినందనలు......
కొన్ని కోట్ల మందికి రోజు టీ.వీ ల్లో కనిపించే పేర్గాంచిన ఒక పురాణ ప్రవచనకర్త గా సుపరిచితలైన ఆధ్యాత్మికవేత్త...
పరోక్షంగా కొన్ని లక్షలమందికి, ప్రత్యక్షంగా కాకినాడలోని కొన్ని వేలమందికి వారు తమ తమ ఆరాధ్యగురుదేవులుగా వర్ధిల్లే పూజ్యసద్గురువులు.....
కాని, నాకు మాత్రం వారు వీటన్నిటిని మించి, "నా జీవితము" అనే సజీవ శిల్పాన్ని తీర్చిదిద్దిన ఒక ఉద్దండులైన స్థపతులు...
అవధరించిన వారి సద్వాక్కులే నాపై వారి సుతిమెత్తని ఉలి తాడనములు...
ఒక 11 సంవత్సరాలు వెనక్కివెళ్తె నేను కూడా ఈ అనంతసంసారం అనే జీవనవాహిని యొక్క ప్రవాహపు అటుపోట్లను ఒరుసుకుంటూ స్తబ్దుగా పడి ఉన్న ఒక కృష్ణశిలను......
సాధారణంగా ఒక శిల్పికి, బాగా నీటిలో నానిన మంచి కృష్ణశిల ఒకటి తారసపడితే చాల సంతోషం కలుగుతుంది.....
కాని, శిలా సదృశమైన శోకావృత జడజీవమై పడిఉన్న నాకు ఒక చక్కని శిల్పిలాంటి సద్గురువులు లభించగానే ఎంతో సంతోషం కలిగింది....అది అప్పటి ఆనాటి కాలంలో మానసికంగా ఒంటరినైన నాకు తోడైన బాసటగా ఉండి ఓదార్చి స్వాంతన కలిగించిన సాధనమై ఉండగా, క్రమక్రమంగా నా గత దశాబ్ద కాల జీవితం మొత్తం ఆ బాసటను పెనవేసుకొని పెరిగిన ఒక లతలా మారింది...
అంతగా ఆ గురుదేవుల సద్వాక్కు నా జీవితంలో అంతర్భాగమై నిలిచిఉండడానికి, అది నాకు ఈ ఒక్క జన్మలో సంప్రాప్తించిన బంధం మాత్రమే కాదని మాత్రం తెలుసు....
దైవం అంటే ఏంటి, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఉండగా ఎందుకు ఈ కష్టాలు, ఇత్యాదిగా ఆధ్యాత్మిక
అంతర్ వివేచన సాగించే అసంఖ్యాక జీవుల్లో నేను కూడ ఒక కేవల నిమిత్తమాత్రుడను కావొచ్చు...
అంతర్ వివేచన సాగించే అసంఖ్యాక జీవుల్లో నేను కూడ ఒక కేవల నిమిత్తమాత్రుడను కావొచ్చు...
ఒకే సూర్యుడిని ఒక్కొక్కరు ఒక్కోలా ఉపాసించి తమ తమ విజ్ఞ్యత మేర ఆ అమేయ శక్తిభరితమైన కాంతిపుంజం యొక్క అనుగ్రహాన్ని ఆర్జించి తరిస్తుంటారు......
ఒకరు ఎండలో బియ్యంపిండి ఒడియాలు, అప్పడాలు, రవ్వపాపడాలు, మామిడికాయి ఒరుగులు ఇలా వివిధ రకాలుగా ఆ శక్తిని తమకు అనుగ్రహంగా మలుచుకుంటారు....
ఇంకొకరు సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసుకొని ఆ సూర్యరష్మిని లౌకిక విద్యుత్ గా మార్చుకొని గృహోపకరణాలకు అందించి వేడినీళ్ళకు గీసర్లు, చల్ల గాలికి ఫాన్లు, ఇత్యాది వాటి వల్ల లబ్ధిపొందుతారు...
