శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి సంస్మరణ ప్రయుక్త చిరుకవనకుసుమాంజలి...💐
********************************
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
********************************
అని అన్నారు పెదతిరుమలాచార్యుల వారు వారి తండ్రిగారి ఆబ్దికమున సగౌరవంగా నమస్కరిస్తూ....
సుదర్శనచక్రత్తాళ్వార్, పాంచజన్యవిష్ణుపార్శ్వదుడు,
అనంతుడు / ఆదిశేషుడు, గరుత్మంతుడు,
విరజానది, జయవిజయాది ద్వారపాలకులు, శ్రీమహాలక్ష్మి, ఇత్యాది వారందరు నిత్యసూరులుగా శ్రీవికుంఠమహర్షి యొక్క తపఃశక్తితో నిర్మితమైన శ్రీవైకుంఠం అనే ఊర్ధ్వలోకంలో నిత్యం శ్రీమహావిష్ణువును సేవిస్తూ ఉంటారు...
ఈ ముఖ్యులైన నిత్యసూరులతో పాటుగా, ఎందరో విష్ణుపార్శ్వదులు, అనగా సాలోక్య, సారూప్య, సామీప్య మోక్షమును కూడా గడించిన మహాభక్తభాగవతోత్తములు,
అచ్చం శ్రీమహావిష్ణువు లా శంఖచక్రగదాపద్మాలను ధరించినవారై శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞ్యపాలురు గా శ్రీహరి సేవకులుగా శ్రీవైకుంఠం మొత్తం విస్తరించి ఉంటారు...
మాన్యులైన మన ఆర్షవాంజ్మయ పురాణేతిహాస ప్రవచనకర్తలు బోధించే విధంగా...అంత్యకాలమున హరినామస్మరణతో దేహమును త్యజించే వారిని ఈ విష్ణుపార్శ్వదులే స్వయంగా వారికి తైజసిక దేహాలను ప్రసాదించి శ్రీవైకుంఠానికి కొనిపోవుదురు....
ప్రతి శ్రీహరి భక్తుడి కోరిక కూడా నారాయణ, శ్రీరామ, ఇత్యాది హరినామములను స్మరిస్తూ తుదిశ్వాసను విడువడమే...అని అనడం అతిశయోక్తి కానేరదు....
కాని
భర్త/భార్య/బిడ్డలను, ఆస్తిపాస్తులను, ఇతర బంధుమితృలను, కాదని అంత్యకాలమున హరినామస్మరణ గావించి తనువుచాలించడం అనే పుణ్యం అంత సులభంగా సంప్రాప్తించేది కాదు సుమ...
ఎవ్విధంగానైతే కోట్లల్లో ఒకరు సీ.ఎం గా, కోటానుకోట్లలో ఒకరు పీ.ఎం గా, సర్వోన్నతమైన పదవులను వరించే భాగ్యవంతులై ఎందరో జీవితాలను చక్కదిద్దే చుక్కానిలా వర్ధిల్లుతారో...
అవ్విధంగా కోట్లల్లో ఒకరు విష్ణుపార్శ్వదులుగా, కోటానుకోట్లలో ఒకరు రుద్రగణాలుగా, సర్వోన్నతమైన మోక్షసామ్రాజ్య పదవులను వరించే భాగ్యవంతులై ఎందరో జీవితాలను చక్కదిద్దే చుక్కానిలా వర్ధిల్లుతారు.....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారినే ఎగ్సాంపుల్ గా తీసుకోండి...
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో శ్రీఅన్నమాచార్యుల జీవితవైభవాన్ని ఆలకించిన సౌభాగ్యవంతులకు తెలిసినట్టుగా...
వారి ముందుతరాల వారిలో ఒక అమాయక నిరక్షరాస్యుడు తనకు కలిగే అవమానాలకు తీవ్రమైన దుఃఖంతో జీవితం మీద విరక్తితో వల్మీకంలోని నాగదేవతలకు తన హస్తాన్ని అందించి తననుతాను ఆహుతిగావించుకునే ప్రయత్నంలో ఉండగా...చింతలమ్మ అనే అమ్మవారు అనుగ్రహించి....
"ఇట్టి ఆత్మహుతి వలదు భక్త...రానున్న తరంలో యావద్ ప్రపంచానికి శ్రీహరిభక్తి అనే నావకు చుక్కానిలా వెలుగొందే ధృవతార వంటి మహాభక్తభాగవతోత్తముడు జన్మించి ఆతడివల్ల మీ యావద్ భావితరాలు కూడా ఎనలేని కీర్తివంతులై సిరిసంపదలతో భోగభాగ్యాలతో శ్రీహరిభక్తితో తరింతురు...."
