Vinay Kumar Aitha's Personal blog. :)
Viewers may feel free to read thru / copy from / comment on any of my posts as I draft/save them for universal peace.. :)
Monday, May 18, 2020
శ్రీ శార్వరి వైశాఖ బహుళ దశమీ ప్రయుక్త పూర్వాభాద్ర / హనుమద్జయంతి - 2020 శుభాభినందలు...😊
శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే | మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || :)
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 3
ఇప్పుడేమో కటింగ్ షాప్లో ఉండే బార్బర్ / క్షురకుడి తో పోల్చి గురుత్వ గొప్పదనం యొక్క వివరణ అంటావ్...." అని అంటారేమో......
బాగా కాంప్లెక్స్ గా చేసి ఏదో కొందరు అత్యున్నత స్థాయిలో ఉండే సాహితీవేత్తలకే అర్ధమయ్యే రీతిలో చెప్తే ఇక ఆ తత్త్వానికి సార్ధకత ఎక్కడుంటుంది....?
ఒక గురువు
" అబ్బో...అవన్నీ పెద్ద పెద్ద జ్ఞ్యానులకు మాత్రమే అర్ధమయ్యే విషయాలు...అవి మీకెక్కడ అర్ధమవుతాయిలే....."
అని....శాస్త్రం అంటే ఒక పెద్ద రాకెట్ సైన్స్ లా భయపెట్టే వారు గురువు కాదు...బరువు అవుతారు..."
కాబట్టి మంగళి చేసే హేర్ కటింగ్ లోనే మనం ఆ సద్గురువుల గొప్పదనాన్ని దర్శిద్దాం.....
అనే చక్రం లో సాగిపోయే రెగులర్ లైఫ్లో మనం ఎందరిని కలిసేందుకు వీళుంటుందో ఏమో కాని
రెణ్ణెల్లకు ఒక్కసారైనా సరే కటింగ్ షాప్ కెళ్ళి....
" అన్నా నమస్తే.....ఎట్ట్లున్నవే....ఈ సారి జర స్టైలిష్ గా జెయ్యవ కట్టింగ్.....ఒక ఫంక్షం కి పోవాలె...." అని అలా ఏదో ఒక పలకరింపుతో కట్టింగ్ షాప్కెళ్ళని వారు ఉండరు కద.....😊
మినహ బార్బర్ షాప్లు బంద్ ఉండడం చాల అరుదు.....
( మంగళవారం మాత్రమే ఎందుకు బార్బర్ షాప్లు బంద్ ఉంటాయి అనే ఆ ఆధ్యాత్మిక తత్త్వసూక్షం గురించి నేను ఇదివరకే ఒక పాత పోస్ట్లో చెప్పి ఉన్నాను....
ఆ రోజు ఉండే కుజ హోర యొక్క ప్రత్యేకత దృష్ట్యా అలా బంద్ చేయడం అని.....)
అనేది మనందరికి తెలిసిందే......
హేర్ కటింగ్, షేవింగ్, నేల్స్ కటింగ్, ఫేషియల్, జుట్టుకి రంగు, ఇత్యాది మెరుగుల కోసం.....
( అఫ్కోర్స్ శుభ్రపరిచి ఉపయోగించడం అని చెప్పడం.....),
అందరికి కటింగ్ చేసేది ఆ బార్బరే.....
" క్షురక సంస్కారం.... " అయిన తర్వాత ఎవరికి వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లా ఫీలైపోతు కాలర్ ఎగరేస్తు, అప్కమింగ్ టాలివుడ్ / బాలివుడ్ / హాలివుడ్ యాక్షన్ హీరో ఇక వారే అనే రేంజ్లో పోజులు కొడుతూ బయటికి రావడం కద్దు.....కద...😊
మా ఇద్దరిది ఒకే బస్తి....ఇద్దరివి ఒకేలా ఉండే పేదలకుండె రెండు రూముల రేకుల ఇల్లు, ఇద్దరం స్కూల్ కి కొంచెం లేట్ గా వెళ్ళే బ్యాట్చ్, అలా చాలా వాట్లో ఒకరికికొకరు అన్నట్టుగా ఉండేది మా స్వార్ధరహితమైన, గర్వరహితమైన, స్నేహం.....
