" శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు కొన్ని కూడా వినలేదా....! అయ్యొ రామా...ఎంత విచిత్రం..."
అనే వాక్యం ఇవ్వాళ సమాజం లో,
" మీ ఇంట్లో ఒక్క సెల్ ఫోన్ కూడా లేదా...! అయ్యొ రామా...ఎంత విచిత్రం..."
అనేంతగా స్థిరపడింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అనేది ఆధ్యాత్మిక జగత్తులో ఒక భాగంగా ఆస్తికజీవనం సాగించే వారందరికి విదితమే....

బాగా మదించిన ఒక పెద్ద భద్రగజం మావటి అంకుశానికి ఒక్కోసారి లొంగకపోవచ్చు.... కాని అంతకంటే బలవంతమైన ఇంద్రియాలు సైతం ఆ సద్గురువుల రసన పై కొలువైన శారదోక్త వాగ్ఝరి లోని అక్షరాంకుశాలకు లొంగిపోతాయి.....!
కుటుంబసభ్యులందరు నెత్తి కొట్టుకొని చెప్పినా వినని మూర్ఖపు పెద్దలు, ఆ ప్రతి తెలుగింటి పెద్దగా ఉండే సద్గురువుల మాటకు సిగ్గుతో తలదించుకొని తమ మూర్ఖత్వాన్ని కుబుసం లాగా తామే వదిలివేసి కుటుంబానికి శాంతిని కలిగించగలరు...!
తమ సంపదలను, వయో పెద్దరికాన్ని, సాకుగా పెట్టుకొని నలుగురిలో ఇతరులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తు ప్రవర్తించే వారు, ఆ సద్గురువుల వాక్కులకు తమలోని ఈర్ష్యా విషాన్ని తగ్గించుకొని సంస్కారంతో హోదాలకతీతంగా హుందాగా ఆలోచించి పరులలో కూడా ఎంతోకొంత గొప్పతనాన్ని చూసి గౌరవించగలరు....!
లోకంలో, కనిపించిన ప్రతివాడిని, ఆ వాడెంత...వీడెంత...అంటూ అందరిని హేళన చేస్తూ బ్రతికే వారు, చూడ్డానికి చిన్నవారైనా సరే మనకంటే విశాలహృదయంతో ఉండేవారు కూడా ఉంటారనే స్పృహతో మెలగగలరు...!
తమకంటే చిన్నవారిలో ఉన్న విద్వత్తుని చూసి ఓర్వలేక నానావిధాలుగా శల్యసారధ్యాన్ని చేస్తూ బ్రతికే వారికి, ఎప్పుడో ఒకప్పుడు, ఎందుకులే మరీ ఇంత హీనంగా ఇతరులను పనికట్టుకొని మరీ ఇబ్బందిపెడుతూ బ్రతికి, కోరి దుష్కర్మపాశాలను బిగించుకోవడం అనే సోయి కలిగించగలదు....!
ఇలా చెప్పడానికి ఎన్నెన్నో భవరోగాలకు భవ్యమైన ఔషధంలా అనుగ్రహించే ఆ సద్గురువుల జ్ఞ్యాన గంగా తీర్థసేవనం ఎందరెందరికో సుభిక్ష జీవనాన్ని ఒసగి, రాబోయే కొన్ని తరాల వరకు ' శ్రీ చాగంటి వారి నోటి మాట ' అనే పరసువేది(స్పర్శవేది) విద్యను అందరికి అందించిన శ్రీచాగంటి సద్గురువులపై కొందరికి కొన్ని అపోహలు ఉండి, వారు ఈ కాలానికి కాకుండా అప్పుడెప్పుడో వందలయేళ్ళ క్రితం నాటి కాలానికి చెప్పినట్టుగా ఉంటాయండి అని అనుకోవడం....
సద్గురువుల యొక్క విశాల హృదయాన్ని అర్ధం చేసుకోలేక అనే అలాంటి మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేకున్నా, వాటిని కొంతమేర నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను...
1. వారికి మహా చాదస్తం అండి. బొట్టు పెట్టుకోకుండ క్యాజువల్ గా ఉండి ఏ పూజ చేయనివ్వరు...
2. భుజాన ఉత్తరీయం లేకుండా వారితో క్యాజువల్ గా మాట్లాడదామంటే అంతగా ఇష్టపడరు....
3. ఈ జెనెరేషన్ పిల్లలకి వారి బోధనలు ఆచరించడం దుస్సాధ్యం అండి...
