శ్రీక్రోధి నామ సంవత్సర (ఏప్రిల్-15-2024) చైత్ర శుద్ధ సప్తమి ఇందువాసర పునర్వసు నక్షత్ర ప్రయుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తంలో అంగరంగవైభవంగా నిర్వహింపబడే శ్రీవారి దివ్యతిరుక్కళ్యాణ మహోత్సవానికి శ్రీకారంగా, శ్రీక్రోధి నామసంవత్సర (ఏప్రిల్-13-2024) చైత్ర శుద్ధ పంచమి మృగశిరా నక్షత్ర ప్రయుక్త స్థిరవాసర శుభసమయంలో శుభారంభమవుతున్న శ్రీకరమైన శ్రీమదలర్మేల్మంగాపద్మావతి ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి 33వ వార్షిక పాంచరాత్రాగమోక్త పాంచాహ్నిక బ్రహ్మోత్సవ మొదటి రోజున గావింపబడే అంకురార్పణ, మృత్సంగ్రహణము, చతుఃస్తానార్చన, ధ్వజారోహణం అనే దైవిక క్రతువుల గురించి ఈశ్వరానుగ్రహంగా కొంత పరికిద్దాం...
"అంకురార్పణ" అనగా బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవం. యాగశాలలో మట్టితో తయారుచేయబడిన కుండలు, ఇతర సామాగ్రిని చక్కని అలంకరణమండపంపై కొలువుతీర్చి, ఆలయ పరిసరాల్లోని పవిత్రమట్టితో వాటిని నింపి, నవధాన్యములను వాటిలో నిక్షిప్తం గావించి బ్రహ్మోత్సవపర్యంతం వాటిని ఆరాధించడం అనేది ఒక సత్సంప్రదాయం...
ఇక్కడ ఓషధీశక్తిని పరమాత్మశక్తిగా ఆరాధిస్తూ, ఆ ధాన్యములు మొలకెత్తిన తీరుతో కొన్నిరకాల ఫలితాలను విశ్లేషించే వైదికవిద్వణ్మూర్తులు గల దేశం మన సనాతన భారతదేశం...
ఒక X రే ని మనం గమనిస్తే మన గురించి మనకు పెద్దగా ఏమి తెలియకపోవచ్చు...కాని అదే X రే ని ఒక నిష్ణాతులైన డాక్టర్ గారు గమనిస్తే వారు ఎన్నో రకాలుగా పరిశీలన గావించి వారివారి విలువైన విశ్లేషణలను అందిస్తారు కద...
ఇది కూడ అచ్చం అటువంటిదే అనుకోండి...
ఋగ్, సామ, యజుర్, అథర్వణ, వేదాలకు ప్రతీకలుగా నాలుగు ప్రధాన దిక్కులను సమంత్రకంగా యాగశాలలో తత్ అధిష్ఠానదేవతారాధన, తత్సంబంధ వేదపన్నలను ఆమ్నాయం గావించడాన్ని చతుఃస్థానార్చన అని అంటారు....
ఒక సంపన్న వ్యక్తి ఎంతో గొప్పగా కట్టుకున్న అంతఃపురమైనా ,
లేక ఒక సామాన్యుడు ఎంతో సింపుల్ గా కట్టుకున్న ఒక మధ్యతరగతి ఇల్లైనా, ద్వారాలు అనేవి కొన్ని మాత్రమే ఉంటాయ్...
అవి సరైన పద్ధతిలో సరైన దిశలో ఉన్నప్పుడు చక్కని శ్రేయోకారక ఫలితాలు....
లేనిచో విచారకరమైన ఫలితాలు ఇచ్చును అనే అధ్యాత్మ సైన్స్ ని విజ్ఞ్యులైన ప్రజలకు బోధించడం కోసమే ఈ చతుఃస్థానార్చన అనే పేరుతో దిక్కులపట్ల ఉండవలసిన కనీస అవగాహన మనకు లభింపజేస్తున్నారు...
ఫర్ ఎగ్సాంపుల్, ఒక ఇంటికి తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం, అనే నాలుగు దిక్కుల్లో ఉండే ద్వారాలు మంచి ఫలితాలను ఇచ్చును....
అట్లుకాకుండా...
ఉండకూడని విధంగా ద్వారాలు ఉన్నచో...ప్రతికూల ఫలితాలు వచ్చును అనే కాస్మిక్ సైన్స్ మనకు ఈ చతుఃస్థానార్చన ద్వారా లభ్యమౌతున్నది...
తూర్పాగ్నేయం లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక ముఖ్యంగా ఆ ఇంటి అతివల ఆరోగ్యాన్ని హరించేవిగా పరిణమిస్తాయి...