కాని కత్తిరించబడి మన నెత్తిపైనే ఉన్న మిగతా జుట్టును చూసి...
" వావ్.....వాట్ ఏ హీరో హేర్ స్టైల్ ఐ హావ్ గాట్....!" అని ఒ పదిసార్లు అద్దం లో ఎగాదిగా చూసుకొని దూస్కొని మురిసిపోతుంటాం.....?.....అవునా....?
( ఆ బార్బర్ తపన కూడా) ....అవునా...?
అని, జీవితానికి ఉపకరించే వాస్తవిక బోధలు కాకుండా ఇలా మెట్ట వేదాంతం వల్లించేవారు, చక్కని కటింగ్ చేయమని అడిగితే బోడిగుండు చేసేవారు అన్నమాట....)
నువ్వు ఎంత తోప్ అయినా సరే,
అది మనకు మనం చేసుకోలేము కాబట్టే ఆ కళలో ఆరితేరిన ఒక బార్బర్ దెగ్గరికి వెళ్ళేది....అవునా....?
బార్బర్ దెగ్గర తలవంచి క్షురక సంస్కారం పొందితే తప్ప నీకు " హీరోయిక్ లుక్ " రాదు....
కాని ఒక చక్కని బ్రహ్మజ్ఞ్యాని అయిన సద్గురువును ఆశ్రయించి వారికి వినమ్రంగా నమస్కరించని నాడు భక్తి / జ్ఞ్యాన సిద్ధి లభించి మన ఆత్మ అనే ప్రతిబింబంలో ఆ పరమాత్మ యొక్క దర్శనం లభించి, అనగా ఆ పరమాత్మ యొక్క తత్త్వ దర్శనం లభించి ఆనందించడం, అనేది కుదరదు.....
మన చిత్త వృత్తులు, మన మనో బుద్ధి అహంకార చిత్త జనితమైన, అనివార్యమైన, అత్యంత సహజమైన, సకల జీవ భావనలు,
మన జీవితంలో అలా నిరంతరం పెరిగే వందలకొలది వివిధ రోమరాశులు.......
పట్టించుకోము....
వారి యొక్క హితవచనాలు అనే పదునైన వాక్కులతో అజ్ఞ్యానం అనే జడరాశిని తొలగించి నిరంతరం ఊగిసలాడే మన చిత్తవృత్తులను సంస్కరించి మనలోనే నిరంతరం కొలువైఉండే ఆ దేదీప్యమానమైన పరమాత్మయొక్క దర్శనాన్ని
( ' ఆత్మసాక్షాత్కారం ' గా భావించబడే ఆ ) అద్వైతానుభవ స్థితి గా మనకు గ్రాహ్యపరుస్తారు.......
మన వెనకున్న అద్దమే మన మనసు....
అంతే తప్ప మెడను వెనక్కి తిప్పి చూసుకోము కద....
తదనుగుణంగా మన మనసును కూడా మన అధీనంలోనే ఉండేలా చేస్తుంది....
"ఓ నా నాలుక నేస్తమా..... ద్రాక్షపళ్ళజోలికి వెళ్ళకు...." అని...
"ఓ నా నాలుక నేస్తమా.... ఎం కాదులే....ఈ ఒక్కసారికి ఒక పది ద్రాక్షలు గుటుక్కుమని మింగెయ్...
మళ్ళీ ఎప్పటికి తింటామో ఏమో....
అంతగా ఆస్తమ ఒస్తే ఇన్హేలర్ ఉంది కద.....ఉమ్మ్ తినెయ్ ద్రాక్షలు....." అని.....
మీకు బుద్ధి బలం ఉంది కాని మనో బలం లేదని అర్ధం....
' మరీ ఎక్కువ ఎందుకు తిన్నావు.....ఒక రెండు తింటే సరిపోయేది కద....'
అని మళ్ళీ అదే బుకాయిస్తుంది..."
కాబట్టి ద్రాక్షల జోలికి వెళ్ళకపోవడమే మంచిది...."
