🙂😊😊
***** ***** ***** ***** ***** *****
తిరుప్పావై తనియన్ లు
నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ ।
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ॥
అన్న వయల్ పుదువై యాండాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావై ప్పల్ పదియం, ఇన్నిశైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై,
పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు,
శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ
వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రం,
నాన్ కడవా వణ్ణమే నల్‍కు.
***** ***** ***** ***** ***** *****
శ్రీ ఆండాళ్ అమ్మవారి జగద్ప్రసిద్ధినొందిన మధురభక్తి వైభవం అనేది, శ్రీవిళ్ళిపుత్తూర్, శ్రీరంగం అనే రెండు మహాపుణ్యక్షేత్రాల మధ్యన సాగిన ప్రేమాయణంగా, శ్రీమద్రామాయణమంతటి మహిమాన్వితమైనది...
అందుకే ఇప్పటికీ, అధ్యాత్మ విజ్ఞ్యులు, కోవిదులు, శ్రీమద్రామాయణ సారస్వతానికి ఎంతటి గౌరవాన్ని ఇస్తారో, శ్రీఆండాళ్ అమ్మవారి అనుగ్రహమైన ముప్పది తిరుప్పావై పాశుర సారస్వతానికి కూడా అంతటి గౌరవాన్ని ఇస్తారు...
ఎందుకంటే వాటి అనుసంధానం యొక్క మహిమ అట్టిది...
తెలుగునాడులో, తమిళనాడు యొక్క వైభవం గురించి చెప్పాలంటే...
తమిళం పెద్దగా అర్ధంకాకపోయినా సరే....తిరుప్పావై ద్రావిడ ప్రబంధపశురాలు టకటకా ఆలపించే పెద్దవారు కోకొల్లలుగా ఉండే తమిళేతర ప్రాంతం మన తెలుగునాడు కూడా ....
"అమ్మా...వణక్కం..వా.. వొక్కార్..ఎప్పిడి ఇర్కింగ్లా..." అని అంటే..
" ఏంటి నాయనా ఏదో గొణుగుతున్నట్టున్నావ్..."
అని అంటారేమో కాని...
"మార్గళి’త్ తింగళ్ మదినిఱైంద నన్నాళాల్"
అని అనగానే...
"నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై’యీర్ ,"...
అని టకటకా స్వరాన్ని అందుకునే సాహితీవిజ్ఞ్యులు ఎందరో...
ఎందుకంటే జన్మాంతర పుణ్యబలం కారణంగా, గోదమ్మ అనుగ్రహం యావద్ ప్రపంచంలో తన భక్తులు ఎక్కడ ఉన్నాకూడా, అందివచ్చే అమరసిరి కాబట్టి.....
ఆనాటి భక్తప్రహ్లాద చరితం నుండి ఈనాటి ఆధునిక కాలంలో ఉన్న ఎందరో హిరణ్యకశిపుడి లాంటి మూర్ఖులు, రాక్షసులు, దైవభక్తిలుప్తులు, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని హరించే నిరంతర వ్యర్ధప్రేలాపన గావించే బుద్ధిహీనులు, ఇత్యాది సకల ఆసురితత్త్వంతో బ్రతికే ధూర్తుల బిడ్డల వరకు, శ్రీవైష్ణవభక్తిసిరుల ప్రాభవం ఎంతటి సార్వజనీనమైనదో అనేది జగద్ప్రసిద్ధినొందిన లోకోత్తరమైన మహిమ్నతతో అలరారే దైవానుగ్రహ విశేషం...!
అందుకే కద అన్నమాచార్యులవారు అన్నారు....
ప|| ఏ పురాణముల నెంత వెదికినా |
శ్రీపతి దాసులు చెడరెన్నడును ||
చ|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు |
విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు |
నిరతము లెన్నడు నెలవులు చెడవు ||
చ|| కమలాక్షుని మతిగానని చదువులు |
కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు |
విమలములేకాని వితథముగావు ||
చ|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు |
దావతులు కపట ధర్మములు|
శ్రీవేంకటపతి సేవించు సేవలు |
పావనము లధిక భాగ్యపు సిరులు ||
శ్రీవైష్ణవభక్తి ప్రపత్తి యొక్క మహత్తు అంతటి ఘనమైనది కాబట్టే..
