శ్రీవేంకటాచలాధీశంశ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందారంశ్రీనివాసమహంభజేత్.....🙏😊
శ్రీ కి నివాసం గా నెలకొన్నవాడుకాన " శ్రీనివాసుడు " అని కద అర్ధం..... శ్రీకారం లేనిచో " నివాస్ " అనే పదానికి అంతగా ప్రాముఖ్యత ఏమి ఉండదు కద.....
అనగా తన శక్తిస్వరూపం ఉరమందుకొలువైన పిదప ఆతడు శ్రీనివాసుడయ్యాడు........
అప్పటివరకు ఎన్నో బాధలకోర్చి శ్రీశుకపురంలో పద్మసరోవరాన్ని తానే స్వయంగా ఏర్పాటు చేసి దేవలోకమునుండి పసిడిపద్మాలను తెచ్చి అవి సదావికసితముగా ఉండేలా
సూర్యభగవానుడిని ఆ కొలను ఎదురుగా నెలకొని ఉండి ఆ పసిడిపద్మాలు వాడిపోకుండా తన సూర్యరష్మితో సమ్రక్షించమని
తెలిపి కఠోర తపమాచరించగా, కరవీరవాసినిగా కొలువైఉన్న తన సతీమని శ్రీపద్మావతిదేవిగా ఆ పసిడిపద్మాలనుండి ప్రభవించి స్వామిని చేబట్టి,
భృగుమహర్షి పాదతాడనానికి అలిగి శ్రీవైకుంఠాన్ని మరియు స్వామివారి వక్షసీమను వీడి భులోకానికి వెళ్ళిపోయిన ఆ శ్రీపతి సతి తిరిగి పద్మావతీదేవిగా ఆ వక్షసీమను అలంకరించి స్వామిని శ్రీనివాసుడిగా చేసింది......
భూవైకుంఠమైన తిరుమల దిగువన తను అవతరించిన ఆ తిరుశుకపురిని
తన అవతారవిశేషం ఈ కలియుగాంతంవరకు కూడా భక్తులెల్లరికి గుర్తుండేలా స్వతంత్రవీరలక్ష్మిగా శ్రీతిరుచానూరుపద్మావతీదేవి గా
ఊర్ధ్వహస్త కమలధారిణి యై, దక్షిణ వరద అభయ హస్తాలంకృతయై శ్రీ నారయణమహర్షి స్థిరీకరించిన అర్చారాధనా విధానమైన శ్రీపాంచరాత్రాగమసేవితయై,
కొలిచినభక్తుల కొంగుబంగారమై కలియుగ ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మియై వెలసిన వైనం కడు రమ్యమైనది......
ఒకానొక సందర్భంలో పురప్రజలందరి సమక్షంలో అన్నమాచార్యులవారి పిలుపుకు పలికి
తన భక్తపరాధీనతను లోకానికి
చాటిచెప్పిన ఆ శ్రీదేవి అపారమైన భక్తవాత్సల్యం గల దయామయి.......
శ్రీచాగంటి సద్గురువులు శ్రీవేంకటేశ్వరవైభవ ప్రవచనంలో మనకు విశదీకరించినట్టుగా,
తన పతికి ఫలాన భక్తుడి పట్ల బాగ కరుణించి వారికి శ్రేయస్కరమైన కావలసినవన్నీ కూడా కటాక్షించమని ప్రత్యేకంగా సిఫారసు చేసి ఆ శ్రీవేంకటలక్ష్మీనారాయణులిరువురు కావించే విశేషమైన భక్తసమ్రక్షణ, ప్రసాదించే అనుగ్రహం అమేయం.......
" నీరు కొలది తామర....." అని అన్నమాచార్యులు తమ "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...." అనే సంకీర్తనలో వివరించినట్టుగా మనము ఎంత అనుకుంటే దైవము అంత.......
మనం దైవం అనగా ఇంత......
అని అనుకుంటే వారు అంతే.......
మనము దైవము అనగా అంతా.....
అని అనుకుంటే వారే అంతా.......
అనగా మనకు అన్నీ వారై, అన్నిటా వారై, మన జీవితాల్లో వారు మమేకమవుతారు..........
