ఆనాడు చతుర్ముఖబ్రహ్మగారు రచించినరీతిలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను తమ పవిత్రత యొక్క శక్తితో పునీతం గావిస్తూ, తత్ క్షేత్రస్థిత దేవతల అనుగ్రహాన్ని అందుకుంటూ ఎన్నో కొండలు, కోనలు, లోయలు, అరణ్యాల మీదుగా గంభీరంగా ప్రవహిస్తూ, వాటి యందు వర్ధిల్లే జీవకోటికి జలానుగ్రహాన్ని అందిస్తూ సాగే గంగ, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఇత్యాది జీవనదుల ప్రవాహంలా సాగే చిరంతనకాలప్రవాహంలో ఎంతో విశేషమైన ప్రాభవాన్ని సంతరించుకున్న శుభతిథి చైత్రశుద్ధపాడ్యమి....
ఇప్పుడు మనం ఉన్న ఈ శ్వేతవరాహకల్పం యొక్క కల్పారంభసమయంలో ఈ కల్పం యొక్క చతుర్ముఖబ్రహ్మగారు సృష్టిరచనను ప్రారంభించిన ఈనాటి చైత్రశుద్ధపాడ్యమి శుభతిథి,
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతీ / శ్రీభూ సమేత శ్రీశ్రీనివాసుడి అనుగ్రహంతో ఈ నూతన సంవత్సరం విజ్ఞ్యులెల్లరికీ గొప్ప ప్రాభవభరిత పర్వసమయమై వర్ధిల్లుగాక అని అకాంక్షిస్తూ...
ఎల్లరికీ నూతన తెలుగు సంవత్సరాది పర్వసమయ శుభాభినందనలు....
శుభ 2026 యుగాది / శుభ 2026 ఉగాది.....💐💐
"విష్ణో పదే పరమ" ఇత్యుదిత ప్రశంసౌ
యౌ 'మధ్వ ఉత్స' ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయస్తధేతి తవ పానీతలౌ ప్రతిష్టౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే || (10)
No comments:
Post a Comment