'శ్రీమంతుడు', 'కలవారికోడలు', లేదా మరొక డైలీ సీరియల్లో ఉండే ' కథాంశంలా.....
ఒక్కొక్కరి అనవసర జోక్యం, పెత్తనం, ఎందుకో అసల్ అర్ధం కాదు....
ఆస్తి బయటి వారికి ఎందుకు చెందనివ్వడం...అని.... మేనమామ వరసకు మేనకోడలిని ఇచ్చి చేస్తే...
మధ్యలో కొందరు పానకంలో పుడకలా దూరి పెత్తనాలు చెలాయించడం.....
అనవసరంగా బయటిపిల్లను ఎందుకు తెచ్చుకోవడం...
అత్త వరసకు దెగ్గరి చుట్టాల అమ్మయిని ఇచ్చి చేస్తే ఆస్తి మరియు అమ్మాయి మన కంట్రోల్లోనే ఉంటాయి కద అని చేస్తే...మధ్యలో కొందరు పానకంలో పుడకలా దూరి పెత్తనాలు చెలాయించడం.....
ఇలా చాలా టీ.వీ సీరియల్లలో ఉండే కథలను గమనిస్తే, ఏదో ఒక నెపంతో మధ్యలో దూరి దోచుకోవడమే పనిగా ఉండే కొందరిని చూస్తే ఒక్కోసారి చిరాకు, కోపం ఎక్కువై....
"ఈ వయసులో నా సొమ్ము దోచి మీవారికి పెట్టాలనే వృధా శ్రమ మీకవసరమా...మీవన్నీ ధారపోసారు కద...అక్కడితో సరిపెట్టుకుంటే మరియాద అనిపించుకుంటది....."
అని గట్టిగా అందామంటే..
తిని ఇంట్లో విశ్రాంతి తీసుకోవలసిన వారిని ఎందుకు అనవసరంగా మాటలు అనడం...
అనే సంస్కారం మనల్ని మౌనం వహించమని చెబుతుంది....
ముఖ్యమైన విషయాల్లో గట్టిగా మాట్లాడకపోతే పోరడు మృదుస్వభావి ఏమో అని అనుకొని బాగా
పంగనామాలు పెట్టడానికి తయారౌతారు....
మిగతా విషయాలెన్నైనా లైట్ గా తీస్కోవచ్చు కాని....స్త్రీలను, పసిపాపలను హింసించే ముదనష్టపు సంతను ఎవ్వరైనా కట్టడి చేయకుండా ఎందుకు వదులుతారు....
ఇలాంటి సిట్యువేషనల్ హ్యాడ్లింగ్ లో ఏ సీరియల్ హీరో అయినా అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టే ఉంటున్నాడంటే....
ఆ దోచుకోవాలని చూసే బద్మాష్బాడ్ఖావ్లు కూడా...
"అమ్మొ...వీడు ఎవ్వరినీ వదిలే రకమే కాదు...ఎందుకు ఇతరలు కోసం వీడి సొమ్ము మింగి అనవసరంగా ఆడపిల్ల సొమ్మును మెక్కిన పాపిష్టివారిగా మిగలడం.....
వాడి సొమ్ము, వాడి పెళ్ళాం సొమ్ము, వాడేమైనా చేస్కోని...
మన సొమ్మును పైసా కూడా వాడు ఆశించనప్పుడు....
వాడి సొమ్మును పడిపడి ఇతరులకు ఎందుకు దోచి పెట్టడం.....
(ఎదో ఒకటి ఇచ్చెస్తే ఒక పని అయిపోతది కద అని మీరిచ్చినవి ఇప్పుడు తిరిగి తీసేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు... అవి కూడా మీవారికే ఇచ్చుకోండి....
ఇద్దామా...వద్దా...ఈ పొట్టోడికి ఏదో ఒక బండరాయి పడేస్తే ఒక పని అయిపోతదిలే.....అనుకుంటూ...నా నెత్తిపై అలంకరించబడిన 200 కిలోల బండరాళ్ళ భారం తగ్గిందని అనుకుంటా....
మంచి మనసుతో నా శ్రేయోభిలాషులు సమకూర్చేవి నాకు చాలు....)
అనేలా ఇప్పుడు వాడి డైలాగ్ ఉండడం సహజమే కద....
."
అనే విచక్షణతో, వివేకంతో కొన్ని సీరియల్లోని కొందరు పెద్దలు...అన్నీ తెలిసినా ఏమి తెలియనట్టే ఉండడమే మంచిది....అనేలా ఉంటుంటారు....ఉండాలి కూడా...
హుమ్...మొత్తానికి ఏ టీవీ సీరియల్లో చూసినా సరే.....
" పైకి కొంచెం ఇంట్రోవర్ట్ లా కనిపించినా...పోరడు "అతడు" సినిమాలో మహేష్ బాబు లా అణుబాంబ్ లాంటి సైలెంట్ స్మాషర్...."
అని తెలిసినవారెవ్వరూ కూడా వాడి జోలికి....
వాడి సొమ్ము జోలికి వెళ్ళరు....
తెలియనివారు తొందర్లోనే తెలుసుకుంటారు.........
No comments:
Post a Comment