Thursday, July 7, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 ఆషాఢ బోనాల జాతర శుభాభినందనలు.....🍦🍕🍧💐🎂😊


ఒక 550 గ్రాముల బోనం అమ్మవారికి సమర్పింపబడితే, అందులో 
279.6 గ్రాముల గుడాన్నం/బెల్లమన్నం మరియు
(205.04 గ్రాముల హరిద్రాన్నం/పసుపన్నం + 
65.36 మిల్లి లీటర్ల వేపనీరు = 270.4 కిలోల నైవేద్యం) వెరసి 550 గ్రాములు ఉండే బోనం / భోజన నివేదనలో....మనం గమనిస్తే....

తీపి + ఘాటు + వగరు అనే మిశ్రమాల కలబోతగా ఉండే నైవేద్య సమర్పణే ఆషాఢ బోనం.....

ఒకే మూర్తిగా కొలువై ఉండే ఆదిపరాశక్తి లోని ఏ అంశకు ఏ నివేదన అందివ్వబడుతున్నది అనేది వేరే సబ్జెక్ట్....
శాక్తేయ సంప్రదాయంలోని ఆదిపరాశక్తి  ఆరాధనలో సకల వైశ్విక శక్తులు ఒకే సమ్మిళిత సమాహార స్వరూపంగా కొలువైఉండడం అనేది శ్రీవిద్యా సంప్రదాయంలోని విశేషం....

అందుకే అమ్మవారిని ఈ క్రింది నామాలతో వాగ్దేవతలు స్తుతించినారు.....
( ఒకే విరాట్ స్వరూపంలో సకల విధమైన శక్తి తత్త్వములు వివిధ కూటములుగా కొలువైఉండడం / ఆరాధింపబడడం ) 

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా॥34॥

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥

మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥

కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥

(నామపారాయణ గా స్తుతించడం / అర్చించడం అనే శ్రేయస్కర పరిధిని దాటి వివిధ శాక్తేయ సైద్ధాంతిక తత్త్వోపాసనల గురించి అందు నిక్షిప్తంగావింపబడి ఉండే శక్తివిస్ఫొటక బీజాక్షరాల గురంచి నేను చర్చింపజాలను.....
అవి కేవలం గురుముఖతః గ్రాహ్యమయ్యే లేదా ఆదిపరాశక్తి అనుగ్రహం తో సదరు ఉపాసకుడికి భాసించే శ్రీవిద్యా తత్త్వసందేశములు......
In simpler words, not every one who boards a flight is a pilot and thus only authorized trained personnel shall be allowed in to a plane's cockpit and its intricacies' discussions... )

ఒక సంవత్సర కాలంలో, 
ఉత్తరాయణం, దక్షిణాయణం అనే 2 అయనాల్లో
6 ఋతువులు, 12 మాసాలు, 24 పక్షములు, గా ఉండే కాలవిభాగంలో మన శరీరం ఒక్కో సమయంలో ఒక్కో విధమైన ప్రాకృతిక మార్పులకు / ప్రభావాలకు లోనై తత్ ఫలితాలతో నిరంతర మార్పును సంతరించుకుంటూ ఉంటుంది......

" ప్రపంచం " అనగా ప్రతి వస్తువు / ప్రాణి కూడా....

1. పుట్టుట.... 
2. పెరుగుట.... 
3. మార్పుచెందుట....
4. తరుగుట....
5. గిట్టుట...

అనే పంచ (5) విధమైన లక్షణాలతో ఉండునది....

మన శరీరం పై ఒక దోమకుడితే....
ఒక ఎర్రని సెగగడ్డలా పుట్టే వ్రణం....
క్రమంగా పెరగడం..... 
రంగు / పరిమాణం లో మార్పుచెందడం..... 
కొంత సమయానికి తగ్గడం... 
ఆతర్వాత కొంతసమయానికి మానిపోవడం..... 

గమనించే ఉంటారు కద.....

"తాత్కాలికంగా వచ్చి పోయిన ఆ వ్రణానికి శరీరము సాక్షి గా ఉండి ఆ మార్పును గమనించినది......"
అనేది ఒక స్థాయిలోని అధ్యయనం.....