శ్రీ మల్లాది వారు,
శ్రీ చాగంటి సద్గురువులు,
శ్రీ సామవేదం వారు,
ఇత్యాది భాగవతోత్తముల అనుగ్రహంగా ఈ ఆధునిక లోకానికి అందిన శ్రీమద్భాగవత ప్రవచనాల్లో విన్నట్టుగా...
అప్పటికప్పుడు మహాభక్తభాగవతోత్తములైన ప్రహ్లాదుల వారు ఉన్నతలోకాల నుండి దిగివచ్చారు కాబట్టి, తన మనవడైన బలిచక్రవర్తిని విష్ణుపార్శ్వదులు వరుణపాశములతో బంధించినాసరే, ఆతడు సుతలలోకాధినాయకుడై సకల భోగభాగ్యాలను అందుకున్నాడు...
(వరుణపాశములకు గల ప్రత్యేకత కారణంగా, వాటిచే బంధింపబడిన వాడు ఎంతటి గొప్పసంపన్నుడైనా సరే,
ఎంతటి శస్త్రాస్త్రసంపదగల వీరుడైనా సరే, అవన్నీ కూడా లయించి కేవల సామాన్యుడిగా తలదించవలసి ఉంటుంది...)
మహాభక్తభాగవతోత్తములైన శ్రీనారదమహర్షి వారు, ప్రత్యక్షంగా ఏతెంచి ద్వాదశాక్షరిని ఉపదేశించి, తపస్సుని ఆచరింపజేసిన కారణంగా, దేవుడు ప్రత్యక్షమైతే ఏమని ప్రార్ధించాలో, ఏమి కోరుకోవాలో కూడా తెలియని అమాయక నిర్మల భక్తి కాబట్టి,
స్వయంగా శ్రీమహావిష్ణువే నభోమండల తేజోవలయం నుండి ఆవలికి వచ్చి భువిపై నిల్చొని ఉన్న బాలధృవుడి భక్తికి
సంతసించి, తన పాంచజన్య స్పర్శతో సకల విజ్ఞానసిరులను క్షణకాలంలో అనుగ్రహించి, అట్టి సకలసద్గుణ మహాభక్తభాగవతోత్తముడైన ధృవుణ్ణి,
"ఈ భువిపై, నీ రాజ్యపరిపాలనానంతరం,
ఇప్పటివరకు ఏ మానవమాత్రుడికీ లభించని సర్వోత్కృష్టమైన ధృవమండలానికి అధిపతిగా,
అనగా...,
ఈ చరాచరవిశ్వంలో ఉండే చతుర్దశభువనాలు, నవగ్రహాలు, సూర్యచంద్రతారాలోకాలు, సకలదివిజలోకాలతో కూడి ప్రకాశించే యావద్ ఖగోళమండలం ఏ సర్వోన్నతమైన మండలాన్ని ఆధారంగా గావించి భ్రమణం గావించునో,
అట్టి ధృవమండలానికి అధిపతిగా కొలువై శాశ్వత కీర్తిని గడించెదవు గాక..."
అని దీవించి వరమిచ్చినాడు....
(శ్రీ మహావిష్ణువు ధరించే పాంచజన్యం అనే శంఖం యొక్క ప్రత్యేతక కారణంగా, ఎవరిని ఉద్ద్యేశించి ఆ శంఖం యొక్క అనుగ్రహం ఇవ్వబడుతుందో, వారు ఎవరు, ఏంటి, ఇత్యాదివాటితో సంబంధం లేకుండా వారి బుద్ధివైభవం అనేది శ్రీవైకుంఠలోకంలో ఉండే విష్ణుపార్శ్వదుల యొక్క సర్వోన్నతమైన స్థాయిలో ప్రకాశించును....)
