శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం
శ్రితచేతనమందారం శ్రీనివాసమహంభజేత్
శ్రీశుభకృత్ నామసంవత్సర దక్షిణాయణ పుణ్యకాల ప్రారంభ పర్వసమయ ఆగమనాన్ని సూచించే ఆషాఢ శుద్ధ ఏకాదశి ని తొలి ఏకాదశి పండుగ గా ఎల్లరూ జరుపుకోవడం విదితమే....
" చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే చైత్రమాస శుద్ధ ఏకాదశి....లేనిచో....
అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే ఆశ్వయుజ మాస శుద్ధ ఏకాదశి...
తొలి ఏకాదశి అవ్వాలి కద.....
మరి ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఎట్లైంది..? "
అనే సందేహం కొందరికైనా వచ్చి ఉండాలి....
అనగా ఇక్కడ మాస క్రమం లేదా నక్షత్ర క్రమం కాకుండా......
అయన క్రమాన్ని ప్రాతిపదికన గావించి తొలి ఏకాదశి గా భావించడం అనే అంశంలో మనం గమనించగల అధ్యాత్మ వస్తువిషయాలేంటో చూద్దాం......
ఏకాదశి అనగా ఆదేశమగుట.....
( సవర్ణదీర్ఘ సంధి / గుణసంధి / ఇత్యాదిగా గల సంధి సూత్రాలను గమనిస్తే ఆదేశమగుట అంటే ఏంటో అనే దానిపై అవగాహన లభిస్తుంది.....)
"అ కారానికి ఇ ఉ, రు, లు పరమైనచో క్రమమగా ఏ, ఓ, ఆర్, లు ఆదేశమగును......"
అనే గుణసంధి సూత్రంలో చెప్పబడినట్టుగా......
[ https://pratibha.eenadu.net/eligibilityexams/lesson/tet/andhra-pradesh/telugu-medium/education/2-3-25-47-730-1231-5126-6390-1182-20040007163 ]
ఒక పదవిభాగం లో ఉత్తర విభాగంలోని పూర్వాక్షరం, సంధి అనంతరం తన స్వస్వరూపానికి ఆహ్వానింపబడే మార్పు ఇక్కడ " సంధి " అనే ప్రక్రియ ద్వరా సూచింపబడుతుంది....
ఈ విధమైన " ఆదేశమగుట " అనే ప్రక్రియ కాల విభాగంలో కూడా ఉండడం, మాఘ పంచక సమయానంతరం వచ్చే ఆషాఢ మాసం అందుకు నెలవు కావడం
( అనగా ఉత్తరాయణం పూర్తై దక్షిణాయణం లో కాలం / భూభ్రమణం సాగే సమయం )
ఎల్లరికి తెలిసిందే.....
తొలకరి జల్లులతో మొదలైన వర్షాకాలనికి స్వాగతం పలికిన అవని.....
తొలుత మహిళలకు, వృద్ధులకు, సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వండి...,
ఇత్యాదిగా ఉండే వాక్యాలను....
'తొలిసంధ్య వేళలో....
తొలి పొద్దుపొడుపులో.....
తెలవారే తూరుపులో......
వినిపించే రాగం భూపాళం......"
అనే పాటను...
ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు......
కాబట్టి మొట్టమొదటి అనే అర్ధంలో
తొలి అనే పదాన్ని ప్రయోగించినప్పుడు....
ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేది ఏవిధంగా తొలి ఏకాదశి అవుతుందో కొంత తర్కిద్దాం.....
సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా ఆరాధించే సత్సంప్రదాయం అనాదిగా భారతావనిలో సనాతనధర్మాంతర్గతమైన విశేషం.....
శ్రీమహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా సుదర్శనచక్రధారిగా.....
శ్రీకంఠుడు త్రిశూలధారిగా..
దేవేంద్రుడు వజ్రాయుధ ధారిగా.....
ఆరాధింపబడడం ఎల్లరికి విదితమే...
ఈ దేవతా ఉపాధుల్లో ఉండే పుణ్యజీవులకు ఇంతటి శక్తివంతమైన ఆయుధాలు సూర్యనారాయణ మూర్తి యొక్క తేజస్సు నుండి దేవశిల్పి విశ్వకర్మచే తయారుచేయబడినవి అని శ్రీచగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినే ఉంటారు.....
స్థితికారుడిగా శ్రీమహావిష్ణువు / శ్రీమన్నారాయణుడు పేర్గాంచడం ఎల్లరికి విదితమే....
ఈ స్థితికారక తత్త్వాన్నే మనం సూర్యనారాయణుడిలో నిత్యం దర్శిస్తూ ప్రతిరోజు నమస్కరిస్తున్నాము.....
( వారివారికి నిర్దేశింపబడిన సంధ్యా ఉపాసన / గాయత్రి శ్లోకములతో / సవితృమండలమధ్యవర్తిని ఆరాధించడం అనే ప్రక్రియలో......)