అని అప్పటికప్పుడే మనసును బుద్ధిబలంతో సంస్కరిస్తే మనో బలం కూడా అక్కడ సమకూరినట్టే...
పడవలో నీరున్నట్టు.....
( In simpler words, chittam is like an axle that connects these two wheels called Buddhi and Maanas to get the vehicle called body keep going in a smooth fashion.....)
లాంటిదే మన చిత్తం...... సంధించబడే ఆ అత్యంత శక్తివంతమైన మిస్సైలే మన సంకల్పబలం......
సంప్రదాయంలో ఈ ఘనకిరీటాన్ని " గురుకిరీటం " అని వ్యవహరిస్తారు.....
స్వామి వారిని అందరికి గురుడు అంటూ,
సానబట్టిన భోగి గా ఉండే జ్ఞాన యోగి
ఆతడు...
అని ఎంతో చక్కనైన సంకీర్తనలో మనకు శ్రీనివాసుడి శ్రీకరమైన గురుత్వాన్ని చాటిచెప్పారు.....
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 🙏😊
శ్రీకరమైన భారతీయసంస్కృతి / భారతీయ సనాతన అహార విధివిధానాలు / జీవన శైలి..... :)
" మనసు " అనే కనిపించని
" మంత్రి " మనల్ని తన అధీనంలోకి తీసుకుని నడిపించే విధానమే మన జీవితం అవుతుంది కాబట్టి.....
" బుద్ధి " గా స్థిరపడుతుంది కాబట్టి....
మనల్ని నిరంతరం ఆటాడించే ఈ ఇరు శక్తులే మొత్తం మన జీవితాన్ని శాసించే కీలకమైన అంశాలు.....
ఒక్కొక్క గడిని మాత్రమే దాటుకుంటు వెళ్ళగల రాజు, మరియు ఒక్కసారిగా. ఎన్ని గళ్ళైనా దాటి ఎక్కడికైనా తుర్రుమని దూసుకుపోగల మంత్రి అనే ఇరు కీలక శక్తులకు తోడుగా మరిన్ని శక్తులు అనగా,
గజ శక్తి, హయ శక్తి, ఉష్ట్ర శక్తి, సైనిక శక్తి తోడుగా ఉండి మన ఆటకు సహకరిస్తాయి.....
సృజించి తమ ఆటను వాటితో ఆడిస్తాయి.....
నిమగ్నమవుతాయి.......
ప్రత్యేకత గలిగిన పావులు.....
లాంటి వీడియో గేంస్ బజార్లో ఉండే షాపుల్లో ఆడి ఉంటే, కాంట్ర గేం లో మల్టిపుల్ ప్లేయర్స్ తో ఆడినప్పుడు, "every soldier jumps in to the battle field with his own roadmap and executes his Matrix inspite of their common goal....." అనే ఆటతీరుకి మన లౌకిక చదరంగం ప్రతిరూపం...... )
చదరంగంలో మనం వేసే ఎత్తు కనిపించకుండా కేవలం పావుల కదలిక మాత్రమే కనిపిస్తుంది.....
అది వేసే ఎత్తు మన మదిలో ఉంటుంది...
" కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిః " అనే నామం మనకు బోధించినట్టుగా, అనాదిగా ఉన్నది అభిన్నమైన శివశక్త్యాత్మకం అనే అద్వయమైన శక్తి ఒక్కటే.....
అది కేవలం వారి యొక్క ఘనమైన
" మనో శక్తి / బుద్ధి శక్తి " అనే
శివశక్త్యాత్మక స్వరూపమైన ఆత్మశక్తి యొక్క ప్రతిరూపమే.......
.......సదరు గాయకుల లోని ఆ గాంధర్వ శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద......
.......సదరు రచయిత లోని ఆ గాణాపత్య శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద......
దేవగురు బృహస్పతి లా సమాలోచన గావించి ఆశ్రయించిన వారిని గురుస్వరూపమై అనుగ్రహించి వారికి ఎనలేని పరదేవతా అనుగ్రహాన్ని కాటాక్షిస్తుంటారు..... ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంతో సాధించబడనిది ఏముంటుంది గనక.....
