Wednesday, August 28, 2019

శ్రీకృష్ణజన్మాష్టమి / గోకులాష్టమి శుభాభినందనలు..😊

శ్రీకృష్ణజన్మాష్టమి / గోకులాష్టమి శుభాభినందనలు..😊
ఈ శుభపర్వదినాన అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్గతంగా అనుగ్రహింపబడిన శ్రీకృష్ణ తత్వాన్ని కొంత విశదీకరించే చిరు ప్రయత్నం.....
దేవకీవసుదేవులు తమ పూర్వపుజన్మల్లో శ్రీమన్నారాయణుడి గురించి తపమాచరించి, అచ్చం నీలాంటి చిన్నిబాబు మాకు కావాలి స్వామి అని వరాన్ని అర్ధించగా, "నా లాంటి వాడు అంటే ఇక నేనే రావాలి కదా మరి.... అందుకే నేనే మీకు ముమ్మారు పుత్రుడిగా జన్మించి అనుగ్రహిస్తాను...." అని తెలిపిన ఆ పరమదయాళువు పృష్ణిగర్భుడిగా, వామనుడిగా,
శ్రీ శ్రీకృష్ణుడిగా, జన్మించి ఆ వరాన్ని పరిపూర్ణంగావిస్తాడు.....
ఆ వరాన్ని అలా ఒసగడంలో పరమాత్మ ఎన్నెన్నో భవిష్యద్ దేవకార్యాలను దృష్టిలో పెట్టుకొని
భువిపై తన జన్మస్వీకారానికి తానే ఉపాయము ఉపేయము కుదిర్చి ఎన్నెన్నో అధ్యాత్మ రహస్యాలు అందులో నిక్షిప్తం గావించి శ్రీవైకుంఠం నుండి తన తేజో అంశయొక్క జీవప్రయాణాన్ని నిర్దేశించాడు....
హాయిగా చల్లగా ఉండే శేషపర్యంకం పై శయనించి, శ్రీమహాలక్ష్మి అమ్మవారు పాదసంవాహనం గావిస్తుండగా, ఆదిశేషుడి సహస్ర ఫణములు వింజామరలా వీస్తుండగా సేదతీరే ఆ జలజనాభుడు, తన దైవిక ఇంద్రియశక్తులన్నిటితో ఒక తేజోంశను సృజించి నిర్దేశిత అవతారాన్ని స్వీకరించి భూలోకానికి రావాలంటే ఎన్నెన్ని సమాలోచనలు గావించి క్షీరాబ్ధి నుండి కదిలివస్తాడో ఎవ్వరికి తెలియని దేవరహస్యము అది.....
ఆ పావన శ్రీపాదయుగళం ఎక్కడ మోపితే అక్కడ సకల సంపదలను, అష్టైశ్వర్యములను వెంటబెట్టుకొని ఆ శ్రీహరి యొక్క నిత్యాన్నపాయిని ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది కాబట్టి, ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తభాగవతులు సత్పురుష సాధువరేణ్యులు, యోగులు, మహర్షులు, ఇత్యాది వారు తననే ఆరాధిస్తూ ఎక్కడెక్కడ కొలువైఉంటారో వారందరికి శ్రేయస్సులు ఒనగూరేలా వివిధ ప్రయోజనాలను యోచించి తన అవతార స్వీకారం చేస్తాడు అన్నది అధ్యాత్మ లోకవిదితమైన సత్యం....
నరనారాయణులుగా సాగే శ్రీకృష్ణార్జునుల పూర్వజన్మపు మైత్రీబంధము ఒకవైపు,
బ్రహ్మగారి మానసపుతృలైన సనకసనందనసనత్కుమారసనత్సుజాతులచే
శాపగ్రస్తులైన తన శ్రీవైకుంఠ ద్వారపాలకులు జయవిజయులకు శాపవిమోచనం గలిగించే క్రమంలో,
హిరణ్యాక్షహిరణ్యకశిపులుగా,
రావణకుంభకర్ణులుగా జన్మించి నిహతులైన తర్వాత ద్వాపరయుగంలో
శిశుపాలదంతవక్తృలుగా జన్మించిన వారిని వధించి తిరిగి శ్రీవైకుంఠానికి వారిని అనుమతింపచేయడం,
శ్రీరామావతారంలో తనను మోహించిన మహర్షులు ద్వాపరంలో గోపికలుగా జన్మించగా వారిని రాసలీలలో అనుగ్రహించి జీవబ్రహ్మైక్యసిద్ధిని అనుగ్రహించడం,
ఇలా వివిధ కార్యసాధనకై తన పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారాన్ని దశావతారాల్లో 8వ అవతారంగా స్వీకరించిన పరమాత్మ తత్వం అత్యంత నిగూఢమయ్యి ఉండికూడా ఎంతో భక్తసులభుడై తనపై ప్రేమాభిమానాలు చూపించినవారందరిని కూడా విశేషంగా అనుగ్రహించిన విశిష్టావాతారం శ్రీకృష్ణావతారం.....
మరే అవతారంలో లేని వైభవం, కానరాని భక్తసౌలభ్యం, ఆశ్రితపారిజాతమై ఉండే భగవద్ తత్వం శ్రీకృష్ణావతారానికే చెల్లినది......
కంసునిచెరసాలలో జన్మించినమరుక్షణమే దేవకీవసుదేవులకు శ్రీమహావిష్ణువై శంఖచక్రధారిగా దర్శనమిచ్చి తన జన్మవృత్తాంతం గురించి తెలిపి మరలా వారికి ఆ సత్యాన్ని మరుగునపరిచి, ఎదురులేని, మనుజులచే ఆపబడని అమేయ కాలప్రవాహానికి సూచికయైన సూర్యపుత్రిక, యమధర్మరాజు సహోదరి యమున తనకు తానుగా వసుదేవునకు నది దాటి నందవ్రజం వెళ్ళడానికి దారి ఇచ్చిన క్షణమునుండి,
ఒక బోయవాని బాణం దెబ్బకు కాలి బొటనవేలికి గాయం అవ్వడంవల్ల జరిగిన తన భౌతిక శరీరత్యాగానంతరం యదుకులముసలంతో ద్వాపరయుగాంతం జరిగే వైనం వరకు ఎన్నెన్నో సందర్భాలలో తన పరమాత్మతత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన పరమోత్కృష్ట అవతారం శ్రీకృష్ణావతారం....
"శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం
అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం...."
అని పెద్దలచే చెప్పబడే నవవిధభక్తికి నిదర్శనంగా చెప్పబడే ఒక్కొక్కభాగవతోత్తములలో
పరీక్షిత్ మహారాజు శ్రవణభక్తికి,
అకౄరుడు వందన భక్తికి,
అర్జునుడు సఖ్యభక్తికి,
తార్కాణమైన వీరుముగ్గురు కూడా శ్రీకృష్ణపరమాత్మ యొక్క ద్వాపరయుగపు మహాభారత కాలానికి చెందినవారే అవ్వడం, వీరిలో ఒకరైన పరీక్షిత్ మహరాజునకు వ్యాసమహర్షిపుత్రులైన శ్రీశుకమునీంద్రులు శ్రీమద్భాగవతాన్ని 7 రోజులు బోధించి అది లోకానికి అందేలా చేయడం,
మరియు అర్జునుడికి బోధించిన భగవద్గీత, వ్యాసోక్తమై గణపతిలిఖితమై లోకానికి లభించి భక్తులు లాభించడం,
ఇవ్వాళ కలియుగంలో మనం ఆ పరమాత్మను సేవించుకునే 2 అత్యంత శక్తివంతమైన శ్రేయస్కరమైన సర్వజన సులభమైన
సారస్వతాలు శ్రీమద్భాగవతాంతర్గతమైన
" గజేంద్రమోక్ష స్తోత్రం "
మరియు శ్రీ భీష్మాచార్య
ధర్మరాజసంవాదమైన
" శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం "
భక్తభాగవతలోకానికి అందివ్వడంలో అంతర్లీనంగా కారణమైఉన్నది ఆ శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహమే కద...!
తన బాల్యపు చిన్నికృష్ణ లీలల నుండి బామ్మర్దితో సాగిన తమ బహుచతురతభరిత వ్యూహప్రతివ్యూహాలతో సాగిన మహాభారత సంగ్రామం వరకు ఆ పరమాత్మ ఎందరెందరికో తనదైన శైలిలో అటు భక్తులకు ఉపకారం ఇటు
అసురసమ్హారం గావిస్తు తన జీవితం మొత్తం నమ్ముకున్నవారికోసమే త్యాగంచేసిన అపర కారుణ్యమూర్తి కదా మన శ్రీకృష్ణ స్వామి...!
చిన్ననాటి సాందీపని మహర్షి గురుకుల మిత్రుడైన సుదాముడు ప్రేమతో పెట్టిన పిడికెడు అటుకులను ఆరగించి అష్టైశ్వర్యాలను కలిగించిన ఘనత కదా కన్నయ్యది...!
విదురుడు సమర్పించిన అరటిపండు తొక్కలను ఆప్యాయతతో ఆరగించి అనుగ్రహించిన వైచిత్రి కదా వనమాలిది...!
తననే నమ్ముకున్న అర్జునుడికి అన్నీతానై, ఆపదలను ఆమడదూరంలోనే నిలిపి, అన్నివేళల్లో విజయుడికి విజయాన్ని సమకూర్చిన భక్తపరాధీనతకదా ఆ భక్తవత్సలుడిది...
శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అంతహ్పురమహిళామణులను క్షేమంగా హస్తినకు చేర్చే సమయంలో అడ్డగించిన దుండగులపైకి కనీసం గాండీవం ఎత్తలేని స్థితిని మనంగమనిస్తే, పార్థునకు ఆ గాండీవాన్ని ధరించి సవ్యసాచిగా వర్ధిల్లే శక్తిని ఇచ్చింది కేవలం
శ్రీకృష్ణ పరమాత్మే యొక్క సాన్నిధ్యం అనే సంగతి తెలపకనే తెలపబడే సత్యం......
కుబ్జ కాసింత గంధం అలదిందని అతిలోకలావణ్యవతిగా చేసాడు...
మాలాకారుడు ఇచ్చిన మూరెడు పూలకు అతన్ని మహదైశ్వర్యవంతునిగా మార్చేసాడు.....
ఇలా ఎందరెందరితోనో ఆ కన్నయ్య కమనీయ మైత్రీబంధాన్ని నెరపి తన మాధవమధులోలత్వాన్ని అనుగ్రహించి వారి జీవితాలను తన అనుగ్రహప్రసాదంతో పరిపుష్టి గావించి తరింపజేసాడు.......
చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ, చేస్తూనే ఉంటాడు ఎప్పటికీ ఆ తిరువేంకటనగముపై శ్రీవేంకటకృష్ణుడిగా వీరస్థాక ధృవమూర్తి గా కొలువైన కలియుగ ప్రత్యక్ష పరమాత్మ......
ఆ నిరతిశయ ఆనంద స్వరూపుడిని అందుకే అన్నమాచార్యులవారు తమ "భావయామిగోపాలబాలం" సంకీర్తనలో...
" తిరువేంకటాచల స్థితం అనుపమం
హరిం పరమపురుషం గోపాలబాలం....."
అంటూ అంత ఆప్యాయంగా పాడి పరవశించారు....!! 😊
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Youtube Video : G Balakrishnaprasad Archive Page Audio link : MS Subbalakshmi Audio link SP Sailaja Audio link Vedavati Prabhakar ...

