Tuesday, October 7, 2025

శ్రీ విశ్వావసు 2025 సంవత్సర అనూరాధ ప్రయుక్త ఆశ్వయుజ శుద్ధ పంచమి, దేవి శరన్నవరాత్రోత్సవాంతర్గత షష్ఠమదివస నైమిత్తికారాధన సమయే ఆచరిత శ్రీచండీహవన విశేషవైభవం..

శ్రీ విశ్వావసు 2025 సంవత్సర అనూరాధ ప్రయుక్త ఆశ్వయుజ శుద్ధ పంచమి, దేవి శరన్నవరాత్రోత్సవాంతర్గత షష్ఠమదివస నైమిత్తికారాధన సమయే ఆచరిత శ్రీచండీహవన విశేషవైభవం..

కలౌ వేంకటనాయకః
కలౌ చండి 
కలౌ కపికుంజరః

అనే ఆర్షవాక్కులను విజ్ఞ్యులు ఎప్పుడో ఒకప్పుడు వినేఉంటారు కద...
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను శ్రద్ధాభక్తితో ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా, 
సాక్షాత్తు ఈ కలియుగప్రత్యక్షవరదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు తిరుమలకు తరలివచ్చిన సర్వదేవతాసమూహం యొక్క సమక్షంలో, శ్రీఆకాశరాజు గారి 
పుత్రిక అయిన శ్రీపద్మావతీదేవితో నారాయణవనంలో జరిగిన
వారి కళ్యాణమహోత్సవంలో ఆరాధించిన పరదైవం కంచి కామాక్షి పరదేవత....
కంచికామాక్షి పరదేవత యొక్క అసంఖ్యాకస్వరూపాలే ఈ యావద్ భూమండలంలో కొలువైన సకల దేవి ఆలయాలు / మందిరాలు....
అందుకే "కథ కంచికి...మనం ఇంటికి..." అనే ఒక పాతకాలం మాట వినేఉంటారు...
శ్రీవారి పరిణయోత్సవంలో పసుపుకొమ్ములు దంచబడిన పేద్ద రాతి రోలు ఇప్పటికీ నారాయణవనంలోని శ్రీవారి ఆలయంలో భక్తులు దర్శనీయమై ఉండడం మన సౌభాగ్యం...

మీరు ఎప్పుడైనా మన పెద్దలు రోలులో పసుపు కొమ్ములు మరియు ఇతర పదార్థాలు దంచడం దర్శించినా....లేక మీరే దంచినా..., 
ఒక విధమైన సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని గమనించడం లేదా అనుభవం చెంది ఉండడం గురించి పరికించి ఉంటారు....

నేను శ్రీచాగంటి సద్గురువుల పర్యవేక్షణలో నిర్వహించబడ్డ శ్రీవేంకటేశ్వరవైభవోత్సవాల్లో అట్టి పసుపు దంచే రోళ్ళను, వాటి వద్ద అట్టి ఒక విధమైన సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని దర్శించాను...

ఒక యజ్ఞ్యవేదిలో ప్రజ్వలించే స్వాహకార జనిత అగ్నిహోత్రం కూడా ఆ పరిసరాల్లో అట్టి ఒక విధమైన సూక్ష్మ సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని విస్తరింపజేసి తద్వారా తత్ ఆరాధిత దేవతానుగ్రహాన్ని ఆయా భక్తులకు అనుగ్రహింపజేయును అనే అధ్యాత్మ సైన్స్ హైయర్ స్ట్రాటా సైంటిస్ట్లకు విదితమైన అంశమే.....

ఒక ఆరాధిత అధ్యాత్మ వస్తువుకు సమకూరిన దేవతాశక్తి కూడా ఇట్టి ఒకానొక సూక్ష్మ సెంట్రి పెటల్ టు సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్ ఫీల్డ్ ని విస్తరింపజేసి తద్వారా తత్ అధ్యాత్మ వస్తువునుండి వినిర్ముక్తమయ్యే దేవతానుగ్రహాన్ని ఆయా భక్తులకు అనుగ్రహింపజేయును అనే అధ్యాత్మ సైన్స్ హైయర్ స్ట్రాటా సైంటిస్ట్లకు విదితమయ్యే అంశం...

