శ్రీ యాదాద్రి లక్ష్మీనారసిమ్హుడి ఆలయ ఈ అపురూప దృశ్యమంజరి.......!
ఆహా అని అనిపించకమానదు కద....!
శ్రీపాంచరాత్ర ఆగమోక్త విధంగా ఆలయ ప్రాకార స్థిరీకరణ....
తరతరాలకు తరగని వన్నెలలదబడి
యుగయుగాలకు జగజగాలకు శాశ్వతంగా శ్రీలక్ష్మీనారసిమ్హుడి దేదీప్యదివ్యదైవికప్రభలను వెదజల్లే విధంగా ఎంతో ఘనమైన రీతిలో ఆలయ నవీకరణ జరిగి బాలాలయం నుండి గర్భాలయానికి వేంచేసి భక్తులను ఘనంగా అనుగ్రహించేందుకు సంసిద్ధమౌతున్న శ్రీలక్ష్మీనారసుమ్హుడి వైభవం అంతని ఇంతని వర్నించనలవి కానిది కద....
ఒక హాస్పటల్కో, స్కూల్కో, హోటల్కో వేళ్ళాలంటేనే ఆ ప్రాంతం ఎంత పరిశుభ్రంగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత సప్రామాణికంగా ఉంది, ఇత్యాదివన్నీ చూసి ఏది చాలా బావుందో వాటి దెగ్గరికే వెళ్ళడానికి మనం సమ్మతిస్తామే...
మరి అటువంటిది
నమ్మి కొలిచే ఎందరెందరో భక్తులకు
ఆరోగ్యం,విద్య/జ్ఞ్యానం,పుణ్యం/ఐశ్వర్యం, ఇత్యాదివన్నీ కూడా అనుగ్రహించే దేవాలయం
ఎంత ఘనంగా ఉండాలి..?
ఎంత సప్రామాణికంగా ఉండాలి...?
ఎంత దృఢంగా ఉండాలి...?
ఎంతటి శాస్త్రీయ వైభవంతో అలారారే విధంగా ఉండాలి...?
ఎంతటి షోడశకళాత్మక దైవత్వం ఉట్టిపడేలా ఉండాలి..?
అనేది ఎవరో కొందరు మహనీయులకు మాత్రమే స్ఫురించే వైజ్ఞ్యానిక అంశం...
అవ్విధంగా ఒక ఆలయాన్ని తీర్చిదిద్దాలనే
సంకల్పం, సంపత్తి, అధికారం, తీరిక, చిత్తశుద్ధి, కార్యాచరణ ప్రణాళిక, ఇత్యాదివన్నీ ఉండడం ఒకెత్తు...
వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిగా ఆచరణాత్మక దృక్కోణంలో ఆహ్వానించి, అమలుపరిచి భక్తులకు / లోకానికి అందివ్వడం ఒకెత్తు ..
ఈ ఇరు పార్శ్వములను సమన్వయపరుస్తూ ఇన్నాళ్ళుగా సాగిన ఎందరో శ్రామికుల శ్లాఘనీయమైన శ్రమ ఒక అత్యత్భుతమైన దేవాలయంగా రూపాంతరం చెంది ఇవ్విధంగా కళ్ళెదుట సాక్షాత్కరించే సత్యమై నిలిచి ఎందరో జీవితాలకు దైవిక ఆపన్న హస్తాన్ని అందించే అమరుల ఆలంబనగా భక్తలోకానికి అందిరావడం నిజంగా ఎంతో హర్షించవలసిన విశేషం...
శ్రీలక్ష్మీనారసిమ్హ స్వామివారు అతిత్వరలో వారి గర్భాలయంలో షోడశకళాప్రపూర్ణులై కొలువై,
ఈ కలియుగ భక్తుల ఈతిబాధలను ఛీల్చి చెండాడే ఉగ్రనారసిమ్హుడిగా ఒకవైపు,
భక్తుల పాలిటి కొంగుబంగారమై ఉండే సౌమ్య నారసిమ్హుడిగా మరోవైపు,
వర్ధిల్లుతూ,
దేవాదాయధర్మాదాయ శాఖచే
కొత్తగా ప్రవేశపెట్టబడిన బెల్లం లడ్డూల ప్రసాదం కూడా భక్తుల్లెల్లరికి బాగా అందుబాటులోకి
రావాలని ఆకాంక్షిద్దాం...😊👏🍨💐🤨🍟🍕
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణోః
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్...🙏
https://twitter.com/KTRTRS/status/1403923427245780994?s=19
No comments:
Post a Comment