పుట్టడం , పెరగడం..... 

10 వాయువులు / ప్రాణాల్లో ఒకటైన సమాన వాయువు యొక్క విశేషమైన వ్యవస్థాంతర్గతంగా శరీరం సాగడం / మార్పుచెందడం.....

50/60 దాటిన తదుపరి చైతన్యం/ఓపిక/సత్తువ/ తగ్గడం....

60 నుండి 100 సంవత్సరాల లోపు ఎప్పుడు ఈశ్వరుడి ఆనతిగా అనుగ్రహింపబడిన ఆయుః ప్రమాణం యొక్క లెక్కలు సరిపోయినవో అప్పుడు శరీరం తనంత తానుగా శరీరాంతర్గత జీవశక్తిని కోల్పోయి దేహం పార్థివదేహం గా తుది మజిలీకి చేరుకోవడం...... 

అనే 5 పరిణామక్రమాలను అందరూ గమనించే ఉంటారు.....

మనుష్య జన్మలో....

తీపి అనే మధురం 1. 2 పరిణామములను సూచిస్తుంది..... 
(పుట్టుట, పెరుగుట.... )

ఘాటు 3 వ దైన మార్పును సూచిస్తుంది..... 

వగరు 4. 5 వ పరిణామములను సూచిస్తుంది..... 
(తరుగుట , గిట్టుట...)

1.2.3 అనే పరిణామక్రమాలు ఎల్లరికీ అమోదయోగ్యమై ఉండేవే......
కాని 4. 5 అనే పరిణామక్రమాలు చాలామంది స్వాగతించనివి..... 

ఓ 10 సంవత్సరాల బాలుడుకి నీకు ఇంకో 60 సంవత్సరాల జీవితం ఉంది బాబు అని బర్త్డే స్వీట్ తినిపిస్తే అది మధురంగా ఉంటుందేమో కాని....

ఓ 60 దాటిన వ్యక్తికి నీకు ఇంకో 15 సంవత్సరాలు మాత్రమే జీవితం మిగిలి ఉంది అని బర్త్డే స్వీట్ తినిపిస్తే అది వగరుగానే ఉంటుంది.....

అది మానుష స్వాభావిక లక్షణం....

మనం స్వాగతించినా.....స్వాగతించకున్నా....
" ప్రపంచం " లోని ప్రతి వస్తువు / ప్రతి ప్రాణి కూడా ఈ 5 పరిణామక్రమాల్లో ఉనికిని స్థిరీకరించుకుంటూ ముందుకు సాగుతూ ఒకనాడు శైధిల్యం చెంది విశ్వంలోని పంచభూతాల్లోకి.....
దేహం లోని పంచభూతాలు లయించిపోవడం....
అనేది అవశ్యమైన ప్రక్రియ.....

అది ఎవ్వరైనా.....ఎంతటి వారికైనా సరే ఒకేవిధంగా సాగే ప్రకృతి యొక్క శాసనం......

అటువంటి పరిణామక్రమాన్ని పరిపూర్ణమైన ఎరుకతో,
పరిణతిచెందిన భావవైశాల్యంతో,
పరిపక్వమైన బౌద్ధిక ఆకళింపుతో స్వాగతించడం అనేది కేవలం ఈశ్వరానుగ్రహంగా సంభవించే అంశం.....

శ్రీ చాగంటి సద్గురువులు, సకల అధ్యాత్మ ఉపాసన యొక్క సారాన్ని ఒకే ఒక్క వాక్యంలోకి ఎంతో గొప్పగా ఒదిగేల ఒకచోట ప్రవచించడం కొందరికైనా గుర్తుండి ఉండాలి......

నిరంతర ఈశ్వరోపాసనతో మనుష్యుడు ఏ స్థాయికి వెళ్ళగలగాలి అంటే.....

" దాహం....పొయ్ నీరు......
ఆకలి.....వెయ్ కబళం..... "

అనే స్థాయిలో శరీరాన్ని సాక్షిగా దర్శించేంతవరకు......

