నుండి 75 సంవత్సరాలుగా " అభివృద్ధి చెందుతున్న దేశం " గా తన అంతర్జాతీయ అస్తిత్వాన్ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ, ప్రపంచ జనాభాలోని రమారమి 18% ప్రజానీకానికి ఆవాసం కల్పిస్తున్న ఉన్నతమైన దేశంగా ఖ్యాతి గడిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో, " మతం " అనేది ఎల్లరిని ఉద్ధరించే ఒక గొప్ప సాధనమై పరిఢవిల్లాలి కాని ఒకరితో ఒకరు కలహించికోవడానికి కాదు.....
గతమనేది కొన్ని గుర్తులను / కొన్ని పరిణామాలను / కొన్ని స్మృతులను వదిలి వెళ్ళిన గతించిన నదీ ప్రవాహం వంటిది......
దాని నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.....
ఎన్నో విధాలుగా మనల్ని మనం ఉద్ధరించుకునే దిశగా మన జీవిత ప్రస్థానన్ని సరిదిద్దుకోవచ్చు.....
అంతే కాని గతాన్ని వర్తమానానికి ఇబ్బంది కలిగించే రీతిలో జీవితం లోకి ఆహ్వానిస్తుంటే, అది ఎవ్వరికి ప్రశాంతతను మిగల్చదు......
తద్వారా భవిష్యత్తు కూడా అశాంతత దిశగా ఆవిష్కరింపబడే ప్రయాసే అవుతుంది.....
ఒక కుటుంబానికి
ఒక మంచి నెక్లేస్, ఒక మంచి బైక్, ఒక మంచి లాప్టాప్, కొన్ని మంచి ఆటబొమ్మలు కానుకలుగా ఇవ్వబడినప్పుడు.....
ఆ ఇంట్లోని స్త్రీలు / పురుషులు / యువకులు / పిల్లలు / వాటిని వారి వారి అభిరుచిమేరకు తగిన వస్తువులుగా ఉపయోగించుకోవడంలో ఎల్లరికీ ప్రశాంతత / ఆనందం ఉంటుంది.....
అంతే కాని "ఇదెందుకు ఇట్ల ఉంది......
అదెందుకు అట్ల ఉంది......
నాకు నీ వస్తువు నచ్చలేదు కాబట్టి నేను గొడవ చేస్తా.....నా వస్తువు మాత్రమే గొప్పది....
మీ వస్తువులు కావు......"
ఇట్లా నానా రకాలుగా లొల్లి చేయడంలో ఎవ్వరికి ఏ గొప్పదనము / ఏ ఉపయోగము ఉండవు.....
వస్తువులు పరస్పర సహకారాన్ని అందించే వాటిగా ఉన్నప్పుడే వాటి స్వీకరణలో ఒక అర్ధం ఉంటుంది.....
అచ్చం అదే విధంగా, " మతం " అనేది ఈ ఆధునిక భారతంలో ఎల్లరికి గల ఒకవిధమైన అనివార్యమైన గుర్తింపు వంటిది.....
వారివారికి గల గుర్తింపుతో
/ లేదా వారివారికి ఆపాదింపబడిన గుర్తింపుతో....
పరస్పర గౌరవ భావం తో మెలగుతూ ఉన్నతి బడసి ఎల్లరూ ప్రశాంతంగా జీవించగలిగినప్పుడు మాత్రమే
" మతం " అనే గుర్తింపునకు ఒక అర్ధం, ఒక పరమార్ధం ఉంటుంది అనేది నిర్వివాదాంశం.....
ఏ మతం లో, ఏ మత గ్రంథంలో, ఏ మత విశ్వాసాల్లో, ఇతర మతాలను దూషించమని / తక్కువ అని / అదని / ఇదని చెప్పబడిందో ఎవరైనా చెప్పగలర....??
ఎవ్వరూ చెప్పలేరు.....ఎందుకంటే.....
ఏ మతమైనా సరే, ఆయా విశ్వాసాల్లోని గొప్పదనం గురించి మాత్రమే ఉటంకిస్తుంది తప్ప ఇతర మతాల గురించిన ప్రస్తావనల గురించి కాదు.....
ఒక కుటుంబంలో భోజనం గావించేటప్పుడు
వంకాయ్ / సోరకాయ్ / పప్పు / ఆలుగడ్డ / చారు / అన్నం / చపాతీలు / పెరుగు / ఇలా వివిధ వంటకాలు ఎదుట ఉన్నప్పుడు......
అందులో ఎక్కువ తక్కువలు / ఇది గొప్ప / ఇది గొప్ప కాదు / ఇది మంచిది / ఇది మంచిది కాదు / అని ఎవరైనా అంటే అది ఎంత మూర్ఖత్వమో......
( ఎందుకంటె ఒకరికి ఒక వంటకం నచ్చుతుంది....ఇంకొకరికి ఇంకొకటి....)
ఒక దేశంలోని వివిధ వ్యక్తులు వివిధ మతాలను / మార్గాలను / విశ్వాసాలను / ఆచరిస్తున్నప్పుడు......
" ఎవరి మతం వారికి మంచిది / గొప్పది / ఉద్ధరణహేతువైనది....."