సూర్యుడికి / సూర్య శక్తి జనిత సుదర్శనచక్రానికి / సూర్యనారాయణుడిగా ఆరాధింపబడే శ్రీమన్నారాయణుడి కి అభేదం......
శ్రీమన్నారాయణుడు ఒకానొక సమయంలో రాక్షసులతో జరిగే యుద్ధంలో అలసి ఉండగా తన తిరుమేని నుండి ఒక స్త్రీ శక్తి ఆవిర్భవించి రాక్షస సమ్హారం గావించినందుకు ప్రతిగా......
దైవిక కాల గణన వ్యవస్థలో అనగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమనబడే, పంచాంగ వ్యవస్థలో శాశ్వతమైన కీర్తిని గడించి....
శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి గా,
సర్వశ్రేష్ఠమైన శాశ్వత స్థానాన్ని ఆర్జించిన వైభవం ఏకాదశిది.....
మన శరీరం అనేది కేవలం అవి ఇవి తిండ్లు తినడానికి మాత్రమే లభించిన సాధనం కాదు.....
బాహ్య స్థూల శరీరానికి బిస్కెట్లు, బిర్యానీలు, అందించి బాగా దారుఢ్యాన్ని అందించడం ఎంత గొప్పో.......
ఆంతర సూక్ష్మశరీరానికి చక్కని దైవిక ఆలంబనను,
అధ్యాత్మ వస్తువిషయసామాగ్రిని అందించిన నాడు మన కేవల మానుష శరీరమే ఎన్నెన్నో దైవిక భూమికలకు ఆవాసమై ఉండే యోగ శరీరాన్ని సిద్ధింపజేసుకోగలదు......
84 లక్షల జీవరాశుల్లో కేవలం మనుష్యుడుకి మాత్రమే ఈ వరం కలదు.....అది భగవద్ అనుగ్రహంగా ఎవరికి వారు సాధన / ఉపాసన గావించి అందుకోవాలి......
అటువంటి ఆధ్యాత్మిక ఉపాసనకు / యోగ సాధనకు దక్షిణాయణ పుణ్య కాలం నెలవు అని శ్రీ చాగంటి సద్గురువులు ఒక ఎగ్సాంపుల్ కూడా చెప్పడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది....
( ఉత్తరాయణంలో కాకుండా దక్షిణాయాణం లో గతించడం గురించి వివరిస్తూ...)
ఆధ్యాత్మిక ఉపాసనకు నెలవైన ఈ దక్షిణాయణ పుణ్యకాలంలో, ఉపాసనా బలాన్ని బాగా వృద్ధి గావించుకోడానికి సంప్రదాయాన్ని పాటించే మాన్యులైన పీఠాధిపతులు కూడా చాతుర్మాస్య దీక్షను అవలంబించడం గమనించే ఉంటారు.......
ఉపాసన బలం అంటే ఏంటి....అది ఎట్లు విదితమగును.....
ఒక మనిషికి బాగా అర్ధ/ధన బలం ఉంటే....
" అబ్బో ఆయనకి ఏం తక్కువ.....
ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకే గుర్తులేవు......"
అని అంటుంటారు.....
ఒక మనిషికి బాగా అంగ బలం ఉంటే....
" అబ్బో ఆయనకి ఏం తక్కువ.....
ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఓ వంద మంది రక్షణగా ఉంటారు..."
అని అంటుంటారు.....
ఇలా లౌకికమైన బలాలన్నీ కూడా సదరు వ్యక్తి యొక్క భౌతికమైన హోదా, సంపద, జనాభిమానం, ఇత్యాదిగా ప్రకటితమవ్వడం తో వాటి యొక్క ఉనికికి కచ్చితమైన కొలమానం అనేది సాధ్యమయ్యే అంశం......
కాని యోగశక్తికి / అధ్యాత్మ ఉపాసనా బలానికి అటువంటి భౌతికమైన కొలమనాలు ఉండవు.....
ఎందుకంటే అది భౌతిక విభూతి కాదుకాబట్టి.....
సదరు సాధకుడి సంకల్పానికి అనుగుణంగా ఆ యోగబలం / ఉపాసనా బలం అనేది చిరంతనమైన కాలప్రవాహంలో కాలగతికి అతీతంగా తనను తాను వ్యక్తపరుచుకునే దైవిక సంపద....
అది ఎవ్విధమైన భౌతిక విభూతులకు కూడా అందని / మేయము కాజాలని / గ్రాహ్యము కాని దైవిక సంపద......
అదే స్థాయిలో, లేదా అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండే యోగులకు మాత్రమే దర్శనీయమై ఉండే దైవిక స్థితి యొక్క అనుభూతి గా మాత్రమే వాటిని వర్ణించగలము......
అనగా " కేవల మానుష ఉపాధిలోకి దైవిక తత్త్వము అధ్యాత్మ సంకల్పంతో ఆదేశమగుచున్నది....."
అనే నిర్వచనము ఇక్కడ సరితూగుతుంది....
