Friday, January 7, 2022

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण: |अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: || 17||

శ్రీకరమైన ఏనుగు మరియు ఎన్నో ఎన్నెన్నో జంతువులతో / పక్షులతో ఉన్న జూ కి వెళ్ళినప్పుడు, అన్ని జంతువుల పట్ల ఒకేలా ఉండాలి అని ఎవరైనా అంటే అది మూర్ఖవాదనే ఔతుంది....

ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా మనల్నే మింగేయగల క్రూరమృగాల దెగ్గరకి వెళ్ళినప్పుడు ఎవ్విధంగా ఉండాలో.....

సిగ్గు శరం లేకుండా మొరిగే జంతువుదెగ్గరకి వెళ్ళినప్పుడు ఎవ్విధంగా ఉండాలో.....

చక్కని సంస్కారంతో పలుకులు నుడవగల రామచిలుక దెగ్గరకి వెళ్ళినప్పుడు ఎవ్విధంగా ఉండాలో.....

అవ్విధంగా ఉండడం వివేచన గల వారికి భూషణమే అవుతుంది....

ఒకరి దెగ్గర ఒకలా ఉండడం....
ఇంకొకరి దెగ్గర ఇంకోలా ఉండడం....
ఒకచోట మృదువుగా ఉండడం....
మరోచోట కఠినంగా ఉండడం....

వీటిని దేశకాలాలను ఎరిగి మనస్తత్త్వాలను చదివి మసులుకోవడం అని అంటారు కాని..
"రంగులు మార్చడం" అని అనరు...

పొద్దున లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకు మనిషి.....

బాత్రూంలో ఒకలా....
కిచెన్రూంలో ఒకలా....
పూజగదిలో ఒకలా....
ఇంట్లోఒకలా...
ఆఫీస్లో ఒకలా... 
ఫంక్షన్స్ / ఈవెంట్స్ / సెరెమొనీస్ లో ఒకలా...
ఆలయాల్లో ఒకలా...

ఉండడం అనేది ఎవ్విధంగా అనివార్యమైన వివిధ ఆహార్యావలంబిత విధానమో.....

ఎదురుగా ఉండే మనుషులను మరీ ముఖ్యంగా మనస్తత్త్వాలను అవలీలగా చదవగలిగే వ్యక్తి కూడా, అవ్విధంగా అనివార్యమైన ఆలోచనాపూరిత ఆచరణాత్మకసరళిని అవలంబించే విధానాలు కూడా భిన్న విభిన్నంగా ఉంటూంటాయి.....

వాటిని వివేచనాత్మక వివేకంతో ఆకళింపుజేసుకోవడంలో గొప్పదనం దాగిఉంటుంది కాని.... 
"వాడొపాగల్ గాడు...." అని ఒక్క వాక్యంలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని 'అభివ్యక్తీకరించడం'
అనేది అలా వాగే వ్యక్తి యొక్క "పాగల్పన్" కి  "బలుపు" కి కొలమానం అంటారు....

ఫర్ ఎగ్సాంపుల్, " గౌరమ్మ వాకిట్లో గన్నేరు చెట్టు" అనే టీ.వీ సీరియల్ లో సపర్ణ రోల్ ప్లే చేసే వ్యక్తి నిజానికి చాలామంచిది అని వీక్షకలోకంలో చాలామందికి తెలుసు...
కొందరు కుట్రపూరిత వైఖరితో 
శకుని లా చెడగొట్టే పనులన్నీ చేసి, సైంధవుడిలా కుయుక్తులన్నీ గావించి, శల్యుడిలా వాగాల్సినవన్నీ వాగేసి, ఏమి తేలియనట్టు అన్నీ సపర్ణే చేసిందని, చేయించిందని బూటకపు కహానీలు చెప్పి చెవుల్లో క్యాబేజీలను పెట్టే ప్రయత్నాలు చేస్తు.....
" సపర్ణ ఒక పాగల్ది.....అందుకే అట్లా చేసింది...." అని ఒక్క వాక్యంలో దులిపేసుకుంటే....

ఎంతకాలం నిజాలు నిగ్గుతేలకుండా ఉంటాయి....?

వివిధ వ్యక్తులను వ్యక్తిత్త్వాలను కాచివడబోసినట్టు వర్ణించే ప్రోజి లాంటి ఆరితేరిన వారిదెగ్గర ఎంతకాలం ఇట్లాంటి నాటకాలు సాగుతాయి....??

దేవలమ్మ నిజమైన పెద్దకూతుర్ని నేనే అంటూ...నంగనాచి నాటకాలాడే వారి ఆటలు ఎంతకాలం సాగుతాయి...?

ఇత్యాది ప్రశ్నలకు సమాధానం... 
"అంతా విధి నిర్ణయం....."
అని సరిపెట్టుకోవడం కొందరిపని..... 

