Thursday, April 2, 2026

శ్రీపరాభవ 2026 చైత్ర శుద్ధ పౌర్ణమి ప్రయుక్త హనుమద్ విజయోత్సవ యాత్ర పర్వ సమయ శుభాభినందనలు.....😊💐


బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమద్ స్మరణాద్ భవేత్త్

అని అనాదిగా ఆర్షవిజ్ఞ్యాన కోవిదుల సద్వచనం....

విశేషమైన బుద్ధి : 
ఆంజనేయుడు అపర రుద్రాంశ సంభూతుడిగా ప్రభవించి, ఆరగించే మధురఫలమేమో అని అనుకొని సూర్యబింబాన్ని అందుకోవడానికి దివికి ఎగిరిన సందర్భంలో దేవేంద్రుడి వజ్రాయుధ ప్రహారానికి భంగపడి హనుమంతుడిగా పేర్గాంచిన సంఘటనలో, వాయుదేవుని ఆకాంక్ష మేరకు సకల దేవతలు వారివారి శక్తులను హనుమంతుడికి అనుగ్రహించగా.....
దేవగురువులు శ్రీ బృహస్పతి వారు...
"నా అనుగ్రహంగా ఎనలేని బుద్ధివైభవంతో అలరారెదవు గాక..." అని అనుగ్రహించారు...
కావున హనుమంతుల వారి భక్తులకు సర్వదా విశేషమైన బుద్దిబలం సమకూరి ఉండును....

విశేషమైన శారీరక / మానసిక బలం :
ఆంజనేయుడు అపర రుద్రాంశ సంభూతుడు మరియు వాయు దేవుడి ఔరస పుత్రుడు....
కావున హనుమంతుల వారి భక్తులకు చక్కని మనోబలం / దేహదారుఢ్యం అనుగ్రహింపబడును.....

విశేషమైన యశస్సు / ధైర్యం :
ఆంజనేయుడు నిరంతర శ్రీరామసేవాదురంధరుడు మరియు కపిరాజైన సుగ్రీవుని ముఖ్య సచివుడు.
కావున హనుమంతుల వారి భక్తులకు చక్కని కీర్తిలక్ష్మి మరియు ధైర్యలక్ష్మి అనుగ్రహింపబడును.....

నిర్భయత్వం / ఆరోగ్యం :
ఆంజనేయుడు నిరంతర హ్రీంబీజోపాసకవరిష్ఠుల్లో
(చతుర్దశ భువనాలను తన క్రీగంటి చూపులతో శాసించే 
శ్రీభువనేశ్వరిదేవీ ఉపాసన బీజాక్షరం) ముఖ్యుడు మరియు హనుమంతుడి వాలంలో అశ్వినీదేవతలు కూడా వసించి ఉందురు.....
మరియు శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణశ్రీమద్రామాయణం ప్రవచనాలు ఆలకించిన వారికి గుర్తున్నట్టుగా... ,
సూర్యపరమాత్మను వారి గురువుగారిగా స్వీకరించి ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం, తో సూర్యగమనానికి అభిముఖంగా ప్రయాణిస్తూ సకలశాస్త్రవిద్యాపారంగతుడిగా కోవిదత్వాన్ని అందుకున్న అసామాన్య విజ్ఞ్యుడు హనుమంతుడు....
కావున నిర్భయత్వం / ఆరోగ్యం హనునద్ భక్తులకు కరతల ఆమలకమై వర్ధిల్లును....

అజాఢ్యం / వాక్పటుత్వం :
అధ్యాత్మశాస్త్రానుగుణంగా....
"శ్రీ కారం" శాక్తేయప్రణవం,
"ర కారం" అగ్నిశక్తి ప్రకటిత బీజాక్షరం,
"మ కారం" విష్ణుశక్తి ప్రకటిత బీజాక్షరం,
వీటి సమ్మిళిత "శ్రీరామ" అనే తారకమంత్రస్మరణతో వర్ధిల్లే ఆంజనేయుడి భక్తులకు ఎనలేని చైతన్యశక్తి మరియు వాగ్దేవతానుగ్రహం అనుగ్రహింపబడును.

అపరంజి వర్ణంలో నిగనిగలాడే క్యారెట్లు,
పరిశుద్ధమైన దేశవాళి ఆవు నెయ్యి,
పరిశుద్ధమైన బెల్లం / కండచక్కెర,
అమృతమయమైన దేశవాళి ఆవుపాలు,
జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, 
తేనె,
ఇవన్నీ సమకూరిన వారికి జీవితంలో ఎంతటి అమోఘమైన క్యారెట్ హల్వా అనుగ్రహం లభించునో....

అట్లే...

బుద్ధి, బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగ్యం
అజాఢ్యం, వాక్పటుత్వం, అనే ఈశ్వరానుగ్రాహాలు లభించిన వారి జీవితం కూడా అమోఘమైన క్యారెట్ హల్వా లాంటి మధురమైన అనుగ్రహంగా వర్ధిల్లును....

శౌచం / పుణ్యం / తపస్సు అనే మూడింటిపై సర్వ దేవతా ఉపాధి ఆధారితమై ఉండే అంశం...

అందుకే దేవతలను దర్శించినవారు, దర్శించేవారు, దర్శింపగోరేవారు, ఈ మూడు సుగుణములకు అత్యంత ప్రాధాన్యత / గౌరవం ఇచ్చెదరు....

హనుమంతుడు కూడా సర్వ దేవతలను దర్శించిన ధన్యుడు, దర్శించే ధన్యుడు, మరియు ఇప్పటికీ,
సర్వదేవతానుగ్రహాన్ని ఒనరించే షోడశసద్గుణాన్వితతేజోమూర్తి, జలధరదేహుడు, ఆజానుబాహుడు, విశాలవక్షుడు, కమలలోచనుడు, పూర్వభాషి, మితభాషి, స్మితభాషి, హితభాషి, సూర్యవంశచక్రవర్తుల యశోచంద్రికల తపఃఫలంగా మూర్తీభవించిన ధర్మం యొక్క సగుణ సారస సాకార స్వరూపమైన తన అలనాటి త్రేతాయుగ శ్రీరాముడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని అనునిత్యం ఆశగా శ్రీరామ దర్శనాన్ని అపేక్షించే ధన్యుడు...

అందుకే...

" భావింపగల తపః ఫల పుణ్యుడు
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు "

అని ఆంజనేయుని కొనియాడినారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్రింది సంకీర్తనలో....
https://annamacharya-lyrics.blogspot.com/2007/02/137periginadu-cudaro.html?m=1

శ్రీఆంజనేయ ఉపాసనతో విజ్ఞ్యులెల్లరూ తరించెదరని ఆకాంక్షిస్తూ ఎల్లరికీ 2026 హనుమద్ విజయోత్సవయాత్ర పర్వసమయ శుభాభినందనలు.....💐😊

సర్వే సుజనాః సుఖినోభవంతు.....,💐

శ్రీపరాభవ చాంద్రమాన సంవత్సర 2026 చైత్ర శుద్ధ నవమి / శ్రీరామనవమి పర్వసమయ శుభాభినందనలు.....😊💐


***************************************************
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం

యావత్ స్థాస్యన్తి గిరయస్సరితశ్చ మహీతలే .
తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి 
৷৷1.2.36৷৷
(బాలకాండ: 2వ సర్గ : 36వ శ్లోకం)

https://www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=1&language=te&field_sarga_value=2

భర్జనంభవబీజానాం ఆర్జనం సుఖసంపదాం
తర్జనంయమదూతానాం రామరామేతి గర్జనం

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామంశ్రీరామం భూయోభూయోనమామ్యహం

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
***************************************************

ఇత్యాదిగా శ్రీరామవైభవాన్ని, శ్రీరామనామ మహత్తును లోకంలోని విజ్ఞ్యులెల్లరూ నిత్యం స్మరించడం ఎల్లరికీ విదితమే....

సాటిలేని మేటైన ఆదికావ్యం,
మధురాతిమధురమైన ఇతిహాసం,
వేదోపబృహ్మణం,
సీతాయాశ్చరితమ్మహత్,
ఇత్యాదిగా శ్రీమద్రామాయణమంత్రమహార్ణవానికి అనాదిగా పలుపేర్లు కలవు....

అట్టి మహాశ్చర్యకరమైన అతిశయభరిత అమరవందిత కావ్యమైన శ్రీమద్రామాయణాన్ని కేవలం ఒక నరుడి కథగా విన్నా కూడా ఎంతో ఘనమైన అనుగ్రహాన్ని ప్రసాదించే పరమానందదాయక పౌరాణిక విశేష ఆర్షసారస్వత వైభవం శ్రీమద్రామాయణం అని శ్రీచాగంటి సద్గురువులు ప్రవచించడం విజ్ఞ్యులకు విదితమే.....

అనగా, ఎల్లప్పుడూ కొబ్బరిబోండా నీళ్ళే తాగడం అందరికీ అన్నివేళలా కుదరకపోవచ్చు...
కాని మంచినీళ్ళు తాగడం అనేది ఎవ్వరికైనా ఎప్పుడైనా కుదిరే పనే / కుదరవలసిన పని...

ఎందుకంటే శరీరానికి హితకరమైన, ఆవశ్యకమైన, నిత్యచైతన్యశక్తిని, ప్రసాదించే
ఔషధం జలం...
అందుకే జలమే పరమాత్మ అని,
"తత్ జలాన్ / తజ్జలాన్" అనే గంభీరమైన శృతివాక్యాన్ని ఎంతో గొప్పగా శ్రీచాగంటి సద్గురువులు వివరించడం విజ్ఞ్యులకు ఎరుకే.....

అట్లే, కొబ్బరిబోండానీళ్ళ వంటి అగ్రశ్రేణి పుణ్యదాయక మధురకావ్యేతిహాసపురాణ గాథలను ఆలకించి తరించడం అందరికీ అన్నివేళలా కుదరకపోవచ్చు...
కాని మంచితీర్థం వంటి శ్రీమద్రామాయణ గాథలను
ఆలకించడం ఎవ్వరికైనా ఎప్పుడైనా కుదిరే పనే / కుదరవలసిన పని...

