Thursday, October 23, 2025

శ్రీ 2025 ఆశ్వయుజ బహుళ త్రయోదశి, శ్రీ ధన్వంతరి జయంతి / ధనత్రయోదశి పర్వసమయ శుభాభినందనలు...💐🙂


1.కల్పవృక్షము
2.కామధేనువు
3.ఉఛ్చైశ్రవము
4.ఐరావతము
5.చంద్రుడు
6.శ్రీలక్ష్మీదేవి
తో పాటుగా అమృతకలశంతో దేవవైద్యనారాయణస్వరూపమైన శ్రీధన్వంతరి భగవానుడు క్షీరసాగరమథనం నుండి ఉద్భవించిన పర్వసమయంగా ధనత్రయోదశి తిధి విజ్ఞ్యులచే ఆరాధింపబడుతోంది...

1.కల్పవృక్షము : స్వర్గ లోక వాసులకు
2.కామధేనువు : బ్రహ్మగారిచే మహర్షులకు / వశిష్ఠ మహర్షివారికి
3.ఉఛ్చైశ్రవము : దేవేంద్రునకు
4.ఐరావతము : దేవేంద్రునకు
5.చంద్రుడు : పరమేశ్వరునకు
6.శ్రీలక్ష్మీదేవి : శ్రీమన్నారాయణుడికి
7. శ్రీధన్వంతరి భగవానుడు తెచ్చిన అమృతం మోహిని ద్వారా సురలకు..
చెంది వారెల్లరూ అనుగ్రహింపబడిరి...
అని పురాణవచనం....

ఇట్టి దైవిక వస్తు/వాహనాది సామాగ్రి భూలోకవాసులైన మానవులకు అలభ్యమైననూ, దేవతానుగ్రహం ఎల్లప్పుడూ ప్రార్ధనలద్వారా లభ్యమయ్యేలా, మన సనాతన మహర్షులు వ్యవస్థీకరించి మనకు పండగలను / పర్వాలను / ఉత్సవాలను అందించడం మన సౌభాగ్యం..

సకల సిద్ధవైద్యవిద్యలకు ఆద్యమూర్తి అయిన శ్రీధన్వంతరి భగవానుడి అనుగ్రహ సముపార్జనకు ధనత్రయోదశి తిధి పేర్గాంచిన సందర్భంగా, శ్రీధన్వంతరినారాయణుడి అనుగ్రహంతో విజ్ఞ్యులెలరూ తరించెదరని ఆకాంక్షిస్తూ, 
విశేషమైన శ్రీలక్ష్మీనారాయణ ఆరాధనతో సకల శ్రేయస్కర సంపదలను గడించి వర్ధిల్లెదరని అభిలషిస్తూ, ఎల్లరికీ
శుభ ధనత్రయోదశి....💐🙂

No comments:

Post a Comment