Tuesday, December 21, 2021

శ్రీ ప్లవనామ సంవత్సర చాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస శుభాభినందనలు....💐🙏

శ్రీ ప్లవనామ సంవత్సర చాంద్రమాన మార్గశిర మాసాంతర్గత సౌరమాన ధనుర్మాస శుభాభినందనలు....💐🙏

మాసానాం మార్గశీర్షోహం....
ఋతూనాం కుసుమాకరః.....
అని కదా గీతాచార్య ఉవాచ....

వసంతఋతువులో ప్రకృతి మొత్తం నూతనతేజస్సుతో శోభిల్లుతుంది కాబట్టి ఆ పరతత్త్వ ప్రాభవాన్ని పరమాత్మగా భావించడం బానే ఉంది....

మరి హేమంత ఋతువులో చలి పులి తన పంజా విసిరే సమయంలో...
రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుతో 
చాలామంది కార్డియాక్ అర్రెస్ట్ తో /  గుండె/ఊరిపితిత్తుల రుగ్మతలతో ప్రాణాలు వదిలే ఈ హేమంత ఋతువులో ఏ పరతత్త్వ ప్రాభవ కారణంగా 
" మాసానాం మార్గశీర్షోహం "
అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు..?

వసంత
గ్రీష్మ
వర్ష
శరద్
హేమంత
శిశిరమనే  ఆరు ఋతువులు ఆ పరమేశ్వరుని ఆహార్యమై ఉంటాయి అని ఒక సినిమాపాటలో వినే ఉంటారు కద....
(" సాగరసంగమం " సినిమాలోని 
" ఓం నమః శివాయా... " అనే పాటలో....)

"అంతర్ముఖసమారాధ్య బహిర్ముఖసుదుర్లభాయైనమః"
అని శ్రీలలితాసహస్రంలో చదివేఉంటారు కదా...

శ్రీచాగంటి సద్గురువులు వారి తిరుప్పావై ప్రవచనాల్లో వివరించినట్టుగా
శ్రీవిళ్ళిపుత్తూర్ వాసులతో గోదాదేవి 
కాత్యాయనీ అధిదేవతగా ఉండే శ్రీవ్రతం ఆచరించి / ఆచరింపజేసి ఎల్లరికీ శ్రీకృష్ణుడి / శ్రీరంగడి అనుగ్రహాన్ని లభింపజేసి తరింపజేసిన వైనం మనం ఇప్పటికీ శ్రీవ్రతం / తిరుప్పావై నోములో చదవడం ఎల్లరికీ విదితమే....

అది మల్లియపుష్పం అని తెలిసినా తెలియకున్నా....
ఎవరు ఏమిటీ ఎందుకు ఇత్యాది వాటితో సంబంధం లేకుండా సమీపించిన వారెల్లరికీ ఆహ్లాదం / ఆరోగ్యం ప్రసాదించడమే విరబూసిన మల్లియ యొక్క వైభవమై ఉంటుంది అనేది ఎల్లరికీ తెలిసిందే.... 

అదేవిధంగా....
కొందరు మహనీయులచే అనుగ్రహింపబడిన సారస్వతం....విన్నంతమాత్రాన / చదివినంతమత్రాన
విశేషమైన దేవతానుగ్రహన్ని వర్షించడమే వాటి వైభవమై ఉంటుంది....

భూదేవి అంశలో శ్రీవిళ్ళిపుత్తూరులో
పెరియాళ్వారుళకు తులసీవనంలో స్వయంవ్యక్తమై లభించి, ఆండాళ్ / కోదై / గోదా గా లోకంలో
పిలువబడి తిరుప్పావై / శ్రీవ్రతం పేరిట 30 శక్తివంతమైన దైవిక పాశురములను అనుగ్రహించి తరింపజేసిన గోదమ్మ వృత్తాంతం కూడా అటువంటిదే.... 

కష్టాల్లో ఉన్నప్పుడు, మనల్ని ఓదార్చే / ఆదరించే నిజమైన మితృలెవరో..... 
బాగునప్పుడు, మన దరిజేరి దోచుకొని మింగేవారెవరో.....
తెలుసుకోవడం తేలిక...
అని మన పెద్దలు చెప్పిన మాట వినే ఉంటారు....

