Tuesday, August 20, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ప్రయుక్త మొదటి శ్రావణ శుక్రవార శుభాభినందనలు...💐🙂


శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గతంగా, క్షీరసాగరమథన ఘట్టం లో, శ్రీలక్ష్మీ ఆవిర్భావ వృత్తాంతం గురించి విన్నవారికి గుర్తున్నాట్టుగా, ఆ సమయంలో అక్కడున్న దేవతలందరూ కూడా కలిసి, క్షీరసాగరతనయగా ఉద్భవించిన అమ్మవారిని ఈ క్రింది శక్తివంతమైన స్తోత్రంతో స్తుతించడం విజ్ఞ్యులకు ఎరుకే...

ముప్పదిమూడు కోట్ల దేవతలందరూ కలిసి, అనగా ముప్పదిమూడు వర్గముల దేవతాశక్తులు కలిసి, అమ్మవారిని స్తుతించిన ఈ "సర్వదేవ కృత శ్రీలక్ష్మీ స్తోత్రం", ఎంతటి మహిమాన్వితమైనదో ఒకసారి అలోచించండి...

*** *** *** *** *** *** *** *** *** *** ***

** సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం **

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే।
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే॥

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే।
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం।

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ।
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః॥

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా।
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే॥

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ।
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః॥

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయం।
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే॥

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే।
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ।

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే।
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే॥

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ।
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే॥

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా।
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః॥

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం।
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువం॥

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం।
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీం॥

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం।
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం॥

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినం।
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియం॥

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్॥
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువం॥

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం।
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదం॥

॥ ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ॥

*** *** *** *** *** *** *** *** *** *** ***

ఒకే శ్రీలక్ష్మీ అమ్మవారిని ఇన్నేసి పేర్లతో, గౌణములతో, కీర్తించడం ఏంటి అని కొందరికి అతిశయం గా అనిపించవచ్చు....

ఒక చిన్న ఎగ్సాంపుల్ తో, ఇలా వివిధ రీతుల వైవిద్య భరిత స్తుతి యొక్క గొప్పదనం ఏంటో వివరించే ప్రయత్నం గావిస్తాను...

సాధారణ రోజుల్లో ఎవరైనా మనల్ని భోజనం చేసారా అని  చాలా క్యాజువల్ గా అడిగితే, అంతే క్యాజువల్ గా...
"ఆ చేసాం.."  అని చెప్తాం....
అంటే అన్నం, కూర, పెరుగు, తో భుజించాము అని అర్ధం...

అదే విశేషపర్వదినాల్లో అయితే...
ఫర్ ఎగ్సాంపుల్, ఎవరో ఒక సంపన్నుల ఇంట్లో
శ్రీవరలక్ష్మీ వ్రతపర్వం రోజునే అనుకోండి...
అదే ప్రశ్నకు, అదే సామాధానం ఉంటుంది...
కాని అక్కడ ఎన్నేసి పదార్ధాలు / ప్రసాదాలు ఉంటాయ్..?

పుళిహోర నుండి పరమాన్నం వరకు...
దద్యోదనం నుండి దైవడలవరకు,
బెల్లంలడ్ల నుండి భక్ష్యాల వరకు,
నేతిపాయసం నుండి మధురసభరిత వివిధ పండ్ల వరకు, 
ఒకటా రెండా...ఎన్నేసి పదార్ధాలు నైవేద్యం గా అమరి ప్రసాదాలుగా మనల్ని అలరిస్తాయి....?

ఇవన్నీ కూడా విశేషపర్వదినాల్లో నివేదింపబడే భగవద్ ప్రసాద విశేషములైతే...

దేవతాస్తుతులు కూడా ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, అనే నామదేశకాల వైభవానికి అనుగుణంగా అంతే విశేషంగా ఉంటాయ్...

అన్నం, కూర, భుజించడాన్ని భోజనం అని అందురు...
వివిధ పంచభక్ష్యపరమాన్నములను భుజించడం కూడా భోజనం అనే అందురు...

కాని, దేశకాలానుగుణంగా, ఆ "భోజనం" అనే ప్రక్రియ కు అర్ధం మారుతూ ఉంటుంది.....

అప్పుడెప్పుడో ఒకసారి మా చెల్లెలి ఇంటికి వెళ్ళినప్పుడు, పకోడీల దెగ్గరినుండి పాపడాల వరకు, భోజనం ఎంతబాగా వడ్డించారో తెలుసా...

అని అప్పుడప్పుడు అంటామేమో కాని...

అప్పుడెప్పుడో ఒకసారి ఫలానా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, సాధారణ అన్నం, పప్పు భోజనం వడ్డించారు తెలుసా...
అని అనడంలో విశేషమేముంటుంది...?

అప్పుడెప్పుడో ఒకసారి మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, పక్కనే ఉన్న షాప్లో ఎన్నేసి కలర్స్ లో ఎన్నెన్ని  కొత్తకొత్త స్టైలిష్ దుస్తులు ఉన్నాయో...తెలుసా....అన్ని రకాల వెరైటీలతో ఉన్న ఆ షాప్లో ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నీక్కూడా ఓ నాలుగు మంచి డ్రెస్సులు కొనిస్తాలే...