ఎందుకంటే 
"శృణోతి హరతు పాపాని..." అని ఆర్షవాక్కు...
అనగా....
శ్రీమద్భాగవతం లో ఉండే అగ్రశ్రేణి పురాణగాథలను వినేంతటి సౌభగ్యం, పుణ్యం, జీవునకు సమకూరాలంటే,
ముందుగా శ్రీమద్రామాయణ ఆదికావ్యాన్ని భక్తిశ్రద్ధలతో ఆలకించి పునీతులమైతే, అప్పుడు
పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణపరమాత్మ యొక్క అనుగ్రహంగా శ్రీమద్భాగవత గాథలను ఆలకించేందుకు కావలసి పాత్రత, పుణ్యం, అనుగ్రహం సమకూరి జీవితాలు తరించేది....

ఆలయంలో భగవద్ కళ్యాణానంతరం భోజనప్రసాదవితరణ గావింపబడేటప్పుడు...,
లైన్లో నిల్చొని విస్తరి పట్టుకొని వడ్డింపబడే భోజన పదార్ధాలన్నీ వడ్డింపబడి ఆరగింపబడిన తదుపరి ఆఖరున పెరుగు, మజ్జిగా వడ్డింపబడడం, ఆరగించడం అనాదిగా వర్ధిల్లుతున్న సత్సంప్రదయాం...

ఎందుకంటే పెరుగు తో భోజనం సంపూర్ణమవ్వును...
పెరుగు అనగా పెరుగుట అని కూడా అర్ధం...
అనగా ఆరగించేవారి / ఆరగించిన వారి తృప్తి పెరిగి...
"ఆహా....ఇక చాలు...ఈశ్వరానుగ్రహంగా ఇవ్వాళ్టి భోజనం పెరుగన్నంతో సంపూర్ణమయ్యింది...." అనే పరిపూర్ణతా భావనను కలిగించే మధురమైన మాధవపదార్ధం దధి....

అట్లే....ఎన్నో పురాణగాథలను,
ముఖ్యంగా శ్రీమద్రామాయణాన్ని
ఆలకించిన తదుపరి పెరుగు వంటి మధురమైన, పుష్టికరమైన, శ్రీమద్భాగవత శ్రవణాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు...

ఎందుకంటే....
పెరుగులా..
శ్రీమద్భాగవతశ్రవణం గావించిన వారికి అగ్రశ్రేణి
పుణ్యవృద్ధి అనుగ్రహింపబడి,
"ఆహా....ఇక ఈ మానవ జన్మ 
చాలు...ఈశ్వరానుగ్రహంగా ఈ జన్మ శ్రీమద్భాగవతకథాశ్రవణంతో సంపూర్ణమయ్యింది...."
అనే పరిపూర్ణతా భావనను కలిగించే మధురమైన మాధవసారస్వతం శ్రీమద్భాగవతం...

శ్రీమద్రామాయణం కూడా శ్రీమద్భాగవతంలో అంతర్భాగమే అని శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భావత ప్రవచనాలు భక్తి శ్రద్ధలతో ఆలకించినవారికి విదితమే....

శ్రీమద్రామాయణం ఎందుకు ఎంతో సింపుల్ గా కనిపించే ఎంతో కాంప్లెక్స్ & కంప్లీట్ ఆదికావ్యమంటే....

ఒకానొక సందర్భంలో పులస్త్యబ్రహ్మ మనవడు బ్రహ్మగారికోసం కఠోరమైన తపస్సును ఆచరించి...
"నాకు దేవ, దానవ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాద్య, విద్యాధరాది జాతులతో నిధనం లేని వరాన్ని అనుగ్రహించు బ్రహ్మదేవా...."
అని రావణుడు కోరగా....
కించిత్ అచ్చెరువొందిన బ్రహ్మగారు...
" మరి నీ లిస్ట్లో నరవానరుల ప్రస్తావన లేదేమి మునిమనవడా...." 
అని అడగగా..." 
"అల్పులైన నరవానరముల గురించి నేను పెద్దగా పట్టించుకోను.....
ఇక వారి గురించిన ప్రస్తావన ఏల ప్రపితామహ..." 
అని రావణుడు సమాధానం ఇవ్వగా....
ఎంతగానో అచ్చెరువొందిన బ్రహ్మగారు....
తన సూపర్ కంప్యూటర్తో సమాలోచన గావించి అంబరీషోపాఖ్యానంలో భాగంగా శ్రీమహావిష్ణువు నరుడిగా జన్మించెదనని పలికెను కాన ఈ పౌలస్త్యునకు ఆ నరరూపంలో భువిపై నడయాడే నారాయణుడే సమాధానం ఇచ్చును కద...అని తలచి.....
"అస్తు...." అని పలికి అదృశ్యమయ్యెను...

"మనుష్యుడిగా, కౌసల్యాదశరథుల పెద్ద కొడుకుగా జన్మించి 'రామ' అని ఇనవంశ కులగురువులైన వశిష్ఠ మహర్షి వారిచే నామకరణంచెంది, నభసి స్థిత దేవతలు కూడా ఆశ్చర్యం చెందేంతటి ధనుర్వేదవిద్యాపారంగతుడిగా పేర్గాంచి మూర్తీభవించిన ధర్మానికి ప్రతిరూపంగా పరిఢవిల్లిన ఒక అసామాన్య మాన్యుడి కథ శ్రీరామకథ..."
అని అనడం సామాన్య స్థాయిలోని శ్రీరామయణ వైభవం...

"అట్టి మాన్యుడైన శ్రీరాముడు మనుష్యుడిగా భువిపై నడయాడుతూనే, మాధవుడిగా ఎట్లు పరిఢవిల్లెనో తెలియజేసే అత్యంత ఆశ్చర్యకరమైన, శ్రీవాల్మీకి మహర్షి గారిచే రచింపబడిన,ఇతిహాస ఆదికావ్యం, వేదోపబృహ్మణం, సర్వశాస్త్రసమన్వయసారం,సకలవేదసారమంత్రమహార్ణవ మధుకావ్యం శ్రీమద్రామాయణం..... " 
అని నిర్వచించి తరించడం ఉన్నతమైన స్థాయిలోని శ్రీరామయణ వైభవం.....

అటువంటి శ్రీరాముడి అయనానికి, తత్ సంబంధిత విశేషాలకు నిలయంగా భాసిల్లుతూ, ఈ కలియుగంలో ఆనాడు భద్రమహర్షికి ఇచ్చిన వరం కారణంగా శ్రీభద్రగిరిపై వెలసిన సీతాసమేతశ్రీరామచంద్రుడు, శ్రీవైకుంఠరామనారాయణుడిగా కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉండడం మనందరి భాగ్యవిశేషం..

భగవంతుడు అవతరించిన పర్వసమయంలో లోకకళ్యాణార్ధమై భగవద్ కళ్యాణాన్ని నిర్వహించడం పరిపాటి కాన....,
ఊరూరా వాడవాడలా ఈ లోకంలో ప్రతి యేటా చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి గా పేర్గాంచి శ్రీసీతారాముల కళ్యాణ మంజరికి ఆలవాలమైన పర్వసమయంగా పరిఢవిల్లే చిరంతన విశేషం...

" భక్త జన పరిపాల భరిత శర జాల
భుక్తి ముక్తిద లీల భూ-దేవ పాల " 
అని శ్రీ త్యాగరాయస్వామి వారు శ్రీరాముడి వైభవాన్ని తన్మయత్వంతో కీర్తించగా....

***************************************************
ప. సీతా కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే

చ1. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర (సీతా)

చ2. భక్త జన పరిపాల భరిత శర జాల
భుక్తి ముక్తిద లీల భూ-దేవ పాల (సీతా)

చ3. పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ (సీతా)

చ4. సర్వ లోకాధార సమరైక వీర
గర్వ మానవ దూర కనకాగ ధీర (సీతా)

చ5. నిగమాగమ విహార నిరుపమ శరీర
నగ ధరాఘ విదార నత లోకాధార (సీతా)

చ6. పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణి కుల సంజాత త్యాగరాజ నుత (సీతా)

https://thyagaraja-vaibhavam.blogspot.com/2008/04/thyagaraja-kriti-sita-kalyana.html?m=1

***************************************************

ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో | సౌజన్య నిలయాయ జానకీశాయ ||
చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ | కుశిక సంభవ యజ़్జ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో | విశద భార్గవరామ విజయ కరుణాయ ||
చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ | ఖరదూషణాయ రిపు ఖండనాయ |
తరణి సంభవ సైన్య రక్షకాయనమో | నిరుపమ మహా వారినిధి బంధనాయ ||
చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ | అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో | వితత వావిలిపాటి వీర రామాయ ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/05/201rajiva-netraya-ragavaya-namo.html?m=1

***************************************************

" సౌజన్య నిలయాయ జానకీశాయ " 
అని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు శ్రీరాముడి సౌజన్యాన్ని అంతే గొప్పగా తన్మయత్వంతో కీర్తించారు...

"భూ దేవ పాల..."
అనగా భూమిని పరిపాలించే ఆనాటి రాజులు / ఈనాటి మంత్రులు అని కూడా అర్ధం...

"సౌజన్య నిలయాయ..." అనగా 
చక్కని లోక ప్రజా క్షేమకారక కళ్యాణ గుణగణాలతో వర్ధిల్లే శ్రీరాముడు అని అర్ధం....

విష్ణ్వాంశతోనే విజ్ఞ్యులు పరిపాలకులుగా పరిఢవిల్లెదరు అని శాస్త్రోక్తి...

అనగా 
గౌ || ప్రధానమంత్రి గారైనా, 
గౌ || ముఖ్యమంత్రి గారైనా, 
గౌ || క్యాబినెట్ మంత్రి గారైనా,
గౌ || శాసనసభాసభ్యులు గారైనా, 
మరే ఇతర పరిపాలక పదవుల్లో వర్ధిల్లే మాన్యులైనా,
వారందరినీ కూడా శ్రీరాముడికి ప్రతిరూపంగా అధ్యాత్మ శాస్త్రం భావించును.....

