శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు ఈనాటి వర్ధమాన సనాతనభారతదేశ ధర్మజ్ఞ్యానదీప్తిపతాకంగా వెలుగొందే మాన్యుల్లో ఒకరిగా ఆర్షవాంగ్మయ పరిశోధకవిజ్ఞ్యులకు, ప్రవచనాసుజ్ఞ్యానారాధకులకు, సుపరిచితమైన సరస్వతీ ఉపాసకులు / స్వరూపులు.
చాతుర్వర్ణవ్యవస్థతో పరిఢవిల్లే మన సనాతనభారతదేశ వైభావానికి అన్నిసామాజికవర్గాల విజ్ఞ్యులు తమవంతు కృషితో కారకులౌతున్నారు కాబట్టి సశాస్త్రీయ విధానంలో గాయత్రి ఉపాసనను వారి పెద్దలనుండి అందుకోని వారు కూడా ఎల్లరూ పఠించదగిన శ్లోక సారస్వతంతో సాధారణ గాయత్రి ఉపాసనను ప్రారంభించి, క్రమక్రమంగా విశేషమైన గాయత్రి ఉపాసనదిశగా వారి సాధనను అభివృద్ధిపరుచుకొని తరించగలరు అని ప్రవచించిన మాన్యుల్లో ఒకరిగా శ్రీ సామవేదం గురువుగారు ఆస్తిక ప్రపంచానికి సుపరిచితులు.
శ్రీ మల్లాది గారి తరువాత, భారతదేశ తెనుగు ప్రాంత సనాతనధర్మదీప్తిసౌధానికి ఆధారస్తంభాలుగా వర్ధిల్లే,
ఒక చాగంటి గారు, ఒక సామవేదం గారు, ఒక కాకునూరి గారు, ఒక అనంతలక్ష్మి గారు, ఒక నోరి గారు, ఒక వద్దిపర్తి గారు, ఒక మైలవరపు గారు, ఇత్యాది మాన్యుల నిస్వార్ధకృషిని స్మరించి నమస్కరించడం ఆస్తికుల విహితధర్మం...
"ఋషిపీఠం" పత్రికామాధ్యమంద్వారా సనాతనధర్మప్రచారయజ్ఞ్యంతో సమాజికచైతన్యదీప్తివ్యాప్తికి ఎంతగానో కృషిస్తున్న శ్రీ సామవేదం గురువు గారు ఈశ్వరానుగ్రహంతో మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అకాంక్షిస్తూ, వారి శ్రీచరణములకు జన్మదినశుభాభినందనానమస్సుమాంజలి...💐🙏😊
https://www.facebook.com/share/v/1Ad8FrTq8g/
No comments:
Post a Comment