యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
అని అనాదిగా మన భారతావని ఆదిపరాశక్తిని ఆరధిస్తూ తరించే దైవికభూమిగా ఖ్యాతిగడించినది...
సర్వజీవకోటి యొక్క మనుగడ వాటివాటి శక్తిప్రకటనపై ఆధారపడిఉండే అంశమే....
ఆ శక్తి ఎన్నెన్నో నామరూపాల్లో వివిధ చోట్ల, వివిధ రీతుల, వివిధ సంప్రదాయాల్లో ఆరాధింపబడుతూ ఆరాధించిన భక్తిలెల్లరికీ ప్రార్ధింపబడిన శక్తియుక్తులను అనుగ్రహించి తరింపజేస్తున్నది...
లాస్ట్ ఇయర్ వందకిలోల్ ఎత్తినవ్...
ఈ ఇయర్ ఎంత...
అని ఒక పైల్వాన్ ని ఉద్దేశ్యించి ఎవరన్నా అంటే, అది శారీరక దారుఢ్యానికి సంబంధించిన శక్తి అని అర్ధం...
లాస్ట్ ఇయర్ వంద కిలోమీటర్లు ఉర్కినవ్...
ఈ ఇయర్ ఎంత ...
అని ఒక రన్నర్ ని ఉద్దేశ్యించి ఎవరన్నా అంటే, అది భూమిపై శరీరాన్ని పరుగెత్తించే / శరీర శీఘ్రగమన దారుఢ్యానికి సంబంధించిన శక్తి అని అర్ధం...
లాస్ట్ ఇయర్ వంద మీటర్లు విసిరినవ్...
ఈ ఇయర్ ఎంత ...
అని ఒక జావెలిన్ త్రో ప్లేయర్ ని ఉద్దేశ్యించి ఎవరన్నా అంటే, అది శరీరం యొక్క వినిర్ముక్త దారుఢ్యానికి సంబంధించిన శక్తి అని అర్ధం...
లాస్ట్ ఇయర్ వంద మీటర్లు ఈదినవ్...
ఈ ఇయర్ ఎంత ...
అని ఒక స్విమ్మర్ ని ఉద్దేశ్యించి ఎవరన్నా అంటే, అది శరీరం యొక్క జలాంతర్గత గమన వేగానికి సంబంధించిన శక్తి అని అర్ధం...
పైన ఉదహరింపబడిన శక్తిలన్నీ కూడా శారీరక / భౌతిక / లౌకిక / మానుష అనుబంధ శక్తుల ప్రస్తావన...
ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేక / వైవిధ్య భరితమైన అనుబంధ శక్తులు....
అచ్చం ఇదేవిధంగా...
శ్రీ చాగంటి సద్గురువుల "శ్రీకనకధార స్తోత్రవైభవం" ప్రవచనాల్లో వివరింపబడిన విధంగా, ఆదిపరాశక్తిని శ్రీఆదిశంకరాచార్యుల వారు చతుర్విధమైన అనుబంధ శక్తిగా స్తుతించారు....
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥
శ్రీవాణి / శ్రీలక్ష్మి / శాకంబరి / శ్రీగౌరి అనేవి మానసిక / అలౌకిక / దైవిక అనుబంధ శక్తులు....
(మనిషి మనస్సు యొక్క శక్తియే ఆరాధనా స్థాయి యొక్క శక్తి అవుతుంది కాబట్టి మానసిక శక్తులు.
ఇతర ఎన్నో లోకాల్లో కూడా పరివ్యాప్తమై ఉండే శక్తులు కాబట్టి అలౌకిక శక్తులు.
దేవతా తత్త్వాలుగా పరిఢవిల్లే శక్తులు కాబట్టి దైవిక శక్తులు)
ఒకానొక సూపర్ హీరో వెయ్ట్ లిఫ్టర్ + స్ప్రింటర్ + త్రోఅర్ + స్విమ్మర్, గా ఉండడు అని అనడం కుదరదు...
కాని ప్రహృష్టమైనరీతిలో,
ఒకరు వెయ్ట్ లిఫ్టర్ గా, వారి శక్తి ప్రకటనం గావిస్తారు...
మరొకరు స్ప్రింటర్ గా, వారి శక్తి ప్రకటనం గావిస్తారు...
మరొకరు త్రోఅర్ గా, వారి శక్తి ప్రకటనం గావిస్తారు...