"నా పుత్రుడవైనందుకు నిన్ను కాకుండా... నా సవతి, నీ పినతల్లి సురుచి కొడుకుని తన తొడపై కూర్చోవడానికి అనుమతించిన ఈ లౌకిక తండ్రి గురించి ఎందుకు నాయనా బాధపడతావ్...
వెళ్ళి సకలలోకేశ్వరుడైన శ్రీమహావిష్ణువుని గూర్చి ప్రార్ధించు...
నీకు కావల్సినవన్నీ కూడా అనుగ్రహించే అసలైన తండ్రి ఆ శ్రీమహావిష్ణువే....." అని తన తల్లి సునీతి చెప్పిన కారణంగా...
అంతటి అనన్యసామాన్యమైన శ్రీవైష్ణవానుగ్రహలబ్ధికి మూలకారణమైన ధృవచక్రవర్తి యొక్క మాతృమూర్తిని కూడా, ధృవుడి పుణ్య విశేషంచేత అవసాన కాలంలో, ధృవుణ్ణి గొనిపోవుచున్న దేవతలవిమానం ముందు ప్రయాణిస్తున్న మరొక దేవతలవిమానంలో విష్ణుపార్శ్వదులు సునీతిని కూడా ఉన్నతలోకాలకు గొనిపోయినారు....
సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అంశలో అవతరించిన రుక్మిణి దేవి...,
"ఆ..ఆ..ఇకచాలు ప్రభు....మీరు ఆరగించిన రెండు గుప్పిట్ల అటుకులకు, అనుగ్రహంగా మీ బాల్యస్నేహితుడైన కుచేలుడికి మీరు ఎంతటి శ్రీలక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించారో మీకు తెలుసు..నాకు తెలుసు....ఇంకా మిగతా అటుకులన్నీ కూడా మీరే ఆరగించి మిమ్మల్ని, నన్నూ కూడా కుచేలుడికి సమర్పించెదరా ఏమి.." అని తన పతి అయిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క చేతిని అదిమిపట్టిన కుచేలోపాఖ్యానం విన్నవారికి తెలిసినట్టుగా....
శ్రీవైష్ణవభక్తిసిరులు ప్రసాదించే లౌకిక సిరులు కూడా ఎంతో విశేషమైనవి..
ఇవన్నీ కృత, త్రేత, ద్వాపర యుగం నాటి శ్రీహరి భక్తి విశేషాలు...
త్రేతాయుగం నాటి శ్రీమద్రామాయణంలో, భూదేవి అంశలో జనకమహారాజుకి లభించిన సీతమ్మలా..,
ఈ కలియుగంలో కూడా అంతటి మహాభక్తభాగవతోత్తములైన శ్రీవిష్ణుచిత్తుల వారి ప్రియసుతగా, తులసీవనంలో భూదేవి అంశలో ప్రభవించి, శ్రీవిళ్ళిపుత్తూరులో నడయాడిన గోదాదేవి యొక్క అనుగ్రహమైన తిరుప్పావై / శ్రీవ్రతం యొక్క మహిమ కూడా అట్టిదే....
***** ***** ***** ***** ***** *****
కూడారై వెల్లుం శీర్ గోవిందా, ఉన్ తన్నై
పాడి పఱై కొండు యాం పెఋ శమ్మానం,
నాడు పుగళుం పరిశినాల్ నన్ఱాగ,
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే ఎన్ఱనైయ పల్‍గలనుం యామణివోం,
ఆడై యుడుప్పోం అదన్ పిన్నే పాఱ్‍శోఋ,
మూడ నెయ్ పెయ్‍దు ముళంగై వళి’వార,
కూడియిరుందు కుళిర్‍ందేలోరెంబావాయ్ ॥ 27 ॥
***** ***** ***** ***** ***** *****
ఆండాళ్ తిరువడిగలే శరణం..🙂🙏💐
No comments:
Post a Comment