దేశ / రాష్ట్ర రాజకీయ సమీకరణాలను క్షుణ్ణంగా అధ్యయనం గావించే పాలిటి / పొలిటికల్ విశ్లేషకులకు, గౌ || ముఖ్యమంత్రి వర్యులు, కే.సీ.ఆర్ గారు మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పబడిన ఈ ముఖ్యమైన స్టేట్మెంట్ ఒకటి బాగా గుర్తుండి ఉండాలి....
" The formation of Telangana is not about its separation from A.P. It's essentially a
de-merger of the same."
"నీళ్ళు-నిధులు-నియామకాలు" అనే ప్రాతిపదికన ఆనాడు స్వతంత్ర భారత దేశం యొక్క 29 వ నూతన రాష్ట్రంగా ఎప్పటినుండో అంతర్లీనంగా ఉన్న తన అస్తిత్త్వానికి స్థిరమైన రూపురేఖలను అందించి ఒక సరికొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించి అన్ని రంగాల్లోను అభినందనీయ ప్రగతితో భారతదేశానికి తలమాణికమైన రాష్ట్రంగా అభివృద్ధిపథంలో ముందుకు సాగుతు రాష్ట్రప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 8 సంవత్సరములు పూర్తిచేసుకొని 9వ
సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభపర్వ శుభాభినందనలు.....
హైదరాబాద్ అనే ఒక సంపన్నమైన 400 పైచిలుకు సంవత్సరాల పురాతన చారిత్రక నగరాన్ని రాజధానిగా కలిగి, నగరానికి నలుదెసలా వందల కిలోమీటర్ల పర్యంతం ఒక త్రికోణాకార పీఠభూమిగా విస్తరించి ఉన్న తెలంగాణ ప్రాంతం యొక్క నైసర్గిక / భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే....
ఎగువన ఉండే మహారాష్ట్రలోని నాసిక్లో ఉద్గమించి దిగువన ఉండే ఆంధ్రప్రదేశ్ లో సముద్రంలో సంగమించే గోదావరి జీవనదీ యొక్క పరీవాహాక ప్రాంతం లోని సిమ్హభాగం తెలంగాణలో కలదు....
అయినా సరే సరైన సాగు/త్రాగు నీటి నిలువసామర్ధ్యం గల బహుళార్ధసాధక ప్రాజెక్లు / చెక్ డ్యాములు / రిసర్వాయర్లు / ఎక్కువగా లేనందున ఈ ప్రాంతం అనాదిగా నీటి కొరతతో అన్ని విధాలుగా వెనకబడి ఉండడంతో అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోయింది అనేది జగమెరిగిన వాస్తవం.....
కాళేశ్వరం ప్రాజెక్ట్ మరియు తత్ అనుబంధ వివిధ ఉప ప్రాజెక్ట్లతో ప్రజలకు చేరువైన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ తో తెలంగాణ రాష్ట్రం యొక్క సాగు/త్రాగు నీటి సమస్య చాలా వరకు పరిష్కరింపబడినది అనేది వివిధ నిపుణులచే విశ్లేషింపబడిన జగద్విదితమైన సత్యం.....
(నిధుల కేటాయింపు / కొరత,
నియామకాలు, అనేవి పూర్తిగా రాజకీయాంతర్గత పరిపాలనకు సంబంధించిన సాపేక్ష సమకాలీన అంశాలు కాబట్టి నాకు అవగాహన లేని వాటి గురించి నేను ఎక్కువగా చర్చించట్లేదు....)
ఒక సామాన్య రాష్ట్ర పౌరుడు ఆలోచించేది.....
సరసమైన ధరలకు నిత్యావసర వస్తువుల లభ్యత / మెరుగైన మౌలిక సదుపాయాల అందుబాటు / అభివృద్ధి పథంలో ముందుకు సాగే వారి వారి దైనందిన జీవనప్రయాణం....
వీటి గురించి ఎవరైతే నిత్యం కృషిస్తూ ప్రజలకు చేరువై ఉంటారో, వారికి ప్రజలు పట్టం కట్టడం అనేది ప్రజాస్వామ్యంలోని అత్యంత సాధారణమైన అంశం...
అవ్విధంగా గత 8 సంవత్సరాలుగా,
నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణకర్తగా పేర్గాంచిన
గౌ || ముఖ్యమంత్రివర్యులు శ్రీ కే.సీ.ఆర్ గారి పరిపాలనలో రాష్ట్రం ఎన్నో విధాలుగా, చాలా రంగాల్లో ఎన్నగల అభివృద్ధిని సాధిస్తూ మున్ముందుకు సాగుతున్నది అనేది నేడు ఎందరో సాధికారిక సామాజిక పరిణామ విశ్లేషణా పండితులు విద్వత్చర్చల్లో ప్రజలకు తెలియబరుస్తున్న అంశం....
1. సుభిక్షమైన పాడిపంటల లభ్యత....
2. సుస్థిరమైన, శాంతియుతమైన న్యాయ / రక్షణశాఖ వ్యవస్థ...
3. సామాన్య ప్రజానీకానికి ఉపయుక్తమైన రీతిలో వివిధ సంక్షేమ పథకాల అమలు....
4. ఆర్ధిక మిగులు దిశగా పురోగమించే రాష్ట్ర కోశాగార వ్యవస్థ....
5. మెరుగైన ఉద్యోగ / వ్యాపార అవకాశాలతో పురోగమించే దిశగా ప్రతి పౌరుడి దైనందిన జీవన ప్రమాణాలు...
6. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మెరుగైన మౌలిక వసతుల రూపకల్పన.....
ఈ ఆరింటి సమ్మిళిత సమాహార స్వరూపంగా,
గౌ || ముఖ్యమంత్రివర్యులు శ్రీ కే.సీ.ఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం మరింతగా ప్రగతిపథంలో మున్ముందుకు సాగాలాని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ "తెలంగాణ ఫార్మేషన్ డే" శుభాభినందనలు.....😊🍧🍦🎂🍕🙏
Wishing one and all a very happy Telangana formation day's 8th anniversary celebrations....🍕🎂🍦😊🍧
May the state march ahead with its all inclusive development model aimed towards becoming one of the finest states of India under the aegis of hon'ble CM, Shree K.C.R gaaru, who has been instrumental in getting an international recognition to the state and especially to Hyderabad as the most happening global cosmopolitan city...
No comments:
Post a Comment