A tech article that I wrote along with an underlying message that, 'always listen to people and their ideas no matter how small they might seem.....' :)

A lucid article explaining the importance of today's 'Continuous Integration / Continuous Delivery' embedded Software Build & Release management methodologies for efficient and robust software delivery management to a larger ever increasing customer base.
------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------

In today's modern era of decentralized computing technologies, it is indeed an established and a proven fact that it is the need of the hour for every company to embrace a CD-CI based Build and Release model that essentially thrives on the updated tools and technology stack already in use in the customer environments and with the competitors to ensure we are always a step ahead of the market.

The very question on why the customers ( be it internal or external ) are looking for an execution model that is simple yet perfectly scale-able , lightweight in terms of the imposed overhead yet highly efficient in terms of throughput, and above all loaded with robust security yet highly end user friendly and with ease of maintenance, answers the need for organizations to revisit their existing models of software delivery based off of the current legacy systems in-use and revamp them to include the state of the art mechanisms composed of latest tools and technologies.
     
With the widespread acceptance of tools & technologies like Docker Containers' execution oriented in-kernel light weight models, decentralized source code management systems (version control systems) like Git, not just highly object oriented APIs but also the public APIs that are modifiable with ease in the customer environment by the field personnel on par with the engineering teams that have developed them in order  to accommodate any dynamic user requests / enhancements. 

(i.e., a code/script snippet that is written in a simple to comprehend fashion and ' cod-ably ' reliable for a larger group of engineers as opposed to only a select few that belong to the 'Only-I-want-to-know-how-to-change-it' category, which isn't apt for any team to prosper ),

it has become extremely important for teams to be agile not just in the process being followed to deliver the software but also in the methodology in which it is being coded / scripted so that the delivery mechanism remains simple yet significantly reliable when it comes to bank on the key features like 
'scale-ability', security and above all the widely requested user friendliness.     

Now that literally every single organization is unanimously bifurcated in to 'Back-end' ( to deal with all the core infra for DBs, AppServers, WebServers, Messaging systems, and the underlying middle ware that entwines all these key layers ), 'Front-end' ( for those cozy web UIs, Widgets, standalone as well as server based dynamic JSPs that rely both on client side & server side validations ), and those important 'Integrations' with external / 3rd party systems that have become so important today to make sure that our software isn't just a fixed piece of a huge chunk of enterprise functionality that is explained across those heavy free docs accompanying the software installation module but also a dynamic enterprise feature that can go beyond what has been built with the help of simple 'plug-and-play' extensions that essentially speak for the functional 'scale-ability' of the software, should the situation demand.

Now, coming to the in-house software re-engineering practices to leverage all of its existing set of licensed external software systems that are used to build its own software, that every organization would like to perform to reduce their operational costs and to strike a balance between what is readily available and what is that missing piece to ensure that our engineering systems are on par with that of our competitors to stay ahead in the market, when it comes to make a statement on how abreast our tools and technologies are behind building and delivering our software, it certainly is the onus on each and every engineer to have his or her inputs provided to the management in the various appropriate endorsed ways which are never to be discouraged or ignored by any one, for that even a small idea might bring in a huge positive change that would help everyone in the long run once they realize its usefulness.

