Wednesday, February 26, 2025

శ్రీ క్రోధి నామ 2025 సంవత్సర (26 ఫిబ్రవరి 2025) మాఘ బహుళ త్రయోదశ్యోపరి చతుర్దశి ప్రయుక్త మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు


శ్రీచాగంటి సద్గురువుల " శ్రీఉమామహేశ్వరవైభవం " ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించిన వారికి తెలిసినట్టుగా,
ఈ యావద్ విశ్వమంతా కూడా పార్వతీపరమేశ్వర సమ్యుక్త స్వరూపంగా భాసిల్లే ఒక దైవికకాంతి పుంజం...

ఒక బైక్ / కార్ / బస్ ఇత్యాదివాటిని ఎగ్సాంపుల్ గా తీసుకుంటే....

ఇంజన్ అనేది శక్తి సామ్యము
బాడి అనేది శివ సామ్యము

ఇంజన్ లేకపోతే ఆ వెహికిల్ కి చరశక్తిలేదు....
కాబట్టి అది వెహికిల్ అని నిర్వచించడంలో అర్ధం లేదు....

బాడి లేకపోతే ఆ వెహికిల్ కి వెహికిల్ గా ఉనికే లేదు...
కాబట్టి అది వెహికిల్ గా వర్ణింపబడజాలదు....

ఇంజన్ (శక్తి) మరియు బాడి (శివుడు) రెండూ సరైనవిధంగా సమ్మిళితమై ఉన్నప్పుడే అది డ్రైవబుల్ ఆటొమోబీల్ వెహికిల్ గా గుర్తింపబడును....

అచ్చం ఇదే విధంగా, ఈ యావద్ బ్రహ్మాండమంతయు పరమేశ్వరపంచాస్య వైభవంతో అలరరారే ఒక దైవిక వెహికిల్.....

ఆ యూనివర్సల్ వెహికిల్ ఎక్కడి నుండి ఎక్కడికి ఏ దిశగా కదులుతున్నది...
ఎవరు కదుపుతున్నది....
ఎవ్విధంగా కదులుతున్నది....
ఆ కదలుకే కాలప్రవాహం అనే పేరు ఎట్లు కలుగుతున్నది...
ఇత్యాదిగా ఈ విశ్వాంతరాళ్ళోని శివశక్తి విశేషాలను తెలుసుకోవడానికి అనాదిగా ఎందరో మహర్షులు, మునులు, ఋషులు, యోగులు, అధ్యాత్మవిజ్ఞ్యులు, ఆధునిక సైంటిస్టులు, వారివారి శక్తియుక్తి కొలది ప్రయత్నిస్తూ, తెలుసుకుంటూ, నిర్వచిస్తూ, ఉన్నారు....

అట్టి ప్రాపంచిక ప్రయత్నంలో ఎందరో విజ్ఞ్యులకు మార్గదర్శకులుగా ఆ పరమేశ్వరుడే సద్గురురూపంలో అవతరించి మానవాళికి తగిన సద్బోధలను గావించి ఆ వైశ్విక శివశక్తి లహరుల్లో ఓలలాడే సారస్వతమంజరుల్లో భక్తులకు పార్వతీపరమేశ్వర దర్శనం, అనగా ఈ బ్రహ్మాండం ఎవ్విధంగా ఒక మహాజ్యోతిస్వరూపంగా భాసిల్లుచూ ఉండునో ఎరుకపరిచి, అనుగ్రహించారు అని, శ్రీఆదిశంకరాచార్యుల అపర శివావతారాన్ని శ్రీరుద్రం నిత్యం స్తుతిస్తున్నది...

నమః॑ కప॒ర్దినే॑ చ॒ వ్యు॑ప్తకేశాయ చ॒

నమః॑ శంక॒రాయ॑ చ మయస్క॒రాయ॑ చ॒
నమః॑ శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ॒

పరశురామ క్షేత్రమైన కేరళ దేశంలో, శ్రీ శివగురు ఆర్యాంబ సుతుడిగా, శివగురుస్వరూపమై ప్రభవించిన కాలడి శంకరులే, కైలాస శంకరులు అని విజ్ఞ్యులకు విదితమే...