"శ్రీనివాస కల్యాణం / పద్మావతీపరిణయం అనే ఆధ్యాత్మిక క్రతువులో శాస్త్రవిహితమైన, సద్గురుప్రోక్తమైన విధంగా శ్రద్ధాసక్తులతో పాల్గొని సర్వస్యశరణాగతి గావించి భక్తిప్రపత్తులతో ప్రణమిల్లినవారికి ఈప్సితములన్నీ దైవానుగ్రహంగా ఈడేరి సకలకల్యాణసంవృద్ధితో జీవితాలు సుఖశాంతిసంపదలతో చతుర్విధపురుషార్ధసిద్ధితో పరిపూర్ణమవుతాయి....." అని పెద్దలు చెబితే, వారి వాక్కులయందు శ్రద్ధ విశ్వాసం గలవారికి ఆ అనుగ్రహఫలం లభించడం మరియు ఏదో " మమ " అన్నట్టుగా ఏదో చేసామ లేదా అనే ధోరణిలో ఉండేవారికి దైవానుగ్రహం ఎప్పుడూ ఇంకా ఆమడదూరంలోనే ఉంటుంది అని నేనంటే, కుతర్కానికి ఎల్లప్పుడు కాలుదువ్వే కొందరు సమ్మతించకపోవచ్చు.......
" అదే గుడి, అదే దైవ మూర్తి, అదే బ్రాహ్మాణోత్తముడు, అదే కల్యాణ క్రతువు, అదే మంత్ర / శ్లోక పఠనం అదే ప్రసాదం.....
కదా.....
మరి అందరికి ఆ దైవానుగ్రహం ఒకేలా ఉండాలి కద అనేది సాధారణంగా హేతువాదులు అనే పేరుతో పిలవబడే అతివాదుల యొక్క
నిరర్ధక తర్కం......
జీవాత్మ పరమాత్మలను అనుసంధానించి అనుగ్రహం అనే ప్రార్ధనాఫలాన్ని ఒసగే ఆ విశ్వాసభరిత భక్తిప్రపత్తుల గురించి ఈ క్రింది ఒక చిన్న లౌకిక ఉదాహరణతో సమన్వయపరిచి తేలికగా అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను.......
" మూడు పూటలా తినడం, తిన్నదరిగేందుకు ఊరిమీదపడితిరగడం, మధ్య మధ్యలో మందు, సిగరెట్లు, గుట్కాలు, ఇత్యాది వాటితో విషాన్ని ఒంట్లోకి నింపడం, భక్తి భగవంతుడు గుడి గోపురం అంటూ పద్ధతిగా ఈశ్వరుడి ప్రీత్యర్ధమై జీవించే వారిని దూషిస్తూ బ్రతికేశైలితో జీవితాన్ని వారికి వారే భారంగా మార్చుకొని, చుట్టూ ఉన్న వారికి కూడా భారంగా జీవించడం, ఎంత చెప్పినా కూడా నలుగురు అభినందించే రీతిలో, లేదా కనీసం చుట్టూ ఉన్నవారిని కష్టపెట్టకుండా ఒక పద్దతితో కూడిన జీవితం జీవించడానికి ససేమిరా సమ్మతించని వ్యక్తి,
"నేను హేతువాదిని......." అని....
పైన చెప్పిన విధంగా భక్తి అంటే చాలు
కయ్యానికి కాలుదువ్వే ఆంబోతులా విరుచుకుపడటాన్ని...... "
లోకజ్ఞ్యానం లేని ఒక ఊర్లోని పసులకాపరితో పోల్చి,
" సెల్ పోన్ల టక్కుం టక్కుం అని ఏల్లతో నొక్కి నీ బ్యాంకుల పైసలేసిన అంటుండే గా పొరగాడు.......!
గిదేం సిత్రమోనుల్ల.....
