Saturday, July 24, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

శ్రీ ప్లవ నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి / వ్యాస పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన శుభాభినందనలు.....😊💐

మన చాంద్రమానం ప్రకారంగా సూర్యోదయానికి,
కలియుగ ప్రత్యక్ష శ్రీమహాలక్ష్మీ అమ్మవారైన
శ్రీ పద్మావతీ దేవి అలర్మేల్ మంగమ్మ జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం తో ఉన్న పౌర్ణమి తిథి తో వెలుగొందే ఆషాఢ పౌర్ణమి శుభదిన శుభాభినందనలు...

శ్రీఆంజనేయ స్వామి వారి మహాభక్తులైన శ్రీ పరాశర మహర్షి వారి పుత్రులైన శ్రీ వ్యాస మహర్షి వారిని సద్గురువులుగా మరియు సకల గురుపరంపరాగతమైన సద్గురువులను విశేషంగా అర్చించే ఈ ఆషాఢ పౌర్ణమి శుభ తిథి
వ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి గా వినుతికెక్కడం ఎల్లరికీ విదితమే...

కాకినాడ ( కోకనదా పట్టనం ) లో ఉండే చాలామంది అధ్యాత్మ జిజ్ఞ్యాసువులకు తెలిసినట్టుగా,

భానుగుడి జంక్షన్ లోని, శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో
ఇవ్వాళ్టి ఉదయం గురుమండల పూజామహోత్సవంలో యావద్ గురుపరంపరను అక్కడి తండూల ( బియ్యం ) రాశి పైన గల
బిల్వ దళాలు, పువ్వులు, నిమ్మకాయలు,
తమలపాకులు, అరటి, దానిమ్మ, కొబ్బరి, యాపిల్లు, సంత్రాలు, ఇత్యాది వివిధ ఫలాలు మరియు ఇతర శాస్త్రోక్త పూజాద్రవ్యములపైకి సవైదిక మంత్రోచ్ఛారణ / స్వరంతో ఆవహింపజేసి.,

వారికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించిన తదుపరి ఆ బియ్యాన్ని ప్రసాదంగా అక్కడికి విచ్చేసిన భక్తుల్లెల్లరికి శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారు పంచిపెట్టడం చాలా మందికి తెలిసే ఉంటుంది....

తదనంతరం, సాయంత్రం ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురుపూజను స్వీకరించేందుకు ఆహ్వానించి ఆ గురుదంపతులకు గురుసేవ గా

పుష్పమాలికా అలంకరణ,
చందన లేపనం,
సుగంధపరిమళ ద్రవ్య సమర్పణం,
ఇత్యాది సశాస్త్రీయ ఉపచారాలను సమర్పించి,
వారు సలిపిన అధ్యాత్మ కృషిని / ఉపాసనను కొనియాడి వారికి నమస్కరించడం అనే సత్సంప్రదాయాన్ని శ్రీ చాగంటి సద్గురువులు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నిర్వహింపజేయడం అనేది చాలామందికి ఎరుకలో ఉన్న విషయమే..

గురువులకే సద్గురువులై భాసిల్లే శ్రీ చాగంటి సద్గురువులే ప్రతి సంవత్సరం ఒక్కో మహనుభావులను అక్కడికి గురుస్వరూపంగా ఆహ్వానించి సత్కరించి గౌరవించడం అంటే ఈ గురుపూజామహోత్సవం ఎంతటి మహోన్నతమైనదో ఇట్టే మనం తెలుసుకోవచ్చు....

"ముఖే ముఖే సరస్వతీ...." అన్నట్టుగా ఆ శ్రీవాణి ఒక్కో మనిషికి వారి వారి పూర్వజన్మ సుకృతంగా ఒక్కో విద్వత్తును కటాక్షించి ఈ లోకానికి జ్ఞ్యానప్రభలను వారిచే వెదజల్లబడేలా అనుగ్రహించి తన ప్రత్యేకతను తెలియజేస్తుంది....

ఒక్కో పువ్వుది ఒక్కో పరిమళం...
ఒక్కో రంగు...ఒక్కో ప్రత్యేకత....ఒక్కో విచిత్రం....
ఒక్కో మకరంద రుచి...

అది ఈ సృష్టిలోని పరమాత్మ వైచిత్రి...

అట్లే ఒక్కో మహానుభావుడిది ఒక్కో విద్వత్తు....

ఒక పిల్లనగ్రోవి ఎదుట ఉన్నప్పుడు....

ఒక మహానుభావుడు అవే 7 కన్నాల నుండి సమ్మేళనాత్మకంగా హృదయం మైమరచే విధంగా అంతులేని స్వరాలను ఆలపించి ఔరా అనిపించడం...

