Monday, May 18, 2020

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే | మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || :)

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే |
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 3
"ఆ శ్రీవేంకటాద్రి అనే కొండకొసపై దివ్యమంగళాభరణాలను ధరించి దివ్యమైన తన శ్రీచరణాలను ఆశ్రయించమని తన వరదహస్తం తో చూపుతు, వాటిని శరణాగతి గావించిన వారికి సంసార సముద్రం ఎల్లప్పుడు కటిదగ్ధమే అని అభయమోసంగే ఆ దివ్యమంగళమూర్తి సకల మంగళములకు ఆవాసమై ఉండగా అతడికి మంగళము అగుగాక...."
అని మనం సుప్రభాతంలో శ్రీనివాసునికి మంగళ అశాసనం పఠిస్తుంటాము కద.......
సద్గురువుల శ్రీచరణాలు కూడా అట్లే సకలమంగళాలకు ఆవాసమై గురుపాదపద్మములను ఆశ్రయించిన ఎల్లరికి సకల మంగళములను కలగచేయడమే ధ్యేయంగా వారు శిష్యులను అనుగ్రహిస్తు ఉంటారు......
ఆ సద్గురువుల మంగళదాయకత్వం ఎవ్విధముగా శిష్యోద్ధరణ గావిస్తుందో ఒక చిన్న ఎక్సాంపుల్ తో వివరిస్తాను....
"సర్వమంగళాసద్గతిప్రదా....." అని కదా ఆ పరేశ్వరిని మనం స్తుతించేది....
కాబట్టి మంగళ వాచకంతో పిలువబడే ఒక మంగళి తో పోల్చి వివరిస్తాను.....
" అదేంటి బాబు నీకు మరీ చాదస్తం కాకపోతే దీపావళి టపాకుల్లో జీవతత్త్వం అంటావ్, సంక్రాంతి పతంగుల్లో పరతత్త్వం అంటావ్.....
ఇప్పుడేమో కటింగ్ షాప్లో ఉండే బార్బర్ / క్షురకుడి తో పోల్చి గురుత్వ గొప్పదనం యొక్క వివరణ అంటావ్...." అని అంటారేమో......
సులభమైన రీతిలో, అందరికీ అర్ధమయ్యే రీతిలో తత్త్వ ప్రతిపాదన గావించి ఆ గొప్పదనం అందరికి అందించడంలోనే సాహిత్యం యొక్క ఔచిత్యం ఉంటుంది కాని.....
బాగా కాంప్లెక్స్ గా చేసి ఏదో కొందరు అత్యున్నత స్థాయిలో ఉండే సాహితీవేత్తలకే అర్ధమయ్యే రీతిలో చెప్తే ఇక ఆ తత్త్వానికి సార్ధకత ఎక్కడుంటుంది....?
మరీ ముఖ్యంగా అది ఆధ్యాత్మిక తత్త్వచింతనైతే అది అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే దానికి విలువ.... లేనిచో అదొక పెద్ద మహాభారతం లా ఉన్నప్పుడు, అనగా అంత సుదీర్ఘంగా అగ్రాహ్యంగా ఉన్నప్పుడు, ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు సరికద ఇప్పుడు ఎందుకులే....ముసలితనంలో కృష్ణారామా అనుకునే టైంకి చూడొచ్చులే..... అని నిరాదరణకు గురౌతుంది ఆ తత్త్వప్రతిపాదన.....
శ్రీ చాగంటి సద్గురువుల మాటల్లో చెప్పాలంటే,
ఒక గురువు
" అబ్బో...అవన్నీ పెద్ద పెద్ద జ్ఞ్యానులకు మాత్రమే అర్ధమయ్యే విషయాలు...అవి మీకెక్కడ అర్ధమవుతాయిలే....."
అని....శాస్త్రం అంటే ఒక పెద్ద రాకెట్ సైన్స్ లా భయపెట్టే వారు గురువు కాదు...బరువు అవుతారు..."