కాబట్టి, శ్రీఆదిశంకరుల అనుగ్రహమైన శివశక్తి సారస్వత ద్యుతిలో, ఆ పార్వతీపరమేశ్వర వైభవాన్ని ఈశ్వరుడు అనుగ్రహించినంతగా దర్శిస్తూ తెలుసుకొని తరించే ప్రయత్నం గావిద్దాం....

"మామిడికాయలను చెట్టు నుండి సంగ్రహించి డైరెక్ట్ గా అట్లే ఆరగిస్తే, శరీరానికి చాలా వేడిచేసి తద్వారా ఇతర ఇబ్బందులు కలుగును....
కాబట్టి, మామిడి కాయలైనా, మామిడి పండ్లైనా, చల్లని నీటిలో బాగా నానిన తర్వాత అందలి అతిఉష్ణతత్వం శీతలీకరింపబడి శరీరానికి ఇబ్బంది కలిగించదు....."
అనే సత్యాన్ని ఒక ఆయుర్వేదవిద్వాంసుడు లోకానికి సెలవిస్తే, ఆ సత్యాన్ని మనం అట్లే విశ్వసించి...పాటించి తరించడం అన్నది ఎట్లో....

శ్రీరుద్రశక్తిని,
పార్వతీపరమేశ్వరుల సమ్మిళితస్వరూపమైన,
త్రిమూర్త్యాత్మకమైన, 
అరూపరూపి అయిన,
ఆద్యంతరహితమైన,
శివలింగస్వరూపంలో భక్తులు ఆరాధించి తరించడం శ్రేయస్కరం అని అనాదిగా ఎందరో అధ్యాత్మ విజ్ఞ్యుల ఉవాచ....

"లీయతే గమ్యతే అనేన ఇతి లింగం..." అనే వ్యుత్పత్తి ప్రకారంగా, 
ఎందులో నుండి సర్వం ఉద్భవించునో....
ఎందులోకి సర్వం లయించునో....
అది లింగం అని అనబడును....

ఒకసారి శ్రీఆదిశంకరాచార్యుల అనుగ్రహమైన శ్రీలింగాష్టక సారస్వతాన్ని గమనించండి....

బ్రహ్మ, విష్ణువు, దేవతలు ఆరాధించే లింగం...
అని ప్రారంభించి...
దేవగురు బృహస్పతి వారిచే, దేవతాశ్రేష్టులచే, దేవలోక ఉద్యానవనాల్లో లభించే పుష్పాలతో సదా అర్చింపబడే లింగం అని సంపూర్ణం గావించారు శ్రీఆదిశంకరాచార్యులు...

స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు నమస్కరించే దేవగురు బృహస్పతి వారిచే ఆరాధింపబడే లింగం, అనే వాక్యం యావద్ ప్రపంచానికి శివలింగారాధన యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్నది...

******** ******** ******** ******** ******** ********

***** లింగాష్టకం *****

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

******** ******** ******** ******** ******** ********

అధ్యాత్మ అంశాల గురించి డిస్కస్ చేస్తూ, నేను కొంచెం మెటీరియలిస్టిక్ గా అంటున్నానని మీరు అనుకోకపోతే...
మీకు ఒక్క వాక్యంలో శివలింగారాధనలోని వైభవాన్ని వివరిస్తాను....

మన ఇంట్లో ఒక ఎలెక్ట్రిక్ ప్లగ్ పాయింట్ ఉంది...

అది మనం ఫ్రిడ్జ్ కి అనుసంధానించుకుంటే...
చల్లని స్టోరేజ్ ని అనుగ్రహంగా పొందుతాము....

అది మనం ఫ్యాన్ కి అనుసంధానించుకుంటే...
గాలిని అనుగ్రహంగా పొందుతాము....

అది మనం లైట్ కి అనుసంధానించుకుంటే...
కాంతిని అనుగ్రహంగా పొందుతాము....

అది మనం వాటర్ హీటర్, వాటర్ ప్యూరిఫయర్ కి అనుసంధానించుకుంటే...
మనకు కావలసిన విధంగా అర్.ఓ ప్యూరిఫైడ్ వాటర్, కోల్డ్ / హాట్ వాటర్ ని అనుగ్రహంగా పొందుతాము....

అది మనం పర్ఫ్యూం డివైస్ కి అనుసంధానించుకుంటే...
మనకు కావలసిన విధంగా రూమంతా పర్ఫ్యూం స్ప్రెడ్ అయ్యి చక్కని సువాసనను అనుగ్రహంగా పొందుతాము...

