శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ నవమి
( 1959 జులై 14 నాటి తిథి ప్రామాణికంగా ),
శ్రీ చాగంటి సద్గురువుల 62 వసంతాల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు....😊🍨🍕💐
శ్రీ చాగంటి గారు...
ఒక మంచి మనసుగల వ్యక్తి అని కొందరు....
ఒక చక్కని భాగవతోత్తములు అని కొందరు...
ఒక గొప్ప ప్రవచనకర్తలు అని కొందరు...
ఒక అద్వితీయమైన సద్గురువులు అని కొందరు...
ఒక అనన్యసామాన్యమైన అధ్యాత్మ శాస్త్రవేత్త అని కొందరు...
ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా
తమ తమ భక్తి కొలది, జ్ఞ్యాన సముపార్జనాసక్తి కొలది,
అభిమానం కొలది వారిని భావిస్తూ సేవిస్తూ తరిస్తుంటారు...
అది వారి వారి వ్యక్తిగత జీవితాలకు ఆ సద్గురువుల సద్వాక్కులు ఆపాదించబడి ఒసగబడిన అనుగ్రహానికి అనుగుణంగా సమకూరిన భావమంజరుల లహరి గా అభివర్ణించడం అతిసయోక్తి కానేరదు...
అప్పటివరకు అది వాగులో పడిఉన్న ఒక సామాన్య బండరాయి...
ఎండకు ఎండి...
వానకు తడిసి..
అట్ల పడిఉన్న ఆ రాయి ఒక చక్కని శిల్పశాస్త్ర కోవిదుడి వద్దకు చేరిన, చేర్చబడిన నాడు...
ఆ రాయి ఒక చక్కని ఆగమోక్త భగవణ్మూర్తిగా మలచబడి ఒక ఆలయంలో కొలువైన నాడు...
ఆహా... ఓహో... ఎంత చక్కని మూర్తి...
అని ఎందరినుండో నమస్కారాలు పూజలు అభిషేకాలు అందుకుంటూ తరించి ఎల్లరినీ తరింపజేస్తుంది...
ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ శిల్పి యొక్క గొప్పదనం గురించి కూడా మాట్లాడతారు....
ఆ గొప్ప శిల్పి మాత్రం వారి విహిత ధర్మంగా అలాంటి ఎన్నో ఎన్నెన్మో శిల్పాలు చెక్కుతూ ఎందరెందరో తరించడానికి వారి జీవితాన్ని వెచ్చించి బ్రతికేస్తుంటారు...
ఆ శిల్పి వారి జీవితపర్యంతంలో కొన్ని వందల వేల శిల్పాలు చెక్కడం తో, ఏ ఏ గుడిలో తనచే మూర్తిగా మలచబడిన శిల్పం దేవతామూర్తిగా మారి ఏ వైభవం అమరి తరిస్తూందో అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా దేవతా మూర్తిగా మారిన ఆ శిల్పం మాత్రం నిత్యం ఆ అమరశిల్పికి తన కృతజ్ఞ్యతను తెలియజేస్తూనే ఉంటుంది...
ఎందుకంటే అది గౌరవం, ప్రేమాభిమానం, మరియాద, బంధం, బాంధవ్యం, ఇత్యాది ఏ భావానికి కూడా అందని ఒక అపురూపమైన అవ్యక్త ఆదర భావన..
ఈశ్వరానుగ్రహం తో కొంత విద్వత్తు, అధికారం, ఐశ్వర్యం, లభించగానే ఒక్కొక్కరూ ఒక్కోలా వారికి అనుగ్రహింపబడిన సంపత్తును వినియోగించి లౌకిక ప్రయోజనాలను ఈప్సితములను ఈడేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకొని వారి పిల్లలకు, మనవలు మనవారాళ్ళకు, ఆ యావద్ లౌకిక సంపత్తును వదిలేసి గతిస్తారు....
కోట్లు కూడబెట్టి ఇచ్చినా సరే,
గతించిన తరువాత వారి పిల్లలు, మనవలు,
గోదానం కాకపోయినా కనీసం ప్రతిసంవత్సరం పద్ధతిగా, శ్రద్ధగా ఆబ్దీకములను నిర్వహించి నమస్కరించి గౌరవించేంతటి సంస్కారంగా జీవించగలరని చెప్పడం ఈ కలియుగంలో ఎల్లవేళలా కుదరదు...అంతటి కేవల భౌతికవాదానికి బంధీలై బ్రతికే జీవనం ఈ కలియుగ వాసులది...
అసలు గోదానం అనేది ఒకటి ఉంటుందని..
అది నిర్వహించి పితరులకు వైతరణీ యాతన లేకుండా చేయడం విహిత ధర్మం అనే విషయం కూడా తెలియని అధ్యాత్మరాహిత్యతతో బ్రతికే జీవితం ఈ కలియుగవాసులది...
