శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, దీపావళి అంటే దివ్వెల సమూహం / వరుస అని పదార్ధం...
ఆరావళి, వింధ్యావళి పర్వత సమూహం / వరుస....
ఇత్యాదిగా మనకు తెలిసినపదాలను ఉదాహరణగా తీసుకుంటే....
ఎర్రని అరుణారుణ తత్త్వంతో ప్రకాశించే భూభాగపర్వతాలు కాబట్టి ఆరావళి, శ్రీవింధ్యవాసిని మాత శ్రీచరణాలంకృత భూభాగపర్వతాలు కాబట్టి వింధ్యావళి.....
దివ్వెల వరుస...
అంటే లైన్ గా దీపాలను పెట్టడం...
అలా లైనా గా దీపాలు మనం మన ఇంట్లో సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చుకద...
మరి ఆశ్వయుజ అమావాస్య నాడే దీపాల వరుసను వెలిగించి దీపావళి పండగ అని ఉత్సవం నిర్వహింపబడడంలో గల ఆంతర్యమేమి...?
జలే గంగా తైలే లక్ష్మీ దీపావళి తిథౌవసేత్
అలక్ష్మీపరిహారార్ధం తైలాభ్యంగోవిధీయతే
అనే శ్లోకాన్ని అనుసరించి దీపావళి నాటి తైలాభ్యంగనస్నానంతో, మన జీవితాల్లో అలక్ష్మీ తొలగి శ్రీలక్ష్మి వరించడంలో ఆంతర్యమేమి...?
సనాతనధర్మప్రతిపాదిత ప్రతీ ఉత్సవంలో కూడా ఎంతో లోతైన గంభీరమైన లోకశ్రేయస్కర తత్త్వసమన్వయం ఉండును అనే విషయం విజ్ఞ్యులకు ఎరుకే...
శరన్నవరాత్ర / దుర్గాష్టమి నాడు
ఉపాసకులను సకలశక్తిస్వరూపిణి,
సకలచరాచరభువనపాలిని,
ఆబ్రహ్మకీటజనని,
అనాధినిధనా హరిబ్రహ్మేంద్రసేవిత, గా అనుగ్రహించే ఆదిపరాశక్తి.....,
ఆ తదుపరి 21 రోజులకు
ఆశ్వయుజ అమావాస్య / దీపావళి
పర్వసమయంలో సకల సంపదలను వర్షించే శ్రీలక్ష్మీదేవి గా
అనుగ్రహించే పరాశక్తి......,
ఆ తదుపరి రమారమి 120 రోజులకు
మాఘపంచమి / శ్రీపంచమి పర్వసమయంలో సకల విద్యలను వర్షించే శ్రీవాణి గా అనుగ్రహించే పరాశక్తి.......,
యొక్క అనుగ్రహపరంపరావైచిత్రికి మధ్యపర్వమైన సమయాన్నే దీపావళి అని పెద్దలు వచించారు........!
మీరు (విజ్ఞ్యులైన ఉపాసకులు, బ్రహ్మవేత్తలు, ఆర్షవిజ్ఞ్యానకోవిదులు) జాగ్రత్తగా గమనిస్తే,
పంచకర్మేంద్రియాలు,
పంచజ్ఞ్యానేంద్రియాలు,
పంచతన్మాత్రలు,
పంచకోశాలు,
మరియు వీటన్నిటిని తన అధీనంలోకి తీసుకొని మనిషిని
శాసించే అగోచర సర్వేంద్రియాధిష్టిత సకలేంద్రియసంచారిని అయిన మన మనసు...
వెరసి 21 తత్త్వాల్లో అలరారే ఉపాసకుల / సాధకుల స్వానుభవ దేవభూమికాతత్త్వం, సంచిత జనిత ప్రారబ్ధ సూచికానుగుణంగా శ్రీలక్ష్మీకటాక్షానికి పాత్రతను, అనుగ్రహాన్ని
సంతరించుకొని తత్ శ్రియానుగ్రహవైభవంతో తరించును...
ఈ లోకంలో
సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అనే 6 విధాలుగా లక్ష్మీతత్త్వం శ్రీలక్ష్మీనారాయణ ఉపాసకులకు ప్రసన్నమై పరిఢవిల్లితూ ఉండును అని అత్యంత మహిమోపేతమైన శ్రీసూక్త ఉవాచ....