అనడానికి ఏదో అరటిపండు ఒలిచి నోట్లో వేసినంత తేలికగా అనిపించినా.......
ఈ స్థాయిలో మనుష్యుడు చరించగలగడం అనేది ఏ స్థాయిలో సాధన సాగితే సమకూరే విద్వత్తో ఎవరికి వారు వారి వారి వివేచనతో బేరీజు వేసుకునే అంశం.....

అమ్మవారికి ఈ విధంగా 
మధురం+ఘాటు+వగరు సమ్మిళితమై ఉండే బోనం సమర్పణంతో.....
మన నిత్య ప్రాపంచిక  జీవితాంతర్భాగమైన పయనంలో మనకు ఆ పరాశక్తి అనుగ్రహంగా ఆ స్థాయిలో విద్వత్తు సమకూరుతుంది అనేది ఇందలి అధ్యాత్మ తత్త్వ సందేశం....

అంటే ఇట్ల బోనం సమర్పించగానే అట్ల అంతటి విద్వత్తు సమకూరుతుందా అని అనడం కాకుండా.....
అట్ల ఎన్నో సంవత్సరాలుగా సమర్పింపబడిన ఆషాఢ బోనానికి ప్రతిఫలంగా ఆ విద్వత్తు ఒకనాడు సమకూరుతుంది అనేది ఇందలి విశ్లేషణ.....

మామిడి పిక్క ఇట్ల భూమిలో పాతగానే అట్ల కాయలు కాసి పండ్లైతయా.....?

పిక్క నుండి మొలకెత్తిన అంకురం,
మొక్కై, చెట్టై, పూత దాల్చి, వేలాదిగా పిందెలు కాసి, వందలాదిగా కాయలు నిలిచి, వాటిలో చెట్టుపైనే ఉండి పండ్లుగా రూపాంతరం చెందినప్పుడు.....
ఒకనాడు భూమిలో పాతిన మామిడి పిక్క ఇన్నాళ్ళకు ఇంతమందికి మధురసభరితమైన సాటిలేని మేటి ఆమ్రఫలములను అందిస్తున్నది అనేది సత్యం......

అదే విధంగా ఈనాడు ఆషాఢ శక్తికి సమర్పింపబడిన బోనం / నమస్కారం అనేది ఏదో ఒకనాటికి భక్తులకు ఆ విద్వత్తును కటాక్షిస్తుంది అనేది భగవతి అనుగ్రహ విశేషం.....

జడానికి కూడా శక్తి ఉంటుంది అనే ఈనాటి శాస్త్రవేత్తల సైన్స్ ని ఆనాడే వాగ్దేవతలు నుడివినారు....

పంచాంగ పరంగా శూన్యమాసం అయిన ఈ ఆషాఢంలో విశేషమైన శక్తిస్వరూపిణి గా మేల్కొనే ఆ ఆదిపరాశక్తి....., 
ఆషాఢ శక్తిగా ఊరూరా, గ్రామగ్రామానా, పల్లెపల్లెలో, పట్నాల్లో, ఆరాధింపబడుతూ సమర్పింపబడే విశేషమైన బోనం / నైవేద్యంతో శాంతించి భక్తులెల్లరిని శాంతమూర్తిగా ఉండి చల్లగా సమ్రక్షించుగాక అని కోరుకుంటూ....

భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా ।
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥

నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా ।
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥

నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45

ఓం భావనాగమ్యాయై నమః

ఓం శ్రీభద్రకాళ్యై నమః

ఓం శాంతిః...శాంతిః...శాంతిః....
🙏🙏🙏🙏🙏😊🎂💐🍧🍕🍦

చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥

తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥

మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥

కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥

కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥

(
నా గత సంవత్సర బోనాల విశేషాల పోస్ట్లు ఈ క్రింది లింకుల్లో లభించును....

https://shreeguravenamah-aithavk.blogspot.com/2021/07/01-2021.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/07/blog-post_12.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2018/09/blog-post_16.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post_20.html?m=1

https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/07/2019-bonaalu.html?m=1
)

No comments:

Post a Comment