నాకు పోను కనిపిస్తాంది కాని పైసలెం అగుపడ్తలేవు......గిప్పుడెట్ల నమ్మాల్నే నా బ్యాంకులకు పైసలొచ్చినయంటే....? "
అని.....ఆ వ్యక్తి హై హై అని అరుస్తూ పశువులను అదిలిస్తూ నిట్టూరుస్తూ ముందుకు సాగడాన్ని పైన ఉన్న హేతువాది యొక్క ప్రశ్నగా భావించగలిగితే........
ఆ పసులకాపరికి గా పోరగాడు ఏం సమాధానం జెప్పాలే....?
1. You see...... There is an Android banking application installed in my cell phone.....
With proper credentials I have logged in and started a "session" that times out in 5 minutes. I have filled in your bank account details from the payee section. Once that goes through the necessary client and server side validations, the session will authenticate me against the bank's database via JDBC feature of the Application Server ( Oracle Weblogic,
IBM WebSphere, Apache Tomcat etc configured to receive my HTTP request via the various HTTP servers like IBM HTTP, Apache Tomcat, MS IIS, and so on.....) on which this application is deployed in an exploded archive format. It will also allow me to choose if I can defer this payment for a specific duration so that you can come online to verify my instant money transfer via the configured messaging systems using asynchronous transactional methodologies
( IBM MQ, TIBCO EMS, and so on.... )
Once my pay gets credited to your bank account it will trigger a message as a payload to the SOAP ( Simple Object Access Protocol ) that invokes a configured SMS gateway which then sends the payload as a message to your cell phone. You can then verify and believe that I have indeed transferred you some money.....😊"
అని చెప్పాలి......లేదా.....
2. " నిజంగనే ఏసిన నన్ను నమ్మురా నాయన....
నీకు నిజంగా సొమ్ము అందుతది...... బ్యాంకుకు పోయి పైసలు తీస్కొపో....."
అని చెప్పాల్సుంటది.....
అవునా.....??
అచ్చంగా అదే విధంగా ఆధ్యాత్మికతలో ఓనమాలు కూడా సరిగ్గాదిద్దుకోకుండా కుతర్కం సాగించే ఆ హేతువాదికి,
1. You see.....
" ఇక్కడ శ్రీపాంచరాత్రాగమశాస్త్రోక్తంగా
కడు శ్రధాభక్తులతో ఆచార్యులందరు కలిసి శ్రీనివాసకల్యాణం నిర్వహిస్తారు......
ఈ విధంగా కల్యాణకైంకర్యపరులుగా పాల్గొన్నవారికి కంకణధారణ చేయించి యావద్ కైంకర్యపర్యంతం వారు శౌచసిద్ధులై ఉండేలా చూస్తారు.....
స్థలశుద్ధి,
ద్రవ్యశుద్ధి,
మంత్రశుద్ధి,
ఆచారశుద్ధి,
ఇలా సకల విధమైన శుద్ధిసిద్ద్యర్ధం
స్వస్తిపుణ్యాహవచనం, గావిస్తారు.....
విష్వక్సేనారాధన తో మొదలై స్వామివారి, అమ్మవారి కల్యాణముత్యాలతలవ్రాల పర్యంతం
( తలంబ్రాలు ) వివిధ క్రతువులు జరుపుతారు......
ఎంతో పుణ్యప్రదాయకమైన మహాసంకల్పపఠనం గావిస్తారు...ఇరువురి ప్రవరను పఠిస్తారు.....
శతమానములకు లక్ష్మీపూజ / సర్వమంగళాపూజ గా కుంకుమ పూజ నిర్వహిస్తారు..... అందులో భాగంగా
ఆ కుంకుమపరాగములకు సోకిన సర్వమంగళానుగ్రహం అది ధరించిన భక్తులెల్లరికి లభించి వారందరికి భగవదనుగ్రహంగా కోరికలు సిద్ధిస్తాయి.........
అక్కడికి సమంత్రకంగా ఆహ్వానించబడిన / ఆవహించబడిన వివిధ దేవతా శక్తులు భక్తులందరిని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు......