మరొకరు ఇంకొక మెట్టు పైస్థాయిలో నిలిచి "సోలార్ ఎనర్జైస్డ్ బ్యాటరి ఆపరేటెడ్ సాటిలైట్ సిస్టెంస్" ని డెవెలప్ చేసి వాటిని రోదసిలోని నిర్ణీత భూభ్రమణ కక్ష్యలోకి రాకెట్ ద్వార ప్రవేశపెట్టి వాటిని అత్యాధునిక (రిమోట్) గ్రౌండ్ ఆపరేటెడ్ కంట్రోల్ యూనిట్స్ కి అనుసంధానించి
పరిమితమైన మానవమేధకు అంతుచిక్కని ఎన్నెన్నో ఖగోళ విజ్ఞ్యాన సారస్వతాలను అందిపుచ్చుకొని వాటిని మానవాళి యొక్క శ్రేయస్సుకై ఉపయోగిస్తున్నారు....
పరిమితమైన మానవమేధకు అంతుచిక్కని ఎన్నెన్నో ఖగోళ విజ్ఞ్యాన సారస్వతాలను అందిపుచ్చుకొని వాటిని మానవాళి యొక్క శ్రేయస్సుకై ఉపయోగిస్తున్నారు....
మరియు మనకు తెలిసిన వివిధ సాంకేతిక ప్రయోజనాలకు అనగా GPS, Weather Forecast, Border Protection Aero Vigilance Systems, Spy Radars, Spatial Counter Intelligence Module embedded enemy annihilation units, ఇత్యాది గా ఆ సౌరమండల శక్తిని ఉపయోగించుకుంటున్నారు.....
సవైదిక మంత్రానుష్ఠానం తో భూసురోత్తములు, సద్గురువుల అనుగ్రహంగా వివిధ శ్లోకాల, స్తోత్రాల ఆధారంగా ఇతరులందరు, అదే సౌరమండల శక్తిపుంజాన్ని గాయత్రి గా, సావిత్రి గా, ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించి అటు భౌతికంగా ఆరోగ్యాన్ని ఇటు మానసికంగా అపరిమిత మేధోశక్తిని సముపార్జించుకుంటున్నారు తమ ఇహ పర జీనవ సాఫల్యానికై....
ఇలా తమ తమ శక్తియుక్తుల కొలది ఒక్కొక్కరు ఒక్కోలా ఒకే సూర్యుడి నుండి వెలువడే ఆ అప్రమేయ శక్తిని తమకు అనుగ్రహంగా మలుచుకుంటున్నారు....
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సూర్యుడు ఏ ఒక్కరినీ కూడా నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యకు, నేను ఇక్కడ వెలగను అక్కడే వెలుగుతాను, నా వెలుగుకు ఇంత ఫీసు ఇవ్వాలి, ఇత్యాది గా ఎవ్వర్ని ఏమి అడగకుండా కేవలం ఉదయాద్రి పై ప్రభవించి అస్తాద్రి పైకి పయనంసాగించడమే తన విహిత కర్తవ్యంగా సాగిపోతుంటాడు...
ఒడియాలు ఎండబెట్టుకొని ఆరగిస్తామా లేదా దాంతో పాటుగా ఈ లోకం యొక్క సాధారణమైన అజ్ఞ్యానపు వైఖరిని ఎండగట్టేందుకు తగురీతిలో మన మేధోవికసనకు పదునుపెట్టేందుకు ఆ సౌరశక్తిని ఆలంబనగా చేసుకుంటామా అనేది వారి వారి స్వనిర్మిత తార్కిక వివేచనకు సంబంధించిన విషయం....
అచ్చం అదే విధంగా ఒక సద్గురు చే కాటాక్షించబడే ఆ దైవిక సారస్వత శ్రవణజనితమైన అనుగ్రహన్ని ఎవరు ఏ విధంగా ఎంతగా శ్రమించి ఒడిసిపట్టుకొని తమ తమ జీవితాలకు ఆపాదించుకొని వాటిని చక్కదిద్దుకొని తరిస్తారు అన్నది వారి వారి వ్యక్తిగతమైన శ్రద్ధాసక్తులకు సంబంధించిన విషయం....
సూర్యుడు ఏ విధంగా అయితే తరతమభేదం లేకుండా తన సౌరశక్తిని దిగ్దిగంతములందు వ్యాప్తిగావిస్తాడో, అదేవిధంగా సద్గురువులు కూడా జ్ఞ్యానభాస్కరులై తమ అనుగ్రహన్ని ఎటువంటి భేదభావాలు లేకుండా ఆర్తులైన వారందరికి అందించే ప్రయత్నంలో ఎంతో గహనమైన శాస్త్రవిజ్ఞ్యాన సర్వస్వాన్ని తాము మొదట పరిశ్రమ గావించి భగవద్ అనుగ్రహంగా అందుకొని, తమ శిష్యులు అంతగా శ్రమ పడకుండ అత్యంత సులభంగా అది వారికి అందివచ్చేలా తమ జీవితమంతా శ్రమిస్తూనేఉంటారు....
