Tuesday, July 19, 2022

శ్రీకరమైన శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా శ్రీచాగంటి సద్గురువుల దర్శనానుగ్రహం / మరియు శ్రీ ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణమందు చాతుర్మాస్య దీక్షకై వేంచేసిఉన్న కంచికామకోటి పీఠ 70వ జగద్గురువరేణ్యులు, శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహ స్మృతులు.....💐🍕😊🍨🍦

శ్రీకరమైన శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా శ్రీచాగంటి సద్గురువుల దర్శనానుగ్రహం / మరియు శ్రీ ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణమందు చాతుర్మాస్య దీక్షకై వేంచేసిఉన్న  కంచికామకోటి పీఠ 70వ జగద్గురువరేణ్యులు, శ్రీ శంకరవిజయేంద్రసరస్వతీ స్వామి వారి దర్శనానుగ్రహ స్మృతులు.....
💐🍕😊🍨🍕

{
మరియు 

1. కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం / శ్రీకోటిఫలీశ్వరాలయం...

2. దక్షారామ శ్రీమాణిక్యాంబా శక్తి పీఠం + శ్రీభీమేశ్వరాలయం...

3. భానుగుడి జంక్షన్ దెగ్గరి అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అన్ని మందిరాలు / ఆలయాలు....

4. అన్నవరం శ్రీ అనంతలక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం / వనదుర్గా అమ్మవారి ఆలయం....

5. పిఠాపురం శ్రీపురుహూతిక శక్తి పీఠం + శ్రీకుక్కుటేశ్వరాలయం,

6. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ శ్రీక్షేత్రం,

7. తొలి తిరుపతి (దివిలి) శ్రీ శృంగారవల్లభస్వామి వారి ఆలయం,

8. సామర్లకోట కుమారారామ శ్రీభీమేశ్వరాలయం...
(పంచారామం)

9. సర్పవరం, శ్రీ భావనారాయణస్వామి వారి ఆలయం 

దర్శనానుగ్రహ  స్మృతులు.....
}

" ఒక్క గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి నాడు మాత్రమే, గురువులు ప్రత్యక్షంగా పిలవకున్నా సరే, శిష్యులు వారి వారి గురువుల సందర్శనార్ధమై, అనుగ్రహాశీస్సులకై, గురువుగారి నివాసానికి తరలిరావొచ్చును....."
అనే విషయం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో చెప్పడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది.....

కరోణా కారణంగా గత 4 సంవత్సరాలుగా పరోక్ష దర్శనానికే పరిమితమై,
ఈసారి గురువుగారి ప్రత్యక్ష దర్శనం లభించడం చాలా ఆనందకరమైన విషయం....

ఎందుకంటే శిష్యులకు అత్యంత సంతోషకరమైనది గురువుల సందర్శనాభాగ్యం..... 
గురువాక్కుల స్మరణ మనన నిధిధ్యాసనం అనే ప్రక్రియలకు దిటవైన ఆలంబన అనునది గురుసందర్శనంతో సంప్రాప్తిస్తుంది... 

త్రిమూర్త్ర్యాత్మక పరబ్రహ్మం గా గురువులను ఆరాధించడం ఒకెత్తైతే,
గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి నాడు వారిని అలా దర్శించి తరించడం ఒకెత్తు...

ఎన్నెన్నో గొప్ప అధునాతన ఫీఛర్లతో / యాప్స్ తో  ఉండే లేటెస్ట్ ఐఫోన్ ఉన్నాసరే, సరైన సెల్ టవర్ సిగ్నల్ / వైఫై ఉన్నప్పుడు మాత్రమే వాటిని పరిపూర్ణంగా ఉపయుక్తంగావించుకోవడం సంభవమయ్యేది.....

అదే విధంగా ఒక వ్యక్తి ఎన్నెన్నో శాస్త్రములందలి విద్యను సంగ్రహించి 
" విద్యావంతుడు " అని అనిపించుకున్నాసరే.....
ఒక గురుస్వరూపాన్ని ఆ విద్యార్జనకు మూలంగా భావించి సేవించిననాడే " జ్ఞ్యానవంతుడు " గా రూపాంతరం గావింపబడడం అనేది మన సనాతనధర్మ సంప్రదాయం లోని విశేషం.....