అట్లే తత్త్వప్రతిపాదనలు గావించే వారు, మరీ ముఖ్యంగా అత్యంత ప్రాముఖ్యత గలిగిన, మహత్తరమైన, ఈ సనాతన ధర్మానికి ఉనికిపట్టైన ధర్మాన్ని పోతపోసుకున్న వారే సద్గురువులు కాబట్టి, ఆ గురుత్త్వం గురించి చెప్పేటప్పుడు కూడా అంతే సరళంగా, సర్వజనగ్రాహ్యంగా, సకలశ్రేయోదాయకంగా చెప్పడంలోనే గొప్పదనం ఉంటుంది అని నా అభిప్రాయం.....
అందుకోసం నాకు క్షురకుడు / బార్బర్ తప్ప వేరే ఉదాహరణ తోచలేదు....😊
కాబట్టి మంగళి చేసే హేర్ కటింగ్ లోనే మనం ఆ సద్గురువుల గొప్పదనాన్ని దర్శిద్దాం.....
ఇల్లు, ఆఫీస్, రొటీన్ జీవితం ....
అనే చక్రం లో సాగిపోయే రెగులర్ లైఫ్లో మనం ఎందరిని కలిసేందుకు వీళుంటుందో ఏమో కాని
రెణ్ణెల్లకు ఒక్కసారైనా సరే కటింగ్ షాప్ కెళ్ళి....
" అన్నా నమస్తే.....ఎట్ట్లున్నవే....ఈ సారి జర స్టైలిష్ గా జెయ్యవ కట్టింగ్.....ఒక ఫంక్షం కి పోవాలె...." అని అలా ఏదో ఒక పలకరింపుతో కట్టింగ్ షాప్కెళ్ళని వారు ఉండరు కద.....😊
ఈ కరోనా బంద్ వల్ల గత కొద్ది కాలంగా హేర్ సెలూన్లు మూతపడ్డాయేమో కాని, మంగళవారం
మినహ బార్బర్ షాప్లు బంద్ ఉండడం చాల అరుదు.....
( మంగళవారం మాత్రమే ఎందుకు బార్బర్ షాప్లు బంద్ ఉంటాయి అనే ఆ ఆధ్యాత్మిక తత్త్వసూక్షం గురించి నేను ఇదివరకే ఒక పాత పోస్ట్లో చెప్పి ఉన్నాను....
ఆ రోజు ఉండే కుజ హోర యొక్క ప్రత్యేకత దృష్ట్యా అలా బంద్ చేయడం అని.....)
ఇక విషయానికి వస్తే,
మంగళి దెగ్గరికి వెళ్ళేది ఎవరు, ఎందుకు......?
అనేది మనందరికి తెలిసిందే......
హేర్ కటింగ్, షేవింగ్, నేల్స్ కటింగ్, ఫేషియల్, జుట్టుకి రంగు, ఇత్యాది మెరుగుల కోసం.....
అక్కడ ఉండేవి ఏంటివి....?
రెండు పెద్ద అద్దాలు, ( మన ముందు ఉన్న గోడకి ఒకటి, వెనక ఉన్న గోడకి ఒకటి....)
కొన్ని కత్తెరలు, ట్రిమ్మింగ్ మిషీన్లు, బ్లేడ్లు, బ్రష్లు, మొదలైన వస్తువులు......
కట్టింగ్ షాప్ కి వారానికి వంద మంది వచ్చినాసరే అందరు కూర్చునేది అదే కుర్చీల్లో, క్రాఫ్ దువ్వుకొని చూసుకునేది అదే అద్దాల్లో, అందరి కటింగ్ కి ఉపయోగించబడేది అవే కత్తెరలు, ట్రిమ్మర్లు, బ్రష్లు
( అఫ్కోర్స్ శుభ్రపరిచి ఉపయోగించడం అని చెప్పడం.....),
అందరికి కటింగ్ చేసేది ఆ బార్బరే.....
