సందర్భంగా, సికింద్రబాద్లోని శ్రీస్కందగిరిసుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయనవీకరణ / పునఃప్రతిష్ట / బ్రహ్మోత్సవాంతర్గతంగా భాగ్యనగరానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహం.... 🙏😊💐🎂🍦🍧🍕
ఎన్నో జన్మల పుణ్య సౌభాగ్య హేతువు తో మాత్రమే శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరాధన / దర్శనం / అనుగ్రహం అనేవి సంభవించడం అని శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒకచోట వివరించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి....
శరవణతటాకం / రెల్లుపొదలు / శివతేజస్సు / కృత్తికలు / కార్తికేయుడు
తారకాసురవధానంతరం వెలువడిన ఆత్మలింగం భిన్నమై 5 చోట్లకు చేరుకొని ప్రవర్ధమానమవుతూ ఉండగా వివిధ దేవతలు ప్రార్ధించి ప్రతిష్ట గావించిన క్షేత్రాలు పంచారామాలుగా పరిఢవిల్లఢం
ఇత్యాదిగా కుమారస్వామి వారి వైభవం ఎల్లరికీ విదితమే......
పరమశివుడైన తండ్రికే ప్రణవోపదేశం గావించిన పరంజ్యోతిస్వరూపుడిగా సుబ్రహ్మణ్యస్వామి వారి ప్రాభవం అనన్యసామాన్యమైనది.....
పరాశక్తి అనుగ్రహించిన శక్త్యాయుధాన్ని ధరించి నెమలిని వాహనంగా కలిగి ఉండే సాకార స్వరూపంలో అనుగ్రహించే సుబ్రహ్మణ్యస్వామి వారు జీవుడి కుండలినీ శక్తికి ప్రతిరూపంగా ఊర్ధ్వగమన జంటనాగుల రూపంలో కూడా ఆరాధనలు అందుకోవడం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి....
"మీరు గమనిస్తే శివపరివారం చాలా గమ్మత్తైనది....
ఆయన వాహనం వృషభం..
ఆవిడ వాహనం సిమ్హం.....
గణపతి వాహనం మూషికం.....
స్కందుడి వాహనం మయూరం......
పాములను ఆభరణాలుగా కలవాడు శివుడు......
ఎద్దుకు / సిమ్హానికి పడదు.....
పాములకు / నెమలికి పడదు....."
అంటూ వైవిధ్యభరితమైన శివపరివారం గురించి శ్రీ శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒకచోట వివరించి ఉన్నారు....
ఇన్ని వైవిధ్యాలతో, వైరాలతో ఉండే ప్రాణులు వైరాన్ని మరచి ఒక కుటుంబ సభ్యులుగా / ఒకే పరివారంగా ఉండడంలోని సందేశమే ఆ పార్వతీపరమేశ్వరులు లోకానికి అందిచ్చే భిన్నత్వం లోని ఏకత్వం గురించిన సందేశం....
ఈ సమాజం ఎల్లప్పుడు ఎన్నో రకాలైన వైవిధ్యాలతో / భేదాలతో / భిన్నవిభిన్నమైన వ్యక్తిత్త్వాలతో ఉండడం అనేది ప్రాపంచిక సహజ లక్షణం......
ఎన్నిభేదాలున్నాసరే శాంతియుతంగా పరస్పర సహకారధోరణిలో ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించగలిగిన నాడు, ఎల్లరికీ శాంతిసౌఖ్యాలు లభించడం అనేది సిద్ధిస్తుంది.....
నువ్వెంత అంటే నువ్వెంత....
అనే రీతిలోనే ప్రపంచం కలహపూరితమైన రీతిలో ముందుకు సాగితే లోపించే శాంతిసౌఖ్యాల గురించి ఈ కలియుగ వాసుల కలతల జీవితాలకు బాగా తెలిసిందే.....
"నువ్వు చాలా గొప్పోడివన్నా.....
నువ్వు మస్తు గ్రేట్ అన్నా....
నువ్వు హీరోవి...నువ్వు అది...నువ్వు ఇది....
మీరు చాలా ఉన్నతమైన వారు....
మీరు బాగా చదువుకున్న సంస్కారవంతులు.....
మీరు గొప్ప కీర్తివంతులు.....
మీరు అది.....మీరు ఇది..... "
అంటూ ఇతరులను గౌరవించే రీతిలో జీవించగలిగినప్పుడు....
లేదా
"వాడో పొగరుబోతు.....
వాడో ఓర్వలేని మూర్ఖుడు.....
వాడో సంస్కారం లేని రౌడీ....
ఇట్లాంటి మూర్ఖులతో ఎంత దూరం ఉంటే అంత మంచిది....