పురోహితులు ఆ ప్రస్తావన తెస్తే 5 రూపాయలిచ్చి గోదానం అయిపోయిందని ' మమ ' అనిపించే వారికోసం జీవితాంతం కూడబెట్టినది వదిలేసి పోవడం అనేది అసలు అర్ధమేలేని జీవితం...
ఇటువంటి ముఖ్యమైన విషయాల దెగ్గరినుండి ఎన్నో ఎన్నెన్నో శాస్త్రోక్త / పురాణోక్త గొప్ప గొప్ప విషయాలవరకు, అవన్నీ ఎల్లరికీ అందించేందుకే వారి యావద్ జీవితంలోని సిమ్హభాగం వెచ్చించిన శ్రీ చాగంటి సద్గురువులు ఈ కలియుగ ప్రజలకు లభించిన ఒక అనన్యసామాన్యమైన "ఆత్మోద్ధరణ " అనే అధ్యాత్మ శిల్పశాస్త్ర కోవిదులు...
ఇవ్వాళ్టి మన ఉరుకుల పరుగుల దైనందిన జీవితానికి వారి అమృతప్రవచనాలు కొన్ని వందల వేల పుస్తకాల పఠనంతో సమానం...
ఒక పుస్తకం చదివినతదుపరి మనమే ఆ పుస్తకమైపోవడానికి చాలా సమయం పట్టొచ్చు...
అది అవగాహన చేసుకొని ఆకళింపుచేసుకొనేంతటి మేధో పటిమ అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు....
కాని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనం శ్రద్ధగా ఆలకించడం అనేది ఒక ప్రత్యేకమైన పుస్తక పఠనం వంటిది..
దేశవాళి ఆవునేతిలో దోరగా వేయించిన క్యారెట్ హల్వా ని ఆరగించిన వారికి మాత్రమే ఆ వంటకం యొక్క గొప్పదనం అవగతమైనట్టుగా....
వారి ప్రవచనం ఎంతటి సాటిలేని ధీటైన మేటి విధంగా సదరు శ్రోతను తన అధీనంలోకి తీసుకొని తన అనుగ్రహాన్ని సమకూర్చుతుందనేది వాటిని శ్రద్ధగా ఆలకించిన వారికి మాత్రమే ఎరుకలో ఉండే విషయం...
ఐ.డి.పీ.ఎల్ బస్టాప్ లో ఎక్కిన పల్లె వెలుగు బస్ నర్సాపూర్ లో దిగి, విష్ణుపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి వెళ్ళడానికి ఇంకో బస్సు కోసం ఎదురుచూస్తూ ఒళ్ళు హూనమై ఉండే ఆ ప్రయాణబడలిక నుండి కాస్త ఉపశమనం పొందడం కోసం
( ప్రతీరోజు షేర్ ఆటోలో వెళ్ళగలిగేంతటి ఆర్థిక స్థోమత లేక, నెలకు 500 రూపాయల బడ్జెట్లో, 360 రూపాయలు రూట్ బస్పాస్ కి పోను మిగతా 140 రుపీస్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాస సంబంధిత ఇతర ఖర్చులన్నీ నెట్టుకొస్తున్న రోజులవి... )
ఏదో క్యాజువల్ గా వారి ప్రవచనాలను అడపా దడపా వినడం మొదలుపెట్టిన 2007:2008 నాటి నుండి ఈనాటి వరకు....
అంతంతమాత్రంగా ఉన్న ఇంటి ఆర్ధిక పరిస్థితితో
లౌకికంగా ఎన్నో ఈతిబాధల మధ్యన కష్టపడుతూ,
కాలేజ్లో ప్రభుత్వం వారిచ్చే ఫీస్ రీఇంబర్స్మెంట్ స్కాలర్షిప్ సహాయం తో చదివి బి.టెక్ చదువుల బండిని ఒక గట్టెక్కించి, మా కాలేజ్ లోని విద్యాగణపతి అనుగ్రహంగా ఆనాడు టీ.సీ.యస్ / అక్క్సెంచర్ / కంప్యూటర్ అసోసియేట్స్ అనే 3 బహుళజాతీయసంస్థల కంపెనీల ఆఫర్లను సాధించడానికి కావలసిన పర్సనాలిటి డెవెలప్మెంట్ స్కిల్ల్స్ ని అనుగ్రహించినదిమొదలు 2008 నుండి నా 21వ పడిలో మొదలైన ఉద్యోగ / లౌకిక జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ఉండి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా వ్యవహరించాలో ఇత్యాది కార్యసాధక దీక్షాదక్షతతో మనగలిగే మానసిక / మేధో సమర్ధతను కటాక్షిస్తూ,
ఇప్పుడున్న 2021 వరకు నాకు లభించిన
ఒక దైవిక మితృలుగా
( స్నేహితులు ఎందరో ఉంటారు...