కటింగ్ షాప్ లోపలికి వెళ్ళేటప్పుడు పెరిగిన జుత్తు, మీసాలు, గడ్డాల తో బైరాగులలా వెళ్ళినవారు ఆ
" క్షురక సంస్కారం.... " అయిన తర్వాత ఎవరికి వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లా ఫీలైపోతు కాలర్ ఎగరేస్తు, అప్కమింగ్ టాలివుడ్ / బాలివుడ్ / హాలివుడ్ యాక్షన్ హీరో ఇక వారే అనే రేంజ్లో పోజులు కొడుతూ బయటికి రావడం కద్దు.....కద...😊
( స్కూల్ డేస్ లో నా స్కూల్ ఫ్రెండ్ చాణిక్య అని ఒకడుండేవాడు.....
మా ఇద్దరిది ఒకే బస్తి....ఇద్దరివి ఒకేలా ఉండే పేదలకుండె రెండు రూముల రేకుల ఇల్లు, ఇద్దరం స్కూల్ కి కొంచెం లేట్ గా వెళ్ళే బ్యాట్చ్, అలా చాలా వాట్లో ఒకరికికొకరు అన్నట్టుగా ఉండేది మా స్వార్ధరహితమైన, గర్వరహితమైన, స్నేహం.....
కాని స్కూల్ కి వెళ్ళగానే వాడు లాస్ట్ బెంచ్లో, నేను ఫస్ట్ బెంచ్లో..., ఎగ్సాంస్ టైం అనగానే వాడు మళ్ళీ నాదెగ్గరే అన్ని నేర్చుకోవడం, చూసి రాయడం అలా చాలా కామెడి గా ఉండేది మా కల్మషరహితమైన స్నేహం.....
అన్నిట్లో నా లోకం నాది, వాడి లోకం వాడిది......
వాడికి ఎగ్సాంస్ టైం అనగానే నేను గుర్తొచ్చిన్నట్టు, నాకు హేర్ కటింగ్ టైం అనగానే వాడు గుర్తొచ్చే వాడు...😊
" హేర్ కటింగ్ అనగానే, ఎప్పుడు చూసినా సుద్ద పప్పు మొహం తో నువ్వు నీ డిప్ప కటింగ్.....ఏంద్రా అసల్ ఆ కటింగ్....వినైగాడు కటింగ్ చేస్కొని వస్తుండంటే క్లాస్ లోకి పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు విజిల్ వేయాలిర అందరు....క్లాస్ లీడర్ అంటే ఎట్లుండాలిర నీ స్టైల్....."
అని, క్లాస్ లో చాల మందికి కామన్ ఫ్రెండ్ అయిన బాలు అనే ఒక ఫ్రెండ్ కటింగ్ షాప్ కి తీస్కెళ్ళి స్టైలిష్ కటింగ్ దెగ్గరుండి చేయించేవాడు.....
వాడు పవన్ కల్యాణ్ కి అప్పట్లో వీరాభిమాని కావడంతో వాడి సోకులు కూడా అట్లే ఉండేవి.....😂
అలా కటింగ్ చేసుకున్న రెండు మూడు రోజులు వరకు నేను కూడా హీరో లా బిల్డప్ ఇచ్చే వాడిని.....ఆ తర్వాత మళ్ళి పుస్తకాల పురుగు గా నా రొటీన్ నాదే..... )
సొ ఇప్పుడు అక్కడ కటింగ్ షాప్లో బార్బర్ మనకు ఎక్కడినుండో ఏదో తెచ్చి అలా మనల్ని ' హీరో ' గా మార్చాడా...?
లేదా అస్తవ్యస్తంగా ఉన్న మన జుత్తునే తన క్షురక వృత్తి నైపుణ్యంతో ఒక క్రమంగా కొరిగి మనకు ఆ నూతన ' హీరో లుక్' ఇచ్చాడా....?
