Monday, June 29, 2020

శ్రీ చాగంటి సద్గురువుల జన్మదినోత్సవం, ఆషాఢ శుద్ధ నవమి పర్వదిన శుభాభినందనలు......😊

శ్రీ చాగంటి సద్గురువుల జన్మదినోత్సవం, ఆషాఢ శుద్ధ నవమి పర్వదిన శుభాభినందనలు.....😊

యావద్ ప్రపంచం ఎన్నడూ కనీవినిఎరుగని రీతిలో ఈ తరానికి సకలశ్రేయోమార్గ దిక్సూచిగా అలరారే కొన్ని వందల వేల ప్రవచనాలు అనే సుజ్ఞ్యాన నిధిని అధ్యాత్మ ప్రపంచానికి అందించి వారి "సద్వాక్కుల అవధరణ తో ఇహపర ఉద్ధరణ.." అనే ప్రాచీనమైన మరియు నిత్యనూతనమైన ఒరవడితో కొన్ని కోట్ల మందికి పరోక్షంగా కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా
వర్నించనలవికాని దైవానుగ్రహాన్ని సమకూర్చి ఎల్లరి జీవితాలను ఎంతో ఘనంగా తీర్చిదిద్దుతున్న సద్గురువులు శ్రీ చాగంటి గారు......

( సత్ గురువు అనగా శాశ్వతమైన, "సత్యమైన ఆ పరబ్రహ్మ తత్త్వంలో సదా తమ చిత్తమును రంజింపజేసి ఆ అత్యంత గహనమైన తత్త్వప్రతిపాదనను ఎంతో సులభ గ్రాహ్యంగా సర్వజనోద్ధరణకై నిస్వార్ధంగా అందించే మహానుభావులు..." అని ఇక్కడ నా యొక్క అర్ధం....)

అలా సత్ యందు తమ బుద్ధిని సదా న్యాసం గావించే వారిని సన్యాసి అంటారు......

ఆ సన్యాసి ఎప్పుడైతే తనచే సాధనసాగించి సాధించబడిన ఆ సత్ విషయ విజ్ఞ్యాన సారస్వత సర్వస్వాన్ని తనను ఆశ్రయించి ఉన్న వారికి ధారాపోస్తారో అప్పుడు వారు ఎల్లరికి సద్గురువుగా అమరి విరాజిల్లుతారు.....

కేవలం ఆశ్రమధర్మానుగుణంగా గార్హస్థ్య, సన్యాస, వానప్రస్థు గా విభాగించబడడం లౌకికం.....

ఏ ఆశ్రమంలో ఉన్నాసరే సత్ యందు సదా ప్రతయ్నపూర్వకంగా తమ మనోబుద్ధులను న్యాసం గావించి రంజిల్లే వారెల్లరు కూడా సన్యాసులే.....

కేవలం వస్త్రం కాషాయం అయినంతమాత్రాన అది ధరించినవారు సత్తు యందు న్యాసం కలవారిగా చెప్పలేము......అది విరక్తితో ఆపాదించుకున్న కేవల లౌకిక సన్యాసం కూడా అవ్వొచ్చు.....

ధరించిన బట్టలతో నిమిత్తంలేకుండా పరబ్రహ్మతత్త్వ సంచయమే పరమావధిగా బ్రతికే వారే నిజమైన సన్యాసులు....

అలా ఎన్నో సంవత్సరాల పాటు పరతత్వవస్తువిషయసంచయంతో తమ జీవితాన్ని సార్ధకంగావించుకొని ఆ సార్ధకజీవితాన్ని ప్రహృష్టవచనముల సంచయమైన ప్రవచనముల ద్వారా ఎల్లరికి తమ పరతత్త్వపరాగానుగ్రహములను పంచిపెడుతున్న పవిత్రమైన సన్యాసశ్రేష్ట సమమైన గార్హస్థ్యసన్యాసులు శ్రీ చాగంటి సద్గురువులు......

2013 సంవత్సరంలో నేను కాకినాడలో జరిగిన మొట్టమొదటి టిటిడి వారి శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడు జరిగిన శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీనివాసకల్యాణం
అనే క్రతువులో పాల్గొనప్పటినుండి......
నిన్నమొన్నటి (2020) ఎన్.టి.ఆర్ స్టేడియంలో గురువుగారికి జరిగిన స్వర్ణకంకణ అలంకరణ / పల్లకి ఉత్సవం వరకు......,

వారి యొక్క / వారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి జీవితంలో లభించిన అనుగ్రహం, ఎవరికి వారు తరచి చూస్తే ఆ అనుగ్రహవిశేషాలు స్వానుభవసత్యాలై కళ్ళముందు సాక్షాత్కరించడం కద్దు.....