ఒక్కొక్క సీరియల్లో ఒక్కోలా వందలకొలది టీవీ సీరియల్లల్లో ప్రసారం కావింపబడే వేలకొలది వ్యక్తిత్వాలను గమనించినట్లైతే ఒక్కోసారి మనం ఆశ్చర్యపోతూంటాం...
మనుషులు ఇవ్విధంగా కూడా ఉంటుంటారా అని....

అన్ని వ్యక్తిత్వాల్లో మనం గమనించగలిగే ముఖ్యమైన విషయాలు

1. భగవద్భక్తితో సంస్కరింపబడిన జీవితాన్ని గడిపే వారి జీవన దృక్పథానికి.....
మరియు భగవద్భక్తి లుప్తమై ఉండే జీవితాన్ని గడిపే వారి జీవన దృక్పథానికి గల భేదం....

( ఇక్కడ " భగవద్భక్తి " అంటే చాదస్తం పేరుతో ఇంటిల్లిపాదిని ఇబ్బందిపెట్టడం గురించి కాదు..... 
భగవంతుడిపై గల అచంచల విశ్వాసంతో జీవిస్తు, విశేషమైన బుద్ధిబలంతో, జ్ఞ్యానకౌశలంతో ఈ లోకం యొక్క నైజాన్ని క్షుణ్ణంగా వడబోసి దేశకాలానుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎందుకు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగల సద్వర్తనను అలవరచుకున్న జీవితం అని అర్ధం...)

2. "కూటి కోసమే కోటి విద్యలు...." అన్నట్టుగా జీవితంలో ఆర్జించిన ప్రతి విభూతిని కేవలం కూటి కొరకే వెచ్చిస్తున్నామా...
లేదా ఎంతో కొంత ఆత్మోద్ధరణకు కూడానా.....
అనేది సదరు వ్యక్తి యొక్క ఉన్నతత్త్వానికి మేయమై, మార్గమై, లక్ష్యమై, గమ్యమై, పరిఢవిల్లుతుంది....
అనే సత్యాన్ని రూఢపరచుకొని జీవించే వారికి మరియు అసలు ఆత్మోద్ధరణ అనే పదం కూడా పెద్దగా పరిచయం లేని వారికి గల భేదం ఆయా వ్యక్తుల జీవన ఔన్నత్యానికి సూచికగా ఉండడం... 

3. పుట్టామా, పెరిగామా, ఉద్యోగ/వర్తక-వ్యాపార/వ్యాపకాలతో జీవితం బిజి బిజి గా గడిపామా, మనవారు అని అనుకున్న వారికి, లేదా మనవారిగా మనం భ్రమించిన వారికి, తగు రీతిలో కూడబెట్టామా, మన తరువాతి ఒకటో రెండో తరాలవారి జీవిత బాగోగులు చూసామా, తుదకు ఒకనాడు

" నిందలేనిదేబొందిపోదు " 
" కోటిమంది వైద్యులు కూడివచ్చినగాని మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు..."
" పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ..."
ఇత్యాదిగా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నట్టుగా...

" రోజూ తిన్నట్టే ఇందాకే ఇడ్లి కూడా తిన్నారు....
బీ.పీ బ్రేస్లెట్ ఉన్నాకూడా ఒక్కసారిగా హైబీపి వచ్చి పెద్దావిడ జస్ట్ ఇప్పుడే ఉన్నచోటే కుప్పకూలింది..... "

" ప్రతిరోజు వెస్కున్నట్టే ఇందాకే తిన్నతర్వాత ఆయాసానికి గోలీ వేస్కున్నారు....కాని ఒక్కసారిగా ఆయాసం ఎక్కువై ఊపిరి తీయలేక ఇబ్బందిపడుతూ ఒక్కసారిగా కన్నుమూసారు...."

ఇత్యాదిగా ఏదో ఒక కారణంతో అవసానసమయం రాగానే కన్నుమూయడం గురించి వినేఉంటారు.....

కళ్ళు తెరిస్తే జననం....
కన్నుమూస్తే మరణం.... 
ఆమధ్యలో....
రోజు పొద్దున కళ్ళు తెరిచినప్పటినుండి..
రాత్రి కళ్ళు మూసేంతవరకుగల కర్మాచరణమే మన జీవనం....

ఎన్నో రోజుల, వారాల, నెలల, సంవత్సరాల, దశాబ్దాల, నిరంతర జీవనసంచయమే "మన జీవితం"
అనే కావ్యం....