అలా కటింగ్ అయిన తర్వాత కత్తిరించబడి క్రింద పడిన జుత్తుని అసల్ మనం పట్టించుకోము.....
కాని కత్తిరించబడి మన నెత్తిపైనే ఉన్న మిగతా జుట్టును చూసి...
" వావ్.....వాట్ ఏ హీరో హేర్ స్టైల్ ఐ హావ్ గాట్....!" అని ఒ పదిసార్లు అద్దం లో ఎగాదిగా చూసుకొని దూస్కొని మురిసిపోతుంటాం.....?.....అవునా....?
మనల్ని చూసి బార్బర్ కూడా ఓ చిరునవ్వు నవ్వుతాడు.....
" ఈ క్రాఫ్ ఎన్ని రోజులు ఉంటుంది గనక.....మళ్ళీ నెలకో రెణ్ణెల్లకో జుత్తు పెరగగానే..... 'అన్నా కటింగ్ చేయవా....' అని మళ్ళిఒస్తాడు.... కటింగ్ అయ్యాక మళ్ళీ ఓ పదిసార్లు అద్దంలో చూస్కొని మురిసిపోతుంటాడు.....ఇది షరామామూలే....కద...." అని బార్బర్ అనుకుంటాడు.....
" ఈ క్రాఫ్ లో అసల్ నన్ను మించిన హీరో ఎవరు ఉండరు....అందుకే బార్బర్ చిరునవ్వు...." అని మనం అనుకుంటాము....
అలా ఆ కటింగ్ అనే ప్రాసెస్ లో, జీవిత పర్యంతంలో కొన్ని వందల కిలోల జుత్తు, కత్తిరించబడి రాలిపోవడం అనే మహాప్రస్థానం లో మనం ఏనాడు కూడా ఆ కత్తిరించబడిన జుత్తు గురించి అసల్ పట్టించుకోము.....ఎప్పుడూ కూడా కటింగ్ అయిన తర్వాత నెత్తిపై ఉండే ఆ పావ్ కిలో జుత్తు / క్రాఫ్ గురించే మన తపన మొత్తం..
( ఆ బార్బర్ తపన కూడా) ....అవునా...?
మొత్తం జుత్తు కొరిగించుకొని బోడిగుండు చేయించుకోవడానికి బార్బరే అక్కర్లేదు, ఎవరైనా ఆ పని ఇట్టే చేయగలరు.....
( 'ఆధ్యాత్మికత అంటే ఏముంది....వైరాగ్యంతో అన్నీ వదిలివేయడమే.....'
అని, జీవితానికి ఉపకరించే వాస్తవిక బోధలు కాకుండా ఇలా మెట్ట వేదాంతం వల్లించేవారు, చక్కని కటింగ్ చేయమని అడిగితే బోడిగుండు చేసేవారు అన్నమాట....)
అలా హీరోయిక్ గా, స్టైలిష్ గా కటింగ్ చేసి మనం మెరిసేలా, మురిసిపోయేలా చేయడం లోనే బార్బర్ యొక్క గొప్పదనం ఉంటుంది....అవునా...?
మన నెత్తి, మన జుట్టే అయినా సరే,
నువ్వు ఎంత తోప్ అయినా సరే,
అది మనకు మనం చేసుకోలేము కాబట్టే ఆ కళలో ఆరితేరిన ఒక బార్బర్ దెగ్గరికి వెళ్ళేది....అవునా....?
అలా చక్కనైన " క్షురక సంస్కారం " పొందడం అనేదే చక్కనైన " భక్తి / జ్ఞ్యాన సంస్కారం " పొందడం......
నువ్వు ఎంత తోప్ అయినా అయ్యుండొచ్చు, నీ దెగ్గర ఎంత జుత్తైనా పెరిగిఉండొచ్చు, కాని ఒక ఆరితేరిన
బార్బర్ దెగ్గర తలవంచి క్షురక సంస్కారం పొందితే తప్ప నీకు " హీరోయిక్ లుక్ " రాదు....