బురదలో రాయి వేయడం ఎందుకు....
మన బట్టలు కరాబ్ చేసుకోవడం ఎందుకు......"
అనే విచక్షణతో ఉండగలిగినప్పుడు మాత్రమే జీవితానికి శాంతిసౌఖ్యాలు అనేవి ఒనగూరుతాయి.....
అట్లు కాక.....
" నా జోలికి రావడానికి నువ్వెవడివి...
నీ అయ్య సొమ్ము దానం చేసినవ మాకు....నీ సొమ్మేమైనా ధారపోసినవ మాకు.....ఎప్పుడు చూసినా మందిపై ఏడుస్తూ...మందిని ముంచి బ్రతకడమే........"
అంటూ కలహపూరిత రీతిలో పరస్పర జీవితాలు ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా శాంతిసౌఖ్యాలు అనేవి సమకూరవు......
కాబట్టి ఏ విధమైన రీతిలో దైనందిన జీవితం సాగుతున్నది అనేదానిపై, ఆయా జీవితాల ఔన్నత్యం, సార్ధక్యం అనేవి ఆధారపడి ఉంటాయి.....
ఒకవైపు మన ఔన్నత్యాన్ని వృద్ధిపరుచుకుంటూ మరో వైపు ఇతర మంచి వ్యక్తుల గొప్పదనాన్ని కూడా గుర్తిస్తూ, గౌరవిస్తూ.....
ఇతర మంచి వ్యక్తుల పట్ల గౌరవం / సంస్కారం / మరియాద ఇట్లాంటి పదాలకు కనీసం అర్ధం కూడా తెలియని మూర్ఖులకు దూరంగా ఉంటూ....
జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ఎట్ల...? అని అంటే.....
అది కేవలం భగవద్ అనుగ్రహంతో మాత్రమే సాధ్యమయ్యే అంశం.......
అవతలి వ్యక్తి మాట్లాడే మాటల్లోనే వారిని చదివేయడం ఒకెత్తైతే.....
ఏమి మాట్లాడకుండానే మనస్తత్త్వాలను గ్రహించి మసులుకోవడం ఒకెత్తు.......
ఎవరితో గొప్పగా సంభాషించాలో తెలుసుకోవడం ఒకెత్తైతే....
ఎవరితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనేది తెలుసుకోవడం ఒకెత్తు...
ఎక్కడ మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోవడం ఒకెత్తైతే....
ఎక్కడ మౌనానికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోవడం ఒకెత్తు....
ఎవరి మాటలు శ్రద్ధగా ఆలకించాలో తెలుసుకోవడం ఒకెత్తైతే....
ఎవరి మాయమాటలు విని మోసపోవద్దో తెలుసుకోవడం ఒకెత్తు....
ఇలా మన యావద్ జీవితం కూడా ఎవరి మాటల ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది అనే అంశం పై,
ఎవరి మాటలను ఆలకించి / విశ్వసించి
మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకుంటాము అనే అంశం పై, ఆధారపడి ఉండే సత్యం.....
వీటన్నిటికి కూడా సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహం చాలా విశేషమైనది....
నిజానికి " సు బ్రహ్మణ్యం " అనే పేరులోనే ఆ గొప్పదనం దాగి ఉంది....
అరవిరిసిన కమలం యొక్క రేకుల ఆకారంలో ఉండే
" శక్తి " అనే ఆయుధాన్ని ( ద్రవిడ సంప్రదాయంలో వేలాయుధన్ / వేల్మురుగన్ / ఇత్యాది పేర్లు రావడానికి కారణమైన ఆయుధం....) ధరించి ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనంతో అన్ని రకాల శక్తి / అనుగ్రహం సిద్ధిస్తాయి అనేది ఆర్షవాక్కు.....
1. నిరంతరవికసిత కుశాగ్రబుద్ధి వైభవం....
2. శ్రేష్టమైన మానసిక, శారీరక ఆరోగ్యభరిత మేధాశక్తి....
3. అనన్యసామాన్యమైన వాగ్వైభవం......
4. అమేయమైన దక్షత్వం.....
5. ఆరితేరిన ప్రజ్ఞ్య.....
6. ఆమూలాగ్ర విషయ పరిజ్ఞ్యానం.....
ఈ ఆరింటి సమ్మేళనమే సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహ విశేషం......
మరియు అన్నిటిని మించి సకలవిధమైన
దోషాలను పరిహరించే పరదైవంగా సుబ్రహ్మణ్యస్వామి వారిది విశేషమైన అనుగ్రహం.....
పుణ్యసంచయం వేరు......
పాప/దోష పరిహారం వేరు....