ముఖ్యంగా అన్నికాలాల్లో అన్నిలోకాలకు తిరుగుతూ ఉండే దేవవైద్యులైన అశ్వినీదేవతలు అక్కడి భక్తుల మనోభావాలను సైతం అధ్యయనం గావించి వారి వారి కొర్కెలను ఆ కల్యాణక్రతువు ఉద్దేశ్యించబడిన దేవతా శక్తికి విన్నవించి వారందరి ఈప్సితములను ఈడేరుస్తారు......
( ఏ విధంగా ఒక సశాస్త్రీయ యజ్ఞ్య క్రతువులో స్వాహాకారంతో అందివ్వబడిన హవిస్సు అగ్నిదేవునిచే
ఉద్దేశ్యించబడిన దేవతా శక్తికి అందివ్వబడుతుందో.....
అవ్విధముగా అన్నమాట..... )
వారి సాక్షిత్వాన్ని సోమసూర్యాగ్నులు, చతుర్వేదాలు, పంచభూతాలు, షడృతువులు, పంచాంగాంతర్గతమైన సప్తవాసరములు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇత్యాదిగా ఉండే శాశ్వత తత్త్వాలన్నీ కూడా వహించి ఇహపరాలకు అందించి ఆ పుణ్యబలం కైంకర్యపరులైన జీవులకు ఎప్పుడూ ఉండేలా అనుగ్రహిస్తారు......
తద్వార ఆ పుణ్యబలం నీకు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఆలంబనగా అందించి నీ యోగక్షేమాలు చూడాలో ఆ పరమాత్మ తన దక్షిణాయన చాతుర్మాస్య యోగనిద్రలో లెక్కలుకట్టి తద్వార ఆ జీవుడి ఉద్ధరణకు బాటలు వేస్తాడు......
ఆ విధంగా నీకు ఆ కల్యాణక్రతువులో శ్రద్ధాభక్తులతో పాల్గొన్న పుణ్యం లభిస్తుంది నాయనా......"
అని చెప్పవలసి ఉంటుంది......
లేదా
2. " పరంపరాగతమైన ఆచార్యులు / సద్గురువులు నుడివిన సనాతన ధర్మశాస్త్రంపై భక్తిప్రపత్తులతో
సంపూర్ణ శ్రద్ధావిశ్వాలాతో వాళ్ళు చెప్పింది ఆచరించి పుణ్యాన్ని సముపార్జించుకో నాయనా...." అని చెప్పవలసిఉంటుంది......
ఆ పసులకాపరికి మొదటి సమాధానం చెప్తే........
" నా బ్యాంకులకు పైసలెట్ల పంపినవ్ర పోరగా అంటే.....
యాపిల్లు యాపు సర్వర్లు సర్వపిండి అంటానవెంద్ర బిత్తిరిగా...... నువ్వెం మాట్లాడ్తానవో జర నీకన్న ఎర్కేనా...? సరే తి....మొత్తానికి నీ పోన్లకెల్లి నా బ్యాంకులకు పైసల్ పోయినవ్ అంటవ్.....గంతేగద....
సరే నమ్ముతన్లే....పొద్దుకూకుతాందిర
పాలుపితికి గొడ్లకు గడ్డి పట్కపోవాలే.....నేనొత్త మరి...."
అని తన దార్లో తాను సాగిపోతాడు కద......
If the former is explained to the herd keeper, he would rather look at you quite astonishingly and might even make fun of you saying.......
" What did you just say.....?
It looks some Greek and Latin to me and you seem to be really a weird guy who is talking about some app servers and web servers and all that which I don't even understand what it means to listen to it....
I know only apples and spider webs that's all....... Ok I better simply believe that your few clicks on the mobile will get me some money in to my bank account....... "
Similarly if you say the former explanation about the detailed devotional / spiritual process involved in the SreenivaasaKalyaanaKainkaryam to that
guy who is full of only materialistic beliefs and no spiritual beliefs at all,
he would rather look at you in a quite bizarre manner and say.....
" What did you just say....?
Mahaasankalpam and all that something else just sounds all Greek and Latin to me...... I don't even understand what it means to listen to it......
Ok I better just listen to you and believe that God will hear my sincere prayers and answer them accordingly....."
Now which among these is true and which isn't....??
