Thursday, April 2, 2026

శ్రీపరాభవ చైత్రశుద్ధ పంచమి ప్రయుక్త ఇందువాసర 25-మార్చ్-2026 నుండి అంగరంగవైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మాండనాయకుడి పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవవైభవానికి అంకురార్పణ మరియు సాలంకృత గరుడధ్వజారోహణోఉత్సవం అనేది కమ్మని షడ్రసోపేతమైన విందుభోజనానికి ముందుగా భోక్త ఎదుట చక్కని శుభ్రపరచిన కదళీపత్రం / అరటి ఆకును పరచి అందులో శనగపప్పు బెల్లం మిశ్రమంతో తయ్యారైయ్యే పూర్ణం అనే మధురపదార్ధంతో విందుభోజనం వడ్డించడం ప్రారంభించడం వంటి అంశం....😊💐

శ్రీపరాభవ చైత్రశుద్ధ పంచమి ప్రయుక్త ఇందువాసర 25-మార్చ్-2026 నుండి అంగరంగవైభవంగా ప్రారంభమయ్యే బ్రహ్మాండనాయకుడి పంచత్రింశత్ 35వ వార్షిక బ్రహ్మోత్సవవైభవానికి అంకురార్పణ మరియు సాలంకృత గరుడధ్వజారోహణోఉత్సవం అనేది కమ్మని షడ్రసోపేతమైన విందుభోజనానికి ముందుగా భోక్త ఎదుట చక్కని శుభ్రపరచిన కదళీపత్రం / అరటి ఆకును పరచి అందులో శనగపప్పు బెల్లం మిశ్రమంతో తయ్యారైయ్యే పూర్ణం అనే మధురపదార్ధంతో విందుభోజనం వడ్డించడం ప్రారంభించడం వంటి అంశం....😊💐

ఎందుకంటే కళ్ళకు ఎంతో స్వాంతనను కలిగించి, మనస్సుకు ఎంతో ప్రశాంతతను అందించి, ఆరగించబోయే భోజనానికి అమృతత్వాన్ని ఆపాదించే దైవిక వస్తువు అరటి ఆకు...
[ వడ్డింపపడే భోజనపదార్ధాల్లో ఏదేని హానికారక తత్త్వం / ఉష్ణతత్త్వం / అజీర్ణతత్త్వం ఉన్నచో వాటిని హరించి, ఆ భోజన పదార్ధాలకు అమృతత్వాన్ని ఆపాదించే విశేషమైన దైవిక తత్త్వం గల సద్వస్తువు అరటి ఆకు....అని మాడర్న్ సైన్స్ పరిశోధనలు కూడా లోకానికి తెలియజేసెను... ]

పంక్తిభోజనాల్లో రంభాపత్రాన్ని పరచి భోజనపదార్ధాలను వడ్డించడం మొదలుపెట్టిన రీతిగ...,
బ్రహ్మోత్సవాలకు ప్రారంభ ఉత్సవంగా, సాలంకృత గరుడధ్వజం / అనగా గరుత్మంతుల చిత్తరువుతో
ఉండే ధ్వజాన్ని, ధ్వజస్తంభప్రాంతంలో ఆలయ ఆగమోక్తకైంకర్యాల్లో భాగంగా విశేషంగా ఆరాధించి, ఆరోహణ గావించి / అనగా ఫ్లాగ్ హాయిస్టింగ్ లా ధ్వజస్తంభోపరిప్రాంతానికి చేర్చి, తన్మూలంగ
సకల దిగ్దేవతలను, ఇతర దివిజ సమూహాన్ని సవాహన, సపరివారంగా, ఈ బ్రహ్మోతావాలకు ఆహ్వానించడం
అనే ప్రక్రియ.....

ఒక అరటి ఆకుకు ఉండే వైశేషిక లక్షణమే ఒక సాలంకృత సారాధిత గరుడధ్వజానికి కూడా ఉండే అధ్యాత్మవిశేషం....
అనగా, నిర్వహింపబడే ఆహ్నిక ఉత్సవాల్లో
(ఆయా ఆలయ / ఆగమ / ఉత్సవ సంప్రదాయానుగుణంగా,
ఏకాహ్నికం, త్రయాహ్నికం, పాంచాహ్నికం, నవాహ్నికం, గా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉంటాయ్...)
తెలిసి తెలియని సదాచారలేమిజనిత దోషాలను, పొరపాట్లను, హరించి ఆ బ్రహ్మోత్సవాలకు అమృతత్త్వాన్ని, పూర్ణత్వాన్ని సమకూర్చి ఆ ఆలయం యొక్క దైవత్వాన్ని, మరియు ఆ ఆలయ స్థిత దేవతామూర్తుల సూక్ష్మరూపద్యుతిశక్తిని
(ఇంగ్లీష్ లో మైక్రోస్కోపిక్ ఆరల్ మాగ్నిట్యూడ్ అని వచింపబడే ఒకానొక కాస్మిక్ / స్పిరిట్యువల్ ఫాక్టర్) విశేషంగా వృద్ధిపరిచే వైభవోపేతమైన సకలదివిజాగమన ఉత్సవం...!