మొదటిది ముఖ్యమైనది.....
రెండోది తప్పనిసరైనది.......
కోట్లకు కోట్ల ఆస్తులతో తులతూగే ఒక బిగ్షాట్ ఇంట్లో జన్మించడం అనేది ఒక జీవుడికి జన్మాంతర పుణ్యబలం తో సంభవించే అంశం....
చక్కగా చదువు అబ్బడం......
చక్కని ఆరోగ్యంతో జీవించడం.....
వయసుకు తగ్గట్టుగా జరగవలసిన అన్ని సంస్కారాలు తగిన టైం కి జరగడం.....
పిల్లాపాపలతో కుటుంబం వృద్ధిలోకి రావడం.....
ఒక 70/80/90 ఏళ్ళకు అనాయాసంగా కైవల్యాన్ని పొందడం.....
ఇవన్నీ కూడా కేవలం పుణ్యం తో మాత్రమే సంభవం కావు.....
వివిధ దోషాల రీత్య వీటికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి......
వాటిని పరిహరించడంలో సుబ్రహ్మణ్యస్వామి వారి అనుగ్రహం అనేది చాలా కీలకమైనది.....
ఇంటిపైన ఒవర్ హెడ్ ట్యాంకులో నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయ్ .....కాని సింకుదెగ్గర ట్యాప్లో ఏదో జాం అయ్యి సరైన సమయానికి నీళ్ళు అందట్లేదు.......
అంటే నీళ్ళు బాగా ఉండి కూడా అవి మనకు ఉపయోగపడట్లేదు అని అర్ధం.....
అదే విధంగా పుణ్యం కావలసినంత ఉన్నాసరే కొన్ని కొన్ని దోషాలు ఉన్నప్పుడు అవి అడ్డుపడి మనకు కావలసినవి అందకుండా చేస్తాయి....
అప్పుడు ఎంత పుణ్యమున్నా సరే ఆ దోషాల కారణంగా ఉన్నతి లభించదు.....
దైవారాధన అనే సంప్రదాయం లో గల విశేషమే దోషనివారణ మరియు పుణ్యసంచయం కూడా.....
దోషనివారణ ప్రక్రియలో సుబ్రహ్మణ్యస్వామి వారిది ఎంతటి శక్తివంతమైన పాత్రో కొన్ని కొన్ని క్షేత్రాల్లో గమనించవచ్చు......
కర్ణాటక లోని కుక్కె / కుక్షి సుబ్రహ్మణ్య స్వామి వారిది యావద్ భారతదేశంలోనే ఎంతో గొప్పదైన క్షేత్రం.....
మామూలుగా చూస్తే ఒక నార్మల్ టెంపుల్ లా కనిపించే కుక్షి క్షేత్రాన్ని యోగదృష్తితో దర్శిస్తే
అక్కడి కార్తికేయుడు ఎంత వేగంగా భక్తుల దోషాలను (ఆయా క్రతువుల సంప్రదాయం తెలిసినవారికి)
హరించివేస్తుంటాడో అనేది కానవస్తుంది......
అందరికి తెలిసిన ఆరుపళైవీడు అనే 6 సుప్రసిద్ధ కూమార క్షేత్రాలే కాకుండా......
కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య,
ఇత్యాది క్షేత్రాల్లో కూడా స్కందుడి అమేయమైన దోషనివారణా శక్తిని గమనించవచ్చు.....
అవ్విధమైన గొప్ప క్షేత్రాల్లో సికింద్రాబాద్ లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా గొప్ప ప్రాభవం గల ఆలయం.....
"స్కందమాత" అనే నవదుర్గల్లోని నామము, " సోమాస్కందమూర్తి " అనే అరుణాచలేశ్వరుడి స్వరూపము,
"స్కందపూర్వజః" అనే వినాయకుడి నామము, ఇత్యాదిగా శివపరివారం మొత్తం కూడా స్కందనామభూషితులై ఉండడం మనం గమనించవచ్చు......
అటువంటి మహోన్నతమైన స్కందగిరి అనే పేరుతో భాసిల్లే కుమార క్షేత్రంలో స్వామివారి ఆలయ నవీకరణానంతర బ్రహ్మోత్సవాంతర్గతంగా శ్రీమహాస్వామి వారి అనూరాధ నక్షత్ర ప్రయుక్త 129 వ జయంత్యుత్సవాంతర్గతంగా శ్రీకంచికామకోటిపీఠ
70వ జగద్గురువులైన శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహం లభించడం జన్మాంతరసుకృతం....
🙏😊💐🎂🍦🍧🍕
జయజయశంకర....హరహరశంకర...
🙏🙏
No comments:
Post a Comment