మరొకరు స్విమ్మర్ గా, వారి శక్తి ప్రకటనం గావిస్తారు....
అచ్చం అదేవిధంగా
ఒకే ఆదిపరాశక్తి శ్రీవాణి గా, శ్రీలక్ష్మి గా, శాకంబరి గా, శ్రీగౌరి గా, ఉంటూనే.....
ప్రహృష్టమైనరీతిలో,
శ్రీవాణిగా గా ఆరాధింపబడుతూ, వైరించి శక్తి ప్రకటనం గావించడం...
శ్రీలక్ష్మిగా గా ఆరాధింపబడుతూ, శ్రియః శక్తి ప్రకటనం గావించడం...
శాకంబరి గా ఆరాధింపబడుతూ, అన్నపూర్ణ శక్తి ప్రకటనం గావించడం...
శ్రీగౌరిగా గా ఆరాధింపబడుతూ, రుద్రాని శక్తి ప్రకటనం గావించడం....
కూడా అదేవిధమైన తత్త్వ సమన్వయం....
ఇట్టి వైవిధ్యమైన నామరూపాత్మక వైభవంతో అలరారే ఆదిపరాశక్తి యొక్క ప్రాభవంలో, భోళాశంకరుడి అర్ధాంగిగా ఆరాధింపబడే అపారకరుణామయి అయిన శ్రీగౌరి శక్తి కూడా భక్తులకు నిత్యం కరతలామలకమై ఉండే అనుగ్రహం...
కాస్త పసుపుకుంకుమను సమర్పించి భక్తితో నమస్కరించినవారికి ఘనంగా అనుగ్రహాన్ని ప్రసాదించే అమ్మవారి వైభవం యుగయుగాలుగా జగజగాల్లోనూ సుప్రసిద్ధినొందిన విశేషం...
ఆ భక్తి ఒక్కో నైసర్గికాచారావైభవానుగుణంగా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విశేషఖ్యాతిని గడించి అనాదిగా
ఆదిపరాశక్తి వివిధరీతుల ఆరాధింపబడడం భారతీయ అధ్యాత్మ విశేషం...
అట్టి ఒకానొక భారతీయ అధ్యాత్మ విశేషమే హైదరాబాద్ మహానగర బోనాల ఉత్సవం / జాతర ...
మనిషి యొక్క ముఖమండలంలో కొలువై ఉండే నాలుగు జ్ఞ్యానేంద్రియాల ద్వారా ప్రపంచంతో అనుసంధానం చెందే మనిషియొక్క మస్తిష్క మేధో ప్రజ్ఞ్యా వైభవమే తనయొక్క దేదీప్యమానమైన జీవితవైభవానికి అద్దంపట్టే విశేషం...
ఆ మస్తిష్కమండలోపరి సహస్రారచక్రంలో దేదీప్యమణిసంఘాతసదృశమైన ప్రభలతో వెలుగొందే జీవుడికి ప్రతీక బోనం పైన అలంకరింపబడే దీపశిఖ...
ఆ బోనానికి బరువును, అనగా సాంద్రతను సమకూర్చే వివిధ సత్వగుణదాయకపదార్ధాలతో నిండుగా ఉండి తొణికిసలాడే బోనం పాత్ర / బిందె / సర్వ / కుండ / జీవధారకుడికి ప్రతీక...
జీవుడు / జీవధారకుడు అనే వ్యష్టినే జీవజీవేశ్వర సంఘాతంగా, 'దేహోదేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః', అని స్తుతిస్తున్నది అనాదిగా మన వైభవాత్మకమైన సనాతనధర్మం....
అనగా ఆ జీవుడు సనాతనుడు అని అర్ధం...,
అనగా ఇతః పూర్వం ఆ జీవుడు ఎన్ని జన్మలెత్తెనో, మరియు ఇక ముందు ఆ జీవుడు ఎన్ని జన్మలు ఎత్తవలెనో అనే కర్మసిద్ధాంతానికి కర్త, కర్మ ,క్రియ, కూడా జీవుడే...
కాని ఆ కర్తకు కర్తృవభావన, కర్మకు ఫలితం,
క్రియకు క్రియాశీలకత్వం, అనే శక్తిని ప్రసాదించేది మాత్రం సర్వశాసక శక్తిగా సర్వకాలసర్వావస్థల్లోను వెలుగొందే ఈశ్వరుడు...