ఎందుకంటే అది కలియుగ ప్రత్యక్ష పరమాత్మ శ్రీశ్రీనివాసుడి ఆనుగ్రహంగా జరిగిన / జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి.....😊
ఎంతో భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వాటిలో పాల్గొనలేరు కాబట్టి....

అంత మందిని అక్కడికి రప్పించి ఏకతాటిపై నిలిపి భగవదనుగ్రహం పొందేందుకు మూలకారణం శ్రీ చాగంటి సద్గురువుల సద్వాక్కు....!

వాక్కులు ఎంతో శక్తివంతమైన అస్త్రాలు....

శ్రీచాగంటి సద్గురువులు మనకు బోధించినట్టు ఎనభైనాలుగు లక్షల జీవరాసుల్లో కేవలం మనుష్య ప్రాణికి మాత్రమే లభించిన మహోన్నతమైన వరం స్వరం.....

ఆ స్వరం ' సత్ చిత్ ఆనంద ' స్వరూపమైన భగవంతుడి కోసం వెచ్చించబడినప్పుడు అది పవిత్రతను, మహిమ్నతను పొంది ఆ వాక్కులు సద్వాక్కులై, ఆలపించి ఆలకించబడిన ఆ సద్వాక్కులు దివ్యాస్త్రాలై ఎంతటి అనుగ్రహమునైన సమకూర్చి పెట్టగలవు అనే అధ్యాత్మ సత్యమే మనకు యుగ యుగాలుగా జగజగాల రూఢపరచబడిన సత్యం....

" సద్వాక్కుల శ్రవణం " అనే ఒకేఒక్క ఆధారశిలపై యావద్ భారతదేశ సనాతనధర్మప్రతిపాదిత వైదికధర్మవైభవం ఆధారపడింది అంటే అది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.....కాని అదే నిజం....

ఎన్ని మాధ్యామాలు ఉన్నా సరే శ్రీ చాగంటి సద్గురువులు వచించినట్టుగా
" శృణ్వన్ తపః " అనే ఒకే ఒక్క ఆధారమే ఎల్లరి జీవితోద్ధరణకు మూలకారణం.....

కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒక్క అక్షరం కూడా క్రమం మారకుండా ఇవ్వాళ్టికి కూడా వేదస్వరం అచ్చం అట్లే తరతరాలకు అందివ్వబడి ఆ అనుగ్రహం అందరికి అందిరావడానికి కారణం...?

అది గురువులచే ఉదాత్త, అనుదాత్త, స్వరిత సంగమమైన మంత్ర, శ్లోక రూపంలో స్వరప్రోక్తమై అనుగ్రహించబడింది కాబట్టి......

శిష్యులచే " శ్రవణం " అనే యజ్ఞ్యం యొక్క తపః ఫలంగా అందుకొనబడింది కాబట్టి అది శాశ్వత తత్త్వాన్ని గడించింది.....

అచ్చం అదే విధంగా శ్రీ చాగంటి సద్గురువులచే గత దశాబ్దం పైచిలుకు సమయంలో కావించబడిన ప్రవచనాల సారం ఇవ్వాళ్టికి కూడా అట్లే తరతరాలకు అందివ్వబడుతూ ఆ అనుగ్రహం అందరికి అందిరావడానికి కారణం...?

అది గురువులచే స్వరప్రోక్తమై సద్వాక్కులు అనే మంత్రసమమైన సారస్వతంగా అనుగ్రహించబడింది.....

శిష్యులచే " శ్రవణం " అనే యజ్ఞ్యం యొక్క తపః ఫలంగా అందుకొనబడింది కాబట్టి అది శాశ్వత తత్త్వాన్ని గడించింది.....

శాశ్వతమైనది కేవలం పరబ్రహతత్త్వం / బ్రహ్మపదార్థం మాత్రమే.....

అట్లే శాశ్వత అనుగ్రహప్రదాయకమైన  ఏ సారస్వతమైనను పరబ్రహతత్త్వం / బ్రహ్మపదార్థం లా అనుగ్రహించునదే.....

కాబట్టి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాంతర్గతమైన అధ్యాత్మ వస్తువిషయ సామగ్రి మొత్తం కూడా బ్రహ్మపదార్థమే.....

ఒక బంగారం బిస్కెట్ సమకూర్చుకున్న వారికి, ఏ విధమైన ఆభరణం తయారు చేసుకొని ధరించి ఆనందించాలనుకుంటే వారికి ఆ బంగారు బిస్కెట్ ఆ రూపంలో అనుగ్రహిస్తుంది అన్నట్టుగా....