అని వాగ్దేవతలతో "గోప్త్రీగోవిందరూపిణి" / "హరిభక్తిప్రదాయిని" గా కీర్తింపబడే ఆదిపరాశక్తి కరుణింపగా....
ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం...
"అన్నమాచార్యకైంకర్యదార్" అనే గౌరవబిరుదాంకితులై వారి వంశీకులు ఇప్పటికీ కూడా నిత్యం ఈ కలియుగ ప్రత్యక్షపరమాత్మ యొక్క సేవలో ఇహము పరము గడించి తరిస్తున్నారు...
ఈ లోకంలో చాలా ఆశ్చర్యకరమైన సత్యం ఏంటంటే..
భక్తవత్సలుడైన శ్రీహరిని సంతసింపజేసే హరినామస్మరణ అనేది చాల సులభమైన అధ్యాత్మ అంశం...కాని అటువంటి మహిమోపేతమైన శ్రీహరిభక్తి నిత్యం అలవడిఉండడం / శ్రీహరిభక్తిపరాయణులై ఉండడం మాత్రం అంత సులభం కానే కాదు...
అందుకే "సులభమా హరిభక్తి మనుజులకు" అనే కీర్తనను శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఎంతో ఘనంగా అనుగ్రహించారు...
మరియు కీ||శే. శ్రీనేదునూరి గురువుగారు అంతే ఘనంగా ఆలపించారు...
********************************
సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుడగుట
కొదలేనితపములు కోటానుకోటులు
నదన నాచరించి యటమీద
పదిలమైన కర్మబంధము లన్నియు
వదలించుకొని కదా వైష్ణవుడగుట
తనివోనియాగతంత్రములు లక్షల సంఖ్య
అనఘుడై చేసినయటమీద
జననములన్నిట జనియించి పరమపా -
వనుడై మరికదా వైష్ణవుడగుట
తిరిగి తిరిగి పెక్కు తీర్థములన్నియు
న(/అ)రలేక సేవించినటమీద
తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ -
వరదుని కృపగదా వైష్ణవుడగుట
********************************
ఎన్నో అవైదిక ఛాందస తత్త్వాలతో / సంప్రదాయాలతో కలుషితమైఉండే ఈ కలియుగంలో కూడా ధర్మానికి ప్రత్యక్ష ప్రతీకలుగా, పరమోత్కృష్ట సద్గురువులుగా అలరారే పరంపరాగతమైన చతురామ్నాయ పీఠాధిపతులకు కూడా అంతటి మహిమోపేతమైన శ్రీహరిభక్తిని, "నిత్య నారాయణ నామస్మరణ" గా జగద్గురువులకు సాక్షాత్తు శ్రీఆదిశంకరాచార్యులచే (అనగా ప్రప్రథమ సర్వోత్కృష్ట
శ్రీవైష్ణవుడైన శివుడు ఈ భూలోకంలో కాలడి శంకరులుగా అవతారాన్ని స్వీకరించిన మహనీయులచే) వ్యవస్థీకరింపబడెను.....
అట్టి మహిమోపేతమైన సర్వార్ధసాధకమైన శ్రీహరిభక్తి అనేసాధనాన్ని, కరతల ఆమలకంగా కలియుగభక్తులకు అందించిన మహనీయులుగా శ్రీఅన్నమాచార్యులను శ్రీహరినందక ఖడ్గాంశసంభూతులుగా విజ్ఞ్యులు కొనియాడి వారి నిరుపమాన శ్రీవేంకటాచలపతి సంకీర్తనా సాహితీ భాండాగారాన్ని భవ్యమైన భాగ్యరాశిగా, భవభంజక భావమంజరుల జ్ఞ్యానభాస్కరద్యుతిగా, సకల పురాణేతిహాస శ్రవణ పుణ్యదాయక శ్రేయోకారిగా, మనకు అందించినందుకు శ్రీతాళ్ళపాకవారికి ఈ కలియుగం ఎప్పటికీ సదా ఋణపడి ఉన్నది....
********************************
దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే
అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుఁగూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
సంకీర్తనముతోడ సనకాదులెల్లఁబాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుఁడు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే
********************************
https://annamacharya-lyrics.blogspot.com/2006/12/105dinamu-dwaadasi-nedu.html?m=1
3వ చరణంలోని 2వ పంక్తిలో ,
"శ్రీవేంకటాద్రి భూమి నుండి" అనే కవనప్రయోగాన్ని చదివే విజ్ఞ్యులకు తెలిసినట్టుగా...