కాత్యాయన మహర్షి యొక్క కూతురిగా అవతరించిన కాత్యాయనిదేవిని దుర్గాదేవిగా కీర్తించే....
"కాత్యాయనాయ విద్మహే
కన్యకుమారి ధీమహి
తన్నః దుర్గిః ప్రచోదయాత్..."
అనే గాయత్రి శక్తి తరంగవలయం గురించి వ్యఖ్యానించాలంటే...,
ఇట్టి సూక్ష్మరూప తైజసికదేవతాశక్తివలయానికి తగిన ప్రామాణిక ఈక్వేషన్స్ ఉండునా అని అడగాలని అనుకునేవారు.....
వాండర్వాల్స్ ఫోర్స్ ని ఏ సైంటిఫిక్ ఈక్వేషన్స్ తో సప్రామాణికంగా పరిగణించి సైన్స్ ఎన్నో చోట్ల అప్ప్లై చేస్తూ ఎన్నో థియరీస్ ని ప్రతిపాదిస్తున్నదో, అని కూడా అడగవలసి ఉంటుంది...

The Van der Waals (vdW) forces that are named after the Dutch physicist who first described them in the late 19th century to explain the properties of real gases, form the cardinal principle of the nano technology that has revolutionized the modern age scientific invention saga....

Quite similarly,

The "Adhyaatma yagya taranga Shakti" (Micro spiritual forces created by a peculiar combination of the centri petal and centri fugal forces exerted by the fire element present in the yagna ritual, forms the cardinal principle of the spritual science that has revolutionized the modern age spiritual discovery saga....

విశ్వసించే వారికి అది 
భగవంతుడి / భగవతి ఆలయం,
భగవంతుడి / భగవతి శక్తి,
భగవంతుడి / భగవతి ప్రసాదం,
భగవంతుడి / భగవతి శాస్త్రం,
భగవంతుడి / భగవతి అనుగ్రహం,

విశ్వసించని వారికి అది వారి సాధారణ స్థాయికి ఇంకా అందని సదరు తెలియని సైన్స్ కి సంబంధించిన అంశం...

ఎవ్వరు విశ్వసించినా, విశ్వసించకున్నా ఆకాశతత్త్వం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ పూర్తిగా అందనటువంటి అమరతత్త్వం....
అవ్విధంగానే 
ఎవ్వరు విశ్వసించినా, విశ్వసించకున్నా భగవద్ తత్త్వం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ పూర్తిగా అందనటువంటి అమరేశ్వరతత్త్వం.....

అట్టి గహనమైన ఆకాశతత్త్వం గురించి ఎంతో కొంత తెలుసుకొని తరించాలంటే రాకెట్ సైన్స్ అనే ఒకానొక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని అధ్యయనం గావించి, వీలైనంత పైకి నింగిలోకి రాకెట్స్ లో ప్రయాణించి, తెలుసుకొని తరించవలసి ఉంటుంది...
అవ్విధంగానే....
గహనమైన భగవద్ తత్త్వం గురించి ఎంతో కొంత తెలుసుకొని తరించాలంటే అధ్యాత్మశాస్త్రం అనే ఒకానొక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని అధ్యయనం గావించి, వీలైనంత శాస్త్రోక్త అలౌకిక భావవీచిక లో విహరించి, తెలుసుకొని తరించవలసి ఉంటుంది...

అట్టి గహనమైన అధ్యాత్మశాస్త్ర కోవిదులు, మాన్యులైన విద్వణ్మూర్తులు, గురువులు, ఆచార్యుల వాక్కుల్లో అధ్యాత్మశాస్త్రవిజ్ఞ్యానాన్ని అందుకొని స్వోద్ధరణతో ఎవరికివారు వారివారి జీవితాల్లో తరించవలసి ఉంటుంది....
ఎందుకంటే, ఇది ఆధునికత అనే ముసుగులో పూర్తిగా భౌతికవాదం అలుముకుంటున్న కలియుగసమయం...
కాబట్టి దేశకాలానుగుణంగా వర్తించే లౌక్యాన్ని, ఆచరిత విహితధర్మాన్ని, ఆచారవైభవాన్ని కలిగిఉండి ఎవరి పరిశ్రమకు తగ్గట్టుగా వారికి భగవంతుడు ప్రసాదించే అనుగ్రహంతో, వర్ధిల్లడం విజ్ఞ్యత అనబడును....

