Saturday, August 10, 2019

ఈశ్వర తైజసాత్మికదివ్యరూప సందర్శనావైచిత్రి యొక్క వివరణ.... :)

శ్రీశ్రీశ్రీ రామానుజ చినజీయర్ స్వామి వారి ఆచార్యోక్తుల్లో, ఎంతో సరళమైన విధంగా ఈశ్వర తైజసాత్మికదివ్యరూప సందర్శనావైచిత్రి యొక్క వివరణ.... 
అది కేవల మాంసచక్షువులకు అందేది కాదు అనేది తరతరాలుగా మన సనాతన సంప్రదాయపు పెద్దలమాట...
మరి అది ఎలా ఈ మాంసపు తనువుకు దృగ్గోచరమవుతుంది అనేది ఆచార్యుల వివరణ.... 
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా, శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూప సందర్శనా భాగ్యాన్ని పార్థునకే కాకుండా, దృతరాష్టృనకు కూడా ఇవ్వడంలో ఉన్న ధర్మసూక్ష్మాన్ని సద్గురువులు వివరించినప్పుడు, అంతటి సౌభాగ్యానికి కారణం ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు విదురునితో ముచ్చట్టించడంలో, అప్రయత్నంగానే సత్సాంగత్య పుణ్యఫలం లభించి, విదురుని బ్రహ్మజ్ణ్యాన బోధ యొక్క శ్రవణ ఫలితాన్ని వెచ్చించి పరమాత్మ దృతరాష్టృడికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు అని కద మనం విన్నది.....
పుట్టుకతో అంధుడైన దృతరాష్టృనకు కూడా పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనా భాగ్యం లభించింది అంటే అది కేవల మాంసపు చక్షురింద్రియశక్తికి సంబంధించినది మాత్రమే కాదనే సత్యం మహాభారతం మనకు ఆనాడే బోధించిందన్నమాట.... 
-4:36

No comments:

Post a Comment