అట్లే ఒకరు లౌకికంగా ఎంత తోప్ అయినా అయ్యుండొచ్చు.....
కాని ఒక చక్కని బ్రహ్మజ్ఞ్యాని అయిన సద్గురువును ఆశ్రయించి వారికి వినమ్రంగా నమస్కరించని నాడు భక్తి / జ్ఞ్యాన సిద్ధి లభించి మన ఆత్మ అనే ప్రతిబింబంలో ఆ పరమాత్మ యొక్క దర్శనం లభించి, అనగా ఆ పరమాత్మ యొక్క తత్త్వ దర్శనం లభించి ఆనందించడం, అనేది కుదరదు.....
మనకుండే సకల ఐహిక భావాలు, మన అసంఖ్యాకమైన సంకల్ప వికల్పాల సమూహం అనే మన మనసు,
మన చిత్త వృత్తులు, మన మనో బుద్ధి అహంకార చిత్త జనితమైన, అనివార్యమైన, అత్యంత సహజమైన, సకల జీవ భావనలు,
మన జీవితంలో అలా నిరంతరం పెరిగే వందలకొలది వివిధ రోమరాశులు.......
కటింగ్లో రాలిపోయిన రోమాల గురించి మనం ఏవిధంగా పెద్దగా పట్టించుకోమో, అలా మననుండే ప్రభవించి మననుండి తొలగించివేయబడిన ఆ అనవసర సోది కి సంబంధించిన చిత్తవృత్తుల భావలహరుల గురించి మనం పెద్దగా
పట్టించుకోము....
కటింగ్ అనే ప్రాసెస్ లో బాగ పదునైన కత్తెరతో, బ్లేడ్ తో, ఎప్పుడు ఎక్కడ ఏవిధంగా ఏది ఎంత వరకు కత్తిరించాలో, అలా మనకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా కత్తిరించి " క్షవరం " అనే సంస్కారం ప్రసాదించి, అద్దంలో మనల్ని మనమే చూసుకొని మురిసిపోయేలా చేసేవారు బార్బర్స్.......
అక్కడ వాళ్ళు మనకున్న అనవసర బరువును తొలగించి ఆ కొత్త హేరోయిక్ కళను కలిగించారు..... అంతే తప్ప మనకు కొత్త బరువులు ఏమి తగిలించలేదు....అవునా...?
అచ్చం అదే విధంగా సద్గురువుల గురుత్వం / శిష్యోద్ధరణ అనే నిరంతర ప్రాసెస్ లో వాళ్ళు మనకు కొత్తగ ఎక్కడినుండో ఏవో బరువులు తెచ్చి తగిలించరు......
వారి యొక్క హితవచనాలు అనే పదునైన వాక్కులతో అజ్ఞ్యానం అనే జడరాశిని తొలగించి నిరంతరం ఊగిసలాడే మన చిత్తవృత్తులను సంస్కరించి మనలోనే నిరంతరం కొలువైఉండే ఆ దేదీప్యమానమైన పరమాత్మయొక్క దర్శనాన్ని
( ' ఆత్మసాక్షాత్కారం ' గా భావించబడే ఆ ) అద్వైతానుభవ స్థితి గా మనకు గ్రాహ్యపరుస్తారు.......
అందుకోసం వారు ఎంతగానో శ్రమించి వారి యొక్క సకలశాస్త్రపారంగత్వం తో మనకు సరైన విధంగా సరళమైన బోధ గావించి ఆ భగవద్ భక్తి జ్ఞ్యానం అనే తైజసిక ' రుచిని ' మనకు వారి సద్వాక్కుల అనుగ్రహం తో ఆపాదించి , మన మదిలోనే, ఎదలోనే ఆ దివ్యమైన అద్వైతానుభూతిని మన అనుభవంలోకి తీసుకువచ్చి మనం ఆనందించేలా చేస్తారు.......