కాబట్టి నిర్గుణ నిరాకార స్వరూపమైన విద్యుత్శక్తి తో మనం ఎవ్విధంగా అనుసంధానమైతే, అవ్విధమైన అనుగ్రహాన్ని అందుకొని తరిస్తున్నాము...
అనేది ఇక్కడ మనం గమనించే లౌకిక సత్యం....కద...

అచ్చం అదే విధంగా శివలింగస్వరూపంగా ఉన్న నిర్గుణ నిరాకార స్వరూపమైన ఈశ్వరశక్తి తో మనం ఎవ్విధంగా అనుసంధానమైతే, అవ్విధమైన అనుగ్రహాన్ని అందుకొని తరించెదము...
అనేది ఇక్కడ మనం గమనించవలసిన అధ్యాత్మ సత్యం....

అంటే...
శివలింగానికి....
ఒక్కో సాత్విక పదార్ధంతో అభిషేకం / ఆరాధన గావిస్తే ఒక్కో విధమైన అనుగ్రహఫలం లభిస్తుంది...అని అంటున్నావా....
అని మీరడిగితే...
అవును అనే అంటాను....

ఎందుకంటే...ఏ మనిషైనా సాధారణంగా ఫలాపేక్ష లేనిదే
తన సమయశక్తియుక్తివిత్తమును వెచ్చించడు అని అనడం మానవ నైజం....

ఫర్ ఎగ్సాంపుల్, స్వచ్ఛమైన నదీజలం / త్రాగునీరు, కొబ్బరినీళ్ళు, ఆవుపాలు, ఇత్యాది సాత్విక పదార్ధాలతో  శివలింగానికి అభిషేకంచేస్తే సకలవిధమైన శ్రేయస్సు ఈశ్వరానుగ్రహంగా ఒనగూరును అనే అధ్యాత్మశాస్త్ర ఉవాచను నేను గౌరవిస్తాను, పాటిస్తాను, బోధిస్తాను, సమర్ధిస్తాను...

"ఐశ్వర్యం ఈశ్వరాధిఛ్చేద్..." అని శాస్త్రం ఉత్తినే అనదుకద....

శ్రీవేంకటేశ్వరుడికి తిరుమల ఆలయ శ్రీనివాసపరివారం అల్లినంత అందంగా పూమాలికలు అల్లాలంటే....
ఫస్ట్ ఒక రెండు పూలను ఎవ్విధంగా అమరికతో గ్రహించి, దారానికి అనుసంధానించి అల్లవలెనో తెలియాలి.....
ఆతరువాత అదేవిధంగా అన్ని సుగంధపుష్పాలను అమరికతో గైకొని మొత్తం పుష్పమాలికలను అల్లవలసి ఉంటుంది....
అప్పుడు ఈశ్వరుడికి పుష్పమాలను సమర్పించిన పుణ్యం మనకు సంప్రాప్తించును.....

ఇంట్లో ఈశ్వరుడికి రెండు పుష్పాలను భక్తితో సమర్పించిన 5 మార్కుల పుణ్యం వేరు....
ఆలయంలో ఈశ్వరుడికి పుష్పమాలికలను భక్తితో సమర్పించిన 95 మార్కుల పుణ్యం వేరు...

అవ్విధముగనే...
పార్వతీపరమేశ్వరులను సగుణసాకారస్వరూపంగా భక్తితో ఆరాధించే 5 మార్కుల పుణ్యం వేరు....
పార్వతీపరమేశ్వరులను శివలింగస్వరూపంలో భక్తితో ఆరాధించే 95 మార్కుల పుణ్యం వేరు...

వేరసి, సగుణసాకారస్వరూపారాధనతో ప్రారంభించి, క్రమక్రమంగా ఆరాధనాస్థాయి / ఉపాసనాస్థాయిలో అభివృద్ధిచెందుతూ, 
సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే నిర్గుణ నిరంజన నిరాకార పరబ్రహ్మోపాసనయందు నిష్ణాతులైనవారు 100 మార్కుల పుణ్యఫల ఈశ్వరానుగ్రహంతో తరింతురు.....

