Tuesday, October 7, 2025

గౌ || ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, రాజ్యప్రభువుల హోదాలో, సర్వభూపాలపాలుడైన శ్రీశ్రీనివాసప్రభువులకు,శ్రద్ధాభక్తితో పరివట్టాన్ని ధరించి ఆచరించిన అట్టి నూతనవస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని దర్శించి నమస్కరించడం కూడా భక్తుల్లెల్లరికీ పుణ్యదాయక విశేషం...!

ఎన్నో రోజులుగా భుజించిన ఆహారం సమకూర్చిన బలంతో మాత్రమే ఒక వ్యక్తి కొబ్బరి చెట్టును ఎక్కి కొబ్బరిబోండాలను స్వీకరించి స్వఛ్చమైన కొబ్బరినీళ్ళు, తియ్యని కొబ్బరిని ఆరగించి ఆ అనుగ్రహఫలంతో మరెంతో బలం సమకూర్చుకోవడం అనే ప్రక్రియ సంభవించును...

అట్లే, ఎన్నో జన్మల పుణ్యకార్యాలు ఒనరించిన పుణ్యబలంతో మాత్రమే సదరు మాన్యులు తిరుమల మహాద్వారప్రవేశంగావించి, కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీశ్రీనివాసపరదైవానికి బ్రహ్మోత్సవ సమయంలో నూతనవస్త్రద్వయసమర్పణ గావించే భాగ్యానుగ్రహం లభించి, ఆ అనుగ్రహఫలంతో మరెంతో పుణ్యబలం సమకూర్చుకోవడం అనే ప్రక్రియ సంభవించును...

గౌ || ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, 
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, రాజ్యప్రభువుల హోదాలో, సర్వభూపాలపాలుడైన శ్రీశ్రీనివాసప్రభువులకు,
శ్రద్ధాభక్తితో పరివట్టాన్ని ధరించి ఆచరించిన అట్టి నూతనవస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని దర్శించి నమస్కరించడం కూడా భక్తుల్లెల్లరికీ పుణ్యదాయక విశేషం...!

ప్రతి శుక్రవారం ఎందరో భక్తులు శ్రీవారికి మేల్సాత్తువస్త్రద్వయసమర్పణాకైంకర్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాకూడా..
మీనలగ్నంలో శ్రీ వైఖానస ఆగమశాస్త్రోక్తవిధివిధానాలతో ధ్వజస్తంభమంటప ప్రాకారంలోగావింపబడిన గరుడధ్వజ ఆరోహణతో విచ్చేసిన సకలదేవతలు వారివారి సూక్ష్మరూపతైజసిక దేహాలతో ఆలయప్రాకారంలో   ప్రబలవైశ్వికశక్తిసమూహాలుగా కొలువై ఉన్న శుభసమయంలో,
గావింపబడే కైంకర్యాలన్నిటికీ కూడా సంప్రాప్తించే భగవదనుగ్రహఫలం మెండైన జన్మాంతర పుణ్యబలవిశేషం..!

సాధారణ మానుషకార్యాల్లో ధనుర్మీనలగ్నములకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.....,
దేవకార్యాల్లో కొన్ని అధ్యాత్మ కారణాలరీత్యా, మీనలగ్నానికి గల ప్రాధాన్యత బహువిశేషమైనది...!
ఎందుకంటే, ఏ దేవతాతత్త్వమైనా ప్రస్ఫుటంగా భక్తులకు అనుగ్రహరూపంలో గ్రాహ్యమయ్యేది మీనతత్త్వం ద్వారానే...
వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సమ్హరించడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి వేదములను తిరిగి బ్రహ్మగారి స్వాధీనం గావించారు అనేది స్థూల బాహ్య అధ్యాత్మ ఇతిహస విశేషం....
అందలి సూక్ష్మ ఆంతర అధ్యాత్మ తత్త్వ విశేషం ఏమనగా, మనుష్యులకు వారి జన్మలక్ష్యం సాధింపబడే దిశగా ఆవశ్యకమైన సకలవిధమైన జ్ఞ్యానసముపార్జనకు అవరోధంగా ఉండే సహజమైన ప్రాకృతిక అజ్ఞ్యానగ్రంథిని లయింపజేసే భగవద్ తత్త్వానికే మీనతత్త్వం అని పేరు....

" ఓం జ్ఞానపంజరాయ నమః "
అని అష్టోత్తరశతనామావళి లో శ్రీవారికి ఒక విశేషమైన గౌణము కలదు....

మన సాధారణ పరిభాషలో చెప్పాలంటే,,
పంజరంలో రామచిలుక ఎప్పుడు ఉంటుంది...?
ఆ పంజరప్రవేశద్వారానికి తాళం వేస్తేనే రామచిలుక పంజరం లోపల ఉంటుంది....
లేకపోతే క్షణాల్లో తుర్రుమని పంజరం నుండి ఆకాశంలోకి ఎగిరిపోతుంది...
అవునాకాదా...?

మన దేహమే ఒక ప్రాకృతిక పాంచభౌతిక ఈశ్వరనిర్మిత పంజరం...
అట్టి పాంచభౌతిక పంజరంలో, పరమాత్మతత్త్వం స్థిరంగా ఉండాలంటే, 
ఎవ్విధంగా ఒక వీణియకు తంత్రులు బిగుతుగా ఉన్నప్పుడే స్వరరాగం అద్భుతంగా ధ్వనించునో....,
అవ్విధంగా...
సుజ్ఞ్యానసిరులు నిరంతరం ఈ మృణ్మయాన్ని చిన్మయంగావిస్తూ ఉండాలంటే, 
దేహంలో జ్ఞ్యానకవాటం ఎల్లప్పుడూ బిగింపబడి ఉండాలి....
అనగా అజ్ఞ్యానగ్రంథి లయించి ఉండాలి....
అందుకు ఆవశ్యకమైనదే భగవంతుడి మీనతత్త్వానుగ్రహం...
అట్టి గోధూళి సమయ మీనలగ్నానికి ఉండే విశేషమైన ఈశ్వరానుగ్రహసంపాతలక్షణం కారణంగా, దేవకార్యాలకు మీనలగ్నం బహువిశేషమైన సమయం...

"ఒరెయ్...సాయంత్రం సమయంలో నిద్రపోతున్నావేంట్రా దున్నపోతా...లె..." 
అనే పాతతరం పెద్దల మాట చాలామంది విజ్ఞ్యులకు ఎరుకే...
అనగా 
"ఈ గోధూళి సమయంలో విశేషంగా ఈశ్వరచైతన్యశక్తి విశ్వవ్యాప్తమై పరిఢవిల్లుతుంటే, ఏమి పట్టని దున్నపోతులా తమస్సుతో నిద్రపోవడం ఏంటిరా శుంఠా..." అని వాచ్యార్ధం...
(పసిపిల్లలు, వృద్ధులు, రోగులు మినహా)

శ్రీశైలంలో అయితే గోధూళి సమయంలో శ్రీభ్రమరాంబాసమేతశ్రీమల్లికార్జునస్వామివారు శ్వేతవృషభవాహనారూఢమై ప్రత్యక్షంగా విహరించడం గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడం కొందరు విజ్ఞ్యులకైనా గుర్తుండే ఉంటుంది...
"తిరు మలై" అంటే "శ్రీ శైలం" అని కూడా అర్ధం కదా....😊

"శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగుం శివః "

"వేంకటాద్రిసమంస్థానం
బ్రహ్మాండేనాస్తికించన
వేంకటేశసమోదేవో
నభూతోనభవిష్యతి"

"శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందరాం శ్రీనివాసంభజేదనిశం"

ఓం నమో వేంకటేశాయ.... 💐😊🙏

https://m.youtube.com/watch?v=wZOLxIQVYPc&fbclid=IwVERDUANSKUxleHRuA2FlbQIxMAABHso7jn2BE3Bfas8SDTZiHDxHnb3bsaUYU0D4N_T613gLLvCTswqelWiaC99F_aem_S3DEsQeNQLqzMVhKPIODQQ

No comments:

Post a Comment