4. దేవుడు అందరి హృదయంలోనే ఉంటాడు అని అంటూనే, మళ్ళి ఆ దేవుడి కోసం ఇలా ప్రార్ధించాలి అలా స్తుతి చేయాలి, అని అందరిని ఆధ్యాత్మిక ఒరవడిలోనే ఉండాలని చెప్తారండి...
5. వారిని ఫాలో అయ్యి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం, చాల కొద్దిమందికే సాధ్యమయ్యే విషయం అండి...

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వారు శాస్త్రానికి ఇచ్చే గౌరవాన్ని అపార్ధం చేసుకుంటూ, వారి బంగారు మాటను భావి తరాలకు భవ్యసంపదగా కాపాడి అందించడంలో అంతగా రానించకుండా అక్కడే ఉండిపోతుంటారు....
సరిగ్గ గమనిస్తే, శ్రీ చాగంటి గురువుగారు, తమ వందల వేల కొలది ప్రవచనాల్లో, ఋణాత్మకవైఖరిని ఎండగట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎవ్వరిని పేరు పెట్టి ఫలానా వారండి అని ఉటంకించడం ఉండదు...అది ఉద్దేశించబడిన ఆ వ్యక్తికి మాత్రమే అర్ధమయ్యి చక్కదిద్దబడేలా అత్యంత జాగ్రత్తతో ఉంటుంది వారి అక్షర కూర్పు...
వెలకట్టలేని తమ ఆధ్యాత్మిక విద్యాసంపదను ఉచితంగా ఆస్తికభక్తజనానికి అనుగ్రహించడనికి సద్గురువులు అలా నియమాలు ఎందుకు పెడతారు అంటే...
దాని వల్ల వారు ఒక్క పైసా కూడ ఆశించరు అనే విషయం అందరికి తెలిసిందే...శిష్యులచే ఘనసత్కారాలను గండపెండేరాలను అందుకోవడానికి వారు ఏనాడు తమ ప్రవచనాలను ఒక కారణంగా భావించరు... అతి కొద్ది సన్నిహితులైన శిష్యులు ఎంతో గౌరవంతో ప్రేమతో గురువాత్సల్యానికి చిరు గౌరవ వందనం అని చెప్పినప్పుడు మాత్రమే వారు సత్కారలు స్వీకరిస్తారు అన్నది జగద్విదితమే...అది కూడా సభా / వేదిక మరియాదకు కట్టుబడి ఉండడంకోసం మాత్రమే...
ఇక అసలైన విషయానికి వస్తే, వారు అందరిచేత ఇలా నియమాచరణ చేయించి తమ ప్రవచనామృతం ద్వారా పరతత్వాన్ని సన్నిహితం చేయడంలో ఆంతర్యం కేవలం మన సంపూర్ణ ఉన్నతిని, శుభాన్ని ఆశించడం మాత్రమే....
ఇక అసలైన విషయానికి వస్తే, వారు అందరిచేత ఇలా నియమాచరణ చేయించి తమ ప్రవచనామృతం ద్వారా పరతత్వాన్ని సన్నిహితం చేయడంలో ఆంతర్యం కేవలం మన సంపూర్ణ ఉన్నతిని, శుభాన్ని ఆశించడం మాత్రమే....
శాస్త్రబద్ధంగా ఉండేలా చేసి శిష్యులకు మొదట పాత్రత, పవిత్రతను ఆపాదించి అటుపై వారి అమూల్య అనుగ్రహానికి మన హృదయాలను శాశ్వత ఆవాసంగా చేయడమే అందులోని పరమార్ధం...
నా స్కూల్ డేస్ లో చిన్నప్పుడు మా బస్తీలో త్రాగునీటి సౌకర్యం లేనప్పుడు, మంజీరా నీళ్ళతో వారానికి 2 సార్లు వాటర్ టాంకర్ వచ్చి ప్రతి గల్లీవాసులకు మంచినీళ్ళు అందించేది....
అందరం మా బిందెలు, డబ్బాలు, క్యాన్లు, బకీట్లు, లైన్లో పెట్టి పట్టుకునేవాళ్ళం...
కొందరు ఓపికగా తమవంతు వచ్చే వరకు వేచి ఉండి, వృధా కాకుండా ఒక మంచి బిందె / పాత్ర నిండా పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పెద్ద డ్రమ్ములో నింపుకునే వాళ్ళం...