......అవ్విధంగా వారిచే ప్రకటించబడే అమేయమైన బార్హస్పత్య శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
" అవురా వీరు ఎంతటి తలపండిన రాజనీతిజ్ఞ్యులో కద.....ఇంతటి చతురత భరిత వ్యూహాలను రచించడం నిజంగా వీరికే చెల్లింది...! "
అనే రీతిలో తమ నాయకత్వ పటిమను ప్రదర్శిస్తారు......
......అవ్విధంగా వారిచే ప్రకటించబడిన
వారి యొక్క దేవేంద్ర సమమైన నాయకత్వ శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
ప్రాణుల క్షుద్బాధకు చలించి దివి నుండి దిగి వచ్చిన శాకంబరి అమ్మవారా ఏమి......
అనే రీతిలో తమదాతృత్వాన్ని ప్రదర్శిస్తారు......
......అవ్విధంగా వారిచే ప్రకటించబడిన
వారి యొక్క పరదేవతా సమమైన సాహసోపేతమైన దయా శక్తి వారి యొక్క మనోశక్తి / బుద్ధిశక్తి యొక్క సమ్మిళితశక్తిస్వరూపమే కద.....
( శ్రీ డొక్కా సీతమ్మ గారిలా... )
మరొకరేమో ఈ సంపదలన్నీ, శక్తియుక్తులన్నీ నాకు గురువుల అనుగ్రహంగా, ఈశ్వరప్రసాదంగా సమకూరినవి.....అని అంటారు.....
........అలా అనగలగడం కూడా సదరు వ్యక్తి యొక్క మనో శక్తి / బుద్ధి శక్తి యొక్క పరిణతను సూచించి వారి యొక్క గౌరవాన్ని మరింతగా ఇనుమడింప జేసే దైవానుగ్రహమై వర్ధిల్లుతుంది......
మనం పీల్చే గాలి....
మనం వినే మాటలు / పాటలు.....
మన వ్యాపకాలు / ప్రవృత్తులు....
ఆఖరికి మన ఆహార్యం కూడా మన ఆహారమే....!
బౌద్ధికసిద్ధి గా,
వాక్సిద్ధి గా,
కార్య సిద్ధి గా,
మనిషికి అసాధ్యం అనేది కూడా సాధ్యం గా మారి
కాబట్టి బ్రహ్మర్షిని బ్రహ్మగారిలా గౌరవించబడేలా చేస్తుంది....
నాంది ఎక్కడ....?
అది ఈ దేశంలో ప్రవహించే జీవనదుల గొప్పదనం....!!
వారికి అభిరుచి గల శాస్త్రాల్లో, మార్గాల్లో, వారిని అగ్రగామిగా నిలిపి యుగయుగాలకు జగజగాలకు వారి యొక్క కీర్తిపతాకములు రెపరెపలాడేలా
శాశ్వతత్వాన్ని ప్రసాదించింది....!!
కుమ్మరి భీముడు మట్టిపెంకలో ఆరగింపు గావించిన వృత్తాంతానికి గుర్తుగా ఇప్పటికీ ' ఓడు ' అనే కొత్త మట్టి పెంకులో శ్రీనివాసుడికి ప్రతి రోజు పెరుగన్నం తినిపించబడే నేల అయ్యింది....!!
లవంగాలు ,
మిరియాలు,
దాల్చినచెక్క,
గసగసాలు,
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం |
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ ‖ 25 ‖ "
Saturday, May 9, 2020
శ్రీ చంద్రశేఖరసరస్వతీ మహాస్వామి వారి శ్రీ చరణాలచెంత వారి వైశాఖ అనూరాధ నక్షత్ర జయంత్యుత్సవ శుభసందర్భంగా కవనకుసుమాల నమస్సుమాంజలులు....🙏🌼
********************************
నృపాలిమౌలివ్రజరత్నకాన్తి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్..!
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్..!!
శ్రీయుతమైన చక్రవర్తుల కిరీటలములందు అమరిన అమూల్యమైన మణుల యొక్క దేదీప్య కాంతిని తలపించేలా వెలుగుతున్న గురుపాదుకలకు నేను నమస్కరించుచున్నాను......