భగవద్ అనుగ్రహం ఉన్న శిష్యులు ఎక్కడున్నా సరే వారికి అది అందితీరుతుందని వారికి బాగా తెలుసును కనుక.......
కాని ఇక్కడ సూర్యునకు, సద్గురువునకు ఒక చిన్న భేదం ఉంది....
సూర్యుడు తన సౌర శక్తిని ఎవరు ఎంతబాగ ఒడిసిపట్టుకొని తరిస్తున్నారో అనే విషయంతో
సంబంధం లేకుండా దేదీప్యమానంగా అలా వెలిగిపోవడమే తన విహితకర్తవ్యంగా సాగిపోతుంటాడు....
సంబంధం లేకుండా దేదీప్యమానంగా అలా వెలిగిపోవడమే తన విహితకర్తవ్యంగా సాగిపోతుంటాడు....
కాని ఒక సద్గురువు మాత్రం అంతకంటే పైస్థాయిలో నిలిచి, శిష్యుల ఆర్తికి అనుగుణంగా తమ బార్హస్పత్య శక్తిని విశేషంగా వర్షించి అనుగ్రహించగలరు....
కాబట్టి ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యునకంటే కూడా సద్గురువులే ఎంతో ఉన్నతమైన, ఉదాత్తమైన కరుణారసహృదయ భరిత పరబ్రహ్మస్వరూపులు.... అందుకే కద సకల శాస్త్రములు ముక్తకంఠంతో
"నగురోధికం....నగురోధికం....
గురురేవ పరబ్రహ్మ....తస్మై శ్రీగురవే నమః...."
అంటూ గురుపాదపద్మములచెంత ప్రణమిల్లుతున్నాయి..... 😊
"నగురోధికం....నగురోధికం....
గురురేవ పరబ్రహ్మ....తస్మై శ్రీగురవే నమః...."
అంటూ గురుపాదపద్మములచెంత ప్రణమిల్లుతున్నాయి..... 😊
వ్యక్తిగతంగా ఎవరి ఆకలి వారిదే, ఎవరి దాహం వారిదే, ఎవరి జీవిత బాధ్యత వారిదే....,
ఎవరో పిలిచి నీళ్ళు తాగమని చెప్తేనే మనం తాగడం లేదు కద....ఎవరో పిలిచి అన్నం తినిమంటేనే మనం తినడం లేదు కద...
మరి ఎవరో పిలిచి మన జీవితాన్ని ఇలా ఉద్ధరించుకోండి అని చెప్తేనే మనకు జీవితోద్ధరణపై మక్కువ కలిగి ఆధ్యాత్మిక వైపు ఆసక్తి కలగాలి అనుకోవడం అంతగా వివేకం అనిపించుకోదేమో....
"మనవళ్ళు మనవరాళ్ళు పెద్దవారైపోతున్నారు... మన అమ్మమ్మలు నానమ్మలు తాతలు తల్లితండ్రులు ఓ 7 పదులకో, 8 పదులకో అలా వెళ్ళిపోయారు కాబట్టి మనకు కూడా తప్పదేమోలే....ఎందుకైనా మంచిది పుణ్యం భక్తి భగవంతుడు అంటూ ఎంతో కొంత ఆధ్యాత్మికత వంటబట్టించుకుందాంలే...... అసలే ఇవ్వాళ్టి కాలుష్యభరిత కల్తి జీవితాలు 60 ల్లోనే గొవింద గోవిందా అనేలా ఉన్నాయి...." అనుకొని కొందరికి ఆ ఆధ్యాత్మికాసక్తి వయస్సురీత్యా కలుగుతుందేమో.....
కొందరికి అదో పరిశోధక వృత్తిలో భాగంగా ప్రవృత్తిగా మారి అలవడొచ్చు...
ఇంకొందరికి జీవితపు ఆటుపోట్లకు తట్టుకుని నిలబడేందుకు, నా అనుకున్న వారే నిస్సహాయులై ఉండి, ఓదార్చేందుకు కూడ ఒక తోడులేక ఉన్న దుర్భర పరిస్థితుల్లో, ఇక గట్టెక్కించేందుకు భగవంతుడు వినా మేలైన మార్గం ఏముంది మనకు అనుకొని శరణాగతి కావించిన క్షణంలో, పొందిన భగవద్ సహాయానికి కృతజ్ఞ్యతగా ఆధ్యాత్మికాసక్తి జనించవచ్చు....