Isn't it true that even a huge banyan tree that is now giving shade to hundreds of folks sitting beneath, ( like the one located in  Sree Ramana aashram, Arunaachalam...) would sprout from a tiny seed...? Hence each and every input from however small or big a person / personality might be, would account for the overall wellness of any system when there is a heart to listen, willingness to respond and reciprocate the good lying within....! :)

------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------

Author 
-Vinay Kumar Aitha
A seasoned CI-CD-B&R professional
************** **************  ************** **************

Tuesday, August 20, 2019

శ్రీనాగసూర్యకళ టీచర్..... తెలుగు, లిఖిత మాతృభాషను, బోధించిన మా స్కూల్ తెలుగు టీచర్ గారు... :)

శ్రీభారతావనికి స్వాతంత్ర్యంసిద్ధించిన రోజుని పురస్కరించుకొని జరుపుకునే పంద్రాగస్ట్ జెండావందనం చిన్నప్పుడు స్కూల్లో బడిపిల్లలందరికి ఒక పెద్ద పండగే.....!
ముందు రోజు సాయంత్రం నుండే వలంటీర్లు గా ఎంపిక చేయబడిన ఔత్సాహిక పిల్లలందరు కలిసి మా రాజధాని స్కూల్ ఆఫీస్ దెగ్గరికి చేరి రంగురంగుల రిబ్బన్లు, కాగితాలు, ఇత్యాదులతో " సుతిల్ దారానికి " గోధుమపిండితో తయార్ చేసిన ' లై ' పూసి వాటిని ఒక వరుసలో అంటే గ్రీన్, రెడ్, బ్లూ, ఆరెంజ్, యెల్లో, ఇలా వివిధ కలర్స్ లో త్రికోణాకారంలో కట్ చేయబడిన కాగితపు ముక్కలను అతికించి వాటిని తోరణాలుగా అన్నివైపులా కట్టేపనిలో నిమగ్నులమైయ్యేవాళ్ళం...
మాకు టీచర్లు సార్లు కూడా బాగా సహాయంచేసేవారు.....
అనురాధా టీచర్, లక్ష్మీ టీచర్, నాగసూర్యకళా టీచర్,  మా స్కూల్ జీవితాన్ని శాసించిన తెలుగు అధ్యాపక సరస్వతీత్రయం ఈ తెలుగు ఫ్యాకల్టి మెంబర్స్......
1 నుండి 4 వ తరగతి వరకు మాకు ఓనమాలు నేర్పిన తొలి తెలుగు అధ్యాపకులు అనురాధా టీచర్ మరియు లక్ష్మీ టీచర్ కాగా...
( కాలని లాస్ట్ బస్టాప్ కి దెగ్గర్లో ఉండే లక్ష్మీ టీచర్ వాళ్ళింట్లో వైణికురాలైన వాళ్ళ అమ్మాయి వాయించే వీణని చూడ్డానికై టీచర్ వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళడం బాగా గుర్తు.... )
5 నుండి 10 వరకు నాగసూర్యకళా టీచర్ మరియు ప్రసాద్ సార్, ఆ స్థానంలో మాకు లిఖిత మాతృభాష ని నేర్పిన ఆరాధ్య గురువులు.....
ప్రత్యేకంగా శ్రీమతి నాగసూర్యకళ టీచర్ గారి తెలుగు ప్రభావం మాజీవితం పై అధికంగా ఉండేది...
ఎందుకంటే చిన్నప్పుడు నేర్చిన ఓనమాలకు సార్ధకత ఆ తరువాతి పైతరగతుల్లో తెలుగు బోధించే వారివల్లే సమకూరేది....
ఒక భవనానికి పునాది కోసం తవ్విన తరువాత కట్టే బేస్మెంట్ లాంటిది 5 నుండి 8 వ తరగతి వరకు ఉండే తెలుగు విద్యాభ్యాసం.....
అది ఎంత ధృఢంగా ఉంటే జీవితంలోని తరువాతి విద్యాభ్యాసం అంత ఘనంగా ఉంటుంది అని బోధించే వారు ఎన్.ఎస్.కె టీచర్....
మాతృభాషపై గట్టి పట్టుని సాధించినవారికి ఇతర భాషలు మరియు ఇతర విద్యలపై అవలీలగా
పట్టు లభిస్తుందని బోధించేవారు....
వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యులు మృదుస్వభావులు అయిన వారు, తమ సనాతన ఆర్యవైశ్య జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి తెలుగు భాష ఎంతగా ఉపకరించిందో తెలుపుతూ మమ్మల్ని కూడా తెలుగుపై మమకారాం పెంచుకొని కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కాకుండా అదొక జీవనోద్ధారకమైన ఆధారంగా అభ్యసించండని నిరంతరం బోధించేవారు మా ఎన్.ఎస్.కే టీచర్....
వ్యక్తిగతంగా క్లాస్ లో ఇంకొందరితో పాటుగా నేను కూడా ఎన్.ఎస్.కే టీచర్ కి ఒక ఫేవరేట్ స్టూడెంట్ని....
మా అమ్మ కి కూడా ఎన్.ఎస్.కే టీచర్ వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉండడంతో నాకు మార్కులు బాగా వేసేవారు.....అంటే నాకు కొందరు టీచర్లు హ్యాండ్
రైటింగ్ బావుండదని మార్కులు తగ్గించేవారు.....
కంటెంట్ ఎంత బాగారాసినా నా కోడి బరుకుడువల్ల కొన్ని మార్కులు కోల్పోయేవాణ్ణి....
కాని ఎన్.ఎస్.కె టీచర్ మాత్రం నా బాధను అర్ధంచేస్కొని ఇంకొంచెం బాగా రాయడానికి ప్రయత్నించు వినై అని సున్నితంగా వారించేవారు కాని మార్కులు మాత్రం ఫుల్లుగా వేసేవారు....
ఓంకారాన్ని స్మరించి ఎన్.ఎస్.కే టీచర్ బ్లాక్బోర్డ్ పై వ్రాయడం మొదలుపెట్టారంటే, ఆ తెలుగు అక్షరావళి ఎంతో హృద్యంగా, చూడచక్కని ముత్యాల వరుసల్లా
ఉండేది.....
సుద్దముక్కను చేబట్టి ఎన్.ఎస్.కె టీచర్ టక టక రాసే శైలిని వర్నించాలంటే, అస్మద్ గురుదేవులు,
శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతంలో ఉటంకించబడే జనమేజయ సర్పయాగ వృత్తాంతం గుర్తున్నవారికి తెలిసినట్టుగా,
అక్కడి మహర్షుల సారస్వతశక్తికి ముల్లోకాల్లో ఉన్న సర్పాలన్నీ టకటక మంటూ ఏవిధంగా వచ్చి వాలేవో, అచ్చం అదేవిధంగా అచ్చులు హల్లులు ఒత్తులు దీర్ఘాలు అన్నీ టకటక మంటూ బ్లాక్బోర్డ్ పై అమరిపోయేవి.......
"ఓం తం తక్షకాయస్వాహా...."
అనగానే ఇంద్రుడి సిమ్హాసనాన్ని చుట్టుకొని అక్కడే ఉండిపోదామనుకున్న తక్షకునితో పాటుగా సిమ్హాసనాన్ని కూడా ఈడ్చివేసిన వైనంలా,
మా టీచర్ వ్రాసే వేగానికి అక్షరాలన్నీ కూడా గోడకు అతుక్కొనిపోదామని అనుకున్నా, ఆ వేగానికి మామీదికి వచ్చేస్తాయోఏమో అన్నట్టుగా జాలువారేవి వారి హస్తఝరియందు.....!
మొత్తం బ్లాక్ బోర్డ్ అంతా నిండిపోయాక
ఆ అక్షరాల అమరికను చూసిన ఎవ్వరికైనా సరే,
తెల్లని ఆదిశేషుని సహస్రఫణములు ఊగిసలాడుతుండగా వాటికింద సేదతీరిన శేషపర్యంకశయనుడి నీలమేనిపై అలంకరించబడిన ముత్యాలసరములవోలే ఉండేది ఆ దృశ్యమంజరి.....!!
ఇక మా టీచర్ బ్లాక్బోర్డ్ పై వ్రాసింది విశదీకరించడం, ఆ కమలనాభుడి నాభికమలంలో కొలువైన విరించి శ్రీవాణి వల్లె వేసే సామవేదంలా ఉండేది ఆ తరగతిబోధ.....
అలా మా జీవితాలకు వారి తెలుగు బోధను ఎనలేని పెన్నిధిగా అందించి
వారు మాత్రం అందరాని లోకాలకు తరలివెళ్ళిపోయారు.....😔
ఈ క్రింద వీడియోలో నా క్లాస్మేట్ / ఫ్రెండ్ నాగరాజు పాడదామనుకున్న, మా ఎన్.ఎస్.కె టీచర్ గారు మాకు అందించిన ఆ దేశభక్తి కీర్తన అప్పుడు నేను పాడి ఒక చిన్న ప్రైజ్ కూడా అందుకున్నాను....😊
నా తెలుగు కవనాలు రాసేది నేనైనా రాయించేది మాత్రం మా నాగసూర్యకళ టీచర్ గారే అనిభావిస్తుంటాను ఇప్పటికీ నేను కొన్నిసార్లు.....అంతగా వారి అనుగ్రహం మా స్కూల్ జీవితాలను సఫలీకృతంచేసింది.....!