ఎంతో కష్టపడి ఆర్జించిన విద్యలన్నీ కూడా పొలం నుండి ఇంటికి లభించిన ధాన్యము వంటివి.....
ఆ ధాన్యము అన్నముగా / భోజ్య పదార్ధం గా రూపాంతరం అయినప్పుడే ఆ ధాన్యానికి, ఆ సేద్యానికి, ఆ కృషికి సార్ధకత లభిస్తుంది....

విద్యార్జన గా మాత్రమే వివిధ వస్తువిషయ సముపార్జన ఉండిపోతే, 
అది కేవల విద్య గా ఉండే సమాచారం.....
విద్వత్తు గా ఆ విద్యార్జన రూపాంతరం గావింపబడడమే సమకూరవలసిన అనుగ్రహ విశేషం.....

ఈ " విద్యార్జన --> విద్వత్తు " అనే ప్రయత్న పూర్వక ప్రక్రియ / ప్రయాసలో, 
గురుకటాక్షం అనునది ఒక క్యటలిస్ట్ లా దోహదమై సదరు విద్యార్థి యొక్క కృషిని సద్యో సఫలీకృతం గావించి తరింపజేస్తుంది.....

అనగా ఆ జ్ఞ్యానం వారి వారి ఈప్సితములను ఈడేర్చే సాధనమై ఒప్పారుతుంది అనేది ఇందలి అధ్యాత్మ విశేషం..... 

విద్య కంటే కూడా ఎందుకు జ్ఞ్యానం అనునది అంతగా ముఖ్యమైనది అని అంటే....

జ్ఞ్యానరాహిత్యం అనునది మనిషిని అన్ని విధాలా కట్టిపడేసే ఒక బంధనం లాంటిది....
అది వీడనంతవరకు మనిషికి ప్రశాంతత / సుఖం అనేవి దుర్లభం...మరియు ఇతరులను / ఇతరుల్లోని ఉన్నతమైన విద్వత్తును గౌరవించి గౌరవింపబడడం అనేది మనుషులకు అంత సులంభంగా జనించని స్పృహ..... 

హృదయపూర్వకంగా నమస్కరించడం / గౌరవించడం అనేది ఇరు వర్గాల గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసే సాధనం.....

ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా గానాన్ని ఆలపించగలడు ... 
" ఆ ఏముందిలే.... ఎవరైనా  పాడతారు...." అని
అనడమే ఈ కలియుగంలో చాలా మంది యొక్క స్పందన...
" అవును....చాలా బాగా ఆలపించాడు...ఎంతటి కృషితో అలా అవలీలగా పాడే స్థాయికి చేరుకున్నాడో...."
అని సదరు వ్యక్తిలోని విద్వత్తును గౌరవించే సంస్కారం చాలా మందికి ఉండదు.....
" నువ్వూ అట్ల అంత బాగా ఒకసారి పాట పాడు చూద్దాం....."
అని ఎవరైనా అంటే...మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవనట్టుగా ఉండడమే ఇక్కడ సదరు మనిషి యొక్క అజ్ఞ్యానానికి కొలమానం.....

ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా వ్యాసాలను వ్రాయగలడు ...  ... 
" ఆ ఏముందిలే.... ఎవరైనా రాస్తారు...."/
" ఆయనకు అంత సీన్ ఉందంటావ..." /
" ఇవ్వి నిజంగా నువ్వు రాసిన వ్యాసాలేనా...." 
అంటూ వివిధ రీతుల అనడమే ఈ కలియుగంలో చాలా మంది యొక్క స్పందన.......
" అవును....చాలా బాగా వ్రాస్తాడు...ఎంతటి కృషితో
అలా అవలీలగా వ్రాసే స్థాయికి చేరుకున్నాడో...."
అని సదరు వ్యక్తిలోని విద్వత్తును గౌరవించే సంస్కారం చాలా మందికి ఉండదు.....
" నువ్వూ అట్ల అంత బాగా ఒకసారి వ్రాయి చూద్దాం....."
అని ఎవరైనా అంటే...మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవనట్టుగా ఉండడమే ఇక్కడ సదరు మనిషి యొక్క అజ్ఞ్యానానికి కొలమానం.....

