ఆషాఢ బోనాల జాతర అనాదిగా
తెలుంగు / తెలంగాణ నైసర్గికాచార వైభవానికి ఉనికిపట్టుగా పరిఢవిల్లుతున్న ప్రాంతీయ పండుగ....
శివసత్తులతో / శక్తి పూనకాలతో శిగమూగే భక్తబృందాల నడుమ దేదీప్యమానంగా వెలిగే దివ్వెలు బోనం కుండలపై కొలువుదీరి ఉండగా, అమ్మవారికి తరలి వచే అసంఖ్యాక బోనాలతో ఉండే జాతరలోని అర్ధాలు / అంతరార్ధాలు ఎన్నో ఎన్నెన్నో.....
ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలను గమనించే ఉంటారు....
ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు / ప్రాణుల యొక్క ప్రతిరూపాలుగా ఏనుగులు / టెడ్డిబేర్లు లాంటి జంతువులు, కార్, బస్, ట్రైన్, లాంటి పెద్ద పెద్ద వాహనాలు ఇత్యాదివన్నీ కూడా చిన్న చిన్న రూపాలను సంతరించుకొని మన ఇంట్లోని చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆటబొమ్మలుగా వచ్చి కొలువై ఉండడం.....
అనగా ఒక స్థూల స్థాయిలోని ప్రపంచాన్ని సంక్షిప్తం గావించి చిన్న పిల్లలకు వాటిని ప్రపంచం గా పరిచయం గావించడంలో....
1. ఆయా వస్తువుల వాస్తవ ఉనికి గురించి చిన్న పిల్లలకు వారి వారి " చిన్న స్థాయిలో " ఎరుక పరచడం....
2. వారు పెరిగి పెద్దవారయ్యాక వాస్తవిక ప్రపంచంలోని ఆయా స్థూల వస్తు ప్రాణి సముదాయాన్ని అత్యంత శీఘ్రంగా గుర్తించి సామ్యమును ఏర్పరచుకొని వాటి గురించిన అవగాహన అనునది ఎంతో వేగంగా లభింపజేసుకోవడం...
3. తద్వారా ఎంతో ఉన్నతమైన రీతిలో వివిధ వస్తువిషయగ్రాహ్య శక్తి పెంపొందింపబడడం.....
ఇత్యాదిగా ఉండే లౌకికమైన సాధరణమైన అంశాలను మనం గమనించవచ్చు.....
ఇదే విధంగా.....
ఎక్కడెక్కడో దూరతీరాల్లో పుణ్యక్షేత్రాల్లో కొలువుదీరి ఉండే స్వయంభూ దైవాలను వ్యయప్రయాసలకోర్చి దర్శించి / సేవించే భాగ్యం అందరు గృహస్తులకు వారి వారి నిత్య జీవన గార్హస్త్య ఉద్యోగ / వ్యాపార / వ్యవహార / కర్తవ్యాల రీత్య కుదరకపోవచ్చు....
" అమ్మవారు మరియు హనుమంతుడు....
ఈ ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా భక్తులకు అత్యంత శీఘ్రంగా పలికే దైవిక తత్త్వములు...." అనే విషయం గురించి శ్రీచగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో చెప్పడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది......
అందుకే గ్రామగ్రామాన ఎన్నెన్నో పేర్లతో గ్రామదేవతలుగా కొలువై ఉండే అమ్మవారు / శిలలకు సిందూరం పూసి హనుమంతులవారి గుడిగా కొలువుదీరి ఉండే ఆంజనేయ మందిరాలు దైవిక రక్షక వ్యవస్థలుగా ఊరురా ఉండడం ఎల్లరూ వారి వారి ప్రయాణాల్లో గమనించే ఉంటారు.....
"క్షేమంగా వెళ్ళి లాభంగా రండి..." అని మన పెద్దలు అనడం వినేఉంటారు....
క్షేమం అనగా ఉన్నది ఉన్నట్టు ఉండుట....
లాభం అనగా కొత్తవి సమకూరుట...
భారి వర్షాలు / వరదలు / అంటువ్యాధులు / ఇత్యాది వాటిని కాలంతర్గతంగా తీసుకువచ్చే
ఈ ఆషాఢ మాసం నుండి క్షేమం / లాభం అనేవి ప్రశ్నలుగా మారే సమయం.....
న్యూస్లో చూస్తూనే ఉన్నాం...
నిలిపి ఉన్న బైకులను / కార్లను / నడుస్తున్న మనుషులను వరదలు వాటి ప్రవాహంలో ఏవిధంగా లాక్కొనిపోతున్నయో.....
అనగా క్షేమం మరియు లాభం ఒకానొక సమయంలో ప్రశ్నార్ధకమైనవి అని అర్ధం....
వివిధ అంటువ్యాధులు ప్రబలి...
శ్రావణం, భాద్రపదం గడిచి
ఆశ్వయుజ మాసం వచ్చే సరికి యమదమ్ష్ట్ర బయలుదేరేకాలం...
అనగా సమవర్తి భూమి యొక్క భారాన్ని / పాపాత్ములను అధిక సంఖ్యలో తనతో పాటు తీస్కెళ్ళిపోయే సమయం.....
ఇలాంటి సమయంలో దూరతీరాలకు వెళ్ళకుండానే,
పెద్ద పెద్ద వ్యయప్రయాసలకు లోనుకాకుండా......
ఎవరికి వారు..వారి వారి స్థోమతకు తగ్గట్టుగా వారి వారి ఇళ్ళ వద్దే కొలువైఉండే అమ్మవారి ఆలయాల్లో / గ్రామదేవతల మందిరాల్లో....