ఎవరికి వారే లిఖించుకునే ఆ 
నిరంతరజీవనమధుకావ్యంలో గల వివిధ అధ్యాయాల్లో అధిక భాగం ఏముంది... ???

దున్నపోతులా తిని అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద పడి పనికిమాలిన తిరుగుళ్ళు తిరగడమే ఎక్కువగా అన్ని పేజీల్లో ఉందా....?
లేదా
84 లక్షల జీవరాశుల్లో వాగ్వైభవంతో, బుద్ధివికసనంతో జీవించగల ఒకేకొక ప్రాణి అయిన మనుష్యుడిగా పూర్వజన్మలపుణ్యబలంతో జన్మించినందుకు తగు రీతిలో ఆ జన్మకు బుద్ధిబలం యొక్క ఆలంబనను అందించి " జీవనప్రమాణాలు " మాత్రమే కాకుండా
" జీవప్రమాణాలు " కూడా మెరుగయ్యే విధంగా జీవించిన పేజీలు కూడా ఉన్నయా..??

ఆర్జించిన బుద్ధిబలంతో ఎప్పుడు చూసినా
"వాణ్ణి ఎట్ల ముంచి బ్రతుకుదాము.... 
వీణ్ణి ఎట్ల ముంచి బ్రతుకుదాము....
వాడి సంపద ఎట్ల మింగాలి... 
వీడి సంపద ఎట్ల మింగాలి...."

అనేలా ఉండే జీవితమే ఎక్కువ పేజీల్లో ఉందా...?
లేదా....

"వారిలా ఎట్ల అభివృద్ధి చెందాలి....
వీరిలా ఎట్ల అభివృద్ధి చెందాలి....
వారిలా మనం కూడా ఎట్ల గొప్పవారమవ్వాలి... 
వీరిలా మనం కూడా ఎట్ల గొప్పవారమవ్వాలి..."
ఇత్యాదిగా ఆదర్శవంతమైన
జీవితాన్ని తీర్చిదిద్దుకున్న పేజీలు కూడా ఏమైనా ఉన్నయా...??

అనేది ఎవరికి వారు తరచి చూసుకునే జీవిత గమన సత్యం..... 

అటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని ఈ భువిపై జీవించి

ఒక ఆదర్శ పుత్రుడై.... 
ఒక ఆదర్శ స్నేహితుడై....
ఒక ఆదర్శ మితృడై....
ఒక ఆదర్శ సఖుడై....
ఒక ఆదర్శ భర్తయై.... 
ఒక ఆదర్శ యోద్ధుడై....  
ఒక ఆదర్శ ఆపద్బాంధవుడై.... 
ఒక ఆదర్శ రాజనీతిజ్ఞ్యుడై....

ఇత్యాదిగా ఎన్నో విధాలా ఒక  ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో పరిపూర్ణపరమాత్మ గా పరిఢవిల్లిన జీవన వైభవం ఆ పార్థసారధిది....
పాండవదూతగా పేరు గాంచిన పరంధాముడిది.....
 
పరిపూర్ణ పరమాత్మగా ఆ శ్రీకృష్ణపరమాత్మ ప్రదర్శించిన భక్తజనోద్ధరణాత్మక ( శ్రీవ్యాసమహర్షి ప్రణీతమైన శ్రీమద్భాగవతాంతర్గతమైన ) లీలలు ఎన్నో ఎన్నెన్నో.....

ఈ భూమిపై ఉంటూనే ఒక సాధరణ ప్రాణికి ఉండే షడూర్ములకు అతీతమైన జీవితాన్ని 
జీవించిన ఆ పరమాత్మ, తన భక్తులకు కూడా ఆ దివ్యజీవన ఔన్నత్యాన్ని ఎరుకపరిచి పరతత్త్వప్రాభవాన్ని తెలియజెప్పిన వైనాన్ని తన 30 తిరుప్పావై పాశురాల్లో గానం చేసి తుదకు
శ్రీరంగడినే శ్రీకృష్ణపరమాత్మగా భావించి సేవించి వరించి ఐక్యమైన గోదాకల్యాణ ఘట్టం నిజానికి 
జీవాత్మ పరమాత్మల అనుంగు అన్యోన్యత్వానికి సూచికగా ఉండే పరతత్త్వ సామ్యము.....