కొందరేమో ఒక పానిపట్ యుద్దంలాగా గోల గోల చేసి విరిగిన బకీట్లు, చిల్లుల సొట్టబిందెలు, అలా ఏది పడితే అది తెచ్చి నీళ్ళు పట్టుకొని వెళ్ళడం, మళ్ళీ అవే తీసుకొని పాని కేలియే పానిపట్ యుద్ద్ అన్నట్టుగా తిరిగిరావడం...ఇలా ఉండేది టాంకర్ దెగ్గర సీన్.... అమ్మ లైన్లో ఉండి నిండుగా పట్టించిన డబ్బాలను, బిందెలను నేను ఇంట్లో పెద్ద డ్రమ్ములో పోస్తూ, లెక్కపెట్టెవాడిని మేము ఎన్ని బిందెలు పట్టుకున్నామో, ఆ మధ్యలో తుఫాన్ లాగా వచ్చి లొల్లి చేసే వాళ్ళు ఎన్ని పట్టుకున్నారు అని...

టాంకర్ మొత్తం ఖాళి అయిపోయినతర్వాత చూస్తే, పాత్ర శుద్ది లేని ( అంటే చాలాసార్లు విరిగిన బకీట్లు, సొట్టబిందెలతో నీళ్ళు పట్టుకున్న ) వారికంటే,
కొన్ని సార్లైనా సరే మంచి పాత్రలతో నిండుగా పట్టుకొని దాచుకున్న వారి దెగ్గరే ఎక్కువ నీరు జమయ్యేది....
కొన్ని సార్లైనా సరే మంచి పాత్రలతో నిండుగా పట్టుకొని దాచుకున్న వారి దెగ్గరే ఎక్కువ నీరు జమయ్యేది....
దీనివల్ల తెలిసింది ఏంటంటే, ఎన్ని సార్లు ఎంతో గొప్ప అల్లరితో ఢిషుం ఢిషుం అంటూ అందరిని నెట్టి తిట్టి పట్టుకున్న వారికంటే పద్దతిగా ఒద్దికగా పట్టుకున్న వారి దెగ్గరే జలసిరి అధికం...!
అదే విధంగా శాస్త్ర మరియాదను పాటిస్తూ గురు వాక్కులపై విశ్వాసం తో, బొట్టు పెట్టుకొని / పంచే-ధోతి-ఉత్తరీయం ధరించి / ఒద్దికగా చేసే కాస్తంత ఆధ్యాత్మిక ఆచరణ అయినాసరే అధికఫలవంతం అవుతుందనే సద్గురువులు మనకు ఆ విధంగా ఆచారంపై మక్కువ కలిగించి, మనకు మనో పాత్ర శుద్దిని, అధిక పాత్రతను చేకూర్చి అనుగ్రహించడం ......![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
ఒకప్పుడు మన తాతా అమ్మమ్మల నాటి కాలంలో పంచెకట్టుకోవడం/ఉత్తరీయం వేసుకోవడం ఒక సామాన్య దైనందిన విషయం... కాని ఇవ్వాళ మనకు అదే పంచెకట్టు ఒక విశేషం....ఏంటోయ్ పంచే కట్టావ్ ఏంటి విశేషం.....అన్నట్టుగా కాలం మారింది....
అట్లే మన తరువాతి తరాలు, దేవుడికి నమస్కారం చేయడం, గుడికి వెళ్ళడం, అసలు శ్రీహరిని తలుచుకోవడం కూడా ఒక పెద్ద విశేషం గా భావిస్తారేమో...!! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
ఎవరి విశ్వాసం వారిది....ఎవరి ఆచరణ వారిది...ఎవరి సంప్రదాయం వారిది....ఎవరి మార్గం వారిది.....! ఏది ఎక్కువ కాదు...తక్కువ కాదు...దేని ప్రత్యేకత దానిదే...
ఒకే కాలనిలో ఉన్నవారందరు కలిసిమెలిసి ఒకే రోడ్డు పై నడిచి తమ తమ ఇళ్ళకు చేరుకున్నట్టుగా, ఒకే సమాజం లో ఉన్నవారందరు కలిసి మెలిసి కలహించుకోకుండా ఒకే సుహృద్భావంతో జీవించి వారి వారి మార్గాలను అనుసరించి పరతత్వ తీరాలకు చేరుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అని నా ఫీలింగ్ అన్నమాట .. ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f4c/1/16/1f642.png)
No comments:
Post a Comment