ఉత్తరవాయవ్యం లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక ముఖ్యంగా ఆ ఇంటి వారికి మానసిక చాంచల్యం కలిగించేవి గా పరిణమిస్తాయి...
పశ్చిమ నైరుతి / దక్షిణ నైరుతి లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక ముఖ్యంగా ఆ ఇంటి వారికి అన్నివిధాల కష్టాలను కలిగించేవి గా పరిణమిస్తాయి...
కాబట్టి...
తూర్పు, ఉత్తరం, తూర్పీశాన్యం, ఉత్తరీశాన్యం లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక ఉత్తమం / సామాన్యం గా...
పశ్చిమం, దక్షిణం, పశ్చిమవాయవ్యం, దక్షిణాగ్నేయం
లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక మధ్యమం గా...
తూర్పాగ్నేయం, ఉత్తరవాయవ్యం, పశ్చిమ నైరుతి / దక్షిణ నైరుతి లో ఉండే ద్వారాలు, గేట్ల ద్వారా సాగే నడక అధమం / ఘోరం గా...
వాస్తు శాస్త్రం యొక్క అభిప్రాయం...
మనిషికి ఈ జ్ఞ్యానం అంకురించాలంటే ఆలయంలో జరిగే అంకురార్పణ, చతుఃస్థానార్చన, వేదఘోష లో పాల్గొన్నప్పుడు ఈశ్వరానుగ్రహంగా అది ప్రాప్తించును....
తద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాలకు కొన్ని కారణాలు / కొన్ని సమాధానాలు / కొన్ని పరిష్కారాలు లభ్యమయ్యి ఈశ్వరానుగ్రహంగా జీవితంలో శాంతిసౌఖ్యములు సిద్ధించును...
"నా దెగ్గర బైక్ మాత్రమే ఉంది...
కార్ లేదు కాబట్టి ఇక కార్ డ్రైవింగ్
నేర్చుకోవడం ఎట్లు అని అనుకోవడానికి...."
మరియు
"నా దెగ్గర బైక్ మాత్రమే ఉంటే ఏంటి...
డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ దెగ్గర కార్ ఉంటది కద...వాళ్ళ ద్వారా కార్ డ్రైవింగ్ నేర్చుకొని కావలసిన ఫోర్ వీలర్ లైసెన్స్ కూడా సాధించుకుంటాను...."
అని అనుకోవడానికి...
గల ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్ ని అధ్యాత్మ సైన్స్ కి కూడా ఆపాదించి....
"నా దెగ్గర నేను చదువుకున్న కేవలం స్కూల్ / కాలేజ్ చదువులకు సంబంధించిన లౌకిక జ్ఞ్యానం మాత్రమే ఉంది...
జీవితానికి అన్ని విధాలా అభ్యున్నతిని ప్రసాదించే ఈశ్వర / అధ్యాత్మ / ఆత్మజ్ఞ్యానం లేదు కద..."
అని అనుకోవడానికి....
మరియు
"నా దెగ్గర నేను చదువుకున్న కేవలం స్కూల్ / కాలేజ్ చదువులకు సంబంధించిన లౌకిక జ్ఞ్యానం మాత్రమే ఉంటే ఏంటి...
జీవితానికి అన్ని విధాలా అభ్యున్నతిని ప్రసాదించే ఈశ్వర / అధ్యాత్మ / ఆత్మజ్ఞ్యానం ఆలయాలను నిత్యం దర్శించడం వల్ల భగవద్ అనుగ్రహంగా లభిస్తుంది కద..."
అని అనుకోవడానికి....
గల ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్, సదరు వ్యక్తికి తన జీవితాభ్యున్నతి పట్ల ఉండే / ఉండవలసిన బాధ్యతను ఎరుకపరుచును...
అన్ని గ్రహాలు కూడా అంతరిక్షంలోనే సూర్యుడి చుట్టూ భ్రమణంగావిస్తూ ఉంటాయ్...
కాని భూమి మీద నుండి నేను చంద్రుణ్ణి చేరుకోవాలంటే నా స్పెషలైస్డ్ స్పేస్ ట్రావెల్ వెహికిల్ ని భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎక్కడ స్లింగ్ షాట్ తీసుకొని సరాసరి చంద్రుడి వద్దకు చేరుకోవాలో అక్కడే స్లింగ్ షాట్ తీసుకోవాలి....