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలచే అందివ్వబడిన
బ్రహ్మపద్దార్ధ వస్తువిషయ సామగ్రిని అందుకున్న వారు కూడా అట్లే ఒక దైవిక స్వర్ణరాశిని సమకూర్చుకున్నట్టు....

వారికి అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అవసరమో ఆయావిధంగా అనుగ్రహం సిద్ధింపజేసి వారు తరించేలా చేసే సుజ్ఞ్యాన నిధిభాండాగారం.....😊

శ్రీ చాగంటి సద్గురువులచే బోధించబడిన ఎన్నెన్నో వెలకట్టలేని అధ్యాత్మ విజ్ఞ్యానవిషయాల గురించి, వాటిని శ్రద్ధాభక్తితో ఆలకించిన ఎందరెందరో మాన్యులు వివిధ రీతుల వాటిని పరిశోధించి తమ తమ జీవితాలకు ఆపాదించుకొని తరించడమనే సత్యం ఎల్లరికి విదితమే కద.....

ఎన్నెన్నో గహనమైన శాస్త్రాలను ఎంతో ఘనమైన రీతిలో ఆపోశనపట్టిన మాన్యులకే కాకుండా, నాలాంటి సామాన్యులకు సైతం జీర్ణమయ్యే రీతిలో ఉండే గురువుగారి వందల వేలాది ప్రవచనాల్లో కామన్ గా ఉండే వివిధ ధ్యానశ్లోకాలు ఎందరెందరికో కంఠగతమైనవి కద....

అందులోని ఒక ధ్యానశ్లోకం ఈ విధంగా కలియుగ ప్రత్యక్ష పరమాత్మను స్తుతించడం ఎల్లరికి తెలిసిందే కద.....

***************************************
"హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటంసునాసం
మందస్మితం మకరకుండలచారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం....."
***************************************

గురువుగారితో పాటుగా మనంకూడా గడగడా ఈ శ్లోకాన్ని చదవడం నేర్చుకున్నాం కద......
కాని అసలు ఈ శ్లోకంలో ఉన్న ప్రత్యేకతను ఎప్పుడైనా తరచి, ధ్యానించి, పరిశోధించారా....?

మొదట్లో నేనుకూడా గురువుగారు చదివినట్టుగా చదివేసి సంతోషపడేవాడిని......

ఆతర్వాత కొన్ని సంవత్సరాలుగా వాటిని ధ్యానం చేయడం అలవడినప్పటినుండి వాటి యొక్క ప్రత్యేకతలు జ్యోతకమై, ఓహో అందుకే గురువుగారు ఈ శ్లోకాలనే ఎన్నుకున్నారన్నమాట అని తెలిసి సంతోషించడం ప్రారంభించాను.....😊

శ్రవణం యొక్క గొప్పదనం ఎట్టిదో శ్రీనివాసుడి ఈ ఒక్క ధ్యానశ్లోకంలో మీకు వివరిస్తాను......
జాగ్రత్తగా పరికించండి......

స్వామివారి అతిలోక లావణ్యభరితమైన తిరుముఖమండలాన్ని వర్నించే ఈ ధ్యానశ్లోకంలో,
"స్వామివారి తిరునామం, నాసిక, చిరునవ్వు, మకరకుండలాలు, ఎర్రని దొండపండులాంటి అధరాలు, కృపను వర్శించే చక్కని దీర్ఘమైన మనోహర నయనారవిందాల కొసల సోయగం.......
వీటితో మెరిసిపోతున్న ఆ పరమాత్మ ముఖారవిందం నాకు ఎల్లప్పుడు ఆత్మానుసంధానమై ఉండుగాక...."

అని వచించే ఈ శ్లోకంలో

జాగ్రత్తగా గమనిస్తే,
అన్ని భ్రమలను తొలగించే బ్రహ్మజ్ఞ్యాన దాయకమైన శ్రీశ్రీనివాసుడి వదనాదవిందమును వర్నించడం అనే ప్రక్రియలో, మిగతావన్నీ కూడా తిరుముఖమండల భాగములైతే, ఒక్క  ' మకరకుండలాలు ' మాత్రమే అందులో వర్నించబడిన ఆభరణములు.....!

స్వామివారి కర్ణములను కాకుండా కర్ణాభరణములను వర్నించడంలోని ఆంతర్యమేమి అని ధ్యానిస్తే అప్పుడు శ్రవణం యొక్క గొప్పదనం మనకు తెలిసివస్తుందన్నమాట.....

కర్ణములను రక్షించునది కర్ణకుండలం అనే ఆభరణం....

ఇది బాహ్య లౌకిక సూచకం.....

మన వైదిక వాజ్ఞ్మయంలో ఎన్నో చోట్ల బోధించబడినట్టుగా,

"శృతం మే గోపాయ....."