ఇంకొక సామాన్య వ్యక్తి అవే 7 కన్నాల నుండి కనీసం
సా పా సా కూడా సరిగ్గా ఆలపించలేకపోవడం...

ఒక మనిషికి ఉండే వేళ్లు, నోరు, మూతి, పిల్లన గ్రోవిని పట్టుకొని ఊదడం, ఇలా అన్నీ కూడా ఈ ఇరువురికి కామన్ గా ఉన్నవే...

మరి ఒకరేమో వారి మూతి నుండి వదిలే గాలినుండి అనన్యసామాన్యమైన గాంధర్వశక్తిని సృజించి
ప్రకృతి తత్వం నుండి పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించడం....

ఇంకొకరేమో అదే ప్రకృతి నుండి ప్రకృతిగా, అనగా లోపల ఉన్న మన శరీరం నుండి వదలబడే గాలి బయట వాతావరణం లోని గాలి లోకి కలపడం.....

అనగా సామాన్య పిండాండ బ్రహ్మాండ సమన్వయంగా ప్రకృతిలో ప్రకృతిగా ఉండిపోవడం.....

ఒకరు అలా ఒక లలితకళావాద్య పరికరం అందుకోగానే కళామయి గా / నాదమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు మైకు అందుకోగానే
రాగమయి గా / స్వరమయి గా / వేదమయి గా / వాగ్దేవి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు ఘంటం అందుకోగానే అక్షరమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం...

ఒకరు కళ్ళు మూసుకుని వివిధ యోగభూమికలను స్మరించగానే యోగమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం

ఒకరు నీళ్ళు అందుకొని ఆచమనం గావించి మంత్రపఠనం గావించగానే మంత్రమయి గా
ఆ సరస్వతీ వచ్చి కొలువై ఉండడం..

ఇలా ఒక్కో మహానుభావుల వద్ద గల పరమాత్మ అనుగ్రహ సంపాకంతో ఒక్కో విధంగా ఆ ఆదిపరాశక్తి,
వారు సంకల్పించి స్మరించగానే ఒక్కో నామ రూపాత్మక ఈశ్వర చైతన్య శక్తిగా వారి వద్దకు వచ్చి ప్రకృతిని పరతత్త్వంగా మార్చి ఎల్లరినీ అనుగ్రహిస్తున్నది కదా...

పూర్వజన్మ సుకృతం తో అబ్బిందా..
పుట్టుకతో అబ్బిందా....
సాధనతో / ఉపాసనతో అబ్బిందా...

అనేదానికంటే.....వారికి గల గురుకాటాక్షమే వారి యావద్ విద్వత్ వైదుష్య వైభవానికి మూల కారణం...

"హుం....ఆ మంద బుద్ధి మనిషి రావడం కోసం గురువుగారు మనకు ఇంకా పాఠం మొదలు పెట్టకుండా ఎదురుచూస్తున్నారు....ఆయన వచ్చినా అంత గొప్పగా నేర్చేదేముంది..."

అంటూ ఏదో నసుగుతూ కూర్చున్న తమ ముగ్గురు శిష్యుల అంతరంగాన్ని అర్ధంచేసుకున్న శ్రీ ఆదిశంకరాచార్యుల వారు గంగా నదికి ఆవలి వైపున గురుసేవగా శ్రీఆదిశంకరుల వస్త్రాన్ని ఉతకడం / శుభ్రపరచడంలో నిమగ్నమై ఉన్న తోటకాచార్యుల వారిని ఒక్క సారిగ పిలవగానే....
గురువుగారు వెంటనే రమ్మని ఆజ్ఞ్యాపించారు అనే తొందరలో అది నదీ అనే విషయాన్ని మరిచి నీటిపైనే అడుగులను మోపుతూ త్వరత్వరగా తరలివచ్చిన ఆ సందర్భంలో వారి ప్రతీ పాదస్పర్శకు ఒక పద్మాన్ని వికసింపజేసి అందులో వారి పాదం మోపబడేలా గంగమ్మ అనుగ్రహించి ఆవలి తీరానికి చేర్చడం,

గురువుల ఎదుట తక్షణం ఏతెంచగా....

"నా శిష్యునకు సకల వాంజ్ఞ్మయం సద్యో కటాక్షంగా భాసించుగాక..."