అన్నిరకాల అజ్ఞ్యానాన్ని సమూలంగా దహించివేసే శాస్త్రమే శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం అని విజ్ఞ్యుల నిర్వచనం....
అనగా ఎన్నో రకాల విజ్ఞ్యానసిరులను వికసింపజేసే 
శాస్త్రమే శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం...
అట్టి శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రజ్ఞ్యుల వచనానుసారంగా,
ఈ గరుడధ్వజారోహణ (చివరి రోజున ఉండే గరుడధ్వజావరోహణ కూడా) ఉత్సవం ఎంతశక్తివంతమైన ఉత్సవమంటే,
ఈ ప్రక్రియలో శ్రీగరుడాళ్వారునకు నివేదింపబడే మధురప్రసాదాన్ని, ఆలయానికి విచ్చేసి, శ్రీసంతానలక్ష్మీ అనుగ్రహాన్ని అపేక్షించే మహిళామణులకు గరుడప్రసాదంగా బ్రహ్మగారి స్థానంలో గరుడధ్వజారాధనా కైంకర్యాన్ని నిర్వహించే సత్బ్రాహ్మణోత్తములు అందివ్వగా,
ఆ ప్రసాదాన్ని మౌనంగా భక్తిశ్రద్ధలతో స్వీకరించే 
గొడ్డ్రాండ్రకు కూడా గరుత్మంతుల అనుగ్రహంతో చక్కని బిడ్డలు జన్మింతురు అని అధ్యాత్మ శాస్త్రవచనం...

అందుకే కద శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఆ గరుడాచలపతిని 
 
"వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు
గొడ్డ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే" 

అని కీర్తించారు వారి సంకీర్తనలో .....

https://annamacharya-lyrics.blogspot.com/2006/11/81vedukomdama.html?m=1

విశ్వసించే వారికి సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ....
[ ఎందుకంటే,
ఎల్లరికీ చక్కని ఆరోగ్యాన్ని (ఆరోగ్యం భాస్కరాధీఛ్చేత్)...,
బ్రహ్మవేత్తలకు విశేషమైన ఆత్మశక్తిని...,
విజ్ఞ్యులకు / ఉపాసకులకు వారివారి వర్ణాశ్రమధర్మానుగుణంగా ఔపాసనిక గాయత్రిశక్తిని...,
వైజ్ఞ్యానికులకు సోలార్ పవర్ ని....,
వ్యాపారులకు, గృహిణులకు వడియాలు, ఒరుగులు, అప్పడాలు, ఇత్యాది ఎన్నో వైటమిన్-D తో సుసంపన్నమైన నిలవ ఉండే ఆహారపదార్ధాలను ఫ్రీ గా అనుగ్రహిస్తూ ఉన్నందుకు.....
]

ఇతరులకు రోజు అలా తూర్పున ఉదయించి పడరమరన అస్తమించే కేవల సూర్యబింబం కావొచ్చు....
 
అట్లే శాస్త్రంకూడా.....

"శాసనాత్ శంసనాత్ ఇతి శాస్త్రం..."
అనే శ్రీచాగంటి సద్గురువుల సద్వచనం కొందరికైనా గుర్తుండే ఉంటుంది......
అనగా "భక్తిశ్రద్ధలతో ఆచరించే సదరు అధ్యాత్మ ప్రక్రియ సదరు ఫలితాన్ని ఒసగును..." 
అని శాస్త్రం ఎంతో గంభీరంగా వచించును.....
అట్లు వచించి శుభాన్ని సమకూర్చే సాధనమే శాస్త్రం అని విజ్ఞ్యుల ఉవాచ....

సూర్యపరమాత్మానుగ్రహాన్ని నమ్ముకున్న వారికి ఆరోగ్యం 
కరతల ఆమలక ఫలంగా అందివచ్చే రీతిలో...
అధ్యాత్మశాస్త్రప్రోక్త భగవదారాధనా కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో విశ్వసించే వారికి శ్రేయస్సు అరచేతిలో చింతామణిగా అందివచ్చే అంశం..

ఎరుక, భక్తి, విశ్వాసం, ప్రపత్తి, భాగవతత్త్వానికి సామ్యమేమనగా.....

ఇతర ఎన్నో సాధారణ మొక్కల మధ్యన ఉండే సదరు మొక్క,
ఉసిరి మొక్క అని తెలుసుకొని,
భక్తితో తులసి కోటలో / ఇంట్లో ఆరాధిస్తూ,
ఎన్నో శ్రేయస్సులను అనుగ్రహించే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉసిరి చెట్టును విశేషంగా ఆరాధిస్తూ,
ఎవరైతే....
శ్రీచాగంటి సద్గురువులు ఆస్తికలోకానికి కార్తీకమాస ఆరాధనామంజరిలో భాగంగా అనుగ్రహించిన ఈ శ్లోకంతో.....