"ఈశ్వరుడి పాదపద్మములచెంత శ్రీకరమైన పుష్పాలను సమర్పిస్తూ ఆరాధిస్తున్నాను..."
అనే వాక్యంలో...
కర్త : ఆరాధించువారు
కర్మ : ఆరాధన
క్రియ : అరాధింపబడడం
ఇక్కడ..
సదరు కర్తకు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను అనే భావన ను అనుగ్రహించువాడు ఈశ్వరుడే...
ఆరాధన అనే సత్కర్మకు ఫలితం ఇచ్చేవాడు ఈశ్వరుడే...
ఆరాధించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించువాడు కూడా
ఈశ్వరుడే...
అందుకే జీవుడు నిమిత్తమాత్రుడైనాడు..
ఈశ్వరుడు సర్వేశ్వరుడైనాడు...
మరి అంతా కూడా సర్వేశ్వరవైభవమే అయితే...ఇక జీవుడి గొప్పదనం ఎక్కడుంది...ఏముంది...ఎట్లుంది...
అని అంటే...
జీవుడికి సర్వేశ్వరుడు అనుగ్రహించే బుద్ధి వైభవంలో ఉండును..జీవుడి వైభవమంతా కూడా..
ఫర్ ఎగ్సాంపుల్,
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎగ్సాంపుల్ గా తీసుకుంటే...
కొంత సమయం, ఓపిక, ధనం లభించగా..
ఒకరు వెంటనే ఈశ్వరుడి ఆరాధనలో వాటిని వెచ్చిస్తూ తరించడంలో...(సత్వగుణశాసిత ఉపాధి)
ఇంకొకరు ఊరిమీదపడి అడ్డమైనవన్నీ కొనుక్కొని తినితాగితిరగడంలో...(రజోగుణశాసిత ఉపాధి)
ఇంకొకరు దున్నపోతు మీద కురిసే వర్షంలా ఏ స్పందనా లేక తిని నిద్రించడంలో...(తమోగుణశాసిత ఉపాధి)
వారివారి శక్తియుక్తులను వెచ్చిస్తునారు అని అనుకుంటే....
ఈ ముగ్గురికీ మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రీతిలో ఉన్న అట్మోస్ఫియర్...కేవలం వారివారి బుద్ధివైభవంలో మాత్రమే భేదం కలదు....
సత్వగుణం, రజోగుణం, తమోగుణం
అనే త్రివిధమైన గుణసాంద్రతలో, ఏ గుణం మనిషిని ఎక్కువగా శాసిస్తున్నది అనేది ఆ మనిషి యొక్క బుద్ధివైభవానికి, తదనుగుణంగా ఆ మనిషి యొక్క జీవితవైభవానికి కారణమవుతున్నది...
అట్టి విశేషమైన సత్వగుణసంవృద్ధిని, తద్వారా ఉన్నతోన్నతమైన భూమికల్లో మనసును నిలకడగా నిలిపే మానసిక పరిపక్వతను, తద్వరా ఆర్జింపబడే విశేషమైన విజ్ఞ్యానమధురిమలకు, కారణం సదరు మనిషి యొక్క బుద్ధివైభవం...
అందుకే..
యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
అని ఆరాధించేది...
నిత్య చైతన్యశీలత్వం అనే బుద్ధి వైభవమే అన్ని వైభవాలకు కారణం...అది కేవలం భగవద్ అనుగ్రహంగా మాత్రమే లభించే అంశం...
కరెంట్ సప్లై ఉంటే, ఫ్యాన్ వేస్కొని చల్లగాలిని ఆస్వాదించవచ్చు, టీ.వి ని ఆన్ చేసి ఏదో ఒక ఛానెల్ చూడవచ్చు, లైట్ ఆన్ చేసి వెలుగును పొందవచ్చు...
ఇత్యాదిగా ఎన్నో విధాలుగా ఆ విద్యుత్శక్తిని వినియోగపరిచి సౌఖ్యాన్ని అందుకునేది..
అదే విధముగా బుద్ధిశక్తిని గడిస్తేనే ఎవ్విధమైన సౌఖ్యాన్నైనా అందుకొని తరించేది...
అందుకే అమ్మవారికి ప్రతిరూపమైన, అమ్మవారికి నైవేద్యంగా సమర్పింపబడే, అమ్మవారి బోనాన్ని తలదాల్చి నడిచేరు పడతులు వారివారి ప్రాంతాల్లో గ్రామదేవతగా కొలువైఉండే ఆదిపరాశక్తి వద్దకు...