ఆషాఢ బోనం / ఆషాఢ జాతర ఆరాధన / పేరిట అమ్మవారిని సేవించి తరించడమనే సంప్రదాయమే ఆషాఢ బోనాల జాతర.....
మట్టినుండి జనించి మట్టి యొక్క మృత్తికా తత్త్వాన్ని కలిగిఉండే పదార్ధాలైన
హరిద్ర / పసుపు, గుడము / బెల్లం,
తో తయారు గావింపడిన బెల్లమన్నం / పసుపన్నం నివేదనలను....మన జీవాంతర్గతమైన శుద్ధ సత్త్వ / సత్త్వ గుణాలకు ప్రతీకలుగా గావించి,
మట్టికుండను శరీరం అనే తొడుగుకు ప్రతీకగా గావించి,
అజరత్వానికి ప్రతీకగా ఉండే వేపాకులను / వేపనీటిని గైకొని,
హృదయకోశంలో దేదీప్యమానంగా వెలిగే పరమాత్మను బోనంపై వెలిగే పరంజ్యోతికి ప్రతీకగా గావించి,
ధగధగమెరుస్తూ హరిద్రావర్ణంలో తణుకులీనే బోనమే మన...
జీవ జీవేశ్వర జీవధారక వ్యవస్థకు సామ్యముగా స్థిరీకరించి....,
శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥
చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥
తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయవ్వనా, మదశాలినీ ॥ 91 ॥
" నిత్యయవ్వనా " గా వెలిగే ఆ పరమాత్మికను
పృథ్వీశక్తి, జీవశక్తి, చైతన్యశక్తి, అజరాశక్తి,
ద్యుశక్తి యొక్క సమ్మిళిత సమాహార స్వరూపంగా వెలిగే " బోనం " అనే సాంప్రదాయిక నివేదనతో ఆరాధించి నమస్కరించి సేవించడంతో....
ఈ 5 శక్తులను కూడా ఆరాధించిన భక్తులకు అనుగ్రహంగా అందించి దీవించమనే తత్త్వ సందేశం బోనం సమర్పణలో ఇమిడిఉంది....
ఈ 5 శక్తులు పరిపుష్ఠమై ఉండడమే ఒక వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం తద్వరా క్షేమం / లాభం అనునవి కాలాంతర్గతంగా సమకూరడం....
ఒక డ్రోన్ కి గల 5 టర్బైన్స్ / ప్రొపెల్లర్స్ సరిగ్గా సంతులనాత్మకంగా ఉండి నిర్దేశిత ఎత్తులో స్థిరంగా ఎగురుతున్నప్పుడు యావద్ ప్రపంచం కూడా ఒక విహంగ వీక్షణంలా తనకు ( కెమెరాకు ) కనిపిస్తుంది...
తద్వారా మనకు కనిపిచ్చేలా చేస్తుంది......
అదే విధంగా....
పృథ్వీశక్తి : శరీరాంతర్గత
సకల పాంచభౌతిక వ్యవస్థా పరిపుష్ఠి....
జీవశక్తి : సత్ అసత్ స్పృహ తో సదా అంతర్నిహితమై ఉండే ఆత్మ శక్తి
చైతన్యశక్తి : చిత్తము యొక్క నిత్య వికసిత గుణము
అజరాశక్తి : సకలేంద్రియ పటుత్వం
ద్యుశక్తి : వివిధ దైవిక లోకాలతో / తత్త్వాలతో అనుసంధానాత్మక మేధాశక్తి....
ఈ 5 సరిగ్గా సంతులనాత్మకంగా ఉండి ఒకానొక ఉన్నతమైన భావస్థాయిలో స్థిరంగా మనసు లయించినప్పుడు యావద్ ప్రపంచం కూడా ఒక విహంగ వీక్షణంలా తనకు ( అంతర్నేత్రానికి /మనోనేత్రానికి ) కనిపిస్తుంది...
తద్వారా లోకాన్ని / లోకులను / లోకరీతులను క్షుణ్ణంగా అధ్యయనం గావించి వడపోసే ప్రజ్ఞ్య అనునది భక్తునకు భాసిస్తుంది.....
" అంటే...గిట్ల ఒక బోనాల పండ్గకు నమస్కరించి ఆరాధించగానే...గట్ల గొప్ప గొప్ప యోగాలు ఒస్తయా...."
అనే పెడసరి వాదన కాకుండా.....
అట్లు విశ్వసించి పరాశక్తిని ఆరాధించేవారికి ఆయా యోగములు ఆ
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
యొక్క అనుగ్రహంగా లభించితీరుతాయి
అని అనడం అనాదిగా పరిఢవిల్లే సనాతన సంప్రదాయం యొక్క వైభవం....
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
ప్రగతినగర్ బస్తి గ్రామదేవత శ్రీపోచమ్మ అమ్మవారికి.....
అస్బెస్టాస్ కాలని గ్రామదేవతలు..
శ్రీనల్లపోచమ్మ, శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు.....
కూకట్పల్లి గ్రామ దేవత శ్రీ చిత్తరామ్మ తల్లికి,
ఆషాఢ బోనాల జాతర నమస్సులను అర్పిస్తూ....
సర్వం బల్కంపేట శ్రీరేణుకాహేమలాంబ / ఎల్లమ్మ శ్రీచరణారవిందార్పణమస్తు...
🙏🙏🙏🙏🙏
😊🍨🍦🎂🍧💐🎇🍕
( బోనాల వౌభవం పై మరింత విస్తృత సమాచారం నా పోత పోస్టుల్లో కలదు...
https://m.facebook.com/story.php?story_fbid=10224663296743187&id=1033694038 )
No comments:
Post a Comment