షోడశకళాప్రపూర్ణుడైన శ్రీరామచంద్రుడి విశేషమైన విష్ణ్వానుగ్రహంతో పరిపాలకులెల్లరూ 
దేశక్షేమకారకమైన,
ప్రజాహితకరమైన,
ప్రజారంజకమైన,
సుపరిపాలనను అందించే దక్షతను అందుకొని తరించెదరని,
తన్మూలంగా ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యైశ్వర్యములతో, జీవించెదరని ఆకాంక్షిస్తూ,
ఎల్లరికీ శ్రీరామనవమి పర్వసమయ పురస్కృత శ్రీసీతారామకళ్యాణమహోత్సవ శుభాభినందనలు...💐😊

సర్వం శ్రీవరభద్రగిరిమూర్ధ్ని స్థిత శ్రీసీతాదేవి సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు....🙏💐😊

శ్రీకరమైన భగవద్ కళ్యాణకైంకర్య వైభవం.....😊💐


కళ్యాణాద్భుతగాత్రాయ
కామితార్థప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ
శ్రీనివాసాయమంగళం

ఎంతో ఆనందకరమైన ఆంతర మనఃశాంతిని, ప్రశాంతమైన నిద్రను కూడా అనుగ్రహించే నీలాంబరి రాగంలో ఆలపించబడిన ఈ క్రింది అన్నమాచార్య సంకీర్తనను మీరెప్పుడైనా వినిఉండి ఉంటే,

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు స్వామివారిని 
"భరిత కళ్యాణగుణ ప్రహ్లాద వరదా..." అని ఎంతో గొప్పగా స్తుతించడం మనం గమనించవచ్చు......

పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా | 
భరిత కళ్యాణగుణ ప్రహ్లాద వరదా ||

https://annamacharya-lyrics.blogspot.com/2010/07/712anamda-nilaya-prahlada-varada.html?m=1

సనాతనధర్మ అధ్యాత్మ చరిత్రలో, పురాణేతిహాసాల్లో, ఎందరో మేటి భక్తులు, కవికోవిదులు, భక్తభాగవతోత్తములు కలరు....

వారందరిలోకూడా భక్తప్రహ్లాదులవారిది ఎంతో ఆశ్చర్యకరమైన అమరవందిత అగ్రస్థానం....
ఎంతగా అంటే నవవిధ భక్తిమార్గాల్లో ఆత్మనివేదనాభక్తికి ప్రతీకగా బలిచక్రవర్తి ఇప్పటికీ గౌరవింపబడడం అధ్యాత్మలోకానికి ఎరుకే....
(భక్తప్రహ్లాదుల కొడుకు విరోచనుడు, భక్తప్రహ్లాదుల మనవడు బలిచక్రవర్తి)

శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మనివేదనం!!

1.భగవత్కథాశ్రవణము : పరీక్షిత్ మహారాజు గారు 
(వారి అసలు పేరు విష్ణురాతుడు)

2. ఈశ్వరమహిమాసంకీర్తనం : భక్తప్రహ్లాదులవారు

3. భగవన్నామస్మరణ : శ్రీనారదమహర్షివారు

4. విష్ణుపాదసేవ : శ్రీమహాలక్ష్మీదేవి

5. పూజ : పృథుమహరాజు / అంబరీషమహారాజు

6. నమస్కరించుట : అక్రూరుడు

7. సేవచేయుట : శ్రీఆంజనేయుడు

8. స్నేహము : అర్జునుడు

9. ఆత్మనివేదనము : బలిచక్రవర్తి

భక్తప్రహ్లాదుల వారు ఎందుకు అంత గొప్ప భక్తులుగా నవవిధభక్తుల్లో విష్ణుసంకీర్తన భక్తికి ప్రతీకగా వినుతింపబడుతున్నారో,
అట్టి భక్తప్రహ్లాద భక్తితరంగాల్లో తనను తాను 
"స్తంభోద్భవ ఉగ్రనారసిమ్హమూర్తి" గా ఆవిష్కరింపజేసుకున్న ఆ నరసిమ్హుడి శక్తి ఎంత గొప్పదో అధ్యాత్మ లోకానికి విదితమైన అంశమే...

అటువంటి శ్రీవేంకటనారసిమ్హ స్వామి వారి కళ్యాణగుణగాన భావలహరుల్లో విహరిస్తూ ఈశ్వరానుగ్రహంతో భగవద్ నామస్మరణవైభవాన్ని కొంత వివేచన గావించి తరిద్దాం......

1. శ్రీఅనంతాళ్వార్ (స్వామి వారికి ఆసనంగా, శయ్యగా, పాదపీఠంగా, వింజామర గా, శ్రీవైకుంఠసేవాగ్రగణ్యుల్లో ముఖ్యులైన శ్రీఆదిశేషుల వారు)

2. శ్రీగరుడాళ్వార్ (స్వామి వారి వాహనమైన శ్రీగరుత్మంతులవారు)

3. శ్రీచక్రత్తాళ్వార్ (స్వామి వారిచే ధరింపబడి ఉండే సాటిలేని సుదర్శనచక్రం)

4. పాంచజన్యం (స్వామి వారిచే ధరింపబడి ఉండే సాటిలేని శంఖం) 

5. కౌమోదకి (స్వామి వారు ధరించే సాటిలేని గద) 

6. శార్ఙ్గము (స్వామి వారు ధరించే సాటిలేని ధనస్సు)

7. నందకం (స్వామి వారు ధరించే సాటిలేని ఖడ్గం)

8. శ్రీమహాలక్ష్మీదేవి (స్వామివారికి నిత్యం పాదసంవాహనం గావిస్తూ పరిఢవిల్లే స్వామివారి నిత్యాన్నపాయిని)

9. శ్రీవైకుంఠజీవవాహినిగా వర్ధిల్లే విరజాతీర్ధోద్భవ దైవిక పద్మం (కమలం పువ్వు)

10, 11.  జయుడు, విజయుడు గా వర్ధిల్లే, శ్రీవికుంఠమహర్షి గారిచే నిర్మితమైన, శ్రీవైకుంఠపురి యొక్క ద్వారపాలకులు.

12. ప్రతినిత్యం నారాయణస్మరణ గావిస్తూ శ్రీవైకుంఠపురికి తరచుగా విచ్చేస్తూ స్వామివారితో సకలలోకాల్లో వర్ధిల్లే స్వామివారి భక్తుల గురించి మరియు స్వామివారికి ఇష్టమైన లోకకళ్యాణక్రతువుల గురించి చర్చించే త్రిలోకసంచారులైన శ్రీనారదమహర్షి వారు...

క్షీరసాగరంలో ఈ ద్వాదశ / 12 తత్త్వములతో నిత్యకళ్యాణం పచ్చతోరణం గా వర్ధిల్లే శ్రీవైకుంఠపురం నుండి వీరందరూ కూడా వివిధరూపాల్లో ఎవ్విధంగా ...
శ్రీభద్రగిరికిపై వెలసిన శ్రీవైకుంఠరామనారాయణుడి సేవకు తరలివచ్చారో శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఈ క్రింది దాశరథీశతకపద్యాన్ని ఎంతో వైభవోపేతంగా వివరించడం విజ్ఞ్యులకు ఎరుకే....

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము 
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.

అది శ్రీభద్రాచలం అయితే శ్రీరామనారాయణుణ్ణి సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఒకలా వస్తారు....

అది శ్రీవేంకటాచలం అయితే శ్రీశ్రీనివాసుణ్ణి సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఇంకోలా వస్తారు....

అది శ్రీసిమ్హాచలం అయితే శ్రీవరాహనృసిమ్హస్వామివారిని సేవించడానికి శ్రీవైకుంఠపురీపరివారం ఇంకోలా వస్తారు....

భక్తులకు తెలిసినా, ఇంకా తెలియకున్నా,

ఎక్కడెక్కడ స్వామివారు లోకకళ్యాణార్ధమై, భక్తులకు ఒసగిన వరాలకై, ఎట్లెట్లు అవతారం స్వీకరించి ఏతెంచెదరో....,
ఎట్లెట్లు మూర్తీభవించి కొలువైఉందురో....,
ఎట్లెట్లు ప్రతిష్టింపబడి నెలకొనిఉందురో....,

అట్లట్లు అక్కడికి యావద్ శ్రీవైకుంఠపురీపరివారం కూడా శ్రీమహావిష్ణువుచే నిర్దేశింపబడిన వారివారి రూపాల్లో ఏతెంచెదరు....

కొన్ని క్షేత్రాల్లో ప్రత్యక్షంగా, మరి కొన్ని క్షేత్రాల్లో ప్రచ్ఛన్నంగా, కొన్ని క్షేత్రాల్లో ప్రస్ఫుటంగా, మరి కొన్ని క్షేత్రాల్లో లీలగా, ఇలా వారివారి నిర్దేశిత శ్రీవైష్ణవసేవాకైంకర్యనిమిత్తమై స్వామివారి అనుజ్ఞ్య మేరకు ఒక్కో పుణ్యక్షేత్రంలో ఒక్కోలా శ్రీవైకుంఠపురీపరివారం వారివారి సూక్ష్మ స్థూల యోగ స్థాయిలో కొలువైఉండి తత్ క్షేత్రంలో వెలసి కొలువై ఉన్న శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ఉంటారు అని ప్రాచీన విజ్ఞ్యుల, శ్రీవైష్ణవభాగవతోత్తముల ఉవాచ....

మీరు గమనించి ఉండి ఉంటే,
మన సి.ఎం గారో, పి.ఎం గారో, ఎదేని ఒక సభాప్రాంగణానికి విచ్చేస్తున్నారంటే...
అక్కడికి వారి క్యాబినెట్ మంత్రులు, వివిధ ఐ.ఎ.ఎస్ / ఐ.పి.ఎస్ ఆఫీసర్స్, వ్యక్తిగతరక్షకసిబ్బంది, ప్రభుత్వ రక్షణశాఖాసిబ్బంది, ప్రఛ్చన్నంగా అక్కడక్కడా ఉండేలా 
వ్యవస్థీకృత ప్రభుత్వ స్పై నెట్వర్క్ / గూఢచారవ్యవస్థ, ఇత్యాదిగా సి.ఎం.ఒ / పి.ఎం.ఒ పరివారం మొత్తం తరలిరావడం గురించి చదివి / విని ఉంటారు కద.....