పైనపేర్కొనబడిన 21 గహనమైన అధ్యాత్మ తత్త్వసమన్వయభరిత ఉపాసన, దీపావళి నుండి మొదలై ఒక్కో లక్ష్మీతత్త్వానికి మీరు ఆపాదిస్తే, రమారమి 120 రోజులకు శ్రీసూక్త ప్రోక్త షణ్విధ లక్ష్మీతత్త్వారాధన సంపూర్ణమైనట్టు ఒక అధ్యాత్మదీక్షాతత్త్వమంజరి...
అనగా సదరు సాధకుడు తనలోనే 3.5 చుట్టలుచుట్టుకొని కొలువైఉండే కుండలినీయోగశక్తి కేంద్రీకృతమై ఉండే
మూలాధారచక్రానికి అధిపతి అయిన శ్రీశక్తిగణపతితత్త్వాన్ని మేల్కొలిపి, శ్రీశక్తిగణపతి అనుగ్రహాన్ని దుర్గాష్టమి నాడు అందుకొని ఉపాసనను కొనసాగించే క్రమములో, 21 గహనమైన అధ్యాత్మతత్త్వ సంచయం యొక్క మొదటి ఆవృతం పూర్తయ్యేసరికి దీపావళి పర్వసమయం ఏతెంచి శ్రీలక్ష్మీ అనుగ్రహాన్ని అందుకొని,
6 పర్యాయాలు అనగా ఇంకో 6 ఆవృతాలు పూర్తైనతదుపరి మాఘపంచమి అనే అత్యంతశక్తివంతమైన తిథి, మాసం, సమ్మిళితసమయంలో "షట్చక్రోపరిసంస్థిత" గా యోగులచే నుతింపడే ఆ "సహస్రారాంభుజారూఢాసుధాసారాభివర్షిణ్యై నమః" అని ఆ పరదేవత పాదముల చెంత తన యోగశక్తిసుమాన్ని సమర్పించి సకలవైశ్వికదైవికవిజ్ఞ్యానతత్త్వసంచయానుగ్రహంతో వర్ధిల్లడం అనే అత్యంత మహిమోపేతమైన అధ్యాత్మతత్త్వసంపూర్ణత సిద్ధించును...
బాహ్యంలో దివ్వెల ఆవళి అనగా దీపముల వరుస యొక్క ఆరాధన సదరు ఉపాసకునకు,
A for Apple, B for Ball, అనే స్థాయిని సూచించును....
అట్టి బాహ్యారాధన, క్రమక్రమంగా ఆంతరదేవతారాధనగా పరిణతిచెందుతూ ఈశ్వరానుగ్రహంతో కాలాక్రమంలో
ఆంతరమున యోగచక్రావళి యొక్క ఆరాధనగా పరిఢవిల్లును.....
తన్మూలంగా,
A for Avalnche effect, B for Buoyancy
అనే స్థాయిలో సదరు ఉపాసకుడి చిత్తవైభవం పరిఢవిల్లుతూ ఉండును.....
ఇట్టి అత్యంత గహనమైన శక్తి ఆరాధనవైచిత్రి గురించి చెప్పడానికి ఒక చక్కని సినిమా స్టోరీలా అనిపించినా, హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం లాంటి అత్యంత కఠోరమైన సాధనానుగ్రహం ఇట్టి ఆంతర అధ్యాత్మపయనం...
రమారమి పుష్కరకాలపౌర్ణమి (అనగా 12 సంవత్సరాల పౌర్ణమి ఆరాధనా మంజరి) యొక్క ఆదిపరాశక్తి ఆరాధనాఫలితంగా ఒక సామాన్య భక్తుడు, అసామాన్యస్థాయిలో ప్రకాశించే చిత్తవైభవం, అనగా
"సహస్రారాంభుజారూఢా గా వర్ధిల్లే యోగి యొక్క చిత్తంపై ఆ ఆదిపరాశక్తి నిత్యం వర్షిస్తూ ఉండే యోగసుధాసారాన్ని దర్శిస్తూ యావద్ విశ్వదృశ్యమంజరిని దర్శించే ఆవళికి చేరుకున్న సాధనావైభవమే నిజమైన భక్తులకు, ఉపాసకులకు, సాధకులకు, యోగులకు ఘనమైన దీపావళి ఉత్సవ వైభవం.....
