కొన్ని ఎపిసోడ్ల కథలు విచిత్రంగా ఉంటుంటాయి....
ఒక వ్యక్తి కొందరు ధూర్తులు కావాలని తనకు కలిగించిన మనస్తాపానికి, అవమానానికి, వాళ్ళను ఎడాపెడా దులిపెయ్యాలని అనుకుంటాడు.....
తన బాల్యం నాటి కొన్ని సంఘటనల రీత్యా....
ఇప్పుడెందుకులే అనవసరంగా నోరుపారేసుకోవడం.....
అవసరమైతే తర్వాత ఎగబడొచ్చులే అని మౌనంగా ఉండి అన్నిటిని అందరినీ అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు ఒక టిపికల్ సీరియల్ నటుడిలా.....
ఒక 25 సంవత్సరాల పాటు కాల చక్రాన్ని వెనక్కి తిప్పితే.....
ఒక మహా అల్లరిపోరడు....వాళ్ళింట్లో కాసే జామకాయలు దానిమ్మకాయలు సరిపోవన్నట్టు....
ఇరుగు పొరుగు వారి ఇంట్లో ఉండే చెట్లపైన కాయలు కూడా ఎప్పుడెప్పుడు చెట్ట్లెక్కి గుటుక్కుమని మింగేయ్యాలా అని ఆడుకుంటూ ఊరంతా తిరిగే సగటు సామాన్య మధ్యతరగతి స్కూల్ పోరడు....
వాళ్ళ చిన్న సిమెంట్ రేకుల రూముల ఇంటికి సమీపంలోనే ఉండే బంధువులైన ఒక సంపన్నుల ఇంట్లోని జామచెట్టు, దానిమ్మచెట్టు పై ఉండే కాయలను కోస్కోడానికై ఆ ఇంటికి ఊరికే వెళ్ళడం....
ఆ ఇంటి వారు ఊరికే కసురుకుంటారు కాబట్టి వెళ్ళొద్దు...అని అమ్మ చెప్పినా సరే వినకుండా వెళ్ళడం....అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ చటుక్కున ఒక జామకాయ్ తెంపుకొని మింగేయడం.....
ఇలా సాగుతున్న ఆ తుంటరి బాలుడి స్కూల్ జీవితంలో ఒకరోజు ఇంట్లో ఉండగా...
సమీప బంధువులైన ఆ సంపన్నుల ఇంటికి సిటి నుండి వచ్చిన కొత్త కోడలు.....
" అన్నయ్యా....ఊర్నుండి బియాంక వాళ్ళ ఫోన్ కాల్ వచ్చింది...
మా మామయ్య తో మీరు ఏదో మాట పట్టింపులతో ఉండి మీరు మా ఇంట్లోకి రావట్లేదంట కదా....
అందుకే నేనే కార్డ్లెస్ ఫోన్ తీస్కొచ్చాను.... మాట్లడండి...." అని అంటూ కార్డ్లెస్ ఫోన్ ఆ బాలుడి నాన్నకు తెచ్చి ఇచ్చి అక్కడే 5 నిమిషాల పాటు నిలుచొని
"మళ్ళీ ఫోన్ వస్తే తెచ్చిస్తాను...." ఏం పర్లేదు మాట్లాడండి..."
అని చెప్పి వెళ్ళిన సంఘటనలో ఈ బాలుడు గమనించిన విషయం ఏంటంటే....
" ఇంట్లో ఫోన్లు ఉన్నవి బస్తిలోని గరీబోళ్ళకోసం కాదు...
ఈ ఇంటి కోడలివి.. ఆ ఇంటివారితో నీకేం పని...."
అంటూ ఆ ఇంటిపెద్ద కసురుకున్నా సరే......
" వాళ్ళింట్లో చామంతులు, గులాబి పూలు తెంపుకుంటాము... పిల్లవాడిని వాకర్లో ఆడిస్తూ ఉగ్గు తినిపిస్తాము.....సమీప బంధువులకు ఒక్క ఫోన్ కాల్ వస్తే మాట్లడుకోడానికి సహాయం చేయడంలో పొయ్యేదేముందిలే...."
అనే విశాలమైన దృక్పథంతో అలోచించి వ్యవహరించిన తీరులో తనకు అత్తమ్మ అయిన
ఆ నవయువతి కనబరిచిన సంస్కారవైభవాన్ని గమనించాడు ఆనాటి ఆ బాలుడు.....
[ ఆ సంపన్న ఇంటిపెద్ద ఈ గరీబోళ్ళ ఇంటి పెద్దకు మామ అవుతాడు....
( అమ్మమ్మగారి అక్కకు కొడుకు....)
మరియు ఈ గరీబోళ్ళ ఇంటి గృహిణికి
ఆ సంపన్న ఇంటి పెద్ద కాక అవుతాడు...
( నానమ్మగారి చెల్లెలికి కొడుకు...) ]
అనాడు ఆ పడతి వ్యవహరించిన పద్ధతిగల తీరుకి 25 సంవత్సరాల తరువాత అప్పటి ఆ బాలుడు ఇప్పటి తన 35 యేళ్ళ జీవితానికి, అనగా ఆనాటి
'మాల్గుడి డేస్' సీరియల్ కి ఈనాటి 'కలవారికోడలు' సీరియల్ కి గల వారధిని గమనిస్తూ ఉండడంలో జీవిత వైచిత్రిని పరికిస్తూ ఉంటాడు.....
సొ, ఇప్పుడు ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాల్లో కలగజేసుకునే అవసరం ఇతరులకు పెద్దగా ఉండదు...
ఎందుకంటే వారు బయటి వారు కాదు కాబట్టి.....
మరియు వారింట్లోని వారు గొప్ప గొప్ప లాయర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ ఆఫిసర్లు, బ్యాంక్ ఆఫిసర్లు, యునివర్సిటిలో వైస్ ప్రిన్సిపల్, ఇలా బాగా చదువుకున్న ఉన్నతమైన వారు కాబట్టి....
వారు అలోచించినంత ఉన్నతంగా ఆలోచించగల సీన్సితారల్ లేవనే సంగతి కొందరికి ఎంత చెప్పినా అర్ధం కాదు.....
కాబట్టి, సీరియల్ యొక్క తదుపరి ఎపిసోడ్లు తనకు ఇష్టమొచ్చినంటే ఉంటాయి....
తన 35 యేళ్ళ జీవితంలో కేవలం లోకాన్నే కాదు.....లోకులను కూడా క్షుణ్ణంగా చదివిన వ్యక్తికి ఎవరు ఎందుకు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారో తెలియదనుకుంటే అది కొందరి పొగరుకి కొలమానం అవుతుందేమో కాని ఘటనాఘటనసమర్ధుడైన వ్యక్తి యొక్క అవగాహనకు కొలమానం కానేరదు....
No comments:
Post a Comment