అట్లే సర్వలోకపరిపాలకుడు / సర్వభూపాలపాలకుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడెక్కడ అవతరించి, ప్రతిష్టింపబడి, 
(స్వయంవ్యక్త, దేవతాప్రతిష్ట, ఋషిప్రతిష్ట, మానుషప్రతిష్ట అను నాలుగు రకాలుగా ప్రతిష్టితమైన భగవణ్మూర్తులు ఈ లోకంలో అనాదిగా ఆరాధింపబడుతూ ఉన్నాయ్...) ఉండునో అక్కడికి 
జన్మజన్మలుగా స్వామివారి శ్రీపాదసేవాకైంకర్యాల్లో తరిస్తూ జీవించిన శ్రీవైష్ణవభూసురోత్తములు మరియు ఇతర భక్తభాగవతోత్తములు తరలివచ్చి స్వామివారి వైభవం నిత్యం ఇనుమడింపబడేలా సేవిస్తూ ఉండెదరు.....

ఒక న్యాయవాది / న్యాయమూర్తి గారికి ఉండే ప్రధాన విభూతి దీర్ఘమైన, లోతైన పరిశీలనాత్మక వివేచన....

ఒక పోలీస్ ఆఫీసర్ గారికి ఉండే ప్రధాన విభూతి అన్ని పరిస్థితుల్లోను పురప్రజారక్షక నైపుణ్యం....

ఒక డాక్టర్ గారికి ఉండే ప్రధాన విభూతి రుగ్మత యందు మరియు తత్ నివారక ఔషధముయందు లోతైన అవగాహన మరియు నైపుణ్యం....

ఒక సత్బ్రాహ్మణాచార్యులవారికి ఉండే ప్రధాన విభూతి కంచు కంఠం మరియు విహితకర్తవ్యాచరణగా అనుసంధించవలసిన భగవదారాధనామంత్రభాగము యందు ఎనలేని పట్టు మరియు విశ్వాసం/గౌరవం....

అప్పుడే 
ఆ న్యాయవాది గారికి / న్యాయమూర్తి గారికి ధర్మదేవత / న్యాయదేవతానుగ్రహంగా....,

ఆ పోలీస్ ఆఫీసర్ గారికి దేవసేనాధ్యక్షుల అనుగ్రహంగా...,

ఆ డాక్టర్ గారికి ధన్వంతరిదేవతానుగ్రహంగా...,

ఆ సత్బ్రాహ్మణాచార్యులవారికి తన్మూలంగా తత్ ఆరాధిత ఆలయ దేవతామూర్తికి శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహంగా...,

వారివారిచే నిర్వహింపబడే విహితకర్తవ్యాచరణ సిద్ధిని గడించి వారిచే ఈ లోకానికి ఎనలేని హితం గావింపబడి ఎల్లరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యైశ్వర్యాలతో, వర్ధిల్లెదరు...

మన వివేకానందనగర్ కాలనిలో 35 సంవత్సరాల క్రితం చైత్ర శుద్ధ సప్తమి నాడు శ్రీవైష్ణవాచార్యశిఖామణులచే శ్రీపాంచరాత్రాగమోక్త ఆరాధనాకైంకర్యాల ఉత్సవంతో ప్రతిష్టింపబడి మూర్తీభవించిన శ్రీమదలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి శ్రీవైష్ణవవైభవం భక్తులకు లభించిన భూలోకస్థితదేవపారిజాతతరురాజం.... 
శ్రీమాన్ కోసూరి రామకృష్ణమాచార్యుల వారు మరియు
శ్రీమాన్ కోసూరి రాఘవాచార్యుల వారి స్వరవైభవంతో సంతసిస్తున్న స్వామివారి త్రిపుష్కరసంవత్సర
భక్తవాత్సల్యవైభవం గురించి ఆలయానికి విచ్చేసే భక్తిలెల్లరికీ విదితమే.....

ఈ క్రింది శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలో స్వామివారి వైభవాన్ని తరచి విజ్ఞ్యులెల్లరూ తరించెదరని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ ఇవ్వాళ్టి పరిణయోత్సవంలో పరిపరి విధముల భక్తుల హృదయాల్లో శోభిల్లిన శ్రీభూ సమేత శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామి వారి అత్యంత విశేషమైన అనుగ్రహంతో భక్తులెల్లరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లెదరు గాక.....

************************************

ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు ||

పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/09/301itanikamte-maridaivamu.html?m=1

శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసమ్
శ్రితచేతనమందారం శ్రీనివాసమహంభజే 

ఓం నమో వేంకటేశాయ 🙏💐😊

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

********************************

శ్రీపరాభవ చైత్రశుద్ధ పంచమి ప్రయుక్త ఇందువాసర 25-మార్చ్-2026 నుండి అంగరంగవైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మాండనాయకుడి పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవవైభవానికి అంకురార్పణ మరియు సాలంకృత గరుడధ్వజారోహణోఉత్సవం అనేది కమ్మని షడ్రసోపేతమైన విందుభోజనానికి ముందుగా భోక్త ఎదుట చక్కని శుభ్రపరచిన కదళీపత్రం / అరటి ఆకును పరచి అందులో శనగపప్పు బెల్లం మిశ్రమంతో తయ్యారైయ్యే పూర్ణం అనే మధురపదార్ధంతో విందుభోజనం వడ్డించడం ప్రారంభించడం వంటి అంశం....😊💐

శ్రీపరాభవ చైత్రశుద్ధ పంచమి ప్రయుక్త ఇందువాసర 25-మార్చ్-2026 నుండి అంగరంగవైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మాండనాయకుడి పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవవైభవానికి అంకురార్పణ మరియు సాలంకృత గరుడధ్వజారోహణోఉత్సవం అనేది కమ్మని షడ్రసోపేతమైన విందుభోజనానికి ముందుగా భోక్త ఎదుట చక్కని శుభ్రపరచిన కదళీపత్రం / అరటి ఆకును పరచి అందులో శనగపప్పు బెల్లం మిశ్రమంతో తయ్యారైయ్యే పూర్ణం అనే మధురపదార్ధంతో విందుభోజనం వడ్డించడం ప్రారంభించడం వంటి అంశం....😊💐

ఎందుకంటే కళ్ళకు ఎంతో స్వాంతనను కలిగించి, మనస్సుకు ఎంతో ప్రశాంతతను అందించి, ఆరగించబోయే భోజనానికి అమృతత్వాన్ని ఆపాదించే దైవిక వస్తువు అరటి ఆకు...
[ వడ్డింపపడే భోజనపదార్ధాల్లో ఏదేని హానికారక తత్త్వం / ఉష్ణతత్త్వం / అజీర్ణతత్త్వం ఉన్నచో వాటిని హరించి, ఆ భోజన పదార్ధాలకు అమృతత్వాన్ని ఆపాదించే విశేషమైన దైవిక తత్త్వం గల సద్వస్తువు అరటి ఆకు....అని మాడర్న్ సైన్స్ పరిశోధనలు కూడా లోకానికి తెలియజేసెను... ]

పంక్తిభోజనాల్లో రంభాపత్రాన్ని పరచి భోజనపదార్ధాలను వడ్డించడం మొదలుపెట్టిన రీతిగ...,
బ్రహ్మోత్సవాలకు ప్రారంభ ఉత్సవంగా, సాలంకృత గరుడధ్వజం / అనగా గరుత్మంతుల చిత్తరువుతో
ఉండే ధ్వజాన్ని, ధ్వజస్తంభప్రాంతంలో ఆలయ ఆగమోక్తకైంకర్యాల్లో భాగంగా విశేషంగా ఆరాధించి, ఆరోహణ గావించి / అనగా ఫ్లాగ్ హాయిస్టింగ్ లా ధ్వజస్తంభోపరిప్రాంతానికి చేర్చి, తన్మూలంగ
సకల దిగ్దేవతలను, ఇతర దివిజ సమూహాన్ని సవాహన, సపరివారంగా, ఈ బ్రహ్మోతావాలకు ఆహ్వానించడం
అనే ప్రక్రియ.....

ఒక అరటి ఆకుకు ఉండే వైశేషిక లక్షణమే ఒక సాలంకృత సారాధిత గరుడధ్వజానికి కూడా ఉండే అధ్యాత్మవిశేషం....
అనగా, నిర్వహింపబడే ఆహ్నిక ఉత్సవాల్లో
(ఆయా ఆలయ / ఆగమ / ఉత్సవ సంప్రదాయానుగుణంగా,
ఏకాహ్నికం, త్రయాహ్నికం, పాంచాహ్నికం, నవాహ్నికం, గా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయ్...)
తెలిసి తెలియని సదాచారలేమిజనిత దోషాలను, పొరపాట్లను, హరించి ఆ బ్రహ్మోత్సవాలకు అమృతత్త్వాన్ని, పూర్ణత్వాన్ని సమకూర్చి ఆ ఆలయం యొక్క దైవత్వాన్ని, మరియు ఆ ఆలయ స్థిత దేవతామూర్తుల సూక్ష్మరూపద్యుతిశక్తిని
(ఇంగ్లీష్ లో మైక్రోస్కోపిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అని వచింపబడే ఒకానొక కాస్మిక్ / స్పిరిట్యువల్ ఫాక్టర్) విశేషంగా వృద్ధిపరిచే వైభవోపేతమైన సకలదివిజాగమన ఉత్సవం...!

