Friday, March 29, 2019

అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల షష్ఠిపూర్తిమహోత్సవము.... ☺

అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువుల షష్ఠిపూర్తిమహోత్సవము.... 
ఆ పేరువినగానే అప్రయత్నంగా కొన్ని కోట్ల మనసులు అమాంతం ఆనందంతో నమస్కరించి ప్రణమిల్లుతాయి వారి దివ్యపాదపద్మముల చెంత.... 
ఆ సద్వాక్కును అవధరించిన వీనులు అప్రయత్నంగానే అమరవంద్యుడైన శ్రీవేంకటనాథుడి ఆలయ తిరుఘంటానాదంలా వాటిని నిరంతరం మననంగావిస్తూ మనోఫలకంపై లిఖిస్తూ ఆధ్యాత్మికానందలహరిలో
ఓలలాడుతాయి....
వారి దివ్యమంగళస్వరూపదర్శనభాగ్యం
లభించిన నయనద్వయం, సాక్షాత్తు ఆనందనిలయంలో కొలువైన స్వామివారి శుక్రవార అభిషేకానంతర ధావళీఖచిత అలంకార ప్రయుక్త నిజపాదదర్శన సహిత దర్శనభాగ్యం లభించినంత ఆనందంతో చెమ్మగిల్లుతుంది....
ఎందుకయ్యా అంటే....
1. బూటకపు వాగ్దానాలతో ప్రజానీకాన్ని వంచించి, నిరుపేదప్రజలకు చెందవలసిన సొమ్మును తమతమ కుటుంబాల కోసం మింగేసి ఫారిన్ బ్యాంకుల్లో వందల కోట్లు వెనకేసునే వారు, 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మైకు పట్టుకొని కంఠశోషచెందేలా తమ స్వరపేటికను ఉపయోగించి మాట్లాడుతారేమో....
కాని ఆ సద్గురువుల స్వరం మాత్రం దశాబ్దకాలంపైచిలుకు నిరంతర కంఠశోషతో కేవలం భగవద్కైంకర్యంగా ఇతరులకు మంచి మాటలు చెప్పి ఎంతోకొంత వారి జీవితాలకు మేలు చెయ్యాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఎటువంటిస్వార్ధ చింతన లేకుండా మాట్లాడుతోంది కాబట్టి....😊
2. ' బిసినెస్స్ ' అనే పేరుతో నిరంతరం లోకసంచారం గావించి ప్రకృతి పాడైనా, ప్రజల ఆరోగ్యం పాడైనా మనకేంటిలే అనుకొని వ్యాపారరంగంలో అగ్రగామిగా నిలదొక్కుకొని అపరకుబేరులవ్వడమే
లక్ష్యంగా సమాజహితాన్ని మరచి
బ్రతికే వారు వేదికలెక్కి మైకుల్లో తమ తమ వ్యాపారాల గురించి ఊదరగొట్టి, అదే వారు సమాజశ్రేయస్సు కై గావించే మహాయజ్ఞ్యంలా మాట్లాడుతారేమో....
కాని ఆ సద్గురువులు మాత్రం, ఒక్కసారి వేదికనెక్కి ఆసీనులై... "శుక్లాంబరధరంవిష్ణుం...." అని ప్రార్ధించి తమ స్వరంతో గావించే శుద్ధభక్తిభరిత ప్రవచనం అనే ఈశ్వరార్చనాంతర్భాగంగా వెలువరించే జీవనోద్ధారక సత్యాలు, జీవితానికి ఉపయుక్తమైన సార్వకాలిక జ్ఞ్యానసూచీలు, ఎన్నో శాస్త్రాలను మథించి కాచి వడపోస్తే తప్ప లభించని దైవత్వపు దివ్యజ్ఞ్యానగులికలు, తరతరాలకు తోడుగానిలిచేలా, తెలుగుభాషాదివ్యత్వాన్ని మేళవించి "సత్ చిత్ ఆనంద " స్వరూపమైన పరబ్రహ్మతత్వపు సత్యాలను చాటిచెప్పే సుమధుర దేవభాష్యముల గురించి మాత్రమే మాట్లాడి గావించిన సమాజశ్రేయస్సు, సార్వజనీన లోకోపకారియై సదా నిలిచిఉంటుంది కాబట్టి....😊
3. కుటిలమార్గాలద్వారా ఆర్జించి పోగుచేసిన ఆ వందలవేల కోట్ల సంపద, కేవలం సదరు వ్యక్తికి, తత్ సంబంధీకులకు మాత్రమే అనుభవించయోగ్యమైన అశాశ్వతమై అనతికాలంలోనే క్షయమైపోయే ఆస్తిగా ఉంటుంది తప్ప సమాజానికి ఎటువంటి హితమొనరించని కాలుష్యకాసారజలం వంటిది....
( అందులో కొంతైనా సమాజహితానికి కూడా వెచ్చించనంతవరకు...)
ఎంతో ప్రయాసతో జీవితాన్నే ఒక చిరంతన జ్ఞ్యానయజ్ఞ్యంగా మలిచి సద్గురువులచే సమకూర్చబడిన " ఆధ్యాత్మికత " అనే శాశ్వతమైన దైవిక సంపద నిరంతరం సమాజహితాన్ని గావించి, తరతరాలకు వీరు వారు అనే తరతమ భేదభావాలు లేకుండా అందరికి అయాచితమైన ఆస్తిగా పరిణమించి, ఆశ్రితుల జీవిత స్వోద్ధరణకై సుస్థిరమైన ఆలంబనగా నిలిచిఉండే ఆ సద్వాక్కుల పెన్నిధి, గంగోత్రి వద్ద ప్రవహించే స్వచ్ఛమైన భాగీరథీ జలసిరి....అది కేవలం ఒక జన్మకు మాత్రమే కాకుండ, జన్మపరంపరలకు సర్వశ్రేయోదాయకమైన అధ్యాత్మజీవామృతం కాబట్టి... 😊
ఎందరో భక్తభాగవతుల హృదయక్షేత్రాలను భగవన్నామం అనే హలంతో భగవద్సేవ అనే సేద్యానికి అనువుగా చేసి వారి ప్రవచనధారతో నారు నీరు సమకూర్చి, ప్రశాంతజీవనం, మనోవికాసం, ఆత్మోద్ధరణ, సమస్త ఇహపర సౌఖ్యములు, అన్నిటినిమించి భగవద్భక్తిభరిత జీవన్ముక్తిని, సేద్యఫలాలుగా మనకు అందించి, కేవలం మనహ్పూర్వక నమస్కారం మాత్రమే మననుండి స్వీకరించే ఆ సద్గురువుల అజరామరమైన సద్వాగ్యజ్ఞ్యం యుగయుగాలకు తరతరాలకు ఆశ్రితులందరికి జ్ఞ్యానదివిటీలై భాసించాలని అభిలషిస్తూ, వారి దివ్యపాదపద్మములకు ఒక ఏకలవ్య వినేయుడి సాంజలిబంధక సాష్టాంగనమస్సులు..... 🙏🙏🙏🙏🙏
***** ***** ***** ***** *****
శ్రీగురుభ్యోనమః.....
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||
కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||
నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||
నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||
నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||
......
.
.
.
***** ***** ***** ***** *****
నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం...😊
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment