శ్రీశంకరభగవద్పాదుల వారి అనుగ్రహంగా అప్రతిహత గురుపరంపరాగతంగా పరిఢవిల్లుతూ,
భరతభూమిపై అనాదిగా కొలువైన సనాతనధర్మం యొక్క వైభవం ఈ కలియుగంలో కూడా పదిలంగాఉండి ఆస్తికప్రజానీకానికి శాంతియుత జీవితాన్ని అనుగ్రహించేలా నిత్యం ధర్మప్రచారయజ్ఞ్యానికై వ్యవస్థీకరించినబడిన చతురామ్నాయపీఠాలకు గురుస్థానాన్ని అలంకరించి శోభిల్లే శృంగేరిపీఠస్థిత శ్రీశారదాచంద్రమౌళీశ్వరారాధకులైన జగద్గురువుల అనుగ్రహాశీర్వచనముగా.......

( ఆదిశంకరాచార్యులకు ఆనాడు సాక్షాత్ కైలాస శంకరులు అనుగ్రహించిన దివ్యశివలింగమే నిరంతరం పీఠంలో ఈనాటికి కూడా అభిషేకించబడే శివలింగం😊 )
" శ్రీచాగంటి సద్గురువులకు జరిగే
పురస్కారం / బిరుదుప్రదానం మరియు వారు ఎల్లవేళలా ఆయురారోగ్యైశ్వర్యాలతో సంతోషంగా ప్రశాంతంగా జీవించేందుకు దోహదపడేలా గండపెండేర ప్రదానం......"
పురస్కారం / బిరుదుప్రదానం మరియు వారు ఎల్లవేళలా ఆయురారోగ్యైశ్వర్యాలతో సంతోషంగా ప్రశాంతంగా జీవించేందుకు దోహదపడేలా గండపెండేర ప్రదానం......"
అనేది ఈ సత్కారానికి ఒక లౌకిక భాష్యం.......
కాని అది ఈ భరతభూమి పై అనగా, ఈ ధర్మభూమి పై, వేదభూమి పై, కర్మభూమి పై, జ్ఞ్యాన భూమి పై, నడయాడే 21వ శతాబ్దపు సర్వోత్కృష్ట సద్గురువులకు, అనగా వారి ధర్మనిరతికి, నిస్వార్ధ ఆధ్యాత్మిక సేవకు, నిరుపమాన మానవీయ విలువలకు, త్యాగ నిరతికి, అన్నిటినిమించి వారి
నిర్హేతుక నిరంతర శిష్యోద్ధరణ దీక్షాదక్షతకు..,
నిర్హేతుక నిరంతర శిష్యోద్ధరణ దీక్షాదక్షతకు..,
వారి అనుగ్రహంతో అమేయమైన అతులమైన అనిర్వచనీయమైన అవ్యక్తమైన అధ్యాత్మ విద్యాపెన్నిధిని సమకూర్చుకున్న ఈ ఆస్తిక ప్రపంచం గావించే మరో మనహ్పూర్వక నమస్కారం......🙏😊
రజతాద్రిపై కొలువైన నిరంతర నందీశ్వరారాధిత నిటలాక్షుడి ఉత్తరసంధ్యావిజృంభిత నటరాజ విశ్వరూపంలో ప్రదర్శించబడే శివతాండవానికి వన్నెతెచ్చేలా ఆ పరమశివుని పాదపద్మానికి కింజిల్కమై అమరిన స్వర్ణాభరణమే,
గురువుగారి పాదాపద్మానికి గండపెండేరమై అలంకృతమయ్యేవేళ......
గురువుగారి పాదాపద్మానికి గండపెండేరమై అలంకృతమయ్యేవేళ......
సభతీర్చబడిన ఆ కైలాసంలో రుద్రుడి జటాజూటం ఆ శివతాండవవేగానికి నటరాజస్వామివారి ముఖారవిందానికి ఇరువైపులా అవి చరమా స్థిరమా అనేంతటి ఆశ్చర్యంగా గాల్లో ఊగిసలాడే స్వామి వారి కేశసరాల సవ్వడులే.....
"సభాయై నమః....."
అంటూ మొదలుపెట్టి.....
" సభాభ్యఃసభాపతిభ్యశ్చవోనమోనమో....."
అనే రీతిలో కొనసాగుతూ.....
గురువుగారు గుక్కతిప్పుకోకుండా సాగించే ప్రవచనా ప్రస్థానంలో వారి నాభినుండి ప్రభవించే నాదంతో సమ్మిళితమైన వారి స్వరపేటికనుండి ప్రభవించే పదాల సవ్వడులై అధ్యాత్మజిజ్ఞ్యాసులెల్లరికి ఆనందాన్ని , ఆశ్చర్యాన్ని కలిగించేలా పరమశివుని త్రిశూలానికి కట్టబడిన ఢమరుక విన్యాసమై కొనసాగేవేళ.......
కాబట్టి భాగ్యనగరస్థిత భాగ్యవంతులైన భక్తభాగవతోత్తములు, ఆస్తికమహాశయులెల్లరుకూడా
ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తరించమనవి కోరుతున్నమహో......😊
ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తరించమనవి కోరుతున్నమహో......😊
Padmanabharao Darapaneni is with M Venkata Ramana Sharma.
నవంబర్ 3వ తేదీ చలో హైదరాబాద్.....
చలో హైదరాబాద్, చలో హైదరాబాద్
Chalo Hyderabad, chalo
చలో హైదరాబాద్, చలో హైదరాబాద్
Chalo Hyderabad, chalo
No comments:
Post a Comment