హేమంత శిశిర సంధి సమయంలోని మార్గశిర పుష్య మాస మధ్యన వచ్చే గోదారంగనాథ దివ్యతిరుక్కల్యాణం జీవాత్మ పరమాత్మను పరిపూర్ణ ఎరుకతో పొందవలసిన కైవల్యసిద్ధిని ఎరుకపరిచే దైవిక ఘట్టం.....

"ప్రాణాత్ వాయురజాయత..."
అని అంటోంది పురుషసూక్తం......

అనగా మనలో ఉండే
( ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమనబడే పంచ ప్రాణాలు ) + ( నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడే పంచ ఉపప్రాణాలను ) 
వాయువు తత్త్వ మూలకంగా శాస్త్రం నిర్దేశించింది...

నార్మల్ గా గాలి వీచేటప్పుడు పెద్దగా ఏమి పట్టించుకోము.....

గాలి ఆడకపోయిన...
గాలి వేడిగా మారినా......
గాలి చల్లగా మారినా.....
అప్పుడు గాలి గురించిన ప్రత్యేక చర్చ, శ్రద్ధ, ఇత్యాదివన్నీ ప్రారంభమౌతాయి....

ఎండా కాలంలో గాలి బాగ వేడిగా ఉంటుంది కాబట్టి గాలి యొక్క వ్యాపకత్వంలో ఉష్ణోగ్రత పెరిగినా
ప్రాణానికి పెద్దగా ఇబ్బంది ఉండదు...
ఎందుకంటే గాలి యొక్క వ్యాపకత్వానికి అడ్డంకి ఉండదు కాబట్టి.... 
( భరించలేని సూర్యతాపంతో సంభవించే వడదెబ్బ గురించి ఇక్కడ చర్చ కాదు....) 

కాని మార్గశిర మాసం తో విజృంభించే చలి తో గాలి యొక్క వ్యాపకత్వంలో సంభవించే మార్పులతో శరీరాంతర్గత గాలి యొక్క వ్యాపకత్వానికి అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి.... 

గాలి అనగా ప్రాణం యొక్క తేజస్సు మందగించడంతో సాధారణంగానే శరీరం కొయ్య బారడం, శరీరాంతర్గత సహజ జీవక్రియా సామర్ధ్యం తగ్గుముఖం పట్టడం, ఇత్యాదిగా వాతవరణంలో తగ్గిన ఉష్ణోగ్రత యొక్క ప్రభావం మన శరీరాంతర్గత గాలి అనే అగోచర ప్రాణేంద్రియ వ్యవస్థపై ప్రభావం చూపడం మనం ఈ చలికాలంలో బాగా గమనించవచ్చు......

మన శరీరాంతర్గత ప్రాణమే మనలో ఉండే జీవాత్మ మరియు పరమాత్మ అనే తత్త్వ భావన....

ఆ ప్రాణశక్తిలోని హెచ్చు తగ్గులను ప్రస్ఫుటంగా ఎవరికి వారు గమనించుకోగలిగే కాలం మార్గశిర మాసం.....
( " ఒ రెండు బుక్కలు అన్నం తక్కువ తింటే ఏంపోయింది....
చలి కాలంలో బొజ్జ ఫుల్ల్ గా తింటే అరగదు.... అజీర్తి....పైత్యం....వాతం.....
అంటూ మన పెద్దలు అనే డైలాగ్స్ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కద...)

ఆతరువాత పురుషసూక్తంలో చెప్పబడే వాక్యం "నాభ్యాదాసీత్ అంతరిక్షం..."

అనగా మన నాభిమండలమే యోగ పరిభాషలో అంతరిక్షానికి, పూర్ణత్వానికి, శూన్యత్వానికి, రోదసికి, 
ఇత్యాదిగా సకల అమేయమైన వ్యాపకత్వంతో అలరారే ఆకాశ తత్త్వానికి సంకేతం.....

మన ఇళ్ళల్లో వెంటిలేటర్లను గోడలకు పై  భాగంలోనే ఎందుకు పెడతారు...?

మనం విడిచే Co2 భరిత వేడి గాలి సమీపాకాశంలోని పైపొరల్లో కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి బయటి ఆకశంలోకి అది సంగమించి స్వఛ్ఛమైన గాలి మన సమీపాకాశంలోనికి స్వాగతించబడాలి కాబట్టి....