సంసారం అనే ఘోర సముద్రం లో మునిగిపోయే వారిని చక్రవర్తుల స్థాయికి చేరుకునేలా ఉద్ధరించే
ఆ శ్రీగురుపాదుకలకు నేను పునః నమస్కరించుచున్నాను......
********************************
नृपालि मौलिव्रजरत्नकांति सरिद्विराजत् झषकन्यकाभ्यां |
नृपत्वदाभ्यां नतलोकपंकते: नमो नमः श्रीगुरुपादुकाभ्याम् ||
" My prostrations to the holy sandals of my Guru, which shine like the precious stones that adorn the crown of kings, by bowing to which one drowned in worldliness will be lifted up to the great rank of sovereignty......."
********************************
Nrupali mouleevraja rathna kanthi saridvi raaja jjashakanyakaabhyam,
Nrupadvadhaabhyaam nathaloka pankhtheh, namo namah sri guru paadukaabhyaam.
Shining like a precious stone adorning the crown of a king.
They stand out like a beautiful damsel in a river infested with crocodiles
They raise the devotees to the state of sovereign emperors.
To such sandals I humbly offer my obeisance.....
********************************
శ్రీగురుపాదుకలు, శ్రీగురుపాదపద్మములు, శ్రీగురువులు
అనే 3 పదాలు కూడా నిజానికి
అభిన్నం కాబట్టి వీటిలో వేటి గురించి మాట్లాడినా సరే అది మూడిటికి వర్తిస్తుంది.....
అస్మద్ గురుదేవులు శ్రీ చాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒక దెగ్గర బోధించడం వినే ఉంటారు.....
గురువులు ఏమి ఇవ్వగలరు.....?
అనేది మీ ప్రశ్నైతే......
గురువులు ఎమైనా ఇవ్వగలరు అనేది సరైన సమాధానం....!
ఎందుకంటే
గు కారశ్చ అంధకారశ్చ
రు కారన్తన్నిరోధకః....
అని మన గురువులు చెప్పినట్టుగా,
ఇక్కడ అంధకారం అంటే చీకటి...
చీకటి అంటే ఏమి లేనితనం...
అనగా అజ్ఞ్యానం, అవిద్య, దారిద్ర్యం,
ఇలా సకల విధమైన లేమితనం అందులోకి వస్తుంది......
ఆ అంధకారాన్ని నిరోధించడం అంటే జ్ఞ్యానాన్ని ప్రసాదించడం,
శ్రేయస్కరమైన విద్యలన్నీ ప్రసాదించడం, సకల శ్రేయస్కరమైన సంపదలను ప్రసాదించడం.......
( విద్య వేరు......జ్ఞ్యానం వేరు....
శ్రీరాముడికి ధనుర్వేదం పై ఎనలేని పట్టుండడం అతనికి గురువులచే అనుగ్రహించబడిన విద్య....
కాని, ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ఎందుకు ఏ అస్త్రాన్ని సంధించి వారిని నిర్జించాలో అనేది అతడి జ్ఞ్యానానికి సంబంధించిన విషయం.....
పై ఉదాహరణతో రెంటికి గల భేదం అర్ధమయ్యిందని అనుకుంటాను..... )
ఇవ్విధంగా గురువు అనగా ఎదైనా ఎమైనా ఇవ్వగలిగే దైవ స్వరూపం అనే అర్ధం అమరుతుంది.....
అసలు గురుభక్తి అలా ఎలా శిష్యులను అంతగా ఉద్ధరించగలదు అనే విషయం ఒక సింపుల్ ఉదాహరణ తో చెప్పే ప్రయత్నం గావిస్తాను....
ఒక తలబిరుసు ఉన్న పోరడు ఒక అమాయకుడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడనుకుందాం.......
అప్పుడు ఆ అమాయక పోరడు తనకు సహాయం చేసే మంచి వారికి ఆ విషయం చెప్పి ఆ పొగరుబోతు పోరడినుండి అన్నివిధాల రక్షణ పొందుతాడు అనేది లోకసహజమైన విషయం.... అవునా.....