అని అంటామా....? లేక

అప్పుడెప్పుడో ఒకసారి మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, పక్కనే ఉన్న షాప్లో ఒకే కలర్ లో ఒకేలా కొన్ని దుస్తులు ఉన్నాయ్...
ఆ షాప్లో ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నీక్కూడా ఒకేరకమైన ఒకేకలర్ డ్రెస్సులు ఓ నాలుగు కొనిస్తాలే...

అని అంటామా....?

కాబట్టి....
వైవిధ్యంలో ప్రత్యేకత ఉన్నది...
ప్రత్యేకతలో మనస్సు లగ్నమయ్యే / రంజిల్లే పరమార్ధమున్నది..
అందుకే సనాతనధర్మ ప్రతిపాదిత / ఆరాధిత / దేవతా తత్త్వంలో అనగా పరతత్త్వంలో ఎన్నో ప్రత్యేకతలు...తద్వారా ఎన్నో విధాలా భక్తులు తరించే మార్గాలు, ఉన్నాయి...

ఒకే పరతత్త్వం వివిధ నామరూపాత్మక వైభవంతో ప్రకాశించడంలోని అసలైన పరమార్ధం భక్తజనోద్ధరణే...

పంచభక్ష్యపరమాన్నములను భోజనప్రసాదంగా భుజించినవారు వాటి ప్రత్యేకత గురించి, వాటిలో ఉన్న ఆహారవైభవం గురించి, వాటి గొప్పదనం గురించి చెప్పడంలో విశేషం ఉంటుంది కాని...

ఎప్పుడూ చద్దన్నం, పప్పుచారు తినేవారు ఎవ్విధంగా పంచభక్ష్యపరమాన్నముల గురించి, వాటి వైభవం గురించి
వ్యాఖ్యానించగలరు....?

ఇక్కడి ఉద్ద్యేశ్యం చద్దన్నం, పప్పుచారు ని తక్కువ చేసి మాట్లాడడం కాదు...
పంచభక్ష్యపరమాన్నముల గొప్పదనం గురించి విశ్లేషించడమే ఇక్కడి ఉద్ద్యేశ్యం...

కాబట్టి వైవిధ్యంలో విశేషమున్నది...
విశేషంలో విషయమున్నది...
విషయంలో విజ్ఞ్యానమున్నది...
విజ్ఞ్యానంలో జ్ఞ్యానం ఉన్నది...
ఆచరిత జ్ఞ్యానం ప్రజ్ఞ్యానమైననాడు, పరతత్త్వం కరతలామలకమై మోక్షమనే కైవల్యతీరానికి మన చైతన్యస్థాయిని చేర్చే మార్గమున్నది....

కాబట్టి ఏంటి ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని దేవతాతత్త్వములు, ఈ అల్లరంతా అని అనడం కంటే...
ఏంటి ఈ విశేషాలన్నీ అని అనడంలో, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం గావించి, అందలి మహిమ్నతను ఆకళింపజేసుకొని తరించడంలోనే విజ్ఞ్యత ఉన్నది...

తెలియని వారికి...,
ఒకటి రెడ్ కలర్ డ్రెస్స్, ఇంకోటి గ్రీన్ కలర్ డ్రెస్, మరొకటి వైట్ కలర్ డ్రెస్...

తెలిసిన వారికి...,
ఒకే డ్రెస్ కి రెడ్ కలర్ డై వేస్తే అది రెడ్ కలర్ డ్రెస్స్ అని పిలువబడుతున్నది....
అదే డ్రెస్ కి గ్రీన్ కలర్ డై వేస్తే అది గ్రీన్ కలర్ డ్రెస్స్ అని పిలువబడుతున్నది....
అదే డ్రెస్ కి ఏ కలరూ వేయకుంటే అది వైట్ కలర్ డ్రెస్స్ అని పిలువబడుతున్నది....
కాబట్టి అన్ని డ్రెస్సులు ఒక్కటే...
కాకపోతే వివిధ ప్రయోజనార్ధమై, వాటికి వివిధ రంగులను ఆపాదించి వివిధ డ్రెస్సులు గా పిలువబడుతున్నవి...
అనే లౌకిక వస్త్ర తత్త్వమే...
అలౌకిక శ్రీలక్షీనారాయణ తత్త్వం కూడా...

ఈ శ్రావణ మాసం లో,
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వక్షసీమలో శ్రీవ్యూహలక్ష్మీ అమ్మవారి గా కొలువైన శ్రీలక్ష్మీ అమ్మవారిని విశేషంగా వివిధరీతుల ఆరాధించడం సనాతన సంప్రదాయ వైభవం...

*** *** *** *** *** *** *** *** *** *** ***
** అష్టలక్ష్మీ స్తోత్రం **

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే।
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 1 ॥

ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ।
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ॥ 2 ॥

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే ।
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 3 ॥

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే ।
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ॥ 4 ॥

సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే ।
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 5 ॥

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే ।
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ 6 ॥

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే ।
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ॥ 7 ॥

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥ 8 ॥

ఫలశృతి
శ్లో॥ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ॥

శ్లో॥ శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః ।
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

*** *** *** *** *** *** *** *** *** *** ***


No comments:

Post a Comment