ఈశ్వరుణ్ణి ఎంతగానో ఆరాధించి "సోహం", "తత్ త్వం అసి", అనే స్థితిలో చిత్తాన్ని స్థిరీకరించినా కూడా....
ఈ పాంచభౌతిక ప్రపంచం యొక్క నైజం కారణంగా, శరీరంలోని పంచభూత పిండాండబ్రహ్మాండ సమన్వయం అనేది జీవజీవేశ్వర సంఘాతం యొక్క ద్వైదీభావనను నిత్యం కల్పిస్తూ ఉండును.....

అందుకే.....
"చిదానందరూపః శివోహం...శివోహం..."
అని అనుగ్రహించిన శ్రీఆదిశంకరులే....
"భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే...."
అని కూడా అనుగ్రహించారు.....

అందుకే....
విదేహముక్తిని గడించిన స్థాయిలో కొలువైఉండే చిత్తవైభవంతో ఈశ్వరస్వరూపంగా పరిఢవిల్లే చతురామ్నాయ పీఠాధిపతులైన జగద్గురువులు కూడా నిత్యం వారికి శ్రీఆదిశంకరాచార్యులచే విహితధర్మంగా అనుగ్రహింపబడిన ఈశ్వరోపాసనను మరియు ఈశ్వరనామస్మరణను నిత్యం అనుష్ఠిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు.....

అనగా అనునిత్యం నారాయణ నామస్మరణం,
అనునిత్యం ఈశ్వరాభిషేకం, తో అలరారే జగద్గురువులే సామాన్యమానవాళికి వారివారి ఈశ్వరారాధనయందు ఉండే / ఉండవలసిన చిత్తశుద్ధిని బోధిస్తూ, అనుగ్రహిస్తున్నారు....

కాబట్టి, సామాన్యులమైన మనము కూడా మన శక్తియుక్తిమేర
ఈశ్వరారాధనయందు సమయాన్ని, చిత్తశుద్ధిని, విత్తాన్ని, వెచ్చిస్తూ నిత్యపుణ్యసముపార్జనయందు శ్రద్ధగలవారిగా జీవించడంలోనే అర్ధం ఉన్నది....

తత్పురుష, (తూర్పు)
అఘోర, (దక్షిణం)
సద్యోజాత, (పశ్చిమం)
వామదేవ, (ఉత్తరం)
ఈశాన, (ఊర్ధ్వం)

అనే పరమేశ్వరపంచాస్య విశ్వరూపంలో ఉండే, ఉత్తరాభిముఖమైన వామదేవ వదనమే, శాస్త్రపరంగా శ్రీమహావిష్ణుతత్త్వం అని శైవాగమవైభవం స్తుతిస్తున్నది కావున, శివకేశవ భేదాలు ఎవరో బేకార్ మూర్ఖుల పనికిరాని మాటలు అని విజ్ఞ్యులు గుర్తించి హరిహర అభేదభావంతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడంలోనే విజ్ఞ్యత ఉండును...

అందులోనే జీవితపరమార్ధమున్నది....

మా అఘ = మాఘ మాసం....
పాపరహితమైన / ఎంతో పుణ్యదాయకమైన మాసం ఈ మాఘమాసం....

అందుకే మాఘపంచక శుభసమయానికి ప్రారంభసమయం ఈ మాఘమాసం...

రథసప్తమి, శ్రీపంచమి, భీష్మ ఏకాదశి / ద్వాదశి, మహాశివరాత్రి, ఇత్యాది ఘనమైన పుణ్యదాయక పండగలన్నీ ఈ మాఘమాసంలోనే ఏతెంచును....

విహితమైన శ్లోక సారస్వత ప్రయుక్తంగా, రథసప్తమి నాడు ఒక్క జిల్లేడు ఆకుతోనైనా స్నానం గావించి, సూర్యనమస్కారాన్ని గావించడం అనంతమైన పుణ్యార్జన కారకం.....
సకల రోగనాశకం...సకల అరోగ్యదాయకం...

శ్రీపంచమి నాడు ఒక్కతెల్లపువ్వైనా శ్రీసరస్వతీదేవికి సభక్తిపూర్వకంగా సమర్పించి, అమ్మవారిచే అలంకరింపబడి ఉండే కచ్ఛపి అనే వీణకు నమస్కరించడం ఎంతో గొప్ప విద్యానుగ్రహకారకం.....