అదే విధంగా మన శరీరాంతర్గంతంగా జరగవలసిన పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఈ చలికాలంలో మందగించిన జీవక్రియలతో సరిగా జరగదు కాబట్టి..... గాలి / ప్రాణ మూలకానికి ప్రత్యేక దైవిక శక్తి యొక్క ఆలంబన అత్యావశ్యకమైనది.....

గాలి ఎక్కడైనా గాలే కద అని అనడం సాధారణం.... 
ఆ గాలి యొక్క వివిధ శక్తి తత్త్వములను ప్రస్ఫుటంగ 
ప్రాణశక్తిగా తన్మూలంగా పరమాత్మ శక్తిగా అనుభవాత్మకంగా తెలుసుకోగలగడం ఈ మార్గశిరమాసంలో ఎల్లరికీ స్వానుభవ సత్యం....

అందుకే ఆ పరమాత్మ 
" మాసానాం మార్గశీర్షోహం.... " అని సెలవిచ్చాడు.....

అందుకే శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు....

" వాయుసుతునేలినట్టి వనజనాభుడే...
మాకు వాయువందు కందకుండ వాయు రక్ష....."

అని పరమాత్మ యొక్క నాభికమలజుడైన బ్రహ్మగారి అనుగ్రహమైన మన ప్రాణాలు వాయువు మూలక ఇబ్బందులతో కందిపోకుండా ఆ వాయుసుతుడైన హనుమంతుల వారిని చిరంజీవిగా ఉండేలా అనుగ్రహించిన శ్రీరామ రక్ష మనకు కూడా సదా రక్షగా ఉండాలని సెలవిస్తూ.....

"ఆదిమూలమే మాకు అంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష"  అనే ఈ క్రింది కడు చక్కని సంకీర్తనను రచించినారు....

[ శ్రీచాగంటి సద్గురువులు వారి శ్రీమద్రామాయణ ప్రవచనాల్లో బోధించినట్టుగా,
శ్రీరంగంలోని రంగనాథుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సూర్యవంశ ఆరాధ్యదేవతామూర్తి....
పౌలస్త్యవధానంతరం అయోధ్యకు చేరుకొని కోసలాధీశుడిగా పట్టాభిషిక్తుడైనప్పుడు అక్కడున్నవారందరికి కానుకలు ఇచ్చే సమయంలో, విభీషణుడికి ఈ మూర్తి కానుకగా ఇవ్వబడి లంకకు తరలించబడే సమయంలో, వినాయకుడి లీలతో ఆ దేవతామూర్తి భరతఖండం దాటి వెళ్ళకుండా ఇప్పుడున్న కావేరి ప్రదేశాన దక్షిణాభిముఖంగా నెలకొని లంకలో చిరంజీవిగా తిరుగాడే విభీషణుడిని ఈనాటికి కూడా అనుగ్రహిస్తున్న మూర్తి....

కాబట్టి ఇక్కడ తిరుప్పావై స్మరణతో

శ్రీరంగనాథుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడు, వినాయకుడు, గోదాదేవి, శ్రీవిష్ణుచిత్తులవారు,....
ఇందరి అనుగ్రహం భక్తులకు సమకూరెను...

*****
ఆదిమూలమే మాకు అంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష

భూమిదేవిపతియైన పురుషోత్తముడే మాకు
భూమిపై నేడనుండినా భూమిరక్ష
ఆమనిజలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్యముందున్న జలరక్ష

మ్రోయుచు నగ్నిలో యజ్ఞమూర్తియైన దేవుడే
ఆయములు దాకకుండా నగ్నిరక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండా వాయురక్ష

పాదమాకసమునకు పారజాచే విష్ణువే
గాదిలియై మాకు నాకాశరక్ష
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేస్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష
*****

http://annamacharya-lyrics.blogspot.com/2007/09/312adimulame-maku.html?m=1

[ నేటి తిథిన, 2014 మార్గశిర బహుళ విదియ నాడు వాయు సంబంధమైన ఇబ్బందితో పరలోకమునకు ఏగిన అస్మద్ పితామహులు, 
కీ.శే || శ్రీ అయిత హనుమయ్య గారి 7వ సంవత్సరాబ్దిక సందర్భమున పితృదేవతా వందనపూర్వక చిరు అక్షర కుసుమాంజలి...]

No comments:

Post a Comment