"ధాత్రీదేవినమస్తుభ్యం సర్వపాపక్షయంకరి
పుత్రాందేహిమహాప్రాజ్ఞే యశోదేహిబలంచమే...
మేధాంప్రజ్ఞ్యాంచసౌభాగ్యం విష్ణుభక్తించశాశ్వతీం
నిర్రోగంకురుమాంనిత్యం నిష్పాపంకురుసర్వదా..."

ఆమలక / ఉశిరి / ఉసిరిచెట్టును ఆరాధిస్తూ ఉంటారో....
వారి పట్ల శ్రీలక్షీనారాయణులు సదా ప్రీతిచెందిన వారై ఉండి అభీష్టసిద్ధిని అనుగ్రహిస్తూ ఉండెదరు....

మీరు ఎప్పుడైనా నిండుగా కాసిన ఉశిరికాయలతో తులతూగే ఉసిరిచెట్టుని ఆలకించి అక్కడ కాసేపు ధ్యానించి చూడండి...
అష్టవిధప్రకృతిని పరిపాలించే శ్రీలక్ష్మీనారాయణతత్వం మనోనేత్రానికి గోచరమై ఔరా అనిపించును.....

అచ్చం ఉశిరిచెట్టు / ఉసిరికాయల్లో ఉండే సూక్ష్మరూప దైవికశక్తి శ్రీగరుత్మంతుల ఆరాధనవల్ల ప్రభవించును...
ఎందుకంటే అధ్యాత్మపరంగా శ్రీమహావిష్ణువు యొక్క వాహనం గరుత్మంతులవారు...
అనగా శ్రీవైష్ణవవైభవాన్ని వహించి వ్యాప్తిగావించే అధ్యాత్మసాధనం శ్రీగరుత్మంతులవారు....

వాహనం ఉన్న చోటికి యజమాని వచ్చునా...?
లేక 
యజమాని ఉన్న చోటికి వాహనం వచ్చునా...?

అనగా....
"రె...అశ్విన్....నేను ఫలాన చోట ఫలాన పనిమీద వచ్చాన్ రా...
అరగంటలో ఇక్కడికే వచ్చి నన్ను పిక్ అప్ చేస్కొ....."
అని యజమాని తన నమ్మకస్తుడైన డ్రైవర్ కి కాల్ చేసి చెప్పినా ...
లేక...
"అన్నా...నేను బండిని ఫలాన చోట పార్క్ చేసిన....
అక్కడికే వచ్చై...పిక్ అప్ చేస్కుంటా......"
అని నమ్మకస్తుడైన డ్రైవర్ తన యజమానికి కాల్ చేసి చెప్పినా ...

అనగా....
వాహనం ఉన్న చోటికి యజమాని వచ్చినా...
లేక 
యజమాని ఉన్న చోటికి వాహనం వచ్చినా...
అది యజమానికి / వాహనానికి (సారధికి) ఉండే పరస్పర మైత్రీసంబంధమైన అంశం...
బండిలోకి యజమాని వచ్చిచేరి, సారధి, యజమాని ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకే వాహనంలో ప్రయాణం గావించే చందంగా....

వైనతేయుడు ఉన్నచోటికి విష్ణువు వచ్చినా....
విష్ణువు ఉండేచోటికి వైనతేయుడు వచ్చినా....

శ్రీవైకుంఠ నిత్యసూరులెల్లరూ వైనతేయారూఢమై విహరించే శ్రీమహావిష్ణువు వద్దకు సూక్ష్మరూపాల్లో ఏతెంచి సదా స్వామివారిని సేవిస్తూ ఉందురు అని భాగవతవచనం....
అధ్యాత్మపరంగా...
వైనతేయవిష్ణువులది పువ్వుతావి కలిసి ఉండే పరిమళపారిజాతతత్త్వం...

అందుకే.....
విశేషమైన శ్రీవైష్ణవప్రభశక్తిని భువికి / భూలోక ఆలయాలకు అనుగ్రహించే బ్రహ్మోత్సవాల్లో ఎల్లప్పుడూ శ్రీగరుత్మంతులవారి ఆరాధనకు అగ్రతాంబూల గౌరవం అమరిఉండును.....

అట్టి శ్రీవైష్ణవదేదీప్యప్రభామయూఖములను దిగ్దిగంతములపర్యంతం పరివ్యాప్తి గావిస్తూ పరిఢవిల్లే శ్రీగరుత్మంతులవారి విశేషారాధనోత్సవమైన  శ్రీగరుడధ్వజారోహణోత్సవానికి విశేషంగా తరలిరండి....! దర్శించండి....!! తరించండి....!!!

సర్వం శ్రీగరుడాచలపతి శ్రీచరణారవిందార్పణమస్తు....
ఓం నమో వేంకటేశాయ....🙏😊💐


No comments:

Post a Comment