విధి సైతం తలొంచే విధాత శాసనాన్ని కూడా సవరించే దేవశాస్త్రాలను ఆలంబనగా గావించి ఆచరింపబడే సశాస్త్రీయసత్కర్మాచరణం తో వెతికిపట్టుకుంటాం అని అనడం కొందరిపని....

ఇప్పుడు టైం మీదికదా అని మీ శైలిలో మీపని మీరుగావిస్తే.....

తరువాత ఎవరి టైం వచ్చినప్పుడు వారి వారి శైలిలో వారిపని వారుగావిస్తారు....

ఇంతకుముందే ఒక పాత పోస్ట్లో రాసిన..... 

" కర్మాచరణ స్వతంత్రత  మాత్రమే జీవుడికి ఇవ్వబడింది .... కర్మఫల నిర్ణయ స్వాతంత్ర్యం అప్పుడు ఇప్పుడూ మరియు ఎల్లపుడూ ఈశ్వరాధీనమై ఉండే వ్యవస్థ.... " అని

" క్రితం జన్మల్లో ఒక ఆలయంలోని శుభ్రతకు సంబంధించిన పనుల్లో ఉండి విశేషమైన పుణ్యాన్ని ఆర్జించిన ఒక వ్యక్తి..... ఈ జన్మలో ఒక రాష్ట్రంలో  ఉన్నతాధికారిగా ఉన్నారు...."
అని అంటే అది మనుష్యులకు వింతగా అనిపించవచ్చు......కాని ఈశ్వరుడికి కాదు....

" ఈ జన్మలో ఒక రాష్ట్రంలో  ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి తన అధికార గర్వంతో గావించిన దౌర్జన్యానికి, దుర్మార్గానికి, వచ్చే జన్మల్లో కొన్ని వేలసార్లు వాళ్ళింట్లోనే ఒక కీటకమై జన్మిస్తూ మరణిస్తూ...వారి గత జన్మ తాలుకా మనుషులతోనే బాధింపబడే అల్ప ప్రాణిగా ఉండి తన కర్మఫలాన్ని అనుభవిస్తాడు...."
అని అంటే అది మనుష్యులకు వింతగా అనిపించవచ్చు....
కాని భగవంతుడికి / కాలానికి కాదు....

అదే ఈ కర్మభూమి యొక్క వైశిష్ట్యం....

సహజ కవచ కుండలాలతో జన్మించినది పరాక్రమవంతుడైన సూర్యపుత్రుడే అయ్యి ఉండవచ్చుగాక....
'కర్ణుడి ఘోర మరణానికి కారణాలు అనేకం....'
అనె శ్రీ చాగంటి సద్గురువుల వివరణ కొందరికైనా గుర్తుండి ఉండాలి.....

మహర్షుల శాపానికి తిరుగులేని రీతిలో....సమయం ఆసన్నమైనప్పుడు....
సూర్యపుత్రుడికి తన అస్త్ర విద్య గుర్తుకురాలేదు..... 
భూదేవి శాపానికి అంతటి పరాక్రమవంతుడు భూమిలో దిగబడిన తన రథచక్రాన్ని పైకి లేపలేక చతికిలపడ్డాడు.....

కురుక్షేత్రసంగ్రామంలో గతించిన వారందరికి యుద్ధ ధర్మాన్ని అనుసరించి తిలోదకాలు సమర్పింపబడే సమయంలో ఒక సుక్షత్రియుడి పార్ధివదేహం గురించి సంబోధిస్తూ ,
"పాండవ పక్షమా....? కౌరవ పక్షమా...?" అని అడగబడినప్పుడు 
"మా తరఫు వాడు..." అని ఎవ్వరూ చెప్పుకోడానికి కూడా ముందుకురాని అత్యంత దయనీయమైన రీతిలో మరణించాడు కర్ణుడు తను పొగరుతో గావించిన కర్మలఫలితానికి....

" మీరు ఎంతటి తోప్ తురుం ఉస్తాదులైనా సరే.....
టాక్టైం బ్యాలన్స్ అయిపోగానే మీ మొబైల్ సర్వీసెస్ కట్టైనట్టు......
మీ పెద్దలు, మీరు, గావించిన పుణ్యం బ్యాలన్స్ అయిపోగానే జబ్బలు ఎగరేసి, కాలర్ ఎగరేసే మీ అన్ని రకాల బలుపు వేషాలు వాటంతట అవే ఆగిపోవలసి ఉంటుంది...."

అనేది భగవద్గీతాసారం అని చాలామందికి తెలిసేఉంటుంది....

As per the " Bhagavad Gita: Chapter 4, Verse 17,
  
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण: |
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: || 17||

karmaṇo hyapi boddhavyaṁ boddhavyaṁ cha vikarmaṇaḥ
akarmaṇaśh cha boddhavyaṁ gahanā karmaṇo gatiḥ

Translation
BG 4.17: You must understand the nature of all three — "Karma", "Vikarma", "Akarma"  "recommended action", "wrong action", and "inaction". The truth about these is profound and difficult to understand.

No comments:

Post a Comment