ఏదేమైనా, జీవితంలో ఎవరికి ఎప్పుడు ఆ పారలౌకిక చింతన అలవడుతుందో అనేది వారి వారి జీవిత సంఘటనలతో ముడిపడిఉండే విషయం....
కాని అది మనకు అత్యంత సరైన సమయంలో సహాయసహకారాలు అందించి అనుగ్రహించడం మాత్రం కేవల భగవద్ అనుగ్రహమే అనిభావిస్తాను నేను వ్యక్తిగతంగా....
ఎందుకంటే చదువుల జీవితంలో చదువులకు తప్ప మరే ఇతర వ్యాపకానికి పెద్దగా సమయం / మేధో పరిణతి ఉండని సమయం అది....
ఇక పెళ్ళి, పిల్లలు, వారి బాగోగులు అని గార్హస్త్య జీవితం మొదలయ్యాక తదేక శ్రద్ధాసక్తులతో ఆధ్యాత్మికతను ఉపాసించి అందిపుచ్చుకునేందుకు అసలు సమయం ఎక్కడుంటుంది అనేది అందరికి తెలిసిన లౌకిక సత్యమే....
మహా ఐతే రోజు వినే సుప్రభాతమో, విష్ణుసహస్రమో అన్నట్టుగా మమ అంటూ ఏదో వినేసి ఆనందించడం వినా...,అందులోని లోతుపాతులను, మార్మికతను, గహనమైన దైవతత్వాన్ని పరిశోధించి పరిగ్రహించేందుకు తగిన తీరిక ఉండని ఆదర బాదర జీవితాలు...
మహా ఐతే రోజు వినే సుప్రభాతమో, విష్ణుసహస్రమో అన్నట్టుగా మమ అంటూ ఏదో వినేసి ఆనందించడం వినా...,అందులోని లోతుపాతులను, మార్మికతను, గహనమైన దైవతత్వాన్ని పరిశోధించి పరిగ్రహించేందుకు తగిన తీరిక ఉండని ఆదర బాదర జీవితాలు...
( ఇందుకు మినహాయింపుగా మహాత్ములు ఉండవచ్చు....నేను కాదనట్లేదు...కాని సాధారాణంగా ఉండే లోకంపోకడ గురుంచి మాత్రమే నేను పైన చెప్పింది...)
నాకు ఆధ్యాత్మికత పై సద్గురువాక్కుల ప్రభావం అనేది జీవితపు అత్యంత డోలాయమానపరిస్థితుల్లో దెగ్గరై నన్ను అనుగ్రహించడం, అటుపిమ్మట వాటిపైనే పరిశోధన, వ్యాపకం, జిజ్ఞ్యాస, అంటూ క్రమక్రమంగా ఆ సద్వాక్కులే నా జీవిత సర్వస్వం కావాడం కాకతాళీయమో లేదా ఆ భగవద్రచనయో తెలియదు కాని అలా అలా అల్లుకుపోయింది నా జీవితం వాటి చుట్టూర....
అవి కేవల భగవద్ కథాశ్రవణం, ఈశ్వర నామగుణగానవైభవానికి సంబంధించినవి మాత్రమే అయ్యుంటే ఆధ్యాత్మిక పై అంతగా నాకు గురికుదిరేదికాదేమో.....
నా ఐహిక జీవితపు ప్రతిమజిలీకి కావలసిన మేధో సంపత్తిని సమకూర్చినందుకుగాను ఆ సద్వాక్కులంటే నాకు అంతగా జీవితాంతర్భాగంగా మారి అనుగ్రహిస్తూనే ఉన్నాయి....
21 వ మిసిమి ప్రాయంలో తప్పనిసరై పైచదువులకు స్వస్తి పలికి ఉద్యోగ జీవితాన్ని ఆరంభించినది మొదలు, 32 యేళ్ళకు భగవంతుడు అనుగ్రహించిన గృహస్త జీవితపర్యంతం,
అటు వృత్తిపరంగా ఇటు కుటుంబపరంగా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే దీక్షాదక్షతను ఒనగూర్చింది ఆ సద్వాక్కు....
అటు వృత్తిపరంగా ఇటు కుటుంబపరంగా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే దీక్షాదక్షతను ఒనగూర్చింది ఆ సద్వాక్కు....
నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు, ఈ లోకం ఒక అందాల హరివిల్లు, అనుకుని బ్రతుకుతున్న నా మొద్దు మొహానికి, మేడిపండు చూడ మేలిమై ఉండు అన్న చందంగా ఉండే ఈ లోకపు కడు స్వార్ధ పోకడలపై తగు అవగాహన కల్పించి, ప్రపంచం ఎప్పుడూ ఒక చదరంగమే అని నేర్పింది ఆ సద్వాక్కు.... ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎవరు ఏ పావును కదుపుతున్నరో విశదీకరించి అందుకు అనుగుణంగా నాకు కావలసిన చతురతభరిత వ్యుహరచనా సమార్ధ్యాన్ని సమకూర్చింది ఆ సద్వాక్కు....
మనతోనే మనవారిలా ఉంటూ మనకు శల్యసారధ్యాలు రచించే వారిని ఆదిలోనే గుర్తించి వారి శకుని మాయాజూదపు పాచికలు పారకుండ కట్టడిచేసి వారి కుయుక్తులను అడ్డగించేందుకు కావల్సిన పైఎత్తులు వేసి ఎదురు నిలిచి గెలిపించింది ఆ సద్వాక్కు.....
కర్తవ్య నిర్వహణలోని అలసట లో ఆదమరిచి ఉండగా నా ఏమరపాటును అదునుగా చేసుకొని, నావారితోనే నా భావి జీవనప్రయాణానికి లక్క ఇంటిని నిర్మించే పనిలో ఉన్న వారిని ఎదుర్కునేందుకు కావలసిన జాగరూకతను విదుర నీతిగా బోధించి రక్షించింది ఆ సద్వాక్కు....
నా ధార్మిక ప్రయాణం సాఫీగా సాగకుండా అనుక్షణం సైంధవుడిలా అడ్డగిస్తున్నవారిని, శ్రీకృష్ణపరమాత్మ తన సుదర్శనచక్రాన్ని అర్కునకు అడ్డువేసి, సైంధవుడు తన ఉనికిని తెలపగానే, "అదిగో అర్జునా సైంధవుడు, సంధించు శరాన్ని...సడలించు వాడి శిరస్సుని...." అని మార్గనిర్దేశo గావించినట్టుగా, ఆ సద్వక్కులాంతర్గతంగా ప్రభవించిన పరతత్వపు విజ్ఞ్యానాన్ని జోడించి, అటు నా పారమార్ధిక ఇటు నా ఐహిక ఇక్కట్లను తొలగించే సవ్యసాచి గాండీవ సంధిత శరపరంపరల్లా, ఆ సద్వాక్కులు నాకు సదా సహాయాన్ని సమకూరుస్తూనే ఉన్నాయి.....
ఇలా చెప్పుకుంటూ పోతే.... ఆ సద్వాక్కుల అనుగ్రహంగా విరబూసిన భావమల్లికల భవ్యమాలికలు కోకొల్లలు....
అవి సదా నా హృదయ మందిరంలోని " నా జీవితం " అనే జీవేశ్వరుడి పటాన్ని అలంకరించి, మదిలో నిత్యం మెదిలే శ్రీవేంకటమాధవుని తలపులకు తావిని అలదుతూనే ఉన్నాయి....ఉంటాయి...! 😊
ఇంకా ఎందరెందరో శిష్యుల జీవితాలు అనే నావకు, దృఢమైన తెడ్డుగా ఉండి వారందరిని భగవద్ సన్నిధి అనే దరికి జేర్చే దిటవైన బాసటగా ఆ సద్వాక్కులు చిరంతన అనుగ్రహాన్ని వర్షిస్తుండాలని అభిలషిస్తూ,
శ్రీ వికారి ఆషాఢ శుద్ధ నవమి నాటి సద్గురువుల చాంద్రమాన జన్మదినోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని, మరియు రాబోయే శ్రీవ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి మహోత్సవసందర్భంగా, వారి శ్రీచరణాల చెంత ఒక ఏకలవ్య వినేయుడి చిరు కవనకుసుమాంజలి పూరిత సాష్టాంగనమస్సులు.....🙏😊
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు కూడా గురువులో దైవాన్ని, దైవంలో గురువును దర్శించి, వారి అనుగ్రహన్ని కీర్తిస్తు ఈ క్రింది సంకీర్తనను రచించారేమో.....
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
No comments:
Post a Comment