కటింగ్ మొత్తం అయ్యాక ఒక వ్యక్తి ముందున్న అద్దంలో కాసేపు, వెనకున్న అద్దంలో కాసేపు చూసుకొని మురిసిపోయినట్టు,
సద్గురువులచే అనుగ్రహించబడిన బోధ తర్వాత మనం కూడా ఆ భగవద్ భక్తి జ్ఞ్యాన సుధాపానంతో మనలోనే ప్రభవించే ఆనందామృతరసాస్వాదనను రెండు అద్దాల్లో చూసి ముసిరిపోతు ఆనందిస్తుంటాము.....
మన ముందున్న అద్దమే మన బుద్ధి....
మన వెనకున్న అద్దమే మన మనసు....
నిరంతరం ప్రతిఒక్కరు తరచి చూసేది ఈ రెండు అద్దాల్లోనే......
బుద్ధి అనే ముందు ఉండే అద్దం, మనసు అనే వెనక ఉండే అద్దం తాలూకా ప్రతిబింబాన్ని కూడా మనకు చూపగలదు....జాగ్రత్తగా మనం పరికించగలిగితే.....
అందుకే కటింగ్ షాప్లో మనం వెనక్కి తిరగనవసరం లేకుండానే ముందున్న అద్దంలోనే మన మెడ భాగంలో కటింగ్ బాగా చేసారలేదా అనేది కూడ చూస్కుంటాం కద.....
అంతే తప్ప మెడను వెనక్కి తిప్పి చూసుకోము కద....
అంటే దాని అర్ధం మన బుద్ధిని సంస్కరించినప్పుడు మన మనసును కూడా అది ప్రభావితం చేస్తుంది.....
తదనుగుణంగా మన మనసును కూడా మన అధీనంలోనే ఉండేలా చేస్తుంది....
ఇదేంటి వినడానికి కొంచెం వింతగా ఉంది అని అంటారేమో......
ఒక చిన్న ఎగ్సాంపుల్ చెప్తా చూడండి......
ద్రాక్షపళ్ళు తింటే అత్యంత త్వరగా ఉబ్బసాన్ని కలిగించి బాగ ఇబ్బంది పెడుతుంది అనేది సత్యం.....
ఈ సత్యాన్ని రూఢం గావించి మదిలో నిలబెట్టుకోవడం బుద్ధిని సంస్కరించుకోవడం....
ఒక వైపు బుద్ధి చెప్తుంది....
"ఓ నా నాలుక నేస్తమా..... ద్రాక్షపళ్ళజోలికి వెళ్ళకు...." అని...
కాని మరో వైపు మనసు చెప్తుంది...
"ఓ నా నాలుక నేస్తమా.... ఎం కాదులే....ఈ ఒక్కసారికి ఒక పది ద్రాక్షలు గుటుక్కుమని మింగెయ్...
మళ్ళీ ఎప్పటికి తింటామో ఏమో....
అంతగా ఆస్తమ ఒస్తే ఇన్హేలర్ ఉంది కద.....ఉమ్మ్ తినెయ్ ద్రాక్షలు....." అని.....
ఇప్పుడు ద్రాక్షలు తింటే...
మీకు బుద్ధి బలం ఉంది కాని మనో బలం లేదని అర్ధం....
"మనసు అట్లే చెప్తుంది.....దానికి పొయ్యేదేముంది.....తిన్నతర్వాత....
' మరీ ఎక్కువ ఎందుకు తిన్నావు.....ఒక రెండు తింటే సరిపోయేది కద....'
అని మళ్ళీ అదే బుకాయిస్తుంది..."
కాబట్టి ద్రాక్షల జోలికి వెళ్ళకపోవడమే మంచిది...."
అని అప్పటికప్పుడే మనసును బుద్ధిబలంతో సంస్కరిస్తే మనో బలం కూడా అక్కడ సమకూరినట్టే...
