Saturday, July 9, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ పౌర్ణమి / గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి మరియు ఆషాఢ శుద్ధ నవమి, శ్రీ చాగంటి సద్గురువుల చాంద్రమాన జన్మదినోత్సవ శుభాభినందనలు...🍦🍕🍧💐😊


గురువు అనగా 

లఘువు / గురువు అనే అర్ధంలో 
బరువు అనే అర్ధం.....

గురు వాచకం అనే అర్ధంలో ఉపాధ్యాయులు / ఆచార్యులు / బోధకులు / ఇత్యాది గా అర్ధం....

వ్యుత్పత్తి ప్రకారంగా
గు కారశ్చ అంధకారశ్చ.....
రు కారంతన్నిరోధకః....
ఇతి గురుః....

అనే అర్ధంలో 
"అంధకారాన్ని రూపుమాపే వారు 
గురువులు.... "

ఇక్కడ అంధకారం అనగా అజ్ఞ్యానం.....

అనగా మనకు తెలియని విషయాలను తెలిపి మనకు జ్ఞ్యానం ప్రసాదించువారు గురువులు అని వాక్యార్ధం..... 

ఈ లోకంలో మనకు తెలియని విషయాలు అంటే ఎన్నో ఎన్నెన్నో.....

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
అనంతమైన వేదరాశిని ఈ కలియుగ వాసులు అధ్యయనం గావించడం యుగ లక్షణం రీత్య వీలుకాదు కాబట్టి,
ఋగ్వేదం, సామవేదం,
యజుర్వేదం ( కృష్ణ యజుర్వేదం / శుక్ల యజుర్వేదం )
అథర్వవేదం గా 
వేదవిభాగం గావించి వారి నలుగురు శిష్యులకు వాటిని అందించి లోకాన్ని అనుగ్రహించిన వారిగా,
18 పురాణాలను రచించినవారిగా,
యావద్ వైదిక వాంజ్మయ కర్తగా, 
వ్యాస మహర్షి వారు ఆస్తికులెల్లరిచే ఆరాధింపబడే మహనీయులుగా పూజింపబడుతున్నారు....

ఈ అధ్యాత్మ గురువారాధన అనే సత్సంప్రదాయాన్ని ఒక అవిచ్ఛిన్న పరంపరగా, శ్రీమన్నారాయణుడు/శ్రీదక్షిణామూర్తి ఆద్యులుగా....
బ్రహ్మగారి మొదలు మన గురువుల వరకు గల గురుపరంపరను .....

సదాశివసమారంభాం....
వ్యాసశంకరమధ్యమాం....
అస్మదాచార్యపర్యంతాం....
వందే గురుపరంపరాం....

అని ఎల్లవేళలా నమస్కరిస్తూ, 
విశేషంగా ఆషాఢ పౌర్ణమి రోజున ఈ క్రింది శ్లోకం తో శ్రీవ్యాసమహర్షి వారిని నమస్కరించడం గురించి శ్రీచాగంటి సద్గురువులు తెలిపిఉన్నారు....

ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్దే
ఫుల్లారవిన్దాయత పత్ర నేత్ర
యేనత్వయా భారత తైల పూర్ణ :
ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః

వ్యాసం వశిష్ఠనప్తారం  శక్తే: పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే  శుకతాతం తపోనిధిం

మరియు వ్యాసుల వారిది ఒక పోస్ట్ / పదవి అని.....
ప్రతి యుగంలోను ఆ పోస్టులో ఉన్న వ్యక్తి ద్వారా లోకానికి జ్ఞ్యానానుగ్రహం లభించడం గురించి కూడా తెలిపిఉన్నారు....

గురువులందు సద్గురువులు వేరయా.....
అని అనడంలోని ఆంతర్యం ఏమనగా....