All of them are indeed true in their respective perspective. Its just that the person you are dealing with hasn't yet elevated himself / herself to those required intellectual heights to include an all inclusive optimistic belief in what is being explained technically as to how that entire bank transaction takes place right from originating as a simple mobile device' client operation and concluding on the bank's App server after it triggers the credit acknowledgement message to the destined mobile user / recipient after it traverses through those many enterprise J2EE layers stacked up together to be referred to as
" The Technical Transactional Entities formed by grouping various software modules configured to work together in an inter operable fashion to ensure the end to end user transaction gets executed successfully in order to achieve the underlying business logic laid out by the corresponding banking firm....."
కాబట్టి ఇక్కడ వ్యక్తి భేదమే తప్ప....వ్యష్టిభేదం లేదు.....
అదే విధంగా విశ్వాసము / ఎరుక అనే భేదాలే తప్ప
తత్త్వతః వారు వీరు అనే భేదభావాలు లేకుండా
భగవంతుడు ఎల్లప్పుడు అందరికీ శ్రేయోదాయకుడే...... ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రతను సంతరించుకొవడమే ప్రతి జీవుడి యొక్క విహిత ధర్మం......
అదే సదరు వ్యక్తి యొక్క ఇహపర ఉన్నతికి దోహదపడే స్వార్జితము...😊
సరే, మిగతావన్ని ఎలా ఉన్నా, మనుష్యుడికి అత్యంత శ్రేయోభరితమైన మానసిక ప్రశాంతతను ఇవ్వగలిగేది కేవలం స్వరసిద్ధమైన శుద్ధగానం......
అందునా అది వేదమూర్తులచే ఆలపించబడే భగవద్గుణగానమైనప్పుడు అది ప్రసాదించే అనుగ్రహం అమేయం....!!
కాకినాడ లో శ్రీచాగంటి సద్గురువుల ఆధ్వర్యంలో 2013 లో జరిగిన మొట్టమొదటి శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లో
శ్రీనివాసగద్యాన్ని ఎంతో హృద్యంగా స్వరశుద్ధితో సామగానం లా ఆలపించి అక్కడి భక్తులందరికీ కూడా ఎంతగానో భగవదనుగ్రహం సిద్ధింపజేసిన ఈ తి.తి.దే వేదఘనాపాఠి ( మీరు ఫోన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు ఎడమభాగంలో చివరన ఎర్రని పైపంచె వేస్కొని ఆలపించేవారు...)
గారి స్వరం మళ్ళీ ఇన్నాళ్ళకు నాకు యుట్యూబ్లో లభించింది...... మీరు కూడా ఒకసారి విని తరించండి.....
ఆ అత్యంత కర్ణపేయమైన శ్రీనివాసగద్య లహరిని..... 😊
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః.....🙏😊
---------------------------------------------------------------------
65.Entha Matramuna Evvaru Talachina - ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన
Audio link : MS Subbalakshmi
Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragamalika, Composer : K.Venkataraman
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
eMta maatramuna evvaru talachina, aMtamaatramae neevu
aMtaraaMtaramuleMchi chooDa, piMDaMtaenippaTi annaTlu
koluturu mimu vaishNavulu, koorimitO vishNuDani
palukuduru mimu vaedaaMtulu, parabrahmaMbanuchu
talaturu mimu Saivulu, tagina bhaktulunoo SivuDanuchu
alari pogaDuduru kaapaalikulu, aadi bhairavuDanuchu
sari mimmuduru saaktaeyulu, Sakti roopu neevanuchu
dariSanamulu mimu naanaa vidhulanu, talupula koladula bhajiMturu
sirula mimunae alpabuddi, talachinavaariki alpaMbagudavu
darimala mimunae ghanamani talachina, ghanabuddhulaku ghanuDavu
neevalana koratae laedu mari neeru koladi taamaravu
aavala bhaageeradhi dari bAvula aa jalamae oorinayaTlu
Sree vaeMkaTapati neevaitae mamu chaekoni vunna daiva(mu)mani
eevalanae nee SaraNaniedanu, idiyae paratatvamu naaku
-----------------------------------------------------------🙏😊
No comments:
Post a Comment