ఆ పొగరుబోతు ఇంకా తన వేధింపులను ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటే, ఈ అమాయకపోరడి తరఫున ఉండే పెద్దలు జోక్యం చేసుకుని
" ఎం రా ఒరివారి....తిన్నది అరుగుతలేదా....లేక అరిగించుకోలేనంతగా డాలర్లకు డాలర్లు మెక్కుతున్నవ.....?
అనవసరంగా ఎవ్వరి జోలికి వెళ్ళని మా పోరడిని ఎందుకట్ల సతాయిస్తున్నవ్...
అరుస్తున్నవట...ఎగబడుతున్నవట...దిమాక్ సడ్కాయించిందా..ఏంది....ఎం కత....."
అంటూ దుయ్యబడతారు......
అవునా.....
శ్రీ చాగంటి సద్గురువులు చెప్పిన్నట్టు పుట్టింటి వారు,
బావలు, బామ్మర్దులు ఎల్లప్పుడు బ్రతుక్కోరుతారు.....మన వారు బావుండాలి అని కోరుకునే నిస్వార్ధ వైఖరి సామాన్యంగా పుట్టింటి తరఫున వారికి అధికం....
అయినాసరే ఆ పొగరుబోతు తనదైన శైలిలో గుంటనక్కలా వివిధ రీతుల తన వేధింపులను కొనసాగిస్తూనే ఉంటే.......
ఈ అమాయకపోరడిని, వాళ్ళ అమ్మమ్మ పుట్టింటి తరఫున బంధువైన ఒక మంచి మనసున్న పెద్దాయన కలిగించుకొని రక్షిస్తాడు.....
బావకి ఇబ్బంది కలిగించే వారి పట్టుపట్టేందుకు బామ్మర్దిగా ఉన్న భగవంతుడే ఊర్కోలేదు......
ఆయుధం పట్టను, యుద్ధం చేయను, కేవలం రథం నడుపుతాను అని పలికిన ఆ పార్థసారధి,
" అర్జునా....వదులు నన్ను......
నేనుండగా నీ పైకి ఇన్ని బాణాలతో భీష్ముడు విరుచుకుపడి గాయపరుస్తాడా.....!
ఈ చక్రి ప్రతాపం ఏంటో ఇవ్వాళ భీష్ముడికి తెలిసి తీరవలసిందే......!!
అంటూ చక్రం విసరడానికి సిద్ధమైన బామ్మర్దిలా......."
బావకు బామ్మర్ది, బామ్మర్దికి బావ అన్నట్టు....
రంగంలోకి ఆ పెద్దమనిషి జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దడంలో భాగంగా,
బడుగుబలహీన వర్గాలకు ఎల్లపుడు అండగా ఉండే ఆ పెద్దమనిషి, స్వయానా సీ.ఎం గారి పేషిలో క్యాబినెట్ మినిస్టర్ అయితే ఇక చెప్పేదేముంది......
దుండగులు తమ దుడుకుతనం ఆపి తీరవలసిందే కద.....
(బాహుబలి సినిమా లో మహేంద్రవర్మ బాహుబలి రక్షణకు, మాహిష్మతి మహాసామ్రాజ్యానికి సామంత
రాజ్యమైన కుంతల రాజ్య సైన్యం సరైన సమయంలో అంతర్శత్రువులపైకి సరైన విధంగా దండెత్తినట్టు...😊)
పంద్రాగస్ట్ కొ, జనవరి 26 కొ, జరిగే పరేడ్లో సీ.ఎం కాన్వాయ్ లో పాల్గొనే ముఖ్య సచివులకు, ఇతరపెద్దలకు పుష్పగుచ్ఛాలతో అభినందనాపూర్వక నమస్సులు తెలిపే బృందంలో ఈ అమాయక పోరడు వెళ్ళి నిల్చుంటే, ఇప్పుడు ఆ పొగరుబోతు అక్కడికెల్లి ఇంకా రాళ్ళు విసురుతాడా....?
విసరలేడు....విసరకూడదు కూడా.....
ఎందుకంటే అక్కడ పువ్వులు కాకుండా రాళ్ళను విసిరితే, చింతబరిగెలను అందుకొని నాలుగు పీకడానికి ఎందరో రాఫ్ కమాండోస్ సీఎం గారి కాన్వాయ్ చుట్టూ నిరంతరం కట్టుదిట్టమైన పహార కాస్తు ఉంటారు కనుక.....
