Thursday, December 23, 2021

జాతీయ రైతు దినోత్సవ శుభాభినందనలు... 🍨🍦🍕💐😊👍


శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టుగా 
ఇక్కడ పండించే పత్తిని వారి దెగ్గరి సిల్క్/ పట్టు కన్నా మెరుగైన నాన్యమైన వస్త్ర ముడిసరుకుగా విదేశీయులు సైతం గౌరవించిన భూవైభవం మన భారతదేశానిది..... 

పాడిపంటలే దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచి సుభిక్షమైన రాజ్యాలతో అలరారిన శతాబ్దాల వైభవ చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం.  .

గత శతాబ్ద కాలంగా, మరీ ముఖ్యంగా గత 2 దశాబ్దాల కాలంగా విజృభించిన ప్రపంచీకరణ / యాంత్రీకరణ / నవీకరణ తో శాస్త్రీయవ్యవసాయ పద్ధతుల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు వచ్చినా సరే...

భూమిని దున్నడం...పంటసాగుకు అనుకూలంగా మట్టిని శోధించడం, 
విత్తిన ధాన్యం మొలకెత్తిన తదుపరి అవసరమైన రీతిలో ఒక క్రమపద్ధతిగా పంటచేనులో వాటిని విస్తరించి సాగును కొనసాగించడం అనే మౌళిక సూత్రాలు అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ ఒక్కటే......

అప్పుడు పాడి ఆధారిత వ్యవసాయం అధికంగా ఉండడంతో, శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా పొలందున్నే కాడెడ్ల గిట్టలోని అమృతస్పర్శ తో ఆ పంటలోని ధాన్యానికి సమకూరే  ఓషధీ శక్తి మనిషికి సహజంగానే ఎంతో విలువైన ఔషధసంపదను అందించి అది సేవించబడిన శరీరాన్ని వజ్రకాయంగా, మనసును సద్గుణాల ప్రోదిగా నిలిపిన ఘనచరిత్ర మన పాతతరం యొక్క ఎవుసానిది.... 

ఇప్పుడు ట్రాక్టర్లు, పెస్టిసైడ్లు, అంతా కలగలిసి పైకి తెల్లగా నిగనిగలాడే ధాన్యమైననూ నిస్సత్తువతో ఓషధీగుణలేమితో లభించే పంటతో ఆనాటి మన పాత తరం వారు ఉన్నంత సహజమైన దృఢత్వంతో ఈ తరం వారు ఉండడం క్రమేపి తగ్గు ముఖం పడుతున్న రోజులివి....

ప్రభుత్వ ప్రోత్సాహంతో, రాయితీలతో పాడి పశు సంపద యొక్క వితరణ, నిరంతర కరెంట్ ఆధారిత బోర్లతో / పంపులతో జల లభ్యత ఏర్పాట్లు, ప్రకృతిసిద్ధమైన వేపాకు, గోమయం, ఇత్యాది వాటి సమ్మిళితమైన క్రిమినివారకాలతో ఎంతో కొంత బలవర్ధకమైన పంట ఇప్పటికీ మనకు లభించడమనేది ఈశ్వరానుగ్రహం... 

" మనిసి " తిరగేస్తే " సినిమ " ...

ఒక చక్కని సందేశాత్మక సినిమాకి ఆవశ్యకమైన వారు 
దర్శకులు/నిర్మాతలు, నాయకుడు, సహాయక పాత్రధారులు, ప్రతినాయకుడు....
ఒక నేపథ్యం తో కూడిన కథాంశం,  కొన్ని పాటలు, డైలాగ్లు, ఫైట్లు, క్లైమాక్స్....

ఒక డైరెక్టర్ ఎంతో అనుభవంతో అవగాహనతో ఎంచుకున్న కథాంశాన్ని.ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించడంలో ఆయా పాత్రల, పాత్రధారుల, సన్నివేషాలా ఇత్యాది సంబారాల, కలబోత ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఏది ఎంతవరకు ఉండాలి అనే అంశంపై తనకు గల పట్టు ఆ చిత్రం యొక్క విజయానికి అనగా ప్రేక్షకుల స్వీకరణకు, ఆనందోత్సాహానికి కొలమానమై ఉంటుంది....

అట్లే ఒక రైతుకు గల అనుభవంతో అవగాహనతో ఎటువంటి నేలలో ఏ పంట ఎప్పుడు ఎలా సాగు చేసి పండించిన పంటకు, పంటను స్వీకరించే వినియోగదారులకు ఆ పంట పరిపూర్ణమైన ఆరోగ్యానందాన్ని తద్వరా ప్రాణశక్తిని అందించి సార్థకతనొందగలదో అవ్విధంగా సేద్యం గావించే ఒక మహర్షి సమమైన వ్యక్తిత్వం కర్షకులది...

ఎన్ని వృత్తులు ఉన్నా అవన్నీ వారి వారి స్వోద్ధరణే ముఖ్యమైన అంశగా ఉండే వృత్తులు... 

వ్యవసాయం / బోధన / రక్షకభటులు/సైన్యం ఈ మూడు వృత్తులు మాత్రం ఇతరులందరిపై కూడా ఎంతో ఘనమైన ప్రభావం చూపే వృత్తులు....

మనం తినే ఆహారంలోని ఆరో వంతు మన మనసై మన జీవితాన్ని శాసిస్తుంది కాబట్టి రైతులది...