మార్స్ ని చేరుకోవాలంటే నా స్పెషలైస్డ్ స్పేస్ ట్రావెల్ వెహికిల్ ని భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎక్కడ స్లింగ్ షాట్ తీసుకొని సరాసరి మార్స్ వద్దకు చేరుకోవాలో అక్కడే స్లింగ్ షాట్ తీసుకోవాలి....
వీనస్ ని చేరుకోవాలంటే నా స్పెషలైస్డ్ స్పేస్ ట్రావెల్ వెహికిల్ ని భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎక్కడ స్లింగ్ షాట్ తీసుకొని సరాసరి వీనస్ వద్దకు చేరుకోవాలో అక్కడే స్లింగ్ షాట్ తీసుకోవాలి....
కద...
మరి ఇదే స్పేషియల్ సైన్స్ ని నేను ఆలయానికి, ఆలయంలోని దేవతామూర్తుల్లో కొలువైఉండే భగవద్శక్తికి ఆపాదిస్తే అది స్పిరిటువల్ సైన్స్ అని నమ్మకుండా ఉండడంలో అర్ధమేలేదు....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విశదీకరింపబడినట్టుగా...
ఒక ఆలయంలోని ఈశ్వరశక్తి / ఈశ్వరానుగ్రహం అనేది 8 భాగాలుగా విభాగింపబడి, ఆ ఎనిమిది చోట్ల నమస్కరించి / ప్రార్ధించినచో సంపూర్ణమైన భగవద్ అనుగ్రహం లభించును అనేది అధ్యాత్మ శాస్త్ర / స్పిరిటువల్ సైన్స్ యొక్క ఉవాచ...
కాబట్టి
1. ఆలయం పైన ఉండే శిఖరానికి నమస్కారం..
2. ఆలయ ధ్వజస్తంభానికి నమస్కారం
3. ఆలయ ముఖమండపానికి నమస్కారం
4. ఆలయ అర్థమండపానికి నమస్కారం
5. ఆలయ అంతరాలయానికి నమస్కారం
6. ఆలయంలోని ఈశ్వరవాహకశక్తికి / అనగా గరుత్మంతులవారు, నందీశ్వరుడు, ఆంజనేయుడు, ఇత్యాదిగా ప్రధానదైవానికి అభిముఖంగా ఉండే ఈశ్వరవాహకశక్తికి, నమస్కారం
7. ఆలయ పరిసరాల్లో ఉండే ఇతర పరివారదేవతాసన్నిధి / ఉపాలయాలకు నమస్కారం
8. ఆలయం వెలుపల ఆలయ అర్చకులకు నమస్కారం
అనేది వివిధ వైవిధ్యభరిత దైవిక అనుగ్రహాలను సమ్మిళితం గావిస్తూ పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం సిద్ధింపజేయును...
ఎంతో గొప్ప అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ప్లేన్ లో దూసుకెళ్ళడం ఎంత ముఖ్యమో, ఒక పారాషూట్ ధరింపబడి, అవసరైనప్పుడు వెంటనే ఆ విమానం నుండి ఎజెక్ట్ అయ్యి, పారాషూట్ సహాయంతో క్షేమంగా క్రిందికి చేరుకోవడం కూడా అంతే ముఖ్యం....
అదే విధంగా....
అత్యంతశక్తివంతమైన గర్భాలయ మూలమూర్తిని దర్శిస్తూ, ఎంతో గొప్ప అడ్వాన్స్డ్ శ్రీవైష్ణవ దైవిక స్థితిలోకి చేరుకోవడం ఎంత ముఖ్యమో, అంతకంటే ముందే గావింపబడిన గరుత్మంతులవారి దర్శనానుగ్రహంతో, అవసరైనప్పుడు వెంటనే ఆ సర్వోన్నత స్థాయి నుండి బహిర్ముఖులై, గరుత్మంతులవారి అనుగ్రహంతో క్రింది / సామాన్య స్థాయికి చేరుకోవడం కూడా అంతే ముఖ్యం....
ఒక కార్లో ముందు సీట్లో కూర్చొని మీ సీట్ పక్కన ఉండే డోర్ని లాక్ చేసి ప్రయాణించడం ఎంత ముఖ్యమో...
మిగతా ఇతర సీట్ల పక్కన ఉండే డోర్లను కూడా లాక్ చేసి ప్రయాణించడం కూడా అంతే ముఖ్యం...
అదే విధంగా....
ఒక ఆలయంలోని ప్రధాన దైవానికి ముందుగా నమస్కరించడం ఎంత ముఖ్యమో, ఆ తదుపరి
మిగతా ఇతర దైవాలకు / ఉపాలయాలకు నమస్కరించడం కూడా అంతే ముఖ్యం...
ఒక కార్ రివర్స్ తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ న్యూట్రల్ కి వచ్చి ఆ తదుపరి రివర్స్ గేర్ వేస్కొని వెళ్ళడం ఎంత ముఖ్యమో...
అదే విధంగా....
ఒక ఆలయంలో సాష్టాంగ నమస్కారంతో గొప్ప పుణ్యాన్ని గడించాలంటే ఫస్ట్ న్యూట్రల్ ఫీల్డ్ అనగా ధ్వజస్తంభం వెలుపలికి వచ్చి ఆ తదుపరి భూమిమీద
సాగిలపడి సాష్టాంగ నమస్కారాన్ని ఒనరించాలి...
ఇలా చెప్పుకుంటూ వెళ్తే, ఎన్నో ఎన్నెన్నో సామ్యాలు...అన్నీ కూడా ఒకానొక గొప్ప సైంటిఫిక్ సబ్జెక్ట్ కి సంబంధించిన అంశాలే...
వాటిలోని వైభవం అర్ధమైన వారు, అది ఒక గొప్ప శాస్త్రం గా అభివర్నించారు...
వాటిలోని వైభవం అర్ధంకాని వారు, అది ఒక చాదస్తం గా భావిస్తారు...
మన సనాతన ఆర్ష సంప్రదాయ వైభవానికి ఉనికిపట్లుగా అలరారే ఆలయాలు నిత్యకళ్యాణం పచ్చతోరణం గా గొప్పగా పరిఢవిల్లడంలోనే ఈ ప్రపంచం యొక్క శ్రేయస్సు, శాంతి, వైభవం ఇమిడి ఉన్నాయి....
ఒకప్పుడు ప్రపంచమంతా కూడా పరిఢవిల్లిన మన అఖండ భారతీయ సనాతన ధర్మం, ప్రపంచంలో ఎక్కడెక్కడ లుప్తమవుతూ ఉన్నదో, అక్కడక్కడ అశాంతి, అసహనం, మౌఢ్యం, హింస, లేమి, ఇత్యాది సకల జాఢ్యాలు పెచ్చరిల్లి ప్రజల జీవితాలను అల్లకల్లోలం గావించాయ్.....
ఎక్కడివరకో ఎందుకు,
మన దేశంలోనే ఉదాహరణలు తీసుకోండి.....
గోవులకు, భారతీయ సనాతన ధర్మానికి, సదాచార వైభవానికి నిలయంగా అలరారే ఆలయంతో అనుబంధం గల ప్రదేశాలు, ప్రజలు ఎంతో గొప్ప మేధస్సు, జ్ఞ్యానం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం తో పరిఢవిల్లడం...
మరియు
గోవులు, ఆలయాలు తగ్గుముఖం పడుతున్న ప్రదేశాల్లో ఉండే ప్రజల జీవితాల్లో భక్తిజ్ఞ్యానములు, సిరిసంపదల లేమితో పెరిగిపోతున్న ఉన్మాద ప్రవృత్తితో ఉండే జీవితాలు గల విచారకరపరిస్థితులు...
ఎల్లరికీ నిత్యం దృగ్గోచరమయ్యేవే కద...
ఎందుకంటే ఎంతో ప్రయత్నపూర్వకంగా సాధనతో సాధింపబడేది సత్వగుణవైభవం....
అది ప్రశాంతమైన మనసుకు, తద్వార స్థిరమైన బుద్ధికుశలతకు, తద్వరా శ్రేయోకారక జీవితవైభవానికి బాటలు పరుచును....
ఎట్టి అభ్యాసం కూడా లేకుండా వచ్చి చేరేవే రజో, తమో గుణములు....
అవి చంచలమైన మనసుకు, తద్వారా చపలచిత్తానికి, తద్వారా అస్తవ్యస్త జీవనగతికి కారణం అవుతాయ్...
అట్టి సర్వోన్నతమైన సత్వగుణ సంవృద్ధి అనేది, మీరు టాటా బిర్లా అదాని అంబానీలకు స్నేహితులైనా సరే,
కేవలం ఆలయాలతో, సదాచారవైభవంతో, సనాతనధర్మప్రాభవం తో అనుబంధంగల జీవితాలకు మాత్రమే సంప్రాప్తించే సౌభాగ్యం...
అనేది, అనాదిగా రూఢమైన సార్వకాలిక సత్యం...
ఆలయాల్లోని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే వారికి విశేషమైన సత్వగుణసంవృద్ధి ఈశ్వరానుగ్రహంగా సంప్రాప్తింపబడును.....