Wishing all my dear fellow Indians a happy 73rd Independence Day...! :)

Aaya hai tyohaar, 73rd SwatantrataDiwas ka.....
har galli say laykay Dhilli thak lehraataahua rangeen tirangaa.....
yaaddilaatay hue un hazaaro deshbhakto ka khurbaani, jinke bina aajka hamaara jeevan tho hota sirf adhoora......
jin parindo ka nas nas mei behtaahua khoon ki khidmat pay basaa hua is desh ki azaadi kaa phal aaj ham bhugaTay jeeraraihai..... un sab mahaaveero ko naman karna harek deshvaasi ka dharm bantaahai.....
Vandemaataram.....🙏
Jai Hind Jai Bhaarath
Jai Jawaan Jai Kisaan..... 😊

Wednesday, August 14, 2019

విరజా తీరస్థ గోవిందా గోవిందా...!! :) 🙏

శ్రీనివాసుడిని నిరంతరం కొన్ని కోట్ల మంది ప్రఖ్యాతమైన గోవింద నామాలతో కీర్తించడం మనం చూస్తుంటాం.... అందులోని ఒక పంక్తిలో ఉండే " విరజాతీరస్థ గోవింద...విరోధిమర్దన గోవింద..." అనే నామం, స్వామి వారు విరజా నదీ తీరమునందు వసించి ఉన్నారు... అని కద...

అల వైకుంఠపురమునందున్న విరజానది స్వామి శ్రీపాదయుగళం ఎక్కడెక్కడ మోపబడిఉంటుందో అక్కడికి ఏదో ఒక రూపంలో, అంతర్వాహినిగా అయినాసరే వచ్చి తీరుతుంది..... ఆ పావన శ్రీపాదద్వయాన్ని నిరంతరం అభిషేకించుటకు.....

తన అన్న రత్నాచలం గా వెలసి శ్రీమహావిష్ణువును శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీ సమేత సత్యనారాయణుడిగా వెలసి ఈ కలియుగ వాసులను కలకాలం కరుణించి కాపాడమని కోరుకుంటే,

తను భద్రాచలం గా వెలసి, ఆ శ్రీవైకుంఠధాముడిని శ్రీవైకుంఠరాముడిగా, భద్రాద్రి పై శ్రీ లక్ష్మణస్వామి సమేత సీతారాముడిగా తన శిరస్సుపై ఆ పావన శ్రీపాదాలను మోపి కొలువైఉండమని భద్రమహర్షి కోరాడు.  భద్రాచలం దక్షిణ అయోధ్య గా వినుతికెక్కిన  పుణ్యక్షేత్రం.

శ్రీభద్రాచలాధీశుడిపై ఎంతో ప్రేమతో శ్రీభక్తరామదాసు గారు తాము రచించిన దాశరథీ శతకంలో, ఒకానొక పద్యంలో, ఆ వికుంఠమహర్షి సృష్టి అయిన శ్రీవైకుంఠంలో ఉన్న పరివారమంతా కూడా ఈ భద్రాచలానికి విచ్చేసిన వైనాన్ని పరమాద్భుతంగా వర్నించిన ఈ క్రింది పద్యంలో మనం చూడవచ్చు, విరజా నది గౌతమి గా రూపుదాల్చిన వైనాన్ని......
    
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానదిగౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి.

దండకారణ్యంలో సీతారాములు తమ వనవాసంలో ఉన్నపుడు గౌతమీ / గోదావరి నదీ తీరంలో సేదతీరిన పర్వతమే భద్రుడు.
తమకు ఆసనంగా, శయ్యగా, భోజన పత్రానికి ఆలంబనగా, ఆటలకు నెలవుగా ఇలా వివిధ రూపాల్లో ఉపకారం చేసిన భద్రుడికి త్రేతాయుగంలో శ్రీరాములవారు ఇచ్చిన వరం కారణంగా, ఈ కలియుగంలో భద్రగిరిపై వారు వెలిసారు. అప్పటికి సీతాపహరణం, కిష్కింధకాండ, హనుమ ఆగమనం కాలేదు కాబట్టి కేవలం శ్రీలక్ష్మణస్వామి సమేత శ్రీసీతారాముడు మాత్రమే వనవాసంలో ఉన్నది. అప్పటి భద్రుడికి వరం ఇచ్చే సమయానికి ఉన్నది ముగ్గురు మాత్రమే కాబట్టి ఇప్పుడున్న గర్భాలయంలో కూడా హనుమ లేకుండ సీతా రామ లక్ష్మణులు మాత్రమే ఉన్నారు.... మారుతి లేకుండా ఏ శ్రీరామమందిరము కూడా పరిపూర్ణం అవ్వదు కాబట్టి, ఆలయం వెలుపల హనుమ వారికి అంజలిఘటిస్తూ కొలువైనాడు.....
త్రేతాయుగంలో ఇచ్చిన తన వరాన్ని సాకారంచేయడంలో కించిత్ ఆలస్యం అవ్వడం వల్ల భద్రుడి శరణాగతి మేరకు హుటాహుటిన శ్రీవైకుంఠం నుండి తరలి వచ్చిన సందర్భంలో తన శంఖచక్రాలను అపసవ్యంగా స్వామి ధరించాడు అని పెద్దలు చెప్పడం వింటుంటాం. కాని అది ఆ శ్రీహరి యొక్క భక్తవాత్సల్యానికి, ఆర్తత్రాణపరాయణత్వానికి సూచిక అని విజ్ఞ్యుల ఉవాచ.... సాధారణంగా కుడి చేతిలో ఉండే చక్రం, దుష్టసమ్హారానికి, శిష్టరక్షణకు పెట్టింది పేరు.... ఎక్కడైనాసరే శ్రీమహావిష్ణువు శంఖచక్రాలు ఎడమకుడి చేతుల్లోనే ధరిస్తాడు.....
కాని ఇక్కడ భద్రాచలంలో స్వామి వెలసిన సందర్భం ఏదో ఒక రాక్షస సమ్హారానికో, ఒక భక్తున్ని రక్షించడానికో కాదు......
తన భక్తుడి సపర్యలకు మెచ్చి ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకునే సందర్భంలో, తన మూలస్థానమైన శ్రీవైకుంఠమునుండి కదలి రావడం....అది కూడా
ఒక యుగం గడిచిపోయిన తరువాత, ఇప్పటి కలియుగంలో అప్పటి త్రేతాయుగపు అవతారమైన శ్రీరామచంద్రుడిగా కొలువైఉండడం.....