ఏకాదశి అనే తిథికి గల ప్రత్యేకత రీత్య, దక్షిణాయణ పుణ్యకాల ప్రారంభ సమయంలో "యోగ నిద్రకు" ఉపక్రమించే శ్రీమన్నారాయణుడి యోగ భూమికకు, అనగా తన దైవిక తిరుమేని నుండి జనించే వివిధ యోగ తత్త్వాలకు, మరియు ఈ కాలంలో వచ్చే ఏకాదశికి ఒక విధమైన సామ్యము ఏర్పడుతుంది.....
మామూలుగానే ఏకాదశి ఎంతో ప్రీతికరమై ఉండగా,
ఉపాసన రీత్యా ఎంతో విశేషమైన ఈ దక్షిణాయణ పుణ్యకాలం లో జాగ్రత్ స్థితి నుండి స్వప్న/సుషుప్తి స్థితుల్లోకి శ్రీమన్నారాయణుడి దైవిక చైతన్య శక్తి రూపాంతరం గావింపబడే సమయంలో తొట్టతొలి
యోగప్రక్రియ జనిత శక్తిని ఆదేశపరుచుకునే తిథి కాబట్టి తొలి ఏకాదశిగా ఈ దేవశయన ఏకాదశి ఖ్యాతి గడించింది......
ఇదంతా చాలా కాంప్లెక్స్ గా ఉంది అని అనిపిస్తే......
ఒక సింపుల్ ఎగ్సాంపుల్లో వివరిస్తా.......
ఒక ముఖ్యమైన నేత 8 గంటల ముఖ్యమైన చర్చలకోసం అని ఒక క్యాంప్ సమావేశానికి / సదస్సుకు వెళ్ళేముందు,
( లోనికి మీడియాకు అనుమతి లేదు....కేవలం చాలా ముఖ్యమైన కొందరు వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఆ సదస్సు ప్రాంగణంలోకి.....)
ఇచ్చే స్టేట్మెంట్ అనేది ఆ 8 గంటలవరకు కూడ మీడియాలో పదే పదే రిపీటెడ్ ముఖ్యాంశాలుగా / న్యూస్ గా వినిపించడం గమనించే ఉంటారు........
ఆ నేత మళ్ళి తిరిగివచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఏ ఛానెల్ పెట్టినా కూడా ఆ ఒక్క న్యూసే రిపీటెడ్ బ్రోడ్కాస్ట్ గావించబడుతుంది......
అచ్చం అదే విధంగా ఒక 8 ఏకాదశుల పర్యంతం, యోగ నిద్రలోకి ఉపక్రమించే శ్రీమన్నారాయణుడి నుండి అందే ఒక విధమైన తొట్ట తొలి యోగ విభూతికి ఆవాసమై ఉండే తిథి కాబట్టి, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని / దేవశయన ఏకాదశిని
తొలి ఏకాదశిగా ఆస్తిక లోకం స్వాగతించడం అనాదిగా పరిఢవిల్లుతున్న సత్సంప్రదాయం.....
సదరు ఉపాసకుడు ఏ యోగమార్గాన్ని అనుసరిస్తూ, ఏ సాధనలో ఏ స్థాయిలో ఉన్నాడో అనే దానికి అనుగుణంగా ఆ శ్రీమన్నారాయణుడి నుండి అందే తొట్ట తొలి యోగ విభూతి వారి వారి దక్షిణాయణ పుణ్యకాల ఉపాసనకు దోహదం గావిస్తుందనేది వారి వారి వ్యక్తిగత ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం........
జ్యేష్ఠ మాసంలో స్వామి వారి దర్శనానికి గతవారం వెళ్ళినప్పుడు, ఆనందనిలయంలోని
కులశేఖరపడికి ఆవల వర్ణింపశక్యంకాని వైభవంతో అలరారే ఆ శ్రీవేంకటేశ్వరస్వామి వారి సజీవసాలిగ్రామావేశిత శ్రీవైష్ణవ తేజస్సును దర్శిస్తూ ఎంతగానో అనుగ్రహింపబడినాను.....
(మొట్టమొదటి సారి శ్రీకాణిపాక సిద్దివినాయక ఆలయం మరియు రెండవసారి శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్ర దర్శనానుగ్రహం కూడా లభించింది)
ఈ దైవానుగ్రహంలోని అదేశమగుట అనే సిద్ధాంతం గురించి, ఏ విధంగా శ్రీహరిసంకీర్తనము దైవానుగ్రహాన్ని
"ఆదేశపరుచుట" అనే ప్రక్రియలోకి
అప్రయత్నంగానే భక్తులను నిమగ్నంగావించి తరింపజేస్తుందో....
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్రింది రసరమ్యమైన సంకీర్తనలో నుడివినారు.......
😊💐🎂🍧🍕🍦🙏
https://pedia.desibantu.com/kaliyugambunaku-galadidiye
No comments:
Post a Comment