షడూర్ములకు లోబడి కేవలం నిద్రాహారభయామైథునాలతో బ్రతుకుతూ ఉండడానికి సర్వోన్నతమైన మనిషిజన్మే ఎందుకు....ఏ మృగత్వం లభించినా కూడా సరిపోతది కద....
భగవద్భక్తి అనే అత్యంత సుందరమైన వ్యాపకాన్ని అలవర్చుకొని, భగవద్ నామస్మరణ అనే ప్రారంభస్థాయి నుండి మొదలుకొని బాహ్యాంతర భగవద్దర్శనం అనే సర్వోన్నతస్థాయిలో ప్రకాశించే చిత్తవైభవంతో ధర్మబద్ధమైన జీవితాభ్యున్నతితో తరించగల ప్రజ్ఞ్యయే విజ్ఞ్యులెల్లరికీ నిజమైన దీపావళి ఉత్సవం....
శ్లోకం 10 - శివానందలహరి
నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ | సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ||
అర్థం:
నరత్వం: (మానవ జన్మ), దేవత్వం (దేవతగా ప్రభవించడం), నగ, వన, మృగత్వం (కొండలు, అడవి, జంతువులుగా పుట్టడం), మశకతా (దోమగా), పశుత్వం (పశువుగా), కీటత్వం (పురుగుగా), విహగత్వాది (పక్షి మొదలైనవిగా) - ఇలా ఏ జన్మలోనైనా జన్మించుగాక.
కానీ నా హృదయం ఎప్పుడూ నీ పాదాలపైన ధ్యానంలోనే మునిగి ఉంటే, ఆ పరమానందంలో విహరిస్తుంటే, ఏ శరీరం కలిగితేనేమి?
అని అన్నారు శ్రీఆదిశంకరాచార్యులంతటి వారే.....!
ఏ జన్మైతే ఏంటి భక్తిభరిత జన్మైతే చాలు అని అంటే...
ఏ జన్మైనా భక్తిలేనిదే సార్ధక్యం చెందదు అనే కదా అర్ధం...
భక్తి
జ్జ్యానం
ఆరోగ్యం
శాంతి
ఐశ్వర్యం
సౌఖ్యం
వర్చస్సు
ఇత్యాదిగా వెలిగే దీపానికి ఎన్నో తాత్పర్యాలు ఉన్నవి...
అందులో జ్ఞ్యానానికి ప్రతీకగా దీపాన్ని, దీపాల వరుసను, భావించి, దీపలక్ష్మిని ఆరాధిస్తే, జ్ఞ్యానానుగ్రహంవల్ల ఇతర అన్ని విభూతులు కూడా క్రమముగా అనుగ్రహింపబడును అని విజ్ఞ్యులైన పెద్దల ఉవాచ...
ఈ క్రింది రమణీయమైన సంకీర్తనలో శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు,
"కనుగొను చూపులే ఘన దీపములట"
అని వచించడంలోని ఆంతర్యం,
"మనలోనే కొలువై ఉన్న పరమాత్మను దర్శించి తరించడానికి భక్తిజ్ఞ్యానదివిటీల వెలుగుల్లో ఆ పరమాత్మ యొక్క దేదీప్య అగ్నిశిఖను కనుక్కొని తరించాలి అని విజ్ఞ్యుల భావన..
ప్రాజ్ఞ్యులెల్లరూ కనుక్కోవలసిన ఆ ఆంతర అగ్నిశిఖను, శ్రీనారాయణసూక్తం ఈ క్రింది విధంగా ఎంతో గొప్పగా స్తుతించడం విజ్ఞ్యులకు విదితమైన అంశమే....