శ్రీవేంకటాద్రి యొక్క అప్రాకృత వైభవాన్ని, మహిమ్నతను, శ్రీఅన్నమాచార్యులవారు చెప్పకనే చెప్తున్నారు....
ఫర్ ఎగ్సాంపుల్, నేను అమెరిక సమ్యుక్త రాష్ట్రాల్లోని వివిధ భౌగోళిక వింతలు విశేషాలను దర్శించి ఫేస్ బుక్ లో పిక్స్ పెడితే....
ఆ దేశానికి ఎప్పుడూ వెళ్ళని నా స్నేహితులు క్యాజువల్ గా ఏమని అంటారు...?
" అరె వినయ్ గా... యు.ఎస్ ఎప్పుడు వెళ్ళినవ్రా...?
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిజంగా అంత పొడువు ఉంటదారా..?
సాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్ నిజంగా అంత స్పెషల్ గా ఉంటదారా..?
సాన్ ఫ్రాన్సిస్కో డౌంటౌన్ లో ఇప్పటికీ ఆ పాతకాలం ట్రైన్స్ రన్ అవుతుంటయా..?
ఆ దేశం లో ఇంకా ఏమేం వింతలు విశేషాలు ఉంటై రా..? "
అని అంటారు...
అంటే, నేను వెళ్ళింది ఇండియా కాని వేరే దేశం అని...
ఆ దేశం వెళ్ళిరావడానికి కావలసిన పాస్పోర్ట్ అండ్ వీసా ఇంకా వాళ్ళకు రాలేదు కాబట్టి అక్కడ ఎమేముంటయో వాళ్ళకు తెల్వదని...
అక్కడి కరెన్సి, అక్కడి ఆహార ఆహార్య విశేషాలు, అక్కడి వాతావరణ విచిత్రాలు, ఇత్యాదివన్నీ కూడా విచిత్రంగా, ఈ దేశంలో ఉండే వాటికి భిన్నంగా ఉంటాయని,
ఇక్కడ చెప్పకనే చెప్పబడుతున్నది కదా...
అచ్చం అదే విధంగా...
ఇంకా భగవద్ భక్తి అనే పాస్పోర్ట్, ఈశ్వరానుగ్రహం అనే వీసా, లభింపజేసుకోని వారికి కూడా....
మన భూలోకం కాకుండా ఈ అనంత సువిశాల రోదసీలో ఉండే ఎన్నో ఎన్నెనో తైజసిక లోకాలు, వాటి వింతలు విశేషాలు, అక్కడి జీవుల ఆహార ఆహార్య విశేషాలు, అక్కడ ఉండడానికి కావలసిన లేక ఖర్చయ్యే పుణ్యసంపద, ఇత్యాది వాటిగురించిన అవగాహన ఇంకా లభించలేదు అని అర్ధం...
ఆ ఆశ్చర్యజనకమైన లోకాలోక విశేషాలను మానసికంగా మీరు దర్శించాలంటే, శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో శ్రీకృష్ణపరమాత్ముడు, తన బామ్మర్ది అర్జునుణ్ణి ఒకానిక సందర్భంలో శ్రీవైకుంఠలోకానికి తీసుకెళ్ళి దర్శింపజేయించిన వృత్తాంతాన్ని ఆలకించినవారికి ఆ విశేషాలు బాగా బాగుగా ఎరుకపడును...
అందుకే పెదతిరుమలాచార్యులవారు విష్ణుపార్శ్వదులలో ఒకరిగా వెలుగొందుతున్న శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారిని....
"యీకడ నారగించ నింటికి విచ్చేయవే" అని సంబోధించారు 2వ చరణంలోని 4వ పంక్తిలో...
********************************
వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశుఁగూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే
********************************
ఈ కలియుగంలో శ్రీహరినామస్మరణం అనే నిత్య భక్తిజ్ఞ్యాన యజ్ఞ్యమే సర్వోన్నతమైన తపస్సు గా విజ్ఞ్యులు వచింతురు....
కాబట్టి...
మన హృదయకవాటాల లో శ్రీహరిభక్తిసంవృద్ధిని ప్రోదిచేసే ఈశ్వరానుగ్రహాన్ని వర్షింపజేయమని మనం కూడా శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారిని మనశక్తిమేర కీర్తిద్దాం...
శ్రీతాళ్ళపాకగురవే నమః...🙏
సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...🙏🙏💐
No comments:
Post a Comment