శ్రీ చాగంటి సద్గురువులకు ఎంతో ప్రీతికరమైన మహాభారతపద్యాల్లో ఒకటైన "కుంభించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగంబెల్లగప్పికొనగ...."
అనే పద్యం యొక్క వివరణలో, శ్రీచగంటి సద్గురువులు వర్ణించిన శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఆవేశాన్ని ఆలకిస్తే మనం ఆశ్చర్యంచెందడం తథ్యం...
ఎందుకంటే, స్వతహాగా శ్రీకృష్ణపరమాత్మకు చక్రి అనే ఒక గొప్ప పేరు కలదు...
సామాన్యార్ధంలో చక్రి అంటే చిరునవ్వుతోనే అనన్యసామాన్యమైన రీతిలో చక్రం తిప్పేవారు అని అర్ధం...
విశేషార్ధంలో, ఎదురన్నదేలేని శ్రీసుదర్శనచక్రాన్ని శస్త్రాస్త్రం గా ధరించి ఉండే శ్రీమహావిష్ణువు అని అర్ధం.
కాబట్టి శ్రీమహావిష్ణువే పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణపరమాత్మ అని అర్ధం.
అటువంటి శ్రీకృష్ణపరమాత్మ కురుక్షేత్రంలో చేసిన శపథం ఏంటో తెలుసా...?
"అస్త్రం పట్టను, యుద్ధం చేయను...కేవలం నా ప్రియాతిప్రియమైన బామ్మర్ది పార్థునకు రథసారధ్యాన్ని గావించెందను.." అని.....
అటువంటి శపథం చేసిన శ్రీకృష్ణుడు, భీష్ముడి ప్రతాపానికి హడలెత్తుతున్న అర్జునుడి వైపు చూసి,
"నేను నీకు రథసారధిగా ఉండగా...,
నీపైకి ఇంతగా బాణాలను సంధించి గాయపరుస్తాడా ఈ భీష్ముడు....
నువ్వాగు అర్జునా...
ఇవ్వాళ ఈ రణభూమిలో నిలిచేది
శాంతనవుడో...శౌరియో తేల్చేదను..."
అని రణభూమిలో పడి ఉన్న ఒక రథచక్రాన్ని గైకొని, భీష్ముడిపైకి శ్రీకృష్ణుడు సంధిచబోయిన ఆ ఘటనలో.....
మనకు అవతగతమవ్వవలసిన విషయం ఏంటంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడికే కోపం తెప్పించిన అప్రతిహత శస్త్రాస్త్రసంపన్నుడు, ఇచ్ఛామరణవరంగల కురువృద్ధుడు, అష్టవసువుల్లో ఒకరి అవతారమైన గంగాశంతనసుతుడు, శ్రీభీష్మపితామహుడు...!
సూర్యాస్తమయమైన తదుపరి, రణభూమిలోని భీష్ముడి శిబిరానికి వెళ్ళి...
"నమస్కారం తాత...నీ ప్రతాపానికి ఈ లోకంలో, సవ్యసాచి అయిన నాతో సహా, ఎవ్వరూ ఎదురునిలవలేరు...
అని నీక్కూడ బాగా తెలుసు కద తాత....
అడుగుతున్నానని ఏమి అనుకోకు తాత...
నువ్వెట్లా పోతవో నువ్వే చెప్పవా తాతా..."
అని ఎంతో వినమ్రుడై అడుగుతున్న మనవణ్ణి చూసి, నవ్వుతూ...
"హుం...తెలుసు మనవడా నువ్వు ఇక్కడివరకూ వస్తావని...ఇలా అడుగుతావని...
విధివశాత్తు ఈ సంగ్రామంలో నేను దుర్యోధనుడి పంచన ఉండడం దురదృష్టకరం..
సర్లే....ఇక్కడివరకూ వచ్చి అడిగావు కద...చెప్తా విను....
నా మీద కోపంతో ఏకంగా మరో జన్మ ఎత్తి మరీ ఎదురుచూస్తున్న శిఖండిని యుద్ధ భూమిలో నాకు ఎదురుపడేలా చెయ్....శిఖండి పై ప్రహారం గావించడం నా సుక్షత్రియధర్మానికి విరుద్ధం కాబట్టి నా ధనుర్బానాలను పక్కకుబెట్టిన వెంటనే నీ గాండీవంతో శరపరంపరలను నాపైకి సంధించు....అప్పుడు నేను నేలకూలెదను....కాని మరణించను....నాకు గల ఇచ్ఛామరణం అనే వరాన్ని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ తరువాత నేను, మరియు శ్రీకృష్ణపరమాత్మ యోగమార్గంలో సంభాషించుకుంటాం...
ఇక వెళ్ళిరా మనవడా...సుఖీభవ...విజయోస్తు...."
అని పలికిన భీష్మపితామహుడి అంతటి ఔదర్యం గల క్షత్రియవీరులు ఈ లోకంలో వేరొకరు లేరేమో...!
అర్జునుడు బాణాన్ని సంధించి పాతాళగంగను భువిపైకి రప్పించి
భీష్మపితామహుల దాహార్తిని శమింపజేసిన తదుపరి కురుక్షేత్రంలో....
నుతించినది గంగాసుతుడు....
నుతింపబడినది గంగాజనకుణ్ణి....
ఇక ఆ శ్రీవిష్ణుసహస్రనామ స్తుతి ఎంతటి సారస్వతగంగాప్రవాహమో ఒకసారి ఊహించండి...
అట్టి శ్రీవిష్ణుసహస్రనామ శ్రవణం, పఠనం, పారాయణ యొక్క మహత్తును ఒకసారి ఊహించండి...
అది మనఊహకు కూడ అందనంతటి శక్తిగల అమరసారస్వతం..!
అవసానసమయంలో, కురుక్షేత్రసంగ్రామభూమిలో అర్జునుడు ఏర్పరచిన అంపశయ్యపై పరుండిన అంతటి అరుదైన అవతారమూర్తి యొక్క అనుగ్రహంగా ఈ లోకానికి అందిన ఎంతోమహిమాన్వితమైన, ఎల్లరూ పఠించదగిన, ఎల్లరిచే పారాయణగావింపబడే అమరసారస్వతం, శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం...!
ఉసిరికాయలు అనేవి ఒక డివైన్ సీసనల్ ఫ్రూట్...
వాటితో ఒక రోజు నిలవ ఉండే ఉసిరికాయ్ చారు చేసుకోవడమా....
లేక...,
నెలల తరబడి నిలవ ఉండే ఉసిరికాయ్ హల్వా చేసుకొని తరించడమా...
అనేది వారివారి విద్వత్తుకు, విజ్ఞ్యతకు, సంబంధించిన అంశం...
శ్రీవిష్ణుసహస్రనామావళి వంటి దైవికసారస్వతాలు కూడా ఉసిరికాయ్ లాంటి మహౌషధీ ఫలాలు...
వాటిని ఎవరు, ఎట్ల వినియోగించుకొని తరిస్తారనేది.....
వారివారి విద్వత్తుకు, విజ్ఞ్యతకు, సంబంధించిన అంశం...😊💐
శ్రీవిష్ణుసహస్రనామావళి లోకానికి అందివచ్చిన పర్వసమయ సందర్భంగా, పరమాత్మ అనుగ్రహం భక్తులెల్లరికీ మెండుగా లభించుగాక అని ఆకాంక్షిస్తూ....విజ్ఞ్యులెల్లరికీ భీష్మ ఏకాదశి శుభాభినందనలు..😊
సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...😊💐🙏
No comments:
Post a Comment