భీష్మ ఏకాదశి నాడు ఒక్కసారైనా శ్రీవిష్ణుసహస్రనామాలను సభక్తియుక్తితో పఠించడం, పారాయణగావించడం, ఎంతో గొప్ప పుణ్యదాయకం....

మహాశివరాత్రి నాడు, ప్రదోష సమయం నుండి మరునాటి ఉషోదయ సమయం వరకు, ప్రత్యేకించి లింగోద్భవసమయంలో, కావించే శివశివా అరాధన మహాపుణ్యదాయకం....
సభక్తిపూర్వకంగా సంవత్సరకాలమంతా గావింపబడే శివాభిషేకం యొక్క పుణ్యఫలం ఒకెత్తు...
మాఘమాస మహాశివరాత్రి నాటి శివాభిషేకం యొక్క పుణ్యఫలం అంతకన్నా మెండైనది...

కొందరు వ్యక్తులు ఎంతో గొప్ప వారైనా సరే...,
వారి పుణ్యాలు మొత్తం క్షయించి పోయి....
అధోగతి చెందడం...వచ్చే జన్నల్లో రోడ్లమీద అడుక్కునే వారిలోకెల్లా అధమాతి అధములుగా జన్మించడం....
అనే పాపాలు వారి ఖాతాలో ఎందుకు జమౌతాయో తెలుసా....

1. శివరాధనలో / ఈశ్వరారాధనలో ఉన్న భక్తులను చెనకడం...
2. మహాశివరాత్రి నాడు ఎంతో భక్తితో, ఆశతో, ఈశ్వరాభిషేకం కోసం వెళ్ళేభక్తులను కావాలని వివిధ రీతుల ఇబ్బంది పెట్టడం...
(బిల్వదళాలను విక్రయించకుండా షాప్ వాళ్ళకు నూరిపోయడం, లింగోద్భవకాలంలో జరగవలసిన మహాశివరాత్రి అభిషేక క్రతువును కావాలని లేట్ 
చేయమని పంతుల్లకు ఫోన్లు చేసి నూరిపోయడం, 
3.ఔషధాలు అవసరమై అర్ధరాత్రి భక్తులు అవస్థలు పడేలా 
ప్రణాళికలు రచించడం, 
ఔషధాలకోసం అర్ధరాత్రి ప్రయాణించే భక్తులపై రాంగ్ రూట్లో
కార్లు అతివేగంగా ప్రయాణింపజేసి,
(రోడ్ల మీద ఉన్న షాపుల బయట సి.సి కెమెరాలు ఉన్నాయని తెలిసికూడా)
భక్తుల బైక్లను గుద్ది గాయపరచమని సేవక మూర్ఖులకు నూరిపోయడం,
అర్ధరాత్రి చంటి పిల్లలతో ప్రయాణిస్తుండగా కావాలని మరియాదాపరిధినిదాటి కయ్యాలను పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్ళొస్తున్న భక్తులను బాధించడం....,
ఇత్యాదిగా, కావాలని అనవసరమైన ద్వేషంతో, కుళ్ళుతో, భక్తిని, భక్తులను, తద్వరా భగవంతుణ్ణి బాధించడం.... 
అనే ధూర్తవేషాల వల్ల...

కొందరు వ్యక్తులు సామాన్యులైనా సరే...,
గొప్ప పుణ్యాలను ఆర్జించి....
సద్యోశ్రేయస్సుతో తరించడం వేటివల్లో తెలుసా....

1. శివరాధనలో / ఈశ్వరారాధనలో ఉన్న భక్తులకు సహాయం చేయడం, గౌరవించడం, నమస్కరించడం...

2. మహాశివరాత్రినాడు ఏదో ఒక రూపంలో ఈశ్వరారాధకుల పుణ్యార్జనకు కారణమవ్వడం....

3. నిత్యం బిల్వపత్రాలను, బిల్వవృక్షాలను, దర్శిస్తూ, స్పర్శిస్తూ, నమస్కరిస్తూ ఉండడం...
(అది నవపత్రసమ్మిళితమైన మహాబిల్వమైతే మరింత మెండైన పుణ్యసంచయమౌను....)

ఎందుకంటే....
"భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం..." అని అంటోంది శ్రీలక్ష్మీఅష్టోత్తరశతనామస్తోత్రం...