అస్మద్ గురుదేవులు, శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణం శ్రద్ధాళువులై ఆలకించిన వారికి తెలిసినట్టుగా,
శ్రీరాముడు ఏనాడు కూడా తను శ్రీమహావిష్ణువు యొక్క అవతారాన్ని అని త్రేతయుగంలో వచించలేదు..... నేను మానవమాత్రుడను,
దశరథుని పుత్రుడను కౌసల్యాకుమారుడను అని మాత్రమే వచించాడు.....
లంకలోని యుద్ధంలో శ్రీరామలక్ష్మణులను సైతం కట్టడి గావించిన మేఘనాథుని నాగాస్త్రబంధనానికి యావద్ వానరసేన సర్పవిషజ్వాలలకు ఆహుతై తల్లడిల్లుతున్న సందర్భంలో, నిర్దేశిత అవతార ప్రయోజనానికై మానుషరూపంలో ఉన్న తన ప్రభువుకు ఆపద వాటిల్లిన మరుక్షణం గరుత్మంతుడు
అక్కడికి వచ్చి, తన గారుడ శక్తితో మొత్తం నాగాస్త్రబంధనాన్ని నిర్మూలించి అందరికి స్వస్థత కలిగించినప్పుడు, శ్రీరాముడు గరుత్మంతులవారికి కృతగ్న్యతలను తెలుపుతూ, తాము అర్ధించకుండానే ఇంతటి ఘనమైన సహాయం చేసిన మీరు ఎవరు అని అడిగినప్పుడు, 
"ప్రస్తుతానికి మీకు ఒక అనుంగు మితృడను అని భావించండి..... " అని చెప్పి గరుత్మంతులవారు తిరిగి శ్రీవైకుంఠానికి వెళ్ళిపొయిన సంఘటనను మనం పరికించి చూస్తే, అక్కడ కూడా శ్రీరాముడు తన మానుష ఉపాధికే ప్రాధాన్యతను ఇచ్చి, తన దైవిక అంశను బహిర్గతం కానివ్వలేదు.....
సీతాపహరణ సమయంలో రావణుడిని అడ్డగించి నేలకొరిగిన జటాయువుకు ఉత్తరక్రియలను గావించి, సద్యహ్ మోక్షఫలాన్ని అనుగ్రహించిన శ్రీరాముడికి తను శ్రీమహావిష్ణువు అనే సంగతి తెలుసు అనే విషయం తెలపకనే మనకు తెలపబడినది కదా.....

నరవానరుల మినహ అన్యులెవరిచేతను మరణం లేని వరగర్వితుడైన రావణసమ్హరానికై మనుష్యుడిగా 12 మాసాలు గర్భవాసానంతరం అవతారం స్వీకరించిన పరమాత్మ తన అవతార ప్రయోజనసిద్ధికై ఎన్నడూ ఆ దేవరహస్యాన్ని వ్యక్తపరచలేదు.....
   
అవతార ప్రయోజనం సిద్ధించినానంతరం, " దశవర్షసహస్రాని దశవర్షశతానిచ..." అనగా 11000 సంవత్సరాల కోసల సామ్రాజ్యపరిపాలనానంతరం కుశుడికి లవుడికి సామ్రాజ్యాన్ని విభాగించి రామరాజ్యం సదా వర్ధిల్లు విధంగా పరిపాలన కొనసాగించమని చెప్పి, ఇక తన అవతారసమాప్తి సమయంలో సరయునదీ ప్రవేశం చేసి అవతార సమాప్తి చేసే సమయంలో తనపై ప్రమాభిమానాలతో ఎంత మంది ఆ సందర్భంలో సరయు ప్రవేశం గావించారో వారందికి కూడా సంపూర్ణకర్మక్షయం గావించి మోక్షాన్ని అనుగ్రహించిన శ్రీరాముడిది ఎంతో విశేషమైన భక్తవాత్సల్యతతి....!

తన పంచాయుధాల్లోని మూడింటిని శంఖము(పాంచజన్యము) , చక్రము(సుదర్శనము) ,  గద(కౌమోదకి) మరియు పద్మమును చతుర్భుజుడై ఆ శ్రీహరి సదా ధరించి ఉండడం వల్ల సమకూరిన 24 వైశేషిక దివ్యస్వరూపాలనే మనం కేశవాది చతుర్వింశతి - 24 నామాలుగా నిత్యం పూజా సమయంలో పఠిచడం అందరికి తెలిసిందే..... 

ఇక మిగిలింది నందకం అనే ఖడ్గము మరియు శార్జ్ఞం అనే ధనస్సు.

కేవలం తన ధనస్సు శార్జ్ఞం కోసం ప్రత్యేకంగా స్వీకరించిన అవతారమే శ్రీరామావతారమని పెద్దలు చెప్పడం కద్దు. కోదండం అనే పేరుతో తన శార్జ్~గాన్ని చేబట్టి శ్రీరామావతారంలో చేసినంతగా స్వామి మరే అవతరంలోను అంత రాక్షససమ్హారం చేయలేదు....అంతటి అరివీరభయంకరమైనది శ్రీరామావతారం.....ఎంతగా అంటే ఏకంగా
కోదండరాముడు అనే పేరుతో శాశ్వతంగా ఈ లోకంలో స్వామి శ్రీరామావతార వైభవం స్థిరపడింది...!!

అటు పరతత్వమైన శ్రీమహావిష్ణువుగా శంఖచక్రాలను ధరించి, వాటికి తోడుగా అంతటి అరివీరభయంకరమైన శార్జ్ఞం / కోదండం అనే ధనస్సును తన పరిపూర్ణ మానుషావతారమైన శ్రీరామావతారానికి సూచికగా చేబట్టి, కమలమ్మను సీతమ్మగా తన వామాంకముపై ఆసీనురాలిగా జేసి, ఆదిశేషుడిని వామ పార్శ్వమున ధనుర్ధారిగా లక్ష్మణస్వామిగా స్థానక ముద్రలో నిలిపిన బహువిశేష స్వరూపము భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తిభవించిన వైనం. ఇక్కడ స్వామి వామ భాగమున శక్తిద్వయం కొలువైఉంది. స్వామి ఎడమతొడపై సీతమ్మవారు పద్మాన్ని ధరించి ఉండడం సకల ఇహ పర ఐశ్వర్యదాయక సూచకం. శస్త్రధారి గా లక్ష్మణస్వామి నిలుచొని ఉండడం శరణాగతులకు సకల అభయ దాయకం. ఇంతటి విశేషశక్తి భరిత క్షేత్రమైనందునే, భద్రాచలం చేరి స్వామిపాదాలను చేరిన తరువాత (అనగా భద్రాచల క్షేత్ర స్పర్ష సోకినతరువాత ) గోదావరి ఉవ్వెత్తున ఉరకలేస్తూ వడి వడిగా దూసుకెళ్తూ తన విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది....!!

భద్రాచలాన్ని దాటి రాజమహేంద్రికి చేరేసరికి ఉన్న గోదావరి విశ్వరూపాన్ని ఒకవైపు, మరియు భద్రాచలం చేరక ముందు ఇతర చోట్ల ఉన్న గోదావరి విస్తారాన్ని ఒకవైపు గా, గమనిస్తే ఈ విషయం ఇట్టే సుగ్రాహ్యం.....