మిగతా గురువులందరు కూడా ఒక సబ్జెక్ట్ / అంశం / పాఠం / విషయం / తెలిపి / నేర్పి / మనకు జ్ఞ్యానానుగ్రహాన్ని ప్రసాదిస్తే.....
సద్గురువులు అనువారు వారి సరళమైన అధ్యాత్మ బోధలతో.....
" ఆత్మ జ్ఞ్యానం " అనే సర్వోత్కృష్టమైన జ్ఞ్యానాన్ని కటాక్షిస్తారు..... 

ఐ.ఎస్.బి లాంటి ప్రతిష్టాత్మక  సంస్థల్లో జాయిన్ అయినా కూడా " ఆత్మ జ్ఞ్యానం " అనునది చదువుకొనే విద్యగా  లభించదు....

ఎందుకంటే అది లౌకిక విద్య కాదు కాబట్టి....

ఈ " ఆత్మ జ్ఞ్యానం " అనునది ఎందుకు అన్నిట్లోకి సర్వోత్కృష్టమైనది  అంటే....

నిత్యానిత్య వస్తువివేచనతో.....
సదసత్ స్పృహతో.....
ఆత్మానాత్మ వివేకం తో....
ప్రాపంచిక పాంచభౌతిక జగత్తులో ఉంటూనే.....
మనలోనే దాగుండే మరో అలౌకికమైన లోకాన్ని దర్శింపజేయిస్తూ....

మన శరీరమే మనకు, అనగా మనలో ఉండే జీవ జీవేశ్వర భావానికి / తత్త్వానికి, ఒక దర్పణం గా ఉండి....

శరీరాన్ని ఒక ప్రాకృత పాంచభౌతిక పదార్ధంగా దర్శిస్తూ....

శరీరాంతర్గతమైన జీవుణ్ణి అప్రాకృతమైన శాశ్వతమైన నిత్య సత్య పారమార్ధిక పదార్ధం గా 
దర్శింపగలిగే స్థితిని అనుగ్రహిస్తూ...

"మననుండే మనము విడివడి మనతో సహా ఈ యావద్ లోకాన్ని ఒక వేదికపై సాగే నాటకంలా  దర్శించుట....." అనే అసాధారణమైన ప్రజ్ఞ్యను కటాక్షించునదే ఆత్మ జ్ఞ్యానము....

" జ్ఞ్యానాత్ ఏవతు కైవల్యం " అని అందుకే అన్నారు...

అనడానికి ఏదో ఒక చక్కని సినిమా స్టోరీలా, సూర్య నటించిన "ప్రాజెక్ట్ 24" మూవి లా ఉంది కాని అదెలా సాధ్యం.....అనే సందేహం రావడం సహజమే......

గురుబోధాంతర్గతంగా ఆ స్థాయిని ఆర్జించి, ఆ స్థాయిలో బౌద్ధిక చైతన్యాన్ని స్థిరీకరించి......
చిత్త వృత్తులను ఏకోణ్ముఖం గావించి...
నిశ్చల తత్త్వంలో నిర్మలమైన రీతిలో మనుష్యుడి మనసు లయం అయిననాడు ఆ దర్శనం సాధ్యమే....

ఒక సామాన్య వ్యక్తికి తన బైక్ అనేది తనను మోసుకొని తిప్పే ఒక ద్విచక్ర వాహనం......
ఎల్లప్పుడు " ఒక వాహనం " అనే వ్యవస్థగానే తనకి తన బైక్ కనిపిస్తుంది...అనిపిస్తుంది....వినిపిస్తుంది...

కాని ఒక బైక్ మెకానిక్ కి అది 
ఒక హ్యాండిల్, రెండు టైర్లు, కొన్ని లైట్లు, ఒక ఇంజన్, ఇంకొన్ని ఐరన్ పార్ట్స్, ఇత్యాది వాటి సమూహం గా దర్శనీయమై ఉంటుంది....

" ఒక వాహనం" అనే అత్యంత స్థూల స్థాయి నుండి, ఇంజన్ ప్లగ్ లోని ఒక స్పార్క్ ను దర్శించడం అనే ఒక సూక్ష్మ స్థాయి వరకు, అన్నీ కూడా సదరు మెకానిక్ కి వివిధ విడి భాగాలా సమాహారం గా కనిపిస్తుంది...అనిపిస్తుంది....వినిపిస్తుంది...