అధ్యాత్మశాస్త్ర కోవిదుల ఆర్షవాక్కుల్లో అనాదిగా దేవి శరన్నవరాత్రోత్సవ వైభవం అనన్యసామాన్యమైనది...
అది ఆచరించి అందుకునే తత్త్వమాహాత్మ్యం...

భూమిలో అడ్డంగా పాతిన చెరుకువిల్లు నుండి నిలువుగా ఉద్భవించే చెరుకునుండి లభించే చెరుకురసం కొద్దిసేపుమాత్రమే త్రాగడానికి యోగ్యమైన రీతిలో బావుంటుంది....
సమయం గడిచేకొద్ది అది స్వీకరించయోగ్యం కాని రీతిలోకి మారిపోతూ ఉంటుంది...
కాని అదే చెరుకురసం నుండి సాధింపబడిన నిలవదోషం లేని బెల్లం మాత్రం ఎప్పటికీ అమృతసమమైన రీతిలో వర్ధిల్లుతూఉంటుంది...
అందుకే బెల్లం నిత్యనైవేద్యార్హతను కలిగిఉండే ఎకైక భోజ్యపదార్ధం...

అవ్విధంగానే ఎంతో మధురంగా అనిపించే ఈ ప్రపంచం యొక్క నిజతత్త్వం ఎండమావిలో నీటిరుచి లాంటిది...
అది ఎప్పటికీ మనిషిని తరింపజేయజాలని కేవల మృణ్మయత్వం...
కాని ఇదే ప్రపంచంలో ఉంటూనే, ఈ ప్రపంచంకంటే ఎంతో ఉన్నతమైన దేవతాతత్త్వం గురించి సాధనగావించి తత్ ప్రజ్ఞ్యానసిరులను అందుకుంటే, అవి మధురాతిమధురమైన బెల్లం ఉండలలాగా ఎప్పటికీ ఆజన్మాంతర శాశ్వతమైన ఆనందహేతువులై మనిషిని తరింపజేసే సాధనములై ఒప్పారును...

అందుకే ఆ పరదేవత ఎన్నో అవతారాలు, అలంకారములు దాల్చినా / ధరించినా, అన్నిటికీ మకుటాయమానమైన రీతిలో విజయదశమినాడు ధరించే అత్యంతశక్తివంతమైన అవతారం
శ్రీరాజరాజేశ్వరిదేవి..!
అనగా రాజాధిరాజులపైన కూడా ఆధిపత్యం కలిగిఉండే పరదేవతాస్వరూపం అని అర్ధం...
ఆవిడ చేతిలో ధరించి ఉండే ఇక్షుఖండం / చెరుకువిల్లు బోధించే పై అధ్యాత్మసత్యాన్ని ఎవరు సాధనద్వారా గ్రహిస్తూఉంటారో, వారికి ఆవిడ ప్రసాదించే అనుగ్రహం కూడా అనన్యసామాన్యమైన రీతిలో వర్ధిల్లే భూమికలుగా అధ్యాత్మవిజ్ఞ్యులు వచింతురు....
అట్టి సర్వోన్నతమైన శ్రీరాజరాజేశ్వరిదేవికి మరో రూపమే శ్రీలలితాపరాభట్టారికా స్వరూపం...

కూకట్పల్లి గ్రామదేవతగా బహువిశేషమైన వైభవంతో వర్ధిల్లుతూ, నేడు శ్రీలలితాదేవి అలంకరణ / స్వరూపంలో అలరారిన శ్రీచిత్తారమ్మతల్లి అమ్మవారి ఆలయప్రాకారంలో, శ్రీచండిహవనంలో కైంకర్యపరులుగా పాల్గొని అమ్మలగన్నయమ్మ అనుగ్రహంతో తరించిన సందర్భంగా, పరాంబిక శ్రీచరణాలచెంత చిరు కావ్యోల్లేఖనాకైంకర్యసుమాంజలిని సమర్పిస్తూ
శ్రీమాత్రేనమః...🙏😊💐

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

ఓం గోవిందరూపిణ్యై నమః...🙏
ఓం సచామరరమావాణిసవ్యదక్షిణసేవితాయై నమః...🙏
ఓం శ్రీలలితాత్రిపురసుందరీదేవ్యైనమః...🙏

సర్వం శ్రీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు...🙏

No comments:

Post a Comment