ఇతరులకు ఒనగూరిన ఈశ్వరానుగ్రహాన్ని గుర్తించి గౌరవించలేని మూర్ఖులకు ఈశ్వరానుగ్రహం గురించి ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటి ప్రయాస...... 

అదే విధంగా ఇతరులకు ఒనగూరిన జ్ఞ్యాన వైభవాన్ని గుర్తించి గౌరవించలేని మూర్ఖులకు, జ్ఞ్యానం గురించి ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరు లాంటి ప్రయాస.....

జ్ఞ్యాన తృష్ణ అనునది మాత్రమే ఒక మనిషికి మరో మనిషికి ఉండే అసలైన భేదం.....
మిగతా లౌకిక భేదాలన్నీ కూడా కేవలం శరీరం అనే పాంచభౌతిక తొడుగుకు ఉండే భేదాలే...

అందుకే గీతాచార్యుడు అంటాడు....
" ఎక్కడ ఎవరిలో ఏ విభూతి ప్రకాశించినా సరే అది నా అంశే..." అని.....

ఒక 3 ఉద్ధరిణల (స్పూన్ల) భగవద్ తీర్థం ప్రసాదింపబడినప్పుడు....
అది లౌకిక కొలమానాలకు మేయము / గ్రాహ్యము / నిర్వచనీయము అయ్యే పదార్ధము.....

గురుర్బ్రహ్మ...గురుర్విష్ణుః...గురుర్దేవో మహేశ్వరః....
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ....తస్మై శ్రీ గురవే నమః.....

అని ముగ్గురు ఈశ్వరస్వరూపముల కలయిక గా ఆరాధింపబడే గురు స్వరూపుల నుండి ప్రసాదింపబడే
భగవద్ జ్ఞ్యానం అనేది ఏ లౌకిక కొలమానాలకు మేయము / గ్రాహ్యము / నిర్వచనీయము కాజాలని పరతత్త్వ పదార్ధము.....ఎందుకంటే అది మహాసముద్రం లా అనంతమైనది....!

ఒక ఏరొప్లేన్ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు.... ఆ విమానం యొక్క టేకాఫ్ & ల్యాడింగ్..... 

ఒకసారి టేకాఫ్ అయిన విమానం ఆకాశంలో ఒక నిర్ణీత ఎత్తులో, నిర్ణీత వేగంతో ప్రయాణం సాగించి గమ్యం చేరుకోగానే ల్యాడింగ్ తో మరలా ప్రయాణికులందరు కూడా భూమిపైకే చేరుకుంటారు....కాని కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఇతర ప్రాంతాల్లో.....

అదే విధంగా, జ్ఞ్యాన సంచయం / వినిమయం అనునవి మనిషి యొక్క ఐహిక జీవన ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలు..... 

ఒకసారి ప్రారంభమైన జ్ఞ్యాన సంచయ ప్రయాసతో బౌద్ధిక పరిణతిలో ఎంతో ఉన్నతంగా పయనించి ఒక తత్వం యొక్క తీరం చేరుకోగానే 
( అనగా సదరు అంశం యొక్క జ్ఞ్యాన సముపార్జనలో పరిపూర్ణతను సాధించిన తదుపరి ),
మరలా జ్ఞానులందరు కూడా ఇతరులందరు ఉన్నట్టుగానే ఉంటారు / కనిపిస్తారు / జీవిస్తారు....

కాని ఎంతో పరిపక్వమైన బౌద్ధిక పరిణతగల వారి జీవిత పయనంలో ఆ జ్ఞ్యాన వైభవం అనునది ప్రకాశిస్తుంది.....

ఫరెగ్సాంపుల్.....
ఒక వేద శాఖలో ఆరితేరిన ఘనాపాటి, 
ఒక బహుళజాతీయ సంస్థలో సమున్నత 
స్థాయిలోని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, 
ఒక పెద్ద ప్రభుత్వాధికారి,
ఒక గొప్ప గాయకుడు, 
మందిని ముంచి బ్రతికే ఒక మూర్ఖుడు / రౌడీ, 
ఈ 5 గురు కూడా దాదాపుగా ఒకేలాంటి దుస్తులు ధరించి ఒకే బస్ / ట్రైన్లో ప్రయాణం గావిస్తున్నప్పుడు......