ఇక్కడ " భా " అంటే, దేవతాద్యుతి, పుణ్యము, ఐశ్వర్యము, మేధస్సు, జ్ఞ్యానం, శ్రేయస్సు,... ఇత్యాదిగా శాస్త్రఉవాచ...

శివలింగంపై బిల్వదళం...
అట్లే సమర్పింపబడితే ఐశ్వర్యదాయకం...
తిరగేసి / బోర్లా సమర్పింపబడితే జ్ఞ్యానదాయకం...
అనే శ్రీచగంటి సద్గురువుల ఉవాచ విజ్ఞ్యులకు విదితమే కద...

కేవలం నడవడం వేరు...
భగవంతుడికి ప్రదక్షిణం గావించడం వేరు...

మాట్లాడడం వేరు....
చక్కగా వచించడం వేరు....

తినడం వేరు...
భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడం వేరు...

పిలవడం వేరు...
నామాన్ని స్మరించడం వేరు...

అట్లే....
వివిధ సాత్విక పదార్ధాలను ఈశ్వరుడిపై పోయడం వేరు...
వివిధ సాత్విక పదార్ధాలతో ఈశ్వరుణ్ణి సభక్తిపూర్వకంగా అభిషేకించడం వేరు...

మొదటిది ఎవరైనా క్యాజువల్ గా చేసేస్తారు.....
రెండవది భక్తి, గౌరవం, విశ్వాసం, శ్రద్ధ, ఉన్నవారు మాత్రమే చేస్తారు....

ఈ మహాశివరాత్రి పర్వసమయంలో భక్తిలెల్లరూ కూడా, 

శివాలయాల్లో ప్రదక్షిణం గావిస్తూ,
శివసంబంధమైన వచనాలను వచిస్తూ,
శివప్రసాదాన్ని ఉత్తరాన కొలువై ఉండే చండీశ్వరుని అనుమతితో స్వీకరిస్తూ....
శివనామాలను స్మరిస్తూ...
శివాభిషేకక్రతువుల్లో తరించెదరుగాక అని ఆకాంక్షిస్తూ....

భక్తులెల్లరికీ మహాశివరాత్రి పర్వసమయ శుభాభినందనలు...💐😊

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ.....

హరనమః పార్వతీపతయే హరహరమహాదేవశంభోశంకర.....

అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలశివ అరుణాచలా.....
అరుణాచలశివ అరుణాచలశివ
అరుణాచలశివ అరుణాచలా.....

ఓం నిధన పతయే నమ !  ఓం నిధన  పతాంతికాయ నమః !!  
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!!   
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!!  
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 
ఓం ఆత్మయ నమః!  ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః !!

!! ఏతత్ సోమస్య సూర్యస్య సర్వ లింగ గ్గ్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం !!

ఓం భవాయ దేవయ నమః 
ఓం శర్వాయ దేవాయ నమః 
ఓం ఈశానాయ దేవాయ నమః 
ఓం పశుపతయే  దేవాయ నమః 
ఓం రుద్రాయ దేవాయ నమః 
ఓం ఉగ్రాయ దేవాయ నమః  
ఓం భీమాయ దేవాయ నమః 
ఓం మహాతే దేవాయ నమః 

ఓం భవస్య దేవస్య పత్న్యైనమః
ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః 
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః 
ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః 
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై  నమః 
ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః 
ఓం భీమస్య దేవస్య పత్న్యై  నమః 
ఓం మహతో దేవస్య పత్న్యై నమః 

ఓం భవస్య దేవస్య పుత్రాయ నమః
ఓం శర్వస్య దేవస్య పుత్రాయ నమః 
ఓం ఈశానస్య దేవస్య పుత్రాయ నమః
ఓం పశుపతయే దేవస్య పుత్రాయ నమః
ఓం రుద్రస్య దేవస్య పుత్రాయ నమః
ఓం ఉగ్రస్య దేవస్య పుత్రాయ నమః 
ఓం భీమస్య దేవస్య పుత్రాయ నమః
ఓం మహతో దేవస్య పుత్రాయ నమః

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! 

సర్వం వేములవాడ శ్రీరత్నగర్భగణపతి సహిత 
శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీరాజరాజేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏💐😊

💐💐💐💐💐💐💐💐💐💐


No comments:

Post a Comment