అచ్చం ఇదే విధంగా...

" ఆత్మ విద్య " / " ఆత్మ జ్ఞ్యానం "
అనే స్వోద్ధరణాత్మక ప్రయాసలో కృషించే వారికి.....
లోకాన్ని అలా విడివడి చూసే దక్షత, ప్రజ్ఞ్య, అనునవి ఈశ్వరానుగ్రహంగా భాసించును....

తద్వారా.....లోకులను...లోకరీతిని....
మనుష్యులను.... మనస్తత్త్వాలను.... 
చాలా నేర్పుతో ఎంతో సూక్ష్మ స్థాయివరకు బేరీజు వేసే పరిణతితో ఉండడం అనే విభూతిని
" ఆత్మ జ్ఞ్యానం " ప్రసాదిస్తుంది......

అందుకే అన్ని విద్యలలో కెల్లా ఆత్మవిద్య సర్వోత్కృష్టమైనది.....

శ్రీమద్ భాగవతప్రవచనాల్లో గురువుగారు ఉటంకించినట్టుగా......
గొల్లవారు అమృతతుల్యమైన ఆవుపాలను ఒక్క చుక్క కూడా క్రిందపడకుండా కుండలోకి ఒద్దికగా పిండుకొని ఏవిధంగా తరిస్తారో.....

అవ్విధంగా సద్గురువులు ప్రసన్నమనస్కులై నిర్హేతుక దయాస్వరూపులై జ్ఞ్యాన గంగను అనుగ్రహిస్తున్నప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పకుండా అమృతతుల్యమైన ఆ జ్ఞ్యానప్రసాదాన్ని  శిష్యుడు ఎక్కడున్నాసరే శ్రవణంతో ఒడిసిపట్టాలి.....

గొల్లవారు గోవు నుండి జాగ్రత్తగా సంగ్రహించిన పాలను కాచి.....
పెరుగు, వెన్న, నెయ్యి, గా రూపాంతరం గావించి వివిధ ప్రయోజనాలను సిద్ధింపజేసుకున్నట్టు.....

ఒక శిష్యుడు కూడా తను ఎంతో శ్రద్ధగా విని ఒడిసిపట్టిన సద్గురువాక్కులు అనే అధ్యాత్మ విద్యను, మననం, నిధిధ్యాసనం, అన్వయం, అనుభవ పూర్వక పరిశీలన, పరిశోధన, ఆత్మోద్ధరణ, అనే వివిధ రీతుల వాటిని జీవితానికి ఆపాదించుకొని తరించవలే....

ఏ విధంగా అయితే ఆవునెయ్యితో రోజు తినే ఆహారాన్ని అమృతతుల్యం గావించి స్వీకరించడంతో మేధస్సు ఎంతో శక్తివంతంగా అవుతుందో.....

అదే విధంగా గురువాక్కుల శ్రవణానంతరం సాగే స్వాధ్యాయం తో జనించే అమేయమైన ఆత్మజ్ఞ్యానం మనిషిని దైవత్వం వైపునకు కొనిపోవు మార్గమై పరిఢవిల్లుతుంది....

2009 నుండి ఇప్పటివరకు కూడా నేను శ్రద్ధగా ఒక తపో యజ్ఞ్యం లా అవధరించిన శ్రీచగంటి సద్గురువుల ఎన్నెన్నో ప్రవచనాలను అధ్యాత్మ సిలబస్ గా భావించినట్లైతే.....
జీవితం అనే పరీక్షలో నాకు (515.0025/600) మార్కులు వస్తాయి...

అంతటి మహత్త్వాన్ని కలిగి, శిష్యులకు ఆ మహత్తును భ్రమరకీటక న్యాయంతో ఆపాదించే ఆ ప్రహృష్టవచనాలు ఎందరెందరో జీవితాలను ఘనంగా తీర్చిదిద్దే దైవానుగ్రహదాయక భక్తిజ్ఞ్యాన దివిటీలు.....