" విష్ణుపాదోద్భవీం " అని కదా గంగమ్మకి ఒక పేరు.... మరి అంతటి ఘనమైన శ్రీమాహావిష్ణువు యొక్క సాటిలేని శ్రీవైకుంఠరాముని అవతార క్షేత్రమైన భద్రాచల స్పర్షసోకగా గౌతమికి సమకూరే ప్రవాహశక్తి అప్రతిహతమే కదా.....!!

ఇనకులతిలకుడిగా, సూర్యవంశసంజాతుడైన శ్రీరామచంద్రుని విశిష్ట క్షేత్రమైన భద్రాచలంలో, ప్రతీ భానువాసరం నాడు, ఆలయ పరిసర పరీవాహక ప్రాంతంలో ఉన్న గోదావరి జలాలపై ఎన్నోకోట్ల పుణ్యతీర్థాలు ఆవాహితమై ఉంటాయనే సత్యం ఇప్పటికీ అక్కడ ఉండే ఎందరో భాగవతులకు అనుభవైకవేద్యమైన ఆధ్యాత్మిక సత్యం..!
అక్కడ అంతర్వాహినిగా ప్రవహించే విరజానది వల్లే ఆ మహత్తు సమకూరేది....
అసలు స్వామి వారి ఆలయంపై కొలువైన విశేషమైన సుదర్శనచక్రం సాక్షాత్ స్వామివారిచే
అనుగ్రహించబడిన విరజాప్రసాదం...... మనుష్యులచే మలచబడిన ఎన్నో సుదర్శనచక్రాలు శ్రీరామదాసు వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆలయశిఖరం పై ప్రతిష్ఠ చేయలేకపోయారు...... ఇక చేసేది లేక స్వామివారినే ప్రార్ధిస్తే,
వారికి కలలో స్వామివారు సాక్షాత్కరించి,

" ముక్తిదాయక క్ష్రేతమైన ఈ భద్రాచల గర్భాలయ గోపురానికి, దైవిక సుదర్శనమే శిఖరంగా నిలువగలదు..... మానుషకృతములు మనలేవు..." అని పలికి మరునాడు గౌతమిలో ఎక్కడ నిలిచి తనను ప్రార్ధిస్తే ఆ దైవదత్తమైన సుదర్శనచక్రం లభిస్తుందో కంచర్లగోపన్నకు తెలిపి తన ఆలయ శక్తికేంద్రాన్ని తానే అనుగ్రహించిన మహానుభావుడు ఆ వరభద్రగిరీశుడైన శ్రీవైకుంఠరాముడు....!

ఇక రీసెంట్ గా కొంత కాలం క్రితం తిరుమలలో కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసమై జియాలజిస్ట్లు జరిపిన పరిశోధనల్లో, ఒక నది తిరుమల కొండల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తూ స్వామివారి గర్భాలయ మూలమూర్తి పాదాల క్రిందిగా ప్రవహిస్తుందని గుర్తించి, ఆ ప్రవాహానికి అడ్డుగా ఎటువంటి తవ్వకాలు, కట్టడాలు చేయడం క్షేమకరం కాదని తెలిపిన సత్యాలు చాల మందికి తెలుసు.... ఆ ప్రవాహమే విరజా నది అన్నది మన పెద్దలు ఎప్పుడో చెప్పిన సనాతన సత్యం....!

వివిధ చోట్ల తయారు చేయబడిన కొన్ని వందల లడ్డూల మధ్యలో ఒక్క తిరుమల లడ్డు పెట్టినా సరే, అది స్వీకరించిన ఎవ్వరైనా సరే అది తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం అని ఇట్టే గుర్తుపట్టడానికి కారణంకూడా, ఆ లడ్డూ ప్రసాదాల తయారిలో వినియోగించబడే విరజా నదీజలం...!

దైవిక తత్వాన్ని, దైవానుగ్రహాన్ని సులభగ్రాహ్యం చేసేందుకు రజోగుణాన్ని నివారించి, అవసరమైన సత్వగుణాన్ని పెంపొందించే దేవ తీర్థమే " వి రజా " జలం....!! అంతటి మహత్తరమైనది విరజానది యొక్క వైభవం....

విరజా తీరస్థ గోవిందా గోవిందా...!! :) 🙏

About This Website
YOUTUBE.COM
Viraja River. It is believed that the river Viraja of Vaikuntam flows beneath the feet of the Lord Venkateswara.

