" వేంకట సూర్య నారాయణ " అంటూ పేరులోనే ముగ్గురు దేవుళ్ళ పేర్లను నింపుకున్నందుకు అందుకు తగ్గట్టే..
శ్రీ వేంకటేశ్వరుడి వైవిధ్యం....
( అనగా ప్రభాస్ ప్లే చేసే రోల్స్ లోని నిత్యనూతన వైవిధ్యం )
+
సూర్యుడి తేజం....
( అనగా ప్రభాస్ ప్లే చేసే రోల్స్ లోని పవర్ఫుల్ అప్పియరన్స్ )
+
నారాయణుడి సర్వాంతర్యామిత్వం....
( అనగా ఎటువంటి రోల్స్ అయినా అవలీలగా అల్లుకుపోయే విధంగా చేయగల ప్రభాస్ యొక్క సర్వసన్నద్ధత )
=
మన ప్రభాస్ నటనా కౌశల ప్రాభవం...
అనేలా...
తెలుగు సినిమా యొక్క వైభవాన్ని బాహుబలి వంటి సినిమాలతో జగద్విఖ్యాతం గావించిన ఘనతను సొంతం చేసుకున్న ఘనుడు....
నటించడం వేరు....
నటనలో జీవించడం వేరు...
నటనకే ఒక క్రొంగొత్త భాష్యాన్ని ఆవిష్కరించే దిశగా నటనా ప్రస్థానాన్ని కొనసాగించడం వేరు...
ఫర్ ఎగ్సాంపుల్....
అనాడు....
" రా రా రా రా..రాఘవేంద్రా రా.... "
అంటూ సాగే " రాఘవేంద్ర " సినిమాలో తన క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించే పాత్రలోకి ఎంతటి రాజసంతో ఒదిగి నటించాడో....
ఈనాడు...
" తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి...
కలలో దేవుడిలా కాపైఉంటావా... "
అనే బాహుబలి సినిమాలో తన క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించే పాత్రలోకి అంతే హుందాగా ఒదిగిన రాజసం గల విలక్షణ నటుడు....
వైవిధ్యం అనేది నటన వల్ల ఆ పాత్రకి వచ్చిందా.....లేదా ఆ పాత్ర వల్ల నటనకి అబ్బిందా అని చెప్పడం కొంత క్లిష్టమైనదే...
ఎంచుకున్న పాత్రకు తగు రీతిలో ఉండవలసిన నటనా కౌశలాన్ని పుణికిపుచ్చుకోవడం
+
నటనలో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండే పాత్రలను ఎంచుకోవడం
=
ఆ సంక్లిష్ట సమతౌల్యం సాధింపబడడం....
అనే ఈక్వేషన్ ని సాధించడంలో మన డార్లింగ్ దిట్ట...
అందుకే సినిమా ఏదైనా సరే మనోడికి ప్రేక్షకలోకం వేసే విజిల్స్ ఎప్పుడూ అదుర్సే...!
భాస అనగా ద్యుతి...
ప్రభాస అనగా ప్రహృష్టమైన ద్యుతి...
చిన్నప్పుడు వారి పెద్దలు పెట్టిన పేరుకు ధీటుగా అంతటి ప్రహృష్టమైన యశోచంద్రికలతో మన డార్లింగ్ సినీప్రస్థానం, చక్కని హుందాకరమైన కథాంశాలతో సుస్వర సుసాహితీ సరాగాలతో సాగుతూ, దిగ్విజయభరితమై తెలుగు సినిమా ప్రాభవం యావద్ ప్రపంచం గర్వించే రీతిలో ఇనుమడింపబడాలని ఆశిస్తూ....
Wishing dear Prabhas a very happy and
a joyous birthday...😊💐👍🍕🍨
Looking forward for a grand and a successfull realease of " Adipurush " for yet another historic legendary impact on the global indian cinemas....😊
No comments:
Post a Comment