తద్వారా విశేషమైన భక్తి, మేధస్సు, జ్ఞ్యానం, బుద్ధికుశలత, వాగ్వైభవం, ఆరోగ్యం, సిరిసంపదలు, ఈశ్వరానుగ్రహంగా సమకూరును....
సకల దేవతాశక్తులను ప్రస్ఫుటంగా, ప్రత్యేకంగా, ప్రబలంగా, దైవిక ప్రాభవభరితంగా, కళత్ర సహితంగా, సవాహన సపరివార యుక్తంగా దివినుండి విచ్చేసి బ్రహ్మోత్సవ పర్యంతం, అనగా ఆఖరిరోజున ఉండే ధ్వజావరోహణ పర్యంతం ఆవహించి ఉండి, భక్తులకు విశేషానుగ్రహం వర్షించవలసినది గా విద్వణ్మూర్తులు ప్రార్ధించే వేదఘోషతో శోభిల్లే ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని తరించడం,
విశేషించి శ్రద్ధగా ఆచార్యులు గావించే శృతిగానాన్ని ఆలకించడం, ఎన్నో జన్మల పుణ్యబలం ఉంటేనే సంప్రాప్తించే సౌభాగ్యం...
ఎందుకంటే అది ఎన్నో ఉత్తరజన్మలకుసరిపడే విశేష పుణ్యాన్ని సద్యో ఆగామి జనిత పుణ్యఫలితంగా సంచితపరిచి జీవుణ్ణి అనుగ్రహించే ఈశ్వరానుగ్రహ విశేషం...!
సర్వం శ్రీశ్రీనివాసశ్రీచరణారవిందార్పణమస్తు...🙂💐
శ్రీవేంకటేశపరబ్రహ్మణే నమః..🙏.
********************************
శ్రీ గరుడ దండకం
నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే ।
శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥
గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడా గతిప్రీతరుద్రా సుకీర్తి స్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన ద్విజిహ్వాధిపాకల్ప విష్ఫార్యమాణ స్ఫటావాటికారత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాన్తికల్లోలినీరాజితం ॥ 2॥
జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్దివౌకస్పతిక్షిప్తదమ్భోళిధారాకిణాకల్ప కల్పాన్తవాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యచ్చ మత్కార దైత్యారి త్రధ్వజారోహనిర్ధారితోత్కర్షసఙ్కర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పఞ్చ కాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్సమస్తే నమస్తే పునస్తే నమః ॥ ౩॥
నమః ఇదమజహత్స పర్యాయ పర్యాయ నిర్యాత పక్షాని లాస్ఫాలనోద్వేలపాథోధివీచీచపేటాహతాగాధ పాతాళభాఙ్కారసఙ్క్రుద్ధనాగేన్ద్ర పీడాసృణీ భావభాస్వన్నఖశ్రేణయేచణ్డతుణ్డాయ నృత్యద్భుజఙ్గభ్రువే వజ్రిణే దంష్ట్రయ తుభ్యమధ్యాత్మవిద్యావిధేయా విధేయా భవద్దాస్యమాపాదయేథా దయేథాశ్చ మే ॥ 4॥
మనురనుగత పక్షివక్త్ర స్ఫురత్తారకస్తావకశ్చిత్రభానుప్రియా శేఖరస్త్రాయతాం నస్త్రివర్గాపవర్గ ప్రసూతిః పరవ్యోమధామన్వలద్వేషి దర్పజ్వలద్వాలఖిల్య ప్రతిజ్ఞావతీర్ణ స్థిరాం తత్త్వబుద్ధిం పరాంభక్తిధేనుం జగన్మూలకన్దే ముకున్దే మ్హానన్దదోగ్ధ్రీం దధీథాముధాకామహీనామహీనామహీనాన్తక
॥ 5॥
షట్త్రింశద్గణచరణో నరపరిపాటీనవీనగుమ్భగణః ।
విష్ణురథదణ్డ కోఽయం విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్ ॥ 6॥
విచిత్రసిద్ధిదః సోఽయం వేంకటేశవిపశ్చితా ।
గరుడధ్వజతోషాయ గీతో గరుడదణ్డకః ॥ 7॥
కవితార్కికసింహాయ కళ్యాణగుణశాలినే ।
శ్రీమతే వేంకటేశాయ వేదాన్తగురవే నమః ॥ 8 ॥
శ్రీమతే నిగమాన్తమహాదేశికాయ నమః ॥
ఇతి గరుడ దండకః సామాప్తః
********************************
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🫐.🍀
🙂💐🍧🍿🍨🍕🇮🇳🎉🫐🏵️🥧🍊🥧🍧
No comments:
Post a Comment