Saturday, August 10, 2019

శ్రీవరలక్ష్మీ నమోస్తుతే...!!!!! 🙏😊

శ్రీవరలక్ష్మీ నమోస్తుతే...!!!!! 🙏😊
" సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామమసర్వదా..... "
అని కదా మనం శ్రీసూక్తాంతర్గతంగా ఆ లోకమాతను ప్రస్తుతిస్తూ ప్రణతులను సమర్పించి వివిధ శాస్త్రోక్తరీతుల్లో
అర్చించి అనుగ్రహాన్ని అపేక్షించేది...
అస్మద్ గురుదేవులు శ్రీచాగంటి
సద్గురువుల వాగ్వైభవంలో తళుకులీనే ఆ పరతత్వపు ప్రాభవాన్ని, పురుషకారిణి గా ఉండి అందరి మనోభీష్టములను వారి వారి ఆర్తికి అనుగుణంగా అనుగ్రహించే ఆ శ్రీలక్ష్మీ కటాక్షవిశేషవైభవాన్ని
కొంతమేర విశదీకరించే చిరుప్రయత్నం చేస్తాను....😊
సిద్ధలక్ష్మి
మోక్షలక్ష్మి
జయలక్ష్మి
సరస్వతీ
శ్రీలక్ష్మి
వరలక్ష్మి
అనే షడ్ నామధేయములతో ఆ శ్రీమహాలక్ష్మిని కీర్తించిడం కేవలం నామమాత్రంగా యథాలాపంగా ఏవో ఒక 6 పేర్లతో ఆ విశ్వంబరిని కీర్తిస్తున్నట్టా...?
లేక అష్టోత్తరశతనామాలతో, సహస్రనామాలతో నిత్యం సేవించబడే ఆ సముద్రతనయను, సరసిజనాభుడి శక్తిగా కొలువైయ్యుండే ఆ శ్రీమహాలక్ష్మి తత్వాన్ని నిఘూడంగా ఆ 6 గౌణములలో నిక్షిప్తంగావించి తత్ సూచికగా ఆ 6 పేర్లనే ఉటంకించారా.?? అనే ఆలోచన రావడం తాత్వికులకు సహజమే కద....
ఆద్యంతరహితేదేవి ఆద్యశక్తినమోస్తుతే....
అని దేవతలచే స్తుతించబడే ఆ లోకాలోకమైన విశ్వవ్యాప్తమైన అప్రమేయతత్వాన్ని అత్యంత శక్తివంతమైన శ్రీసూక్తంలో కేవలం పైన పేర్కొన్న 6 విశిష్ట
నామముల్లో గౌణములుగా పేర్కొనబడడం ఒక ప్రత్యేకతను
ప్రతిపాదించడమే అవుతుంది.....
అణువు నుండి ఆకాశం వరకు,
జడము నుండి జవసత్వములు గల బృహత్ ప్రాణులవరకు,
ఈ చరాచర విశ్వంలో నిండినిబిడీకృతమైన ఆ ఆదిపరాశక్తి యొక్క కరుణాకటాక్షవైభవాన్ని స్థూలంగా, జీవోపాధి స్థాయిలో ఒక మేయమైన కొలమానంగా బుద్ధిజీవులకు దృగ్గోచరమయ్యేలా శాస్త్రోక్తంగా ఆ శక్తిని నిర్వచించడమే అందులోని వైశేషిక భావమంజరి......
ఎట్లనగా...,
***** సిద్ధలక్ష్మి *****
సర్వోత్కృష్టస్థాయిలో ఆ పరాశక్తి యొక్క భోగానుగ్రహం ఈ లోకంలో సిద్ధలక్ష్మి గా స్థిరీకరించబడి ఉండడం..... అనగా ఒక ఊర్ధ్వగమన ఉపాధితో జన్మను పొందిన జీవుడికి అత్యంత పైస్థాయిలో ఆ శ్రీమహాలక్ష్మి యొక్క అనుగ్రహం సిద్ధలక్ష్మిగా వారికి కైవసమవ్వడం.....
ఒక జీవుడికి అత్యంత దుర్భేద్యమైన
కట్టడి తన కర్మయే....అది సంచితమై ఉండడం వల్లనే కద ప్రారబ్ధానుభవం కోసమై ఈ మర్త్యలోకమున జన్మను స్వీకరించవలసి వచ్చింది.....ఆ సదరు జన్మపు జీవ ప్రయాణంలో వచ్చి చేరే ఆగామి ని కూడా భరించవలసిరావడం......
సిద్ధలక్ష్మిగా ఆ అమ్మవారి అనుగ్రహం సముపార్జించుకున్నవారికి
కర్మ అనే ఆ భౌతిక కట్టడి కేవలం ఒక దూదిపోగు వంటిది....
వారు ఐచ్ఛికంగా దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్మూలించివేసి కేవలం లోకకల్యాణానికై మాత్రమే
వారి అభీష్టసిద్ధిని సాధించునే పనిలో జీవనం సాగిస్తు ఉండిపోగలరు..... క్రింది ఉన్న మిగతా 5 శ్రీమహాలక్ష్మి అనుగ్రహవిశేషాలు వారికి కైవసమైన సిద్ధలక్ష్మీ అనుగ్రహమునందు అంతర్భాగములై కొలువైఉంటాయి...
***** మోక్షలక్ష్మి *****
కర్మలంపటంలో చిక్కి కకావికలమై
సతమతమయ్యే పని లేకుండా సంపూర్ణ కర్మక్షయమే పరమావధిగా ఆ పరాశక్తిని ప్రార్ధించిన వారికి, మోక్షలక్ష్మిగా ఆ శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కైవసమైఉంటుంది....
ఇక్కడ మోక్షలక్ష్మి అంటే కేవలం శరీరాన్ని త్యజించినానంతరం అనుగ్రహించబడే సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య మోక్షాలుగా మాత్రమే కాకుండా, ఐహికంగా విదేహముక్తిగా ఉండే పంచవిధ మోక్షలక్ష్మి గా, వారి ప్రతి కర్మకు ఆగామి అనేది లేకుండా, సంచిత ప్రారబ్ధాలను సమూలంగా క్షయింప జేసి వారి యొక్క కర్మాచరణఫలితాన్ని తామరాకుమీది నీటిబొట్టులా జాలువార్చేలా వారి జీవితాన్ని సుసంపన్నంచేసే మోక్షలక్ష్మి గా భావించవలసి ఉంటుంది......క్రింద ఉండే మిగతా 4 శ్రీమహాలక్ష్మి అనుగ్రహవిశేషాలు వారికి కైవసమైన మోక్షలక్ష్మి అనుగ్రహమునందు అంతర్భాగములై కొలువైఉంటాయి...
***** జయలక్ష్మి *****
షడూర్ములు ఉన్న ప్రతి ప్రాణి, అనగా అత్యంత అల్ప స్థాయిలో ఉండే కీటకం మొదలు అత్యున్నతస్థాయిలో ఉండే మనుష్యప్రాణి వరకు, కోరుకునేది వారి వారి స్థాయిలో సాగే కర్మాచరణమునందు జయం.....
అది వరించనినాడు, వారి పరిశ్రమమొత్తం వృధా అవ్వడమే కాబట్టి అందరు ఆశించేది వారి అన్ని పనుల్లో జయలక్ష్మీ అనుగ్రహమే.....
క్రింద ఉండే మిగతా 4 శ్రీమహాలక్ష్మి అనుగ్రహవిశేషాలు వారికి కైవసమైన జయలక్ష్మీ అనుగ్రహమునందు అంతర్భాగములై కొలువైఉంటాయి....
శ్రీరామజయం అంటూ ప్రతి పనిని మంగళవాచకంతో ప్రారంభించడం మన సనాతన సంప్రదాయపు పెద్దల ద్వార మనకు అందివ్వబడిన గొప్ప సంస్కృతి.... శ్రీరామ నామం యొక్క శక్తి అటువంటిది కదామరి....!
***** సరస్వతీ *****
బుద్ధికుశలతను ఆలంబనగా చేసుకొని జీవించడం / జీవించాలనుకోవడం ప్రతి మనుష్యప్రాణికి ఉండే ఔత్సాహిక లక్షణం..... అందుకు విద్యాలక్ష్మిగా
ఉండే ఆ సరస్వతీ అనుగ్రహానికై ఈ లోకంలో ప్రతిఒక్కరు పరితపిస్తూ ఉంటారు.....
విద్యా దదాతి వినయం.....
వినయం దదాతి పాత్రత.....
ఆ విద్య వల్ల అబ్బిన వినయం తో చేకూరిన పాత్రత వల్ల పైన ఉండే 4 రకాలైన శ్రీమహాలక్ష్మీ అనుగ్రహాలు సమకూరి జీవనసాఫల్యత అనేది సిద్ధించేది....... విద్యాలక్ష్మి అనుగ్రహం అంటే కేవలం సర్టిఫికెట్లు,
డిగ్రీ / ఇంజనీరింగ్ / మెడికల్ పట్టాలు మాత్రమే కాదు,
ఒక రైతుకు ఎప్పుడు ఏ భూమిలో ఎటువంటి నాట్లు వేసి ఎక్కువ పంటదిగుబడి సాధించుకోవాలో తెలిసేది ఆ విద్యాలక్ష్మీ అనుగ్రహం వల్లే.....
పాడి ఆవుల కొట్టంలో పనిచేసే వ్యక్తికి ఏ ఆవుకు ఎంత మోతాదులో పచ్చగడ్డి వేసి ఎన్ని లీటర్ల పాలు పితకొచ్చో, ఎంత మోతాదులో ఎండు గడ్డి వేసి పాల యొక్క నాణ్యతను ( పాలు చిక్కగా ఉండేలా ) చూడొచ్చో