కాని మితము నుండి ఋతమునకు నడిపించే నిస్వార్ధమైన మితృలు చాలా అరుదుగా ఉంటారని బోధించిన వారి సద్వాక్కే ) నాకు నిజ నేస్తమై నిలిచి నన్ను అడుగడుగునా గెలిపించే జ్ఞ్యానాలంబనై నిలిచింది వారి ప్రవచనా సద్వాక్కు...
వారి శ్రీవేంకటేశ్వర వైభవం ప్రవచానాల్లో ఉదహరింపబడిన
" ఉన్నాడయా...దేవుడున్నాడయా...."
అనే జానపద గేయంలో బోధింపబడిన రీతిలో
ఇనచంద్రులున్నంతవరకు జగత్తులో శాశ్వతంగా మహత్తును ప్రసరింపజేస్తూ ఎల్లరినీ అనుగ్రహించే రీతిలో ఈశ్వర మాహాత్మ్యాన్ని ఆనాడు శ్రీమద్రామాయణంగా శ్రీవాల్మీకి మహర్షి ఎవ్విధంగ లోకానికి అందించి అనుగ్రహించినారో...
ఈ నేలపై తెలుగు భాష వాడుకలో ఉన్నంతవరకు శ్రీ చాగంటి సద్గురువుల అమృతప్రవచనాలు శ్రీమద్రామాయణ సుజ్ఞ్యాన మంత్రమహార్ణవమువోలే,
అధ్యాత్మ ప్రవచనామంత్రమహార్ణవమై అవధరించిన వారెల్లరినీ తరింపజేస్తూ ఉంటాయనడం ఏమాత్రం అతిశయోక్తి కానేరదు...
వారి అమృతప్రవచనాల అనుగ్రహంగా మా మూడేళ్ళ వైవాహిక జీవితానికి పరిపూర్ణతను కటాక్షిస్తూ, శ్రీభువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంగా ప్రభవించిన నా కూతురుకి ఇక రాబోయే రోజుల్లో నేనే గురువై వారి ప్రవచనా విశేషాలను బోధించడంలో
( మరీ ముఖ్యంగా వారి " రుక్మిణీ కల్యాణం " ప్రవచనం / తత్సంబంధ శ్రీమద్భాగవత పద్యాలు నా కూతురికి కంఠస్థమైతే నాకు కాస్త మనఃశాంతి గా ఉంటుంది కద...😊 )
వారి ప్రవచనాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వినే భాగ్యం తో ఉండే,
నా జీవిత నౌకకు చుక్కానివలె అమరిన వారి అమర ప్రవచనాల యొక్క మహత్తు గూర్చి ఒక చక్కని సినిమా పాటలో చెప్పాలంటే....
ఈ క్రింది పాట నాకు స్ఫురించింది...
********************
Movie : Santosham
Song : Nuvvante naakishtamani
Singers : Rajesh, Usha
Lyrics : Sirivennela
Music : RP Patnayak
అ:నువ్వంటే నాకిష్టమని అన్నది నాప్రతి శ్వాస
ఆ:నువ్వేలే నా లోకమని అన్నది నాప్రతి ఆశ
అ: నీ నవ్వులో శృతి కలిపి పాడగా
ఆ:నీ నీడలో అణువణువు ఆడగా
ఇ: అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా అ:||నువ్వంటే||
అ:చ: నువ్వునా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లే.... కనిపించదా
ఆ: నిన్నలా చూస్తూఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అన్పించదా
అ:వరాలన్ని సూటిగా యిలా నన్ను చేరగా
ఆ: సుదూరాల తారక ....సమీపాన వాలగా
అ: లేనేలేదు.... యింకే కోరిక...... ఆ:||నువ్వంటే||
ఆ:చ ఆగిపోవాలి కాలం ,మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారి పోనీయకా
అ: చూడునా యింద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మనపాపగా పుడుతుంది సరికొత్తగా
ఆ: నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా
అ:ప్రతీ రేయి తీయగా పిలుస్తోంది హయిగా
ఆ: ఇలా ఉండిపోతే చాలుగా.....
అ:||నువ్వంటే||
********************
వారి ప్రవచానాలను త్రికరణశుద్ధిగ నమ్మి ఆరాధించే ఎందరెందరో శిష్యులను వారు మరింతగా అనుగ్రహిస్తూ వారి అజారమరమైన ప్రవచనా ప్రస్థానం నిరంతర గంగాప్రవాహమై ఆచంద్రతారార్కం
యశోచంద్రికలతో ఎల్లరి జీవితాలు వర్ధిల్లే విధంగా అనుగ్రహిస్తూ ఉండాలని అభిలషిస్తూ...
వారి శ్రీచరణాలకు ఒక వినేయుడి చిరుకవనకుసుమాంజలి ప్రయుక్త వారి 62 వ జన్మదినోత్సవ మరియు రాబోయే గురుపౌర్ణమి ఉత్సవ శుభాభినందనాపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలులు.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊💐🍕🍨
No comments:
Post a Comment