గురువుగారు ప్రవచనాల్లో ఒకచోట చెప్పినట్టుగా......

పంచుకుంటే తరిగిపోయే లౌకికమైన సంపద అనేది వారి వారి కుటుంబసభ్యులకు మాత్రమే చెందవచ్చేమో.....

కాని, పంచేకొలది పెరిగే గురువులు సృజించే అధ్యాత్మ జ్ఞ్యాన సంపద అనేది శిష్యులు ఎక్కడున్నా సరే వారికి శ్రీగురుకటాక్షం గా అందుతుంది......

ఒక్క వాక్యంలో సద్గురుబోధ యొక్క మహత్తును వర్ణించాలంటే......

" ఒకరియందు సద్గురుభావనతో శరణాగతి గావించిననాడు,
వారియొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష అనుగ్రహం బార్హస్పత్య అనుగ్రహంగా రూపాంతరం చెంది విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.....

వంద పుస్తకాలు చదివి ఆర్జించే జ్ఞ్యానం 100 అంతస్తుల భవనంపైకి మెట్ట్లెక్కి వెళ్ళడమనే ప్రయాస అయితే.....
ఒక సద్గురుబోధాంతర్గతంగా వాటిని అందుకోవడం అనేది ఎలివేటర్ / ఎస్కలేటర్ లో ఆ 100 అంతస్తులపైకి చేరుకోవడం వంటిది... 

మొదటి ప్రయాసలో మన ఇచ్ఛాపూర్వక జ్ఞానపూర్వక క్రియాపూర్వక ప్రమేయం నిత్యం మనల్ని నడపవలసి ఉంటుంది గంటల కొలది పయనంలా.....

రెండవ ప్రయాసలో ఒక్కసారి ఎలివేటర్ ఎక్కగానే అది ఆన్ చేయగానే తనంతతానుగా మనల్ని 100 అంతస్తులపైకి కొద్ది నిమిషాల్లోనే తీసుకుపోతుంది...

100 అంతస్తుల పైకి చేరుకోవడం అనేది రెండుమార్గాల్లోను ఉండే తుది ఫలితమే.....

కేవల మన ప్రయాసలో మనకు మనమే జ్ఞ్యానాన్ని సముపార్జించుకోవడం అనేది సుదీర్ఘమైన యాత్ర....

గురువానుగ్రహంగా జ్ఞ్యానం ఒనగూరడం అనేది ఈశ్వరానుగ్రహంగా ప్రభవించే సద్యో విశేషం.....

సద్గురువాక్కుల ఆలంబన లేనినాడు జీవితం ఒక బరువు......
సద్గురువాక్కుల ఆలంబన లభించిననాడు జీవితం కల్పతరువు....

అందుకే అన్నారు.....

"న గురోరధికం..న గురోరధికం.." అని..... 

అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్...
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ .....🙏

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ శుద్ధ నవమితో శ్రీ చాగంటి సద్గురువులు 63 వసంతాలను పూర్తిచేసుకొని 64వ పడిలోకి అడుగిడిన పర్వసమయంలో, వారికి వారి యొక్క చాంద్రమాన జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులను అర్పిస్తూ వారి శ్రీపాదములచెంత చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త సాష్టాంగ ప్రణామములు గావించడం ఒక తెలుగు వాడిగా జన్మించినందుకు నా జన్మాంతర సుకృతం....

వారి గురువుగారైన శ్రీ అమరేశ్వరప్రసాద్ గారికి నమస్కరిస్తూ... 
ఆ శ్రీవరభద్రగిరీషుడైన పావన గౌతమీ తటస్థిత
శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహంతో శ్రీచాగంటి సద్గురుదంపతులు మరియు వారి యావద్ కుటుంబం కూడా నిండునూరేళ్ళు నమస్కరించిన శిష్యులెల్లరిని ఘనంగా అనుగ్రహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ.....
శ్రీగురవేనమః...
🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐💐💐💐💐💐💐
🍦🍕🍧💐🎂😊
 

No comments:

Post a Comment