ఇంటిని చక్కదిద్దే పనులతో నిత్యం బిజిబిజి గా ఉండే ఇల్లాలిని
'గృహిణీ గృహముచ్యతే...'
'గృహలక్ష్మీ నమోస్తుతే...'
అని అనాదిగా సనాతనధర్మం ఇల్లాలిని గృహదేవతగా గౌరవిస్తున్నది..
సదరు యజమాని యొక్క నిత్యనైమిత్తిక ఆరాధనలు ఆ ఇంటికి, ఇంటివారి వైభవానికి కారణం అవ్వును...
అందుకే పూజా సంకల్పంలో 'ధర్మపత్నీ సమేతస్య..' అనే ఉంటుంది...
అనగా నిత్యనైమిత్తిక పూజాదిక్రతువుల కర్తవ్యం ఆ ఇంటియజమానిదై ఉంటుంది...
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వివరింపబడిన విధంగా...
సదరు యజమాని ఆర్జించే పుణ్యంలో సగభాగం అతడి ఇల్లాలికి అయాచితంగానే లభించును...
మరియు
కొన్ని విశేషమైన పర్వదినాల్లో, (బోనాలు, శ్రీవరలక్ష్మీవ్రతం,
బ్రతుకమ్మ ఉత్సవం, శ్రీగౌరి నోము, ఇత్యాదిగా...) మహిళామణులను ఉద్దేశ్యించిన ఆచారసంప్రదాయాలతో స్త్రీలను విశేషంగా గౌరవిస్తున్నది మన సనాతనధర్మం....
అనగా, తద్వారా వారికి విశేషమైన పుణ్యాన్ని అనుగ్రహిస్తున్నది మన సనాతనధర్మం...
అట్టి గృహలక్ష్మికి చక్కని బుద్ధివైభవం ప్రసాదించే బోనాల జాతర వల్ల, గృహాలు, తద్వరా పల్లెలు, పట్టనాలు, తద్వార రాష్ట్రము, దేశము కూడా చక్కని ఈశ్వరానుగ్రహమైన వైభవంతో అలరారును...
బుద్ధిశక్తికి, బోనాల జాతర వైభవానికి, అమ్మవారి వైభవానికి, మహిళామణుల బుద్ధివైభవానికి, ఇంతగా సమన్వయాన్ని ఆపాదిస్తూ కవనాన్ని రచించడం ఎందుకంటే.....
నిజమైన ఆభరణాలుగా ఒక మహిళకు ఉండవలసిన సహనాన్ని, మంచిబుద్ధిని, మంచిమనస్సును కొల్పోయి ఉన్మత్తతతో, అనుమానంతో, ఆవేశంతో, మూర్ఖత్వంతో, పొగరుతో, ఒక మహిళ ప్రవర్తిస్తే, అది తనకే కాక ఎందరో జీవితాలకు, కుటుంబాలకు, తీరని శోకాన్ని కలిగించేదై పరిణమించును...
కాబట్టి మహిళామణులకు చక్కని బుద్ధివైభవం అనుగ్రహింపబడిఉండడం ఎంతో ఆవశ్యకం కాబట్టే ఇట్టి ఉత్సవాలు నిర్వహింపబడేది....
(ఎవ్వరినీ ప్రత్యేకంగా ఎత్తిచూపడం ఇక్కడి ఉద్ద్యేశ్యం కాదుకాబట్టి ఉదాహరణలు అనవసరం...)
అమ్మవారి వైభవం అంతటి ఘనమైనది కాబట్టి,
"తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబులనుండెడి అమ్మ...దుర్గ మాయమ్మ.." అని స్తుతించారు శ్రీ బమ్మెరపోతనామాత్యుల వారు వారి శ్రీమద్భాగవతాంధ్రీకరణలో...
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్
భా-1-10-ఉ.
ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం తో అన్ని ప్రాంతాల్లోను బోనాల ఉత్సవం సంపూర్ణమౌను...
మరియు శ్రావణ శ్రీవరామహాలక్ష్మి ఆరాధన శుభారంభమౌను.....
భక్తులెల్లరికీ ఆదిపరాశక్తి అనుగ్రహం మెండుగా లభించి తరించెదరు గాక అని ఆకాంక్షిస్తూ....శుభాభినందనలు.....😊💐
No comments:
Post a Comment