అని నిర్వచించడంలో / ఎల్లరూ కూడా ఒక కుటుంబంలా శాంతియుత ధోరణిలో / పరస్పర మతసామరస్యంతో జీవించగలిగినప్పుడు మాత్రమే ఆయా మతాలు / ఆయా విశ్వాసాలు / మనిషికి మేలు చేసే సాధనములు.......
ఒక్క చిన్న ఎగ్సాంపుల్ లో మతం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలంటే.....
సముద్రం అలలతో పోటెత్తే పౌర్ణమి సమయం వస్తున్నందున......
బీచ్ లో ఉన్న వారందరిని ఒక కొండగుట్టపైకి చేరుకోవడానికి పక్కనే ఉన్న వివిధ ఎండిపోయిన చెట్టు కొమ్మలను చేతి కర్రలుగా గావించి ప్రయాణం గావించండి.....అని చెప్పబడినప్పుడు.....
వారి వారికి నచ్చిన కొమ్మను గైకొని అనువైన చక్కని చేతికర్రగా మార్చుకొని ఎవరికివారు కొండగుట్టపైకి చేరుకోవడంలో ఆ కర్రలకు / వాటిని చేతికర్రలుగా ఉపయోగించిన వ్యక్తులకు సార్ధకత ఉంటుందే తప్ప......
' క్రింది స్థాయిలోనే ' అక్కడే ఉండిపోయి...
"నా కర్ర గొప్పది....నీ కర్ర గొప్పది కాదు.....నాది ఆ చెట్టు కర్ర.....నీది ఈ చెట్టు కర్ర......నాకన్న పెద్ద కర్ర ఎందుకు తీస్కున్నవ్....నిన్ను కొండపైకి పోనివ్వకుండా ఇక్కడే నా కర్రతో అడ్డుపడతా...."
ఇలా ఎన్ని విధాలుగా మూర్ఖత్వంతో వాదులాట గావించినా సరే,
ఎవరైతే ఇతరుల కర్రల గురించి ఎక్కువగా ఆలోచించకుండా.....
వారు ఎన్నుకున్న కర్రను చేతికర్రగా గైకొని,
ఆ ఆలంబనతో వడివడిగా అడుగులువేసుకుంటూ కొండపైకి చేరుకుంటారో...
వారికి అభివృద్ధి / క్షేమం / ప్రశాంతత / ఆనందం / ఇలా అన్నీ కూడా ఆ చేతికర్ర సాధించిపెట్టిందని అర్ధం......
కేవలం కర్రల్లో గల ఏవో భేదాలకోసం వాటిని అందుకున్న వ్యక్తులు ' క్రింది స్థాయిలోనే ' ఉండి లొల్లి చేయడంలో, ఆ కర్రలు ఒకరితో ఇంకొకరు కలహించుకోవడానికి సాధనములుగా ఉపయోగింపబడినాయి కాని పరస్పర సహాయసహాకారాలతో స్వోద్ధరణకు సాధనములుగా ఉపయోగింపబడలేదు అనేది పైకి చేరుకున్న వ్యక్తులకు కనిపించే సత్యం....
ఎందరో వ్యక్తులు శీఘ్రంగా కొండపైకి చేరుకోవడంలో సహాయం ఒనరించినవి కాబట్టి
ఆ చేతి కర్రలు గొప్పవిగా పరిగణింపబడాలా....??
లేదా....
కొందరు వ్యక్తులు "క్రింది స్థాయి" లోనే ఉండిపోయి
" ఉన్నతి వైపునకు ప్రయాణించడం " అనే అసలైన కర్తవ్యాన్ని పక్కనబెట్టి, కేవలం కర్రల కోసం పరస్పరం కలహించుకోవడంతో కెరటాల ధాటికి సముద్రంలో మునిగిపోయారు.....
కాబట్టి
ఆ చేతి కర్రలు గొప్పవి కాదు అని పరిగణింపబడాలా....??
( కర్రలు సముద్రంలో మునగవు.....అవి అక్కడ కూడా నీటిపై తేలియాడుతూ మనుష్యులకు సహాయాన్నే చేస్తాయి.....)
కాబట్టి ఒక చేతి కర్రలాంటి " మతం " అనే ఆలంబనతో, జీవిత ప్రయాణంలోని వివిధ శిఖరాలను అధిరోహించడమా లేక
జీవనోద్ధరణ అనే అసలైన కర్తవ్యాన్ని పక్కన బెట్టి.....
కేవలం మతాలకోసం మనుష్యులు జీవితంలో
"క్రింది స్థాయి" లోనే ఉండిపోవడమా అనేది,
మన మతాన్ని మన స్వోద్ధరణకు ఒక ఆలంబనగా గావించామా......
లేదా ఇతర మతాల గురించిన అనవసరమైన చర్చల కోసం మాత్రమే మతాన్ని ఒక కలహకారక వస్తువు గా భావిస్తున్నామా అనే అంశం పై ఆధారపడి ఉండే సత్యం....
Respect your religion as you would respect yourself.....
Respect others' religions as you would respect the other family members....
( despite the various differences amongst them )
Then, there is no scope for any religion to
become a hindrance in our respective paths towards a meaningful / fruitful / fulfilled life.....because it will then only become an object to uplift everyone towards our chosen shores of life.....
.
No comments:
Post a Comment