అన్నిరకాల అజ్ఞ్యానాన్ని సమూలంగా దహించివేసే శాస్త్రమే శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం అని విజ్ఞ్యుల నిర్వచనం....
అనగా ఎన్నో రకాల విజ్ఞ్యానసిరులను వికసింపజేసే 
శాస్త్రమే శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం...
అట్టి శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రజ్ఞ్యుల వచనానుసారంగా,
ఈ గరుడధ్వజారోహణ (చివరి రోజున ఉండే గరుడధ్వజావరోహణ కూడా) ఉత్సవం ఎంతశక్తివంతమైన ఉత్సవమంటే,
ఈ ప్రక్రియలో శ్రీగరుడాళ్వారునకు నివేదింపబడే మధురప్రసాదాన్ని, ఆలయానికి విచ్చేసి, శ్రీసంతానలక్ష్మీ అనుగ్రహాన్ని అపేక్షించే మహిళామణులకు గరుడప్రసాదంగా బ్రహ్మగారి స్థానంలో గరుడధ్వజారాధనా కైంకర్యాన్ని నిర్వహించే సత్బ్రాహ్మణోత్తములు అందివ్వగా,
ఆ ప్రసాదాన్ని మౌనంగా భక్తిశ్రద్ధలతో స్వీకరించే 
గొడ్డ్రాండ్రకు కూడా గరుత్మంతుల అనుగ్రహంతో చక్కని బిడ్డలు జన్మింతురు అని అధ్యాత్మ శాస్త్రవచనం...

అందుకే కద శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఆ గరుడాచలపతిని 
 
"వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు
గొడ్డ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే" 

అని కీర్తించారు వారి సంకీర్తనలో .....

https://annamacharya-lyrics.blogspot.com/2006/11/81vedukomdama.html?m=1

విశ్వసించే వారికి సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ....
[ ఎందుకంటే,
ఎల్లరికీ చక్కని ఆరోగ్యాన్ని (ఆరోగ్యం భాస్కరాధీఛ్చేత్)...,
బ్రహ్మవేత్తలకు విశేషమైన ఆత్మశక్తిని...,
విజ్ఞ్యులకు / ఉపాసకులకు వారివారి వర్ణాశ్రమధర్మానుగుణంగా ఔపాసనిక గాయత్రిశక్తిని...,
వైజ్ఞ్యానికులకు సోలార్ పవర్ ని....,
వ్యాపారులకు, గృహిణులకు వడియాలు, ఒరుగులు, అప్పడాలు, ఇత్యాది ఎన్నో వైటమిన్-D తో సుసంపన్నమైన నిలవ ఉండే ఆహారపదార్ధాలను ఫ్రీ గా అనుగ్రహిస్తూ ఉన్నందుకు.....
]

ఇతరులకు రోజు అలా తూర్పున ఉదయించి పడరమరన అస్తమించే కేవల సూర్యబింబం కావొచ్చు....
 
అట్లే శాస్త్రంకూడా.....

"శాసనాత్ శంసనాత్ ఇతి శాస్త్రం..."
అనే శ్రీచాగంటి సద్గురువుల సద్వచనం కొందరికైనా గుర్తుండే ఉంటుంది......
అనగా "భక్తిశ్రద్ధలతో ఆచరించే సదరు అధ్యాత్మ ప్రక్రియ సదరు ఫలితాన్ని ఒసగును..." 
అని శాస్త్రం ఎంతో గంభీరంగా వచించును.....
అట్లు వచించి శుభాన్ని సమకూర్చే సాధనమే శాస్త్రం అని విజ్ఞ్యుల ఉవాచ....

సూర్యపరమాత్మానుగ్రహాన్ని నమ్ముకున్న వారికి ఆరోగ్యం 
కరతల ఆమలక ఫలంగా అందివచ్చే రీతిలో...
అధ్యాత్మశాస్త్రప్రోక్త భగవదారాధనా కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో విశ్వసించే వారికి శ్రేయస్సు అరచేతిలో చింతామణిగా అందివచ్చే అంశం..

ఎరుక, భక్తి, విశ్వాసం, ప్రపత్తి, భాగవతత్త్వానికి సామ్యమేమనగా.....

ఇతర ఎన్నో సాధారణ మొక్కల మధ్యన ఉండే సదరు మొక్క,
ఉసిరి మొక్క అని తెలుసుకొని,
భక్తితో తులసి కోటలో / ఇంట్లో ఆరాధిస్తూ,
ఎన్నో శ్రేయస్సులను అనుగ్రహించే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉసిరి చెట్టును విశేషంగా ఆరాధిస్తూ,
ఎవరైతే....
శ్రీచాగంటి సద్గురువులు ఆస్తికలోకానికి కార్తీకమాస ఆరాధనామంజరిలో భాగంగా అనుగ్రహించిన ఈ శ్లోకంతో.....

"ధాత్రీదేవినమస్తుభ్యం సర్వపాపక్షయంకరి
పుత్రాందేహిమహాప్రాజ్ఞే యశోదేహిబలంచమే...
మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం విష్ణుభక్తించశాశ్వతీం
నిర్రోగంకురుమాంనిత్యం నిష్పాపంకురుసర్వదా..."

ఆమలక / ఉశిరి / ఉసిరిచెట్టును ఆరాధిస్తూ ఉంటారో....
వారి పట్ల శ్రీలక్షీనారాయణులు సదా ప్రీతిచెందిన వారై ఉండి అభీష్టసిద్ధిని అనుగ్రహిస్తూ ఉండెదరు....

మీరు ఎప్పుడైనా నిండుగా కాసిన ఉశిరికాయలతో తులతూగే ఉసిరిచెట్టుని ఆలకించి అక్కడ కాసేపు ధ్యానించి చూడండి...
అష్టవిధప్రకృతిని పరిపాలించే శ్రీలక్ష్మీనారాయణతత్వం మనోనేత్రానికి గోచరమై ఔరా అనిపించును.....

అచ్చం ఉశిరిచెట్టు / ఉసిరికాయల్లో ఉండే సూక్ష్మరూప దైవికశక్తి శ్రీగరుత్మంతుల ఆరాధనవల్ల ప్రభవించును...
ఎందుకంటే అధ్యాత్మపరంగా శ్రీమహావిష్ణువు యొక్క వాహనం గరుత్మంతులవారు...
అనగా శ్రీవైష్ణవవైభవాన్ని వహించి వ్యాప్తిగావించే అధ్యాత్మసాధనం శ్రీగరుత్మంతులవారు....

వాహనం ఉన్న చోటికి యజమాని వచ్చునా...?
లేక 
యజమాని ఉన్న చోటికి వాహనం వచ్చునా...?

అనగా....
"రె...అశ్విన్....నేను ఫలాన చోట ఫలాన పనిమీద వచ్చాన్ రా...
అరగంటలో ఇక్కడికే వచ్చి నన్ను పిక్ అప్ చేస్కొ....."
అని యజమాని తన నమ్మకస్తుడైన డ్రైవర్ కి కాల్ చేసి చెప్పినా ...
లేక...
"అన్నా...నేను బండిని ఫలాన చోట పార్క్ చేసిన....
అక్కడికే వచ్చై...పిక్ అప్ చేస్కుంటా......"
అని నమ్మకస్తుడైన డ్రైవర్ తన యజమానికి కాల్ చేసి చెప్పినా ...

అనగా....
వాహనం ఉన్న చోటికి యజమాని వచ్చినా...
లేక 
యజమాని ఉన్న చోటికి వాహనం వచ్చినా...
అది యజమానికి / వాహనానికి (సారధికి) ఉండే పరస్పర మైత్రీసంబంధమైన అంశం...
బండిలోకి యజమాని వచ్చిచేరి, సారధి, యజమాని ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకే వాహనంలో ప్రయాణం గావించే చందంగా....

వైనతేయుడు ఉన్నచోటికి విష్ణువు వచ్చినా....
విష్ణువు ఉండేచోటికి వైనతేయుడు వచ్చినా....

శ్రీవైకుంఠ నిత్యసూరులెల్లరూ వైనతేయారూఢమై విహరించే శ్రీమహావిష్ణువు వద్దకు సూక్ష్మరూపాల్లో ఏతెంచి సదా స్వామివారిని సేవిస్తూ ఉందురు అని భాగవతవచనం....
అధ్యాత్మపరంగా...
వైనతేయవిష్ణువులది పువ్వుతావి కలిసి ఉండే పరిమళపారిజాతతత్త్వం...

అందుకే.....
విశేషమైన శ్రీవైష్ణవప్రభశక్తిని భువికి / భూలోక ఆలయాలకు అనుగ్రహించే బ్రహ్మోత్సవాల్లో ఎల్లప్పుడూ శ్రీగరుత్మంతులవారి ఆరాధనకు అగ్రతాంబూల గౌరవం అమరిఉండును.....

అట్టి శ్రీవైష్ణవదేదీప్యప్రభామయూఖములను దిగ్దిగంతములపర్యంతం పరివ్యాప్తి గావిస్తూ పరిఢవిల్లే శ్రీగరుత్మంతులవారి విశేషారాధనోత్సవమైన  శ్రీగరుడధ్వజారోహణోత్సవానికి విశేషంగా తరలిరండి....! దర్శించండి....!! తరించండి....!!!

సర్వం శ్రీగరుడాచలపతి శ్రీచరణారవిందార్పణమస్తు....
ఓం నమో వేంకటేశాయ....🙏😊💐


శుభ 2026 యుగాది / శుభ 2026 ఉగాది.....💐💐


ఆనాడు చతుర్ముఖబ్రహ్మగారు రచించినరీతిలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను తమ పవిత్రత యొక్క శక్తితో పునీతం గావిస్తూ, తత్ క్షేత్రస్థిత దేవతల అనుగ్రహాన్ని అందుకుంటూ ఎన్నో కొండలు, కోనలు, లోయలు, అరణ్యాల మీదుగా గంభీరంగా ప్రవహిస్తూ, వాటి యందు వర్ధిల్లే జీవకోటికి జలానుగ్రహాన్ని అందిస్తూ సాగే గంగ, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఇత్యాది జీవనదుల ప్రవాహంలా సాగే చిరంతనకాలప్రవాహంలో ఎంతో విశేషమైన ప్రాభవాన్ని సంతరించుకున్న శుభతిథి చైత్రశుద్ధపాడ్యమి....