ఇంకా ఎక్కువ వేషాలు వేస్తే,
అది మొత్తం సీఎం గారి కాన్వాయ్ నే ఇబ్బంది పెట్టే అంశంగా భావించబడి చాలా కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది ఆ దుండగులతో...... అవునా....?
పై ఉదాహరణ లా అచ్చం అదే విధంగా ఒక శిష్యుడు,
తాను మానసికంగా గురువుల, గురుపరంపరల యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు, వారిని పరివేష్టించి ఉండే వివిధ దైవిక శక్తులు సదరు శిష్యునకు కూడా ఎల్లప్పుడు దృఢమైన రక్షణకవచంగా ఉంటాయ్.....
ఒక సీ.ఎం గారి కాన్వాయ్ లో ఉన్న వ్యక్తికి అక్కడి సకల శ్రేయస్సులు, సంపదలు, రక్షణలు ఏ విధంగా వర్తిస్తాయో
( Now that he has been entitled to participate in Mr.CM's convoy, all the riches applicable to that convoy would be implicitly applicable and available to this person as well and by the virtue of getting himself placed near the hon'ble CM, he would be treated on par with that of the respected chief minister by all the Rapid Action Force Commandos around the CM's convoy.....
Hence that mischievous guy has to stop his pestering unless he want to get shot down by the commandos over there whose only goal is to guard Mr. CM from everyone around no matter what ....... )
అదే విధంగా సద్గురువుల శ్రీచరణాలను ఆశ్రయించి ఉన్న వారికి గురుకటాక్షంగా ఆ గురుపరంపర యొక్క సకల శక్తులు, సంపదలు, విద్యలు అబ్బుతాయి అనేది యదార్ధం.....
మరియు అదేవిధంగా సద్గురువుల శ్రీచరణాలను ఆశ్రయించి ఉన్న వారి జోలికి ఎట్టి అవిద్య, అజ్ఞ్యానం,
రావు....రాలేవు.....
వస్తే సమూలంగా దహించుకుపోవలసిందే కాబట్టి....!
అందుకే ఈ భారత దేశం యొక్క వైభవం మొత్తం ఈ పుణ్యభూమిలో జన్మించిన ఎందరెందరో మహనీయుల యొక్క శాశ్వతమైన జ్ఞ్యానసామ్రాజ్యం వల్ల అమరింది.....
ఇతర దేశాల మాదిరిగా కేవల భౌతిక సంపద వల్ల కాదు ....
శ్రీ చాగంటి సద్గురులు ప్రవచనంలో ఒక దెగ్గర చెప్పినట్టుగా, శ్రీ పరమాచార్య వారిని మీరు ఎదైనా కోరుకొండి అని అడిగితే,
" నాకు కావలసింది మీరందరు రోజుకు ఒక 5 నిమిషాలైన శ్రీరామ నామస్మరణ చేయడం....అంతే...."
అని వచించి అంత ఘనమైన రీతిలో
శిష్యోద్ధరణ గావించిన,
శ్రీ ఆదిశంకరాచార్యుల తో మొదలై అవిచ్ఛినంగా కొనసాగే శ్రీకంచికామకోటిపీఠజగద్గురుపరంపరలో 67వ జగద్గురువులుగా ( శ్రీ ఆదిశంకరులను కూడా కలిపితే 68 వ ) యావద్ ప్రపంచం యొక్క శ్రేయస్సును కాంక్షిస్తు
" మైంత్రీం భజతాం.....స్పర్ధాం త్యజతాం...."
అనే ఘనమైన గీతాన్ని భారతరత్న, శ్రీమతి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి గారికి రాసిచ్చి
అది వారిచే U.N వారి కచేరిలో ఆలపించబడి యావద్ ప్రపంచం యొక్క మన్ననలను అందుకునేలా ఆనాడు అనుగ్రహించిన,
అట్లే ఇప్పటికి కూడా వారి బృందావనం నుండే యావద్ ప్రపంచంలోని శిష్యులను అనుగ్రహిస్తున్న
శ్రీ కంచి పరమాచార్య,