వారి గురించి ఏమి తెలియని వ్యక్తికి ఈ 5 గురిని చూపించి..... 
వీరిలో ఎవరు ఎవరో అనేది చెప్పమంటే అది సాధ్యంకానిది....

ఎందుకంటే ఇక్కడ ఒకేలా కనిపించే మనుషుల్లోని వివిధ విద్వత్ వైభవం అనునది పొటెన్షియల్ ఎనర్జి గా అంతర్నిహితమై ఉన్నది..... 
( మూర్ఖత్వం / మౌఢ్యం కూడా ....)

వారి వారి నిర్దేశిత కార్యనిర్వహణలో విద్వత్ ప్రకటనము గావింపబడినప్పుడు,
ఆ విద్వత్ వైభవం అనునది కైనెటిక్ ఎనర్జి గా బహిర్గతమై తద్వారా వారి వారి జ్ఞ్యాన ప్రకటనం అనునది లోకానికి గ్రాహ్యమయ్యే అంశమౌతుంది....

శ్రీశైలం రిసర్వాయర్ లో నీరు ఉన్నప్పుడు ఆ జలం తనయందు స్థాణువు గా ఉన్న పొటెన్షియల్ ఎనర్జితో మామూలుగానే కనిపిస్తుంది.....
డ్యాం ను పర్యవేక్షించే అధికారులు తగు సమయంలో గేట్లు తెరిచి నీరు కిందికి వదలగానే,
స్పిల్ల్వే పై ఎంతో వేగంతో ఉరకలు వేస్తు ఉవ్వెత్తున ఎగిసిపడే కృష్ణమ్మ జలప్రవాహఝరులకు డ్యాం పరిసరప్రాంతమంతా నీటి తుంపరలతో ఆవరించి ఉన్నప్పుడు ఆ జలం తనలో ఎంతటి శక్తిని గర్భితమైన సూక్ష్మ రూపంలో ఓడిసిపట్టిందో అనేది కానవచ్చి ఔరా ఎంతటి శక్తి కదా అని ఆ జలశక్తి దృగ్గోచరమయ్యే అంశమౌతుంది......

అచ్చం అదే విధంగా, గురువుల అనుగ్రహం అనునది పొటెన్షియల్ ఎనర్జిగా శిష్యులకు అందినప్పుడు అది కనిపించని బార్హస్పత్య శక్తిగా అందివస్తుంది..... 

సదరు శిష్యుడిచే గురువానుగ్రహంగా ఆ అధ్యాత్మ శక్తి యొక్క ప్రకటనం వివిధ రీతుల్లో గావింపబడినప్పుడు,
ఆధ్యాత్మికత యొక్క శక్తి అంటే ఏంటో లోకానికి గ్రాహ్యమయ్యే అంశం గా ప్రభవిస్తుంది.....

అప్పటివరకు అది అంతర్నిహితమై ఉండే ఒక సూక్ష్మ రూప అణుశక్తి వంటిది....
అది సంకల్ప సహితంగా ట్రిగర్ చేయబడినప్పుడు ఎంతటి శక్తి విస్ఫోటనమైనా సృష్టించగలదు....
ఇది అనాదిగా సనాతనధర్మభూమిపై మాత్రమే
పరిఢవిల్లే ఆధ్యాత్మికత యొక్క కానరాని మహత్తు.....

అందుకే సద్గురువులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, త్రిమూర్త్యాత్మక
శక్తిగా సనాతనధర్మసంప్రదాయం అనాదిగా గౌరవించి నమస్కరించి తరిస్తున్నది....

గురువుగారి సందర్శనార్ధమై వారింటికి ఏతెంచిన ఎందరో శిష్యులను, అక్షతలతో ఆశీర్వదించి,
వివిధ ఫలాలను జ్ఞ్యాన ప్రసాదంగా కూడా అందించి అనుగ్రహఫలాన్ని ఒనరించిన శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు ప్రణమిల్లిన మధురక్షణాల స్మృతిగా ఈ చిరుకవనకుసుమాంజలిని వారి శ్రీచరణాలకు నమస్సుమాంజలి గా సమర్పిస్తూ.... 
శ్రీగురుభ్యో నమః....

మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊🍦🎂🎇💐🍨🍧😊



Sree AkunDi Lakshmi smaaraka GoShaala loni mahimaanvita Navadala Bilva Vruksham...!!

No comments:

Post a Comment