మనం అభ్యసించే విద్య మన భావి  జీవితాన్ని నడిపించే సాధనమై ఒప్పారుతుంది కాబట్టి బోధకులది...

మన ప్రాంత / దేశ భద్రతను అనుక్షణం గమనించుకుంటూ, శాంతియుత వాతవరణంలో పౌరులెల్లరి జీవితాలు సార్థకమయ్యేలా చూస్తారు కాబట్టి రక్షకభటులు/సైన్యానిది...

ఈ మూడు వృత్తులూ కూడా అప్పుడూ ఇప్పుడూ ఎల్లప్పుడూ, ఎల్లవేళలా గౌరవించవలసిన ప్రధానమైన వృత్తులు ...

శరీరం, మనసు, ఆత్మ ....

వీటి నిత్య పోషణ, తోషణ, రక్షణ, మన జీవితం అనబడుతుంది....

శరీరం దృఢంగా ఉండడం ప్రప్రథమ ఆవశ్యకత..... 

మనసు సంతోషంగా, ఉత్సాహంగా,  నిత్యనూతనపరిశీలనాత్మక దృక్కోణంతో ఎల్లప్పుడూ చైతన్యవంతమై ఉండి, దృఢమైన శరీరానికి సార్ధక్యాన్ని సమకూర్చేలా జీవించగలగడం తదుపరి కర్తవ్యం...  

దృఢమైన శరీరంలోని చైతన్యవంతమైన మనసుతో సదా వికసితమైఉండే బుద్ధి కుశలతతో ఆత్మతత్వాన్ని అందిపుచ్చుకొని జీవితాన్ని, జన్మను సార్ధపరుచుకోవడం ఆ తదుపరి బాధ్యత....

ఇన్నిటికి మూలం ఎక్కడ ఉంది...??

రైతు పండించే ధాన్యం నుండి లభించే స్వఛ్చమైన సారవంతమైన పౌష్టికాహార లభ్యతలో ఉంది....

కాబట్టి రైతులను ఎల్లప్పుడూ గౌరవించడం, ఆదరించడం, అభిమానించడం, ఆర్థిక సహాయాన్ని అందించడం ఎల్లరికి విహిత ధర్మమే....

అందుకే రైతులకు పెద్ద పీట వేస్తూ వారి పాడిపంటల సమగ్ర అభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధి, ఆచరణాత్మక చేయూతను అందిస్తూ వారి జీవితానికి అన్నివిధాల దృఢమైన ఆలంబన అందించి మన్ననలను అందుకునే ప్రభుత్వాలదే ఎల్లప్పుడూ పైచేయి....

గౌ|| ముఖ్యమంత్రివర్యులు, శ్రీ కే.సీ.ఆర్ గారి ఆధ్వర్యంలో రూపొందింపబడిన వివిధ రైతు సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రానికి నిత్యనూతన హరితవర్ణాలను అలదుతూ దేశంలోని సస్యశ్యామల, సుభిక్ష రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపి 
రైతులకు రామరాజ్యన్ని అందిస్తున్న తీరుని శ్లాఘించేలా ఈ రైతు దినోత్సవాన్ని ఎల్లరూ అనందంగా జరుపుకోవాని అభిలశిస్తూ...., 

అందరికీ 2021 జాతీయ రైతు దినోత్సవ శుభాభినందనలు....😊💐👍🍨🍕🍦🍨

ఆనాటి పాడిపంటల నేపథ్యం గల కల్మషరహితమైన జీవన నేపథ్యాన్ని... 
ఆనాటి దేశభక్తితత్పరతను కొనియాడే రీతిలో ఉండే 
శ్రీ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర్యసంగ్రామ యోద్ధుల వీరచరితను...కలగలిపిన కథాంశంతో 
దర్శకదిగ్గజమైన శ్రీ ఎస్.ఎస్ రాజమౌళి గారు చేపట్టిన RRR సినిమా, చరణ్ డ్యూడ్ సినీప్రస్థానంలో అత్యుత్తమమైన మెగాపవర్ మూవి గా, తారక్ కి మరో
తరగని కీర్తిని అందించే క్లాసిక్ మూవి గా, ప్రేక్షకులకు చక్కని సందేశాత్మక ఆనందదాయక చిత్రంగా 
ఘనవిజయం సాధించాలని ఆశిస్తూ RRR సినిమా యునిట్ వారందరికి కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాభినందనలు... 🍨🍦🍕💐😊👍

[  రైతు దినోత్సవానికి / RRR ( Rise Roar Revolt )  సినిమా కి ఏంటి సంబంధం అని కొందరికి ఈ పోస్ట్ కొంచెం కంఫ్యూసింగ్ గా ఉండొచ్చు....

స్నేహం యొక్క ప్రాభవాన్ని ఉటంకించే కథాంశంతో సాగే  సినిమా కథకు / రైతు పొలంలోని ఆహ్లాదకరమైన ఆనందకరమైన పచ్చదనానికి / అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి / 
ఇత్యాదిగా నా గతం తాలూకా యాత్రల విశేషాల ప్రతిబింబం ఈ సినిమా కథాంశం లో ఉంటుంది అనే విషయం నాకు తెలుసు కాబట్టి ఇలా
జాతీయ రైతు దినోత్సవానికి / RRR సినిమాకి సామ్యమును ఆపాదిస్తూ ఈ కవనాన్ని రచించాను....😊)

No comments:

Post a Comment