****** ****** ****** ****** ****** ******
ప॒ద్మ॒కో॒శ-ప్ర॑తీకా॒శ॒గ్ం॒ హృ॒దయం॑ చాప్య॒ధోము॑ఖమ్ ।
అధో॑ ని॒ష్ట్యా వి॑తస్యాం॒తే॒ నా॒భ్యాము॑పరి॒ తిష్ఠ॑తి ।
జ్వా॒ల॒మా॒లాకు॑లం భా॒తీ॒ వి॒శ్వస్యా॑యత॒నం మ॑హత్ ।
సంత॑తగ్ం శి॒లాభి॑స్తు॒ లంబ॑త్యాకోశ॒సన్ని॑భమ్ ।
తస్యాంతే॑ సుషి॒రగ్ం సూ॒క్ష్మం తస్మిన్᳚ స॒ర్వం ప్రతి॑ష్ఠితమ్ ।
తస్య॒ మధ్యే॑ మ॒హాన॑గ్ని-ర్వి॒శ్వార్చి॑-ర్వి॒శ్వతో॑ముఖః ।
సోఽగ్ర॑భు॒గ్విభ॑జంతి॒ష్ఠ॒-న్నాహా॑రమజ॒రః క॒విః ।
తి॒ర్య॒గూ॒ర్ధ్వమ॑ధశ్శా॒యీ॒ ర॒శ్మయ॑స్తస్య॒ సంత॑తా ।
సం॒తా॒పయ॑తి స్వం దే॒హమాపా॑దతల॒మస్త॑కః ।
తస్య॒ మధ్యే॒ వహ్ని॑శిఖా అ॒ణీయో᳚ర్ధ్వా వ్య॒వస్థి॑తః ।
నీ॒లతో॑-యద॑మధ్య॒స్థా॒-ద్వి॒ధ్యుల్లే॑ఖేవ॒ భాస్వ॑రా ।
నీ॒వార॒శూక॑వత్త॒న్వీ॒ పీ॒తా భా᳚స్వత్య॒ణూప॑మా ।
తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
స బ్రహ్మ॒ స శివః॒ స హరిః॒ సేంద్రః॒ సోఽక్ష॑రః పర॒మః స్వ॒రాట్ ॥
****** ****** ****** ****** ****** ******
****** ****** ****** ****** ****** ******
నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి
పరమాత్మునికి నిత్య పూజలివిగో
తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట
కనుగొను చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికినినిత్య ౨
పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకునిత్య ౨
గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయునికి
https://annamacharya-lyrics.blogspot.com/2006/10/43nityapoojalivigo.html?m=1
****** ****** ****** ****** ****** ******
ఒక హెవి ఏర్ బస్ యొక్క టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ఎంతటి శక్తియుక్తి సమన్వయభరిత సంక్లిష్ట ప్రక్రియో...
షట్చక్రాన్వితధ్యానయోగసమాధి కూడా అట్టి శక్తియుక్తి సమన్వయభరిత సంక్లిష్ట ప్రక్రియ...
కాబట్టి "ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదిని" యొక్క స్థాయిలో ఆదిపరాశక్తిని యోగసమాధిలో దర్శించగల విజ్ఞ్యులకు మాత్రమే నా ఈ కావ్యోల్లేఖనా / కావ్యాలాపనాసుమాంజలి సంబంధించినది అని విజ్ఞ్యులుగుర్తించవలెను....
ఇతరులకు ఈ కవనం ఇతర సాధారణ అంశాల సమన్వయసుమాంజలి అని భావించవలెను...
భక్తి జ్జ్యాన సంపద అనే ఆజన్మాంతర అత్యంత విలువైన శ్రీలక్ష్మీవైభవం విజ్ఞ్యులెల్లరికీ అమరి, తన్మూలంగా ఇతర అన్ని శ్రియానుగ్రహాలు అనుగ్రహింపబడి,
శ్రీవిద్యాలక్ష్మీ యొక్క అనుగ్రహంతో ఈ దీపావళి పర్వసమయం విజ్ఞ్యులెల్లరి జీవితాలను దేదీప్యమానంగా పరిఢవిల్లజేయుగాక అని ఆకాంక్షిస్తూ....
శ్రేయోభిలాషులెల్లరికీ దీపావళి పండగ శుభాభినందనలు...😊💐🌟☀️✨🌈
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
సర్వం కొండగట్టు శ్రీలక్ష్మీవేంకటేశ్వర సహిత శ్రీవీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏
సర్వే సుజనాః సుఖినోభవంతు...💐
Note : All the pictures, colors, symbols, and any other representations in the pictures of my posts are randomly copied from the typical google searched images pertaining to the context being discussed and thus aren't to be misunderstood by anyone for any assumptions / hypothetical references to any otherwise.
Thanks for your broad-minded understanding and prudence.