Friday, March 29, 2019

కూచి గారి ఈ త్రిజటా వృత్తాంత వర్ణచిత్రం భళి భళి...! 😊

శ్రీ చాగంటి సద్గురువుల సంపూర్ణరామాయణ ప్రవచనం సదా నెమరువేసుకునే వారికి గుర్తున్నట్టుగా, రాముని అయనం లో క్లిష్ట పరిస్థితులు ఎదురై ఇక రామాయణం ముందుకు సాగడం కష్టం అని అనిపించినప్పుడల్లా ఒక స్త్రీమూర్తి వల్ల ఆ సందర్భం మలుపు తిరిగి శుభకరమై ముందుకు సాగడం మనం చూస్తుంటాం...
మంథర నూరిపోయడం, కైకేయి హఠం (వీళ్ళది కుళ్ళుతో కూడిన మనస్తత్వంలా అనిపించినా ఆ సందర్భం లో దేవతలు వారిచే అలా చేయించారు అని గురుదేవుల ఉవాచ గుర్తుండేఉంటుంది.... ), అనసూయామాత సీతమ్మవారికి అభరణాలిచ్చి దీవించడం, శూర్పనఖ తెంపరితనానికి ఖరదూషణయుద్ధం జరిగి తుదకు సీతాపహరణం జరగడం, సీతాన్వేషణకై దక్షిణదిక్కుగుఏగిన హనుమ నాయకత్వంలోని వానరసైన్యం
స్వయంప్రభా బిలము నుండి బయటపడడం, నాగమాత సురస పెట్టిన పరీక్షలను సూక్ష్మ శరీరుడై హనుమ జయించి ఆమె అనుగ్రహాన్ని పొందడం, సిమ్హికను సమ్హరించడం, లంకిణి ని వశపరుచుకొని శత్రునాశనానికై వామపాదంతో హనుమ దొడ్డిదారిన లంకాప్రవేశం కావించడం, అశోకవనబంధీగా ఉన్న సీతామాతకు విభీషణుని సతీమణి సరమ సహాయం చేయడం, కాపలాగా ఉన్న రాక్షసి అయినా సరే త్రిజట తన స్వప్నం గురించి చెప్పి సీతమ్మను ఊరడించడం, ఇత్యాది గా ఒక్కొక్క స్త్రీమూర్తి వల్ల శ్రీమద్రామాయణం ఒక్కోలా మలుపుతిరిగి శ్రీరామునికి ఎనలేని సహాయం గావించి చరితార్ధులైరి కదా...!
కూచి గారి ఈ త్రిజటా వృత్తాంత వర్ణచిత్రం భళి భళి...! 😊
Kuchi Saisankar
"త్రిజట"

No comments:

Post a Comment