పరిమళసంపంగి చెట్లను ఎప్పుడైనా మీరు గమనించి ఉండి ఉంటే, ఆకుపచ్చని చిన్న పువ్వుగా ప్రారంభమై కనిపించి కనిపించకుండా ఆకుల్లో ఆకులా ఒదిగిఉండి,
పసుపచ్చని అరవిరిసిన సంపంగిపుష్పంగా రూపాంతరం చెందే ఆ అరుదైన పుష్పసోయగం ఎంతో వైభవోపేతమైనది...
ఆ ఘుమఘుమలాడే పసుపచ్చని అరవిరిసిన
పరిమళసంపంగిపుష్పాలను అమ్మవారికి అలంకరించి శ్రీలలితసహస్రనామావళిని పారాయణం గావించే భక్తులకు అమ్మవారు ప్రసాదించే అనుగ్రహం ఎంతో మెండైనది
అని హయగ్రీవ, అగస్త్య మహర్షి వారి ఉవాచ ....
చాలా సంవత్సరాలు పాటు వీధిచివర్లో ఒకరి ఇంటిముందు ఉండే సంపంగి చెట్టుకు పూసిన పరిమళసంపంగిపుష్పాలను అడిగి తెంపుకొని ఆరాధించినవాడిగా వాటి మహిమ ఎంతటిదో తెలిసే ఇలా వచిస్తున్నా....
ఆ పరిమళసంపంగిపుష్పాలు ఎంత గొప్పవో అంతే సౌకుమార్యమైనవి కూడా..
అనగా తెంపడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి నేలకురాలి పూజకు అనర్హమౌతాయ్...
జీవితంలో కొన్ని సమయాలు కూడా ఇటువంటివే...
అజాగ్రత్తగా ఉంటే, కడిగిన ముత్యాలలా దేవుడి పూజకు ఈశ్వరసిమ్హాసనం చేరవలసిన పుష్పాలు...,
రేకుల అమరిక లుప్తమై నేలకు రాలగలవు...
కొన్నికొన్ని సార్లు చెట్టు కొమ్మలకు బుద్ధిలేకున్నా,
తోటమాలికైనా బుద్ధిఉండాలి....
ఫర్ ఎగ్సాంపుల్.....
ఇప్పుడున్న సందర్భంలో,
ఫలాన ఆహారం స్వీకరిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది....
ఫలాన వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఇబ్బంది....
ఫలాన పండ్లను ఆరగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది.
అని విజ్ఞ్యులు చెప్పినప్పుడు.....
తత్ విరుద్ధంగా "ఎవ్వరు" చెప్పినా కూడా, సున్నితంగా అట్టి పెడద్రోవపట్టించే సలహాలను తిరస్కరించవలెను అనునది లౌక్యం అనబడును...
లౌక్యాన్ని పాటించే వారికే ఈ లోకంలో గౌరవం, అభివృద్ధి, మరియాద, కీర్తి, ఇత్యాదివి సంప్రాప్తించేది....
గౌరవప్రదంగా పరిధిదాటకుండా చెప్పే మంచి మాటలు వినడంలోనే ఎల్లరి జీవితాలకు అభివృద్ధి కలిగేది...
No comments:
Post a Comment