అని శ్రీఆదిశంకరులు ఒక్క సంకల్పంతో
తోటకులను పద్మపాదాచార్యుల గా అనన్యసామాన్యమైన పాండిత్యంతో వర్ధిల్లే విధంగా అనుగ్రహించిన ఆ సందర్భంలో శ్రీతోటకాచార్యులచే
లోకానికి అందివ్వబడిన " తోటకాష్టకం " తోనే కదా ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆ శక్తివంతమైన స్తోత్రంతోనే ఇప్పటికీ మరియు ఎప్పటికీ గురుపౌర్ణమి రోజున గురువందనం ఆచరించి ఎల్లరూ తరించేది.....

ఇంతకంటే గురువైభవం గురించిన ఉదాహరణ ఇంకేముంటుంది...

గురువులు ప్రసన్న హృదయంతో తమ తపోశక్తిని శిష్యులకు ధారపోసిన నాడు....
గులక రాయి వంటి వారైనను గుణించలేనంతటి జ్ఞ్యాన రత్నమై శాశ్వత వైభవాన్ని గడించి తరించడం ఈ తపో భూమి పై ఎందరెందరో మహానుభావుల జీవితాల్లో తేటతెల్లమైన గురువైభవం....

శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో...

" గురువులు ఏమి ఇవ్వగలరు...?
అని అడిగితే
" గురువులు ఏమైనా ఇవ్వగలరు...!"
అనేది సమాధానం...

గురుకృప అంతటి ఉత్కృష్టమైనది కనుకనే

యుగయుగాలుగా ఈ దేవభూమి పై
గురుకులాల్లో / పాఠశాలల్లో విద్యార్థులందరికి తప్పకుండా నేర్పింపబడే శ్లోకం...

"
గురుర్ బ్రహ్మా..
గురుర్ విష్ణుః...
గురుర్ దేవో మహేశ్వరహః....
గురుర్ సాక్షాత్త్ పరబ్రహ్మ.....
తస్మై శ్రీ గురవే నమః......"

ఆతరువాతే...

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ...
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా...."

అంటూ వివిధ ప్రార్ధనా శ్లోకాలు నేర్పించారు మన చిన్నప్పుడు స్కూల్లో...

మనం ప్రయాణించే మార్గంలోని అజ్ఞ్యానమనే అంధకారన్ని రూపుమాపే జ్యోతీస్వరూపాలే గురువులు...
( గు కారః అంధకారశ్చ....
రు కారన్ తన్నిరోధకహః...
అనే శృతివాక్యానుగుణంగా...)

పలకా బలపం చేబట్టి

ఓనమాలు / ABCD లు దిద్దిన ఆ నాటి నుండి

కంప్యుటర్ / మొబైల్ కీ బోర్డ్ పై నిరంతర అక్షర సేద్యాన్ని గావిస్తూ బ్రతికే ఈనాటి వరకు...

నా విద్యా / ఉద్యోగ / అధ్యాత్మ మార్గాల్లో నాకు దిక్సూచియై ఉండి నడిపించిన ప్రతి ఒక్క గురుస్వరూపులను నా అధ్యాత్మ సద్గురువులైన శ్రీ చాగంటి సద్గురువుల శ్రీ చరణాల్లో దర్శించి స్మరించి నమస్కరిస్తూ...

సహృదయులైన వారందరికీ ఇదే నా గురువందనం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐😊

विदिताखिल शास्त्र सुधा जलधे
महितोपनिषत्-कथितार्थ निधे ।
हृदये कलये विमलं चरणं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 1 ॥

करुणा वरुणालय पालय मां
भवसागर दुःख विदून हृदम् ।
रचयाखिल दर्शन तत्त्वविदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 2 ॥

भवता जनता सुहिता भविता
निजबोध विचारण चारुमते ।
कलयेश्वर जीव विवेक विदं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 3 ॥

भव एव भवानिति मे नितरां
समजायत चेतसि कौतुकिता ।
मम वारय मोह महाजलधिं
भव शङ्कर देशिक मे शरणम् ॥ 4 ॥

सुकृते‌உधिकृते बहुधा भवतो
भविता समदर्शन लालसता ।
अति दीनमिमं परिपालय मां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 5 ॥

जगतीमवितुं कलिताकृतयो
विचरन्ति महामाह सच्छलतः ।
अहिमांशुरिवात्र विभासि गुरो
भव शङ्कर देशिक मे शरणम् ॥ 6 ॥

गुरुपुङ्गव पुङ्गवकेतन ते
समतामयतां न हि को‌உपि सुधीः ।
शरणागत वत्सल तत्त्वनिधे
भव शङ्कर देशिक मे शरणम् ॥ 7 ॥

विदिता न मया विशदैक कला
न च किञ्चन काञ्चनमस्ति गुरो ।
दृतमेव विधेहि कृपां सहजां
भव शङ्कर देशिक मे शरणम् ॥ 8 ॥


No comments:

Post a Comment