ఇప్పుడు మనం ఉన్న ఈ శ్వేతవరాహకల్పం యొక్క  కల్పారంభసమయంలో ఈ కల్పం యొక్క చతుర్ముఖబ్రహ్మగారు సృష్టిరచనను ప్రారంభించిన ఈనాటి చైత్రశుద్ధపాడ్యమి శుభతిథి,
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ / శ్రీభూ సమేత శ్రీశ్రీనివాసుడి అనుగ్రహంతో ఈ నూతన సంవత్సరం విజ్ఞ్యులెల్లరికీ గొప్ప ప్రాభవభరిత పర్వసమయమై వర్ధిల్లుగాక అని అకాంక్షిస్తూ...

ఎల్లరికీ నూతన తెలుగు సంవత్సరాది పర్వసమయ శుభాభినందనలు....
శుభ 2026 యుగాది / శుభ 2026 ఉగాది.....💐💐

"విష్ణో పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ 'మధ్వ ఉత్స' ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయస్తధేతి తవ పానీతలౌ ప్రతిష్టౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (10)


Shree Vishwaawasu 2026 Phaalguna Bahula Dwaadashi commemorates the 523rd Aaradhana Utsawams of the saint poet, composer and singer Shree Taallapaaka Annamaachaarya....


Let us all pay our 2 cents of tributes to the mighty spiritual stalwart that has transformed the modern age Bhakti movement into a holistic ShreeVenkataHarisankeertanaa yagnyam by composing as many as 32000 sankeertanams extolling the magnanimity of lord Shree Venkateswara swamy vaaru and his pristine blessings showered on all those devotees who sing his glory in jubilance.....

Various eminent spiritualists and litterateurs have been striving their best to discover and propagate as many sankeertanams as they could in order to sustain the invaluable devotional treasure rendered by Shree Taallapaaka Annamaachaarya.
Most of the same were confined to copper plate inscriptions preserved in the Annamaachaarya Bhaandaagaram beside Shree Bhaashyakaarla sannidi in the premises of Thirumala Ananda Nilayam until the recent century for reasons known to lord Shree Venkateshwara who chose to bless them to the world after we got independence from all sorts of foreign invasions / reigns.

While there are several poetical / lyrical / literary 
works rendered by many eminent philosophers and saints in the mighty history of the ancient India and 
modern India too, amongst all of them, Shree Taallapaaka Annamaachaarya Sankeertanams are the most celebrated ones as per the idiom 
"Kalau Sankeertya Keshavam" ....

Because, the established "Varnaashrama Vyavastha" prevalent since the ancient times got subjected to a complete metamorphosis that knows no boundaries or definitions or stipulated names and forms due to various reasons in this KaliYugam due to KaliyugaLakshanam, and the same calls for a modern form of a simpler yet significantly meritorious form of worship that bestows one and all with all the merits required to make them successful in their respective chosen paths of life / professions / businesses / occupations / etc.

The same was envisioned by ShreeHariNanadakaKhadgaamsha Shree Taallapaaka Annamaachaarya who descended to this world to execute the bestowed divine tasks of uplifting the spiritually amateur folks and those who are not fortunate enough to be associated with a selfless good Samaritan (typically called a guruji or a master) whose guidance drives them towards the 
shores of meaningful and fulfilled lives.

The significance of ShreeHariSankeertanam is extolled in an exquisite way in the below sankeertanam by Shree Taallapaaka Annamaachaarya who quite gracefully states the below verse in the 3rd stanza to tell the devotee world the most magnanimous aspect of ShreeHariSankeertanam.

చ 3 || హితమైనయిహపరాలిష్టమైనవెల్లా నియ్య | 
సతమై కలదుగా నీసంకీర్తన- |

ca 3 || hitamainayihaparA liShTamainavellA niyya | satamai kaladugA nIsaMkIrtana- 

ప|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||

చ 1 || పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | 
నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | 
చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||

చ 2 || ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | 
సరి గావగద్దుగా నీశరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | 
నిరతి గలదుగా నీభక్తి నాకు ||

చ 3 || హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | 
సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | 
గతి గలదుగా నీకమలాదేవి ||

pa|| kaliyuga meTulainA galadugA nIkaruNa | jalajAkSha harihari sarvESvarA ||

ca 1 || pApa meMta galigina barihariMcEyaMduku | nApAla galadugA nInAmamu |
kOpameMta galigina kocci SAMtamiccuTaku | cEpaTTi kalavugA nAcittamulO nIvu ||

ca 2 || dhara niMdriyA leMta taramukADina nannu | sari gAvagaddugA nISaraNAgati |
garima garmabaMdhAlu gaTTinatALLu vUDiMca | nirati galadugA nIBakti nAku ||

ca 3 || hitamainayihaparA liShTamainavellA niyya | satamai kaladugA nIsaMkIrtana- |
tati SrIvEMkaTESa nAtapamu PaliyiMpiMca | gati galadugA nIkamalAdEvi ||

https://te.wikisource.org/wiki/%E0%B0%95%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81%E0%B0%97_%E0%B0%AE%E0%B1%86%E0%B0%9F%E0%B1%81%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE

https://youtu.be/qwT3qM00H_w?si=-kntXb6yp75op2FR

May the divine light of "Shree Taallapaaka Annamaacharya Sankeertanaa Saaram" continue to shower its pristine blessings on umpteen devotees and sober dignitaries that are always busy in making this world a much better and a happy place for every prudent and diligent person around to dwell in peace and prosperity via their respective endeavours of universal well-being and philanthropy.

Sarvay Sujanaah Sukhinobhavanthu....💐

Om Namo Venkateshaaya....😊💐🙏

శ్రీపరాభవ చాంద్రమాన సంవత్సర చైత్ర శుద్ధ పంచమి ఇందువాసరం (23-03-2026) నుండి చైత్ర శుద్ధ నవమి భృగువాసరం (27-03-2026) వరకు శ్రీపాంచరాత్రాగమోక్త శ్రీవారి వార్షిక పాంచహ్నిక బ్రహ్మోత్సవ వైభవం...💐😊


చైత్ర శుద్ధ సప్తమి 2026 మార్చ్ 25, సౌమ్య వాసర మృగశిర నక్షత్ర ప్రయుక్త మిథునలగ్న పుష్కరాంశ సుముహూర్తంలో, బ్రహ్మాండనాయకుని పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత కళ్యాణమహోత్సవంలో దేవతలందరూ దివినుండి వారి అనుగ్రహాన్ని వర్షించే సుముహూర్తంలో ఎంతో విశిష్టమైన శ్రీశ్రీనివాస అనుగ్రహంతో భక్తులందరూ తరించే మధురాతిమధురమైన పర్వసమయం...😊💐

కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందనః
ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయకః !

కృతయుగంలో నరసింహ భగవానుడు,
త్రేతాయుగంలో శ్రీరామ భగవానుడు,
ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు 
కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు (శ్రీనివాసుడు) 
ప్రత్యక్ష దైవములు (అనగా ప్రత్యక్ష ప్రామాణికతతో గ్రాహ్యమై ఉండే దేవతలు) అని పెద్దల ఉవాచ...

అనగా శ్రీవేంకటేశ్వరుడు కలియుగానికి అధిష్ఠానదైవం కనుక శ్రీశ్రీనివాస కళ్యాణకైంకర్యం విశేషమైన భగవదనుగ్రహదాయక వైభవమై ఒప్పారే అధ్యాత్మ అంశం అని పెద్దల ఉవాచ....

సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగే ఒక సామాన్య పెళ్ళికి మరియు
అంగరంగవైభవంగా ఎంతోమంది సాదర అతిథులు, ఆహ్వానితులు, బంధుజనుల సమక్షంలో ఎంతో అట్టహాసభరితంగా సంప్రదాయవైభవంతో
జరిగే మహదైశ్వర్యవంతుల పెళ్ళికి, విందుకి, ఎంత భేదం ఉండునో.....,

అట్లే..,

మామూలుగా ఇతర రోజుల్లో నిర్వహింపబడే భగవద్ కళ్యాణ కైంకర్యములకు, మరియు సాలంకృత ఆరాధిత గరుడధ్వజారోహణతో ఆలయప్రాకారానికి విచ్చేసి విశేషమైన సూక్ష్మద్యుతిశక్తితో కొలువైఉండే దివిజ సమూహం, నిత్యసూరులు, దిగ్దేవతలు,
మరియు భగవద్సన్నిధికి విచ్చేసిన 
భూసురోత్తములు,
కళ్యాణకైంకర్యపరులు,
భక్తభాగవతోత్తములు,
ఇందరి సమక్షంలో ఎంతో అట్టహాసభరితంగా ఆగమసంప్రదాయవైభవంతో నిర్వహింపబడే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి కళ్యాణం, భోజనప్రసాదవితరణ అంత విశేషంగా ఉండే వైభవం....!

ఆపాదతలమస్తకం స్వర్ణాభరణాలంకృత దేవతామూర్తుల దర్శనం కలిసంతారకమైన విశేషభగవదనుగ్రహదాయక వైభవం అని శాస్త్రోక్తి...

అటువంటి అరుదైన భగవదనుగ్రహానికి పాత్రులై తరించాలంటే, శ్రీవేంకటాచలం వంటి శ్రీక్షేత్రాల్లో నిర్వహింపబడే ఆర్జిత సేవల్లో పాల్గొని దర్శించి తరించగలం....
మరియు
మన కూకట్పల్లి వివేకానందనగర్ కాలని లో కొలువైన,
శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ సమేత శ్రీశ్రీనివాసుడి
చైత్ర శుద్ధ సప్తమి నాటి వార్షిక బ్రహ్మోత్సవాంతర్గత కళ్యాణోత్సవంలో పాల్గొని దర్శించి తరించగలం....

శ్రీ విఖనస మహర్షి గా భగవంతుడే అవతరించి అనుగ్రహించిన ఆరాధనామంజరిని శ్రీవైఖానస ఆగమశాస్త్రం అని...

శ్రీ నారాయణ మహర్షి గా భగవంతుడే అవతరించి అనుగ్రహించిన ఆరాధనామంజరిని శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రం అని...