తెలిసేది కూడా విద్యాలక్ష్మీ అనుగ్రహం వల్లే.....
ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేసే కార్మికుడికి, ఫర్నేస్ యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడు ఎందుకు ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండేలా తగు రీతిలో విచక్షణాభరితంగా
తన ఉద్యోగాన్ని నిర్వహించే దక్షతను ప్రసాదించేది కూడా విద్యాలక్ష్మీ అనుగ్రహమే.....
ఇలా వివిధ వృత్తుల్లో ఉండే వారికి
వివిధ రకాలుగా అవసరమైన బుద్ధికుశలతను ప్రసాదించేది ఆ విద్యాలక్ష్మీ అనుగ్రహమే....
క్రింద ఉండే మిగతా 2 శ్రీమహాలక్ష్మి అనుగ్రహవిశేషాలు వారికి కైవసమైన విద్యాలక్ష్మీ అనుగ్రహమునందు అంతర్భాగములై కొలువైఉంటాయి....
***** శ్రీలక్ష్మి *****
ఇక వారు వీరు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఆశించేది ఆ శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని....సంపదను ఇష్టపడని వారెవరుంటారు గనక...
అందునా ఈ కలియుగం మొత్తం
" ధనమూలం ఇదం జగత్ " అనే నానుడికి తగ్గట్టుగా ప్రపంచం ధనలక్ష్మి చుట్టే పరిభ్రమిస్తుంది అనడం అతిశయోక్తి కాదేమో....!
వివిధ రూపాలుగా ఆ సంపదను,
అనగా స్థిర చర ధన కనక వస్తు వాహనాది సంపత్త్ రూపాల్లో ఆ శ్రీలక్ష్మీ అనుగ్రహానికై అందరు ప్రార్ధిస్తుంటారు......
[[ కొందరు న్యాయం ధర్మం నీతి నిజాయితి మొదలైన ఉన్నత విలువలకు కట్టుబడిన ధర్మమార్గపు జీవితాన్ని ఆలంబనగా చేసుకొని ఆ శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని
కైవసం చేసుకుంటారు......
వారిని గజవాహనారూఢురాలిగా / ఏనుగు తన వాహనం గా కొలువైన మహాలక్ష్మి గా ఆ సిరులతల్లి కరుణించి సకల సంపదలను శాశ్వతంగా ఉండేలా యోగ్యతానుగుణంగా అనుగ్రహిస్తుంది....
ఇంకొందరు, అటువంటి ఉన్నతమైన విలువలకు తిలోదకాలిచ్చి, కేవలం సంపాదించడమే లక్ష్యంగా
మందిని ముంచడమో, దోచుకోవడమో,
బెదిరించడమో, మరే అనైతికమైన మార్గమో, ఎవ్విధమైతే ఏముంది సంపదను బలవంతంగా ఆర్జించి పోగుచేసుకోవడమే వీరి జీవనధ్యేయం..... అటువంటి వారిని 270 డిగ్రీల్లో తన తల తిప్పగల అమంగళసూచకమైన పక్షి గుడ్లగూబ / ( Owl ) వాహనం గా గల లక్ష్మిగా అనుగ్రహిస్తుంది....
అది ప్రస్తుతానికి భోగంగా
( హాయిగా అనుభవించబడే లౌకిక సంపదగా ) కనిపించినా కాలక్రమంలో అది భోగమై ( అనగా పాముపడగై ) వారు ఏ విధంగా ఇతరులను హింసించి ఆ సంపదను ఆర్జించారో అట్లే వారిని కూడా నానా హింసలకు గురిచేసి ఆ సంపద హరించుకుపోతుంది.... అనగా అనైతిక మార్గాల్లో ఆర్జించబడిన లక్ష్మి కాలక్రమంలో అలక్ష్మిగా మారి పోతుంది.... ]]
***** వరలక్ష్మి *****
ఇక చివరగా వరలక్ష్మి గా పేర్కొనబడిన మహాలక్ష్మీ అనుగ్రహం అన్నిటి యందు ఆపాదించబడేది, అన్నిట్లో ప్రత్యేకమైనది మరియు అన్నిటికి మూలమైనది కూడాను....!!
జీవితంలో లభించే ప్రతీ వస్తువు,
ప్రతీ సంపద, ప్రతీ లక్షణం, ప్రతీ క్షణం కూడ ఒక వరమే....
అసలు మనకు మన జీవితమే ఒక పెద్ద వరం.....
పైన ఉన్న పంచవిధ లక్ష్మీ అనుగ్రహం మరియు వరలక్ష్మి గా ఉండే తన అనుగ్రహానం రెండు సమ్మిళితమై ఉండే అనుగ్రహాలు.....
అనగా వరలక్ష్మి గా ఆ శ్రీమహాలక్ష్మి ఏ వరాన్నైనా ఇవ్వగలదు.....
ఆవిడ ఇచ్చిన ప్రతీ వరం కూడా వరలక్ష్మి అనుగ్రహంగా భావించవచ్చు.....
సిద్ధలక్ష్మి గా కోరుకున్న లోకశ్రేయస్కర సిద్ధులన్నీ అనుగ్రహించిన ఆ శ్రీమహాలక్ష్మి
అడిగిన వరమిచ్చిన తత్కాల వరలక్ష్మే కద...!
మోక్షలక్ష్మి గా పంచవిధ మోక్షాలను అనుగ్రహించే శ్రీమహాలక్ష్మి, మోక్షమనే మహోన్నతమైన వరాన్ని ఒసగిన వరలక్ష్మే కద...!
సకలకార్యజయం అనే వరమిచ్చిన జయలక్ష్మి, వరలక్ష్మే కద...!
కోరిన విద్యలను ఒసగే సరస్వతీ అమ్మవారి వరాలవెల్లువ కూడా వరలక్ష్మి అమ్మవారి వరములే కద..!
తరగని సిరులను కురిపించే శ్రీలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా కరగని వరముల వరలక్ష్మి అనుగ్రహములే కద....!
అట్లా ప్రతి అనుగ్రహం కూడా తన అనుగ్రహంగా ప్రసరించే ప్రత్యేకమైన శ్రీమహాలక్ష్మి స్వరూపమే వరలక్ష్మి అమ్మవారు...
వరలక్ష్మి అమ్మవారు ఇవ్వనిదిలెదు....
వరలక్ష్మి అమ్మవారు కానిదిలేదు....
వరలక్ష్మి అమ్మవారు లేనిదిలెదు.....
ఉన్నదంతా వరమే....
ఉండేవన్నీ వరాలే....
కావున ఈ లోకం మొత్తం వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహమే.......
మరేదో పేరు పెట్టుకుంటే తనను సరిగ్గా గుర్తుపడ్తారో లేదో అని, ఏది కావలంటే అది వరంగా అనుగ్రహించేందుకు శ్రీమహాలక్ష్మి అయిననేనే వరలక్ష్మి అమ్మవారిగా
సదా సంసిద్ధంగా ఉండే భక్తసులభ స్వరూపిణిని అని, మనకు తన వైభవ విశేషాలను చారుమతి అనే పుణ్యపతివ్రత ద్వారా తెలిపి,
తను క్షీరసాగర తనయగా ఉద్భవించి కోరి కోరి వరించిన
శ్రీమహావిష్ణువు యొక్క అవధిలేని కారుణ్య మూర్తి స్వరూపమైన, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరవతార జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో తన సహోదరుడు చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశించే పవిత్ర శ్రావణమాసపు శుక్రవారమునందు పూజించి తరించండని ఆ ముకుందప్రియ, ఆ హరివల్లభి, ఆ జగన్మాత మనకు తన అనుగ్రహన్ని వర్షించి ప్రతి సంవత్సరము కరుణిస్తూనే ఉంటుందన్నమాట.....😊
అందుకే అనుకుంటా అన్నమాచార్యులవారు అమ్మవారిని ఎంతో ఘనంగా
" జయలక్ష్మి వరలక్ష్మి ,,,,"
అంటూ కీర్తిస్తూ, గోవిందుని విశాల వక్షస్థలంలో కొలువైనట్టుగా, ఎప్పటికీ మాతోనే మాఇంట కూడా కొలువై ఉండవమ్మ అని వేడుకున్నారు.... 😁
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||
🙏🙏🙏🙏🙏
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Archive Audio link : G Balakrishnaprasad Meaning : Tadepalli Patanjali జ యలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి( బెర...