" భద్రం కర్ణేభిశృణుయామదేవాః...."

" శృణ్వన్ తపః....:

ఇవన్నీ కూడా సద్వాక్కుల శ్రవణం యొక్క గొప్పదనం గురించి మనకు తెలిపే వాక్యములే......

వచించబడే ఆ సద్వాక్కులను,

" శరీరం --> చెవి --> మనసు --> శ్రవణేంద్రియం --> బుద్ధి --> చిత్తం --> మేధోమండల న్యాసం --> స్వాధ్యాయం --> మననం --> తన్మూలంగా జనించే తత్త్వజ్ఞ్యాననిధి.... "

అనబడే ఈ బృహత్ భవ్య ఆత్మోద్ధరణ
వ్యవస్థకి మూలం ఏంటి...?

"శ్రద్ధగా వినడం....విన్నది పదిలపరుచుకోవడం..."
కద...

కాబట్టి శ్రవణం యొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పబడేలా మన పెద్దలు అలా చిన్న చిన్న సులభగ్రాహ్యమైన రీతుల్లో మనకు అందించారు....

నవవిధ భక్తుల్లో మొదటగా చెప్పబడేది కూడా శ్రవణమే....

ఇన్ని కోట్లమంది జన్మజన్మాంతరముల సాధనలు సాగించి తుదకు సాధించే మోక్షం అనే ఆ ఈశ్వరసాయుజ్య / జన్మరాహిత్య స్థితిని పరీక్షిత్ మహారాజు
( అర్జునుడు-->అభిమన్యుడు-->పరీక్షిత్ )
శుకమహర్షి వారి అనుగ్రహంతో 7 రోజుల్లో సాధించింది కూడా శ్రవణం వల్లే....

మన ప్రార్ధనలను ఆలకించడం వల్లే దేవతలు మనల్ని అనుగ్రహించేది....
( పూలు, పళ్ళు, పత్రి, ఇతర సామాగ్రి మన ప్రార్ధనలకు అనుసంధానములు మాత్రమే....)

ఇవ్విధంగా శ్రద్ధాభక్తులతో కూడిన శ్రవణ యజ్ఞ్యాన్ని ఆలంబనగా మనకు అందించి వారి సద్వాక్కుల సుస్వర మంత్రాలతో మనకు దేవతానుగ్రహమును వర్శింపజేస్తున్న శ్రీ చాగంటి సద్గురువులు ఈ నవయుగ  శ్రీశుకబ్రహ్మగా మనకు ఈశ్వర ప్రసాదంగా లభించిన
ఆచార్యవరిష్ఠులు......

శ్రీశుకబ్రహ్మ కేవలం పరీక్షిత్ మహారాజు గారి ఆర్తిని మన్నించి ఆనాడు శ్రీమద్భాగవతాన్ని అందించి తరింపజేస్తే......

సహజకవి శ్రీపోతనామాత్యులవారి ఘంటంలోకి ఎంత మహత్తుతో ఆ వ్యాసమహర్షి ప్రణీత
సంస్కృత మూలం తియ్యనైన తెలుగు భాషలోకి శ్రీరామచంద్రానుగ్రహంతో అనువదించబడిందో.....

అంతటి మహత్తుతో ఆ శ్రీమద్భాగవతం
శ్రీ చాగంటి సద్గురువుల కంఠంలోకి ఒదిగి, ఈతరానికి దైవానుగ్రహం సమకూర్చే జీవనదిగా నిత్యం భక్తజనుల హృదయసీమలలో ప్రవహిస్తూనే ఉంటుందనేది అధ్యాత్మ జగత్తుకి విదితమైన సత్యం.....
( అనగా శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతం విన్నవారికి......
శ్రీమద్రామాయణం కూడా శ్రీమద్భాగవతంలో అంతర్భాగం అని గురువు గారు చెప్పిన విషయం ఎల్లరికి గుర్తే కద....  )

వారి అమృతవాణి మరెన్నో మధురప్రవచనాలను ఈ అధ్యాత్మలోకానికి అందిస్తూ ఎందరెందరో శిష్యకోటికి ఎనలేని ఈశ్వరానుగ్రమును సముపార్జించేలా వారి సద్వాగ్యజ్ఞ్యం సదా సురగంగా ప్రవాహంలా సాగుతూండాలని అభిలషిస్తు, అస్మద్ గురుదేవుల శ్రీచరణాలకు ఒక వినేయుడి చిరుకవనకుసుమాంజలి భరిత, వారి 61 వ జన్మదినోత్సవ శుభాభినందనాపూర్వక, సాష్టాంగప్రాణామాలు.....😊🙏💐🍨🍕🍟🍇

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్  🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---------------


No comments:

Post a Comment