తిరుమలలో శ్రీవైఖానస ఆగమోక్త ఆరాధనా విధానాన్ని,
తిరుచానూర్ మరియు ఇతర ఎన్నో శ్రీవైష్ణవక్షేత్రాల్లో శ్రీపాంచరాత్ర ఆగమోక్త ఆరాధనా విధానాన్ని పాటించడం అనాదిగా వర్ధిలుతున్న సత్సంప్రదాయం....

నిత్యం షట్కాల ఆరాధనతో వర్ధిల్లే తిరుమలలో శ్రీవైఖానస ఆగమోక్త ఆరాధనా విధానాన్ని పాటించడం అనే సత్సాంప్రదాయవైభవాన్ని భగవంతుడే ఎందుకు స్థిరీకరించాడంటే....

శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో ఒకసారి వివరించినట్టుగా....,

యుగలక్షణం అనే అనివార్యమైన అంశం కారణంగా 
శౌచము, సదాచారము, ధర్మము, సిద్ధి,
అనే నాలుగు ప్రధాన అంశాలపై వర్ధిల్లే దేవతాశక్తి తత్ దేవతామూర్తుల్లో నిత్యం కొలువై ఉండి అనుగ్రహించడం అనే వైభవం ఈ కలియుగంలో దుర్లభమై ఉన్న కారణంగా,
ఏఏ పద్ధతులను పాటిస్తే ఈ నాలుగూ కూడా ఒనగూరి దేవతామూర్తుల్లో తత్ ఆవాహిత దైవికశక్తి నిత్యం ప్రస్ఫుటంగా కొలువై ఉండి భక్తులను నిరంతరం అనుగ్రహిస్తూ ఉండునో...
అట్టి సమ్మునతమైన అధ్యాత్మ అంశాల సమాహారంగా కొందరు విజ్ఞ్యులకు మాత్రమే ప్రధానదేవతా / మూలవర్ బింబాన్ని స్పృశించే అరుదైన అనుగ్రహంతో సమకూర్చబడిన సారస సాకార సమూర్త్యారాధనా వైభవాంశముల సామాహర భగవద్ 
శాస్త్రమే శ్రీవైఖానస ఆగమశాస్త్రం...

కొందరు / కొన్ని కుటుంబాలకు చెందిన విజ్ఞ్యులు మాత్రమే ఎందుకు అని అంటే, ఒక స్టెప్ అప్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని నిత్యం టచ్ చేస్తూ, శుద్ధి గావిస్తూ, ఆపరేట్ చేయాలంటే ఆ స్థాయిలో తగు సమ్మునతమైన తర్ఫీదును పొందిన వారు మాత్రమే తగినవారు అని అనడం ఎట్లు సమంజసమో....,
శ్రీవైఖానస ఆగమశాస్త్రం / శ్రీవైఖానస అర్చకులు కూడా అట్లే...

ఈ లోకంలో ఎన్నో ప్రదేశాల్లో ఇట్టి విశేషమైన భగవద్ అనుగ్రహం ఎందరో భక్తులకు అందిరావాలంటే,
ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫర్నర్ నుండి అధ్యాత్మద్యుతిశక్తిని నిరంతరం తరంగితంగావింపజేసుకుంటూ / స్వీకరిస్తూ వర్ధిల్లే.... 
ఒక స్టెప్ డౌన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని నిత్యం టచ్ చేస్తూ, శుద్ధి గావిస్తూ, ఆపరేట్ చేయడం (ఆ స్థాయిలో తగు సమ్మునతమైన తర్ఫీదును పొందిన ఎందరో విజ్ఞ్యులు) అనే అంశానికి సామ్యమే శ్రీవైష్ణవ శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర వైభవం....

మన ప్రపంచంలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ వందల సంఖ్యలో ఉంటే, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ వేల సంఖ్యలో ఉండడం EEE ఎంజినీర్స్ కి తెలిసిన అంశమే.....

అట్లే మన భూలోకంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర ఆరాధనావైభవంతో అలరారే ఆలయాలు వేలాదిగా ఉండడం అధ్యాత్మ విజ్ఞ్యులకు విదితమై ఉండే అంశమే...

మన భూలోకంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర ఆరాధనావైభవంతో అలరారే అట్టి  వేలాది ఆలయాల్లో, ఎంతో విశేషమైన వైభవంతో, మహిమ్నతతో, అలరారే ఆలయం
మన కూకట్పల్లి వివేకానందనగర్ కాలని లో కొలువైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీశ్రీనివాస భగవదాలయం....

భగవద్ సన్నిధిలో / ఆలయంలో, గోశాలలో, తులసీవనంలో, బిల్వవృక్ష, ఆమలక/ఉసిరి/ఉశిరి వృక్ష, సన్నిధిలో  నిర్వహింపబడే భగవద్ కైంకర్యోత్సవాలు విశేషమైన అనుగ్రహాన్ని వర్షించును అని పెద్దల ఉవాచ....

విష్వక్సేనారాధన 
స్వస్తిపుణ్యాహవాచనం,
వివిధపుణ్యతీర్థావాహితజలసంప్రోక్షణ, 
మహాసంకల్పపఠనం,
లగ్నాష్టకచూర్ణికాపఠనం,
గుడజీరకధారణ,
మంగళసూత్రధారణ,
తలంబ్రాలు/తలబాలు,
నిలయవిద్వాంసుల సుస్వరరాగాలాపన,
భగవద్గౌణగుణగానసంకీర్తనం,
కళ్యాణమహోత్సవ మహాప్రసాదసేవనం,

ఇత్యాది సత్త్వగుణసాంద్రతాభివృద్ధికారక కార్యక్రమాల సమ్మిళిత సమాహార విశేషంగా కొనసాగే భగవద్కళ్యాణక్రతువులో పాల్గొని తరించే భక్తభాగవతోత్తములకు విదితమైనట్టుగా,
శ్రీశ్రీనివాసపరిణయోత్సవం భక్తులెల్లరికీ ఒక మహావైభోగదాయక మహోత్సవం...

మామూలుగా మానవుల పెళ్ళిలో పాటించే కార్యక్రమాలన్నీ కూడా వారిరువురి శ్రేయస్సుకై పెద్దలు, దైవజ్ఞ్యులచే నిర్వహింపబడే కళ్యాణక్రతువు.

దేవుళ్ళ పెళ్ళిలో పాటించే కార్యక్రమాలన్నీ కూడా వీక్షకమహాశయుల శ్రేయస్సుకై పెద్దలు, దైవజ్ఞ్యులచే నిర్వహింపబడే కళ్యాణక్రతువు.

భగవద్కళ్యాణాంతర్గత ఏ క్రతువు ఏ భక్తుణ్ణి ఎవ్విధంగా అనుగ్రహించును అనేది భక్తుడికి మరియు భగవంతుడికి మాత్రమే గ్రాహ్యమయ్యే అధ్యాత్మ విశేషం...

ఎందుకంటే సదరు డాక్టర్ గారు సూచించిన ఏ ఔషధం ఎవ్వరికి ఎట్లు ఉపకరించి స్వస్థతను సమకూర్చిందో తెలిసేది ఆ వైద్యనారాయణమూర్తికి మరియు ఆ ఔషధాన్ని సేవించిన వారికే కద....

ఈ క్రింది స్పేస్ ఎక్స్ప్లొరేషన్ స్టోరి గురించి వినే ఉంటారు కొందరైనా....

అంతరిక్షంలో నోట్స్ రాసుకోవడానికి వీలైయ్యే విధంగా ఎన్నో శాస్త్రాలను శోధించి, ఎన్నో పరిశోధనలు చేసి, ఎన్నో కోట్లు వెచ్చించి గ్రావిటి లేకున్నా కూడా అంతరిక్షనౌకల్లో కూడా పనిచేసే ఒక స్పెషల్ పెన్ ని కనిపెట్టి ఉపయోగించారంట అమెరికా వాళ్ళు.....

అంతరిక్షంలో నోట్స్ రాసుకోవడానికి అన్ని కోట్లు వెచ్చించి ఒక స్పెషల్ పెన్ ని కనిపెట్టారా అమెరిక వాళ్ళు...!
హుమ్మ్...
ఒక పెన్సిల్ ని ఉపయోగించి నోట్స్ రాసుకుంటే సరిపోద్ది కద...
అని రష్యావాళ్ళు సింపుల్ గా ఒక నార్మల్ పెన్సిల్ తో నోట్స్ రాసుకున్నారంట.....

అట్లే....

ఎన్నో గహనమైన శాస్త్రాలను శోధించి, ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో ధనం వెచ్చించి కొందరు అవి ఇవి అని ఏవేవో కాంప్లెక్స్ అధ్యాత్మ సాధనలను / సాధనాలను అవలంబిస్తూ ఉంటారు....

(గహనమైన శాస్త్రాలను తక్కువ చేసి మాట్లాడడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు...సామాన్య జనబాహుళ్య గ్రాహ్యానికి అందనంత ఎత్తులో ఉండే గహనమైన సిద్ధాంతాలే అధ్యాత్మశాస్త్ర రీత్యా వివిధ సమస్యలకు గల పరిష్కారాలు అని చెప్తూ, భక్తులను ఏమార్చి వారిని లూటి గావించే వ్యాపారాలతో వివిధ ఛానెల్స్ లో ప్రసారమయ్యే కొందరు సొ కాల్డ్ అధ్యాత్మవ్యక్తుల కొన్ని ప్రకటనలు అంతగా ఉపయుక్తమైనవి కాదని చెప్పడం మాత్రమే ఇక్కడి ఉద్దేశ్యం అని విజ్ఞ్యులు గమనించవలె...
అంగడి సరుకులుగా అమ్మబడే పిరమిడ్లు, వివిధ యంత్రాలు, ఇతర కాంప్లెక్స్ పూజా వస్తువులు, కొత్త కొత్త యోగ ధ్యాన ప్రక్రియలను నిర్వహించే ఆశ్రమాలు, విరించికుమారీస్ అని శాస్త్రంలో ఎక్కడా లేని మెట్టవేదాంతాన్ని ప్రచారం గావిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలతో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న హానికారక సంస్థలు, ఇత్యాదివి జీవితాభివృద్ధికారక అధ్యాత్మ అంశాలు కాదని చెప్పడం మాత్రమే ఇక్కడి ఉద్దేశ్యం అని విజ్ఞ్యులు గమనించవలె...)

ఇంకొందరు సింపుల్ గా భగవద్ కళ్యాణమహోత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించి సకల శ్రేయస్సులను అందుకొని తరిస్తూ ఉంటారు....

ఎందుకంటే, "శుభం కరోతు కళ్యాణం" అని ఆర్యోక్తి....

ఎవరికి ఏది శుభం అని అంటే....
అది అడిగే భక్తుడికి....అనుగ్రహించే దేవుడికి సంబంధించిన అంశం....అని అనవలసి ఉంటుంది....

కొందరు భక్తులు ఏవైనా ఎప్పుడైనా అడుగుతూనే ఉంటారని భగవంతుడికి కూడా తెలుసు....
అందుకే "నిత్యశుభప్రద గోవిందా..." అని స్తుతించేది....
అట్టి భక్తులు అడిగినవి దేశకాలానుగుణంగా అనుగ్రహించే భగవంతుడే భక్తిజ్ఞ్యానములను కూడా అనుగ్రహిస్తాడు...
భక్తిజ్ఞ్యానములతో తనను ఆరాధిస్తూ భాగవతోత్తములుగా 
తమనుతాము తీర్చిదిద్దుకున్న భక్తులకు అడిగినా అడగకున్నా ఉపయుక్తమైనవన్నీ అనుగ్రహిస్తూ తన భక్తవత్సలతను ప్రదర్శించే వాడే భగవంతుడు.....

అందుకే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు స్వామి వారిని ఆశ్రితపారిజాతంగా అభివర్ణిస్తూ,

"వెతకి వెతకి వరములొసంగెడి వేంకటపతి యితడు"

అని స్తుతించారు ఈ క్రింది సంకీర్తనలో.....

https://annamacharya-lyrics.blogspot.com/2008/05/495vide-nelakonnadu-srivemkatagiri-mida.html

నిత్యం సకలలోకమాన్యులచే, సకలదేవతలచే నమస్కరింపబడుతూ వర్ధిల్లే దేవతాసార్వభౌముడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని మరి మనం ఎంతగా వెతకి వెతకి సేవించి తరించాలో కూడా ఈ క్రింది సంకీర్తనలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు అంతే గొప్పగా అభివర్ణించారు....

"త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి | వెదకి వెదకి సేవించుడీ ||" 

https://annamacharya-lyrics.blogspot.com/2007/11/347vedam-bevvani-vedakedivi.html?m=1

"త్రిదశవంద్యులు" అనగా బాల్యం, కౌమారం, యవ్వనం, అనే మూడు దశల్లో వర్ధిల్లి ఎల్లప్పుడూ 30 సంవత్సరాల యవ్వనప్రాయం వారిగా అగుపించే ద్యుతిశక్తిభరిత దివిగమన తైజసికదేహధారులైన దేవతలు అని ఇతః పూర్వం ఒక పోస్ట్లో శ్రీ చాగంటి సదురువుల ప్రవచన వాక్కును వివరించాను.....

దేవతలను మరియు ఈ కలియుగ ప్రత్యక్ష దేవతాసార్వభౌముడైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని విజ్ఞ్యులు ఎందుకు నిత్యం ఆరాధిస్తారో ఒక చిన్న ఎగ్సాంపుల్ తో వివరిస్తా...

బయట వీధిలో ఏదో సమస్యతో మన ఇంట్లో కరెంట్ / పవర్ సప్లై ఆఫ్ అయినప్పుడు రాత్రి పూట ఫలాన వస్తువు ఫలాన చోట ఉంది అని ఒక టార్చ్ లైట్ వేసి దర్శించగలగడం శ్రీలక్ష్మీ అనుగ్రహానికి సంకేతం...
ఆ ఉపయుక్తకరమైన వస్తువును అందుకొని తరించడానికి అవలంబించవలసిన శ్రేయస్కరమైన మార్గాన్ని టార్చ్ లైట్ వెలుగులో దర్శిస్తూ ముందుకుసాగడం శ్రీమన్నారాయణానుగ్రహం....

అనగా మొదట మనం టార్చ్ లైట్ ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకొని అందుకోవాలి....
ఆ తదుపరి మన గమ్యాన్ని బాగా దర్శించాలి....
ఆ తరువాత మన గమనమార్గాన్ని బాగా దర్శించాలి....
అప్పుడు గమ్యగమనసిద్ధిని గడించి కావలసిన ఉపయుక్తకరమైన శ్రియానుగ్రహం అందివచ్చి మనం తరించెదము....

అందుకే విజ్ఞ్యులైన పెద్దలు చెప్పే మాట....

ధ్వజస్తంభానికి నమస్కరించి ఒక ఆలయవ్యవస్థలోకి ప్రవేశించిన తదుపరి మొదట మనం గరుడాళ్వార్ ఎక్కడ ఉన్నారో గుర్తుపెట్టుకొని నమస్కరించాలి....
ఆ తదుపరి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని బాగా దర్శించాలి....
ఆ తరువాత శ్రీవేంకటేశ్వరస్వామి వారిని బాగా దర్శించాలి....
అప్పుడు జీవజీవేశ్వరైక్యభావ సిద్ధిని గడించి కావలసిన ఉపయుక్తకరమైన శ్రియానుగ్రహం అందివచ్చి మనం తరించెదము....

అధ్యాత్మ పరంగా శ్రీమహావిష్ణువు యొక్క వాహనం గరుడాళ్వార్....
అనగా వైనతేయా...ఫలాన ప్రదేశానికి / లోకానికి వెళ్దాం పద...అని స్వామివారు సంకల్పించిన మరుక్షణం ఆ చోట /ప్రదేశంలో స్వామివారిని ప్రకాశింపజేసే సాధనం గరుత్మంతులవారు.....

ఓక్ టార్చ్ లైట్ కూడా అంతే కద...
అనగా ఫలాన ప్రదేశంలో లైట్ బీం ని ప్రకాశింపజేసే సాధనమే కద....

కొన్నికొన్ని టార్చ్ లైట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే వస్తువులను కూడా ఎంతో గొప్పగా దర్శింపజేయగలవు....

అవ్విధంగానే కొన్నికొన్ని ఆలయాల్లోని గరుడాళ్వార్ ఆరాధన ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, జన్మజన్మల అఘాన్ని నశింపజేసి, జన్మజన్మలకు వర్ధిల్లే శ్రియానుగ్రహాన్ని ప్రసాదించే గారుత్మతశక్త్యానుగ్రహాన్ని భక్తులకు అనుగ్రహించేంతగా...

గరుత్మంతుల వారి శక్తి ఎంతటి ఘనమైనదో తెలుసుకోవాలంటే
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాలను,
ప్రత్యేకించి యుద్ధకాండలో మేఘనాథుడి నాగాస్త్రబంధనంతో అశక్తులై ఉన్న శ్రీరామసేన మొత్తాన్ని ఎవ్విధంగ తన బంగారు రెక్కలతో సుపర్ణుడు శ్రీవైకుంఠ ప్రాకారాలనుండి రయ్యన భూమండలానికి చేరుకొని కాంచన లంకలో వాలి తన రెక్కల సవ్వడితో నాగాస్త్రబంధనాన్ని క్షణాల్లో లయించి, 
"అడగకుండానే మాకు ఇంతటి మేలును ఒనరించిన నీవెవరవు..." అని శ్రీరాముడు అడగగా...
"నేను మీకు ఒక గొప్ప మిత్రుణ్ణి అని ప్రస్తుతానికి అనుకోండి శ్రీరామ....
మీకు ఈ రామరావణసంగ్రామంలో విజయం సిద్ధించుగాక....
శుభమస్తు...." 
అని అంతే వేగంగా దివికి ఎగిరిన సకల వేదపురాణేతిహాసమంత్రాధిదేవతైన
శ్రీగరుత్మంతుల వారి అనన్యసామాన్యమైన అనుగ్రహంతో
విజ్ఞ్యులెల్లరూ తరించెదరని అభిలషిస్తూ....

భక్తభాగవతలోకానికి విజ్యులైన ఆలయ కమిటీ వారిచే అందివ్వబడిన శ్రీవారి పంచత్రింశత్ 35వ వార్షికబ్రహ్మోత్సవ ఆహ్వాన కరపత్రం జతపరిచాను...మీరూ చదవండి...మీతోటి విజ్ఞ్యులచే చదివించండి...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విశేషంగా....
తరలిరండి....దర్శించండి...తరించండి....! 
జన్మజన్మలకు వర్ధిల్లే శ్రియానుగ్రహాన్ని గడించి తరించండి....!!

************************************

గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవలనీవల నోర(గుమ్మలుగ నాడుద మీతని పాడుదము

సత్యము సత్యము సకలసురలలో
నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల
అత్యంతము శరణనరో యితని

చాటెడి చాటెడి సకలవేదములు
పాటించినహరి పరమమని
కూటస్ఠు(డితడు గోపవధూపతి
కోటికి యీతని గొలువరో జనులు

నిలుచున్నా(డిదె నే(డును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుడు
వలసినవారికి వరదుం(డీతదు
కలడు గలడితని(గని మనరో

https://annamacharya-lyrics.blogspot.com/2007/03/158govimdadi-nmochcharana.html?m=1

************************************

భగవద్కళ్యాణకైంకర్యం ఎవ్విధంగా భగవంతుణ్ణి భక్తభాగవతోత్తములకు మరింగ దెగ్గరగా చేసి విశేషమైన శ్రియానుగ్రహపరంపరలను వర్షించునో స్వామివారి అనుగ్రహంతో మరో పోస్ట్లో మళ్ళీ తరచి తరిద్దాం....

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః |
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు ||

సర్వే సుజనాః సుఖినోభవంతు....💐😊