కాబట్టి ఎప్పుడూ బుద్ధిదే పై చేయిగా ఉండేలా చేస్తే మన మనసు తనంత తను మన అదుపాజ్ఞ్యలలోనే ఉండడం ఖాయం....
మనసు అదుపులో మనం ఉంటే.....
పడవలో నీరున్నట్టు.....
మన అదుపులో అది ఉంటే నీటిపై పడవ ఉన్నట్టు.....
మరి ఇంతకీ ఈ మనసు, బుద్ధి అనే రెంటికి కూడా సాక్షిత్వాన్ని నెరపేది ఎవరన్నట్టు....?
అదే మన చిత్తం.....!
( In simpler words, chittam is like an axle that connects these two wheels called Buddhi and Maanas to get the vehicle called body keep going in a smooth fashion.....)
అంటే ఒక వైపు మనోబలం మరో వైపు బుద్ధిబలం అనే ఇరు చక్రాలను ఆధారంగా చేసుకొని పనిచేసే అత్యంత శక్తివంతమైన బ్యాలిస్టిక్ మిసైల్ లాంచర్ / బాంబర్
లాంటిదే మన చిత్తం...... సంధించబడే ఆ అత్యంత శక్తివంతమైన మిస్సైలే మన సంకల్పబలం......
చిత్తం ఎంత దృఢంగా తననుతాను స్థిరీకరించి సంకల్పబలం అనే ఆ మిస్సైల్ ని సంధిస్తుందో, ఎంతో బలంతో ఎంత దూరమైన ఆ మిస్సైల్ వెళ్ళగలదు.....నిర్ణీత గురిని భేదించుటకు.....
ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనోబలం, బుద్ధిబలం, తన్మూలంగా చిత్తబలం వీటన్నిటివల్ల సమకూరిన సంకల్పబలం, అన్నీ ధృఢంగా ఉన్నప్పుడే ఆ మిస్సైల్ 14 భువనాలను సైతం భేదించగల జవంతో దూసుకుపోతుంది.....
కాబట్టి మన మనసుకు, బుద్ధికి, చిత్తానికి, సంకల్పబలానికి, అంతటి ధృఢమైన శక్తి సమకూరాలంటే కేవలం అవి సద్గురువుల సద్వాక్కులచే సంస్కరింపబడినప్పుడే వాటికి అంతటి శక్తి సమకూరి మన సంకల్పం నెరవేరుతుంది.......
అందుకే సద్గురువుల స్థానం ఎంతో ఉన్నతమైన ఎవరెస్ట్ శిఖరాగ్రం వంటిది.... ఏకొద్ది మంది మహనీయులు మాత్రమే అక్కడికి చేరికొని మనకి జీవితంలో 360 డిగ్రీల మార్గనిర్దేశం గావించి ఉద్ధరించడం అనేది జరిగేది.....!
శ్రీమలయప్పస్వామివారికి ఎందరెందరో మహానుభావులు / భక్తులు సమర్పించిన ఎన్నో ఆభరణాలు ఉన్నాయి.....
కాని మీరు గమనించారో లేదో, గరుడోత్సవం లాంటి ముఖ్యమైన ఉత్సవాలకు మన మలయప్ప ఎప్పుడూ ధరించేది ఈ గుమ్మడికాయలా ఉండే కిరీటాన్నే...!
సంప్రదాయంలో ఈ ఘనకిరీటాన్ని " గురుకిరీటం " అని వ్యవహరిస్తారు.....
అది ధరించి మనకు దర్శనం ప్రసాదించే శ్రీ భూ సమేత శ్రీనివాసుడు తన సార్వభౌమత్వం లో దాగిన గురుత్వాన్ని కూడా మనకు ఎరుకపరుస్తున్నాడు కద....😊
అందుకే అన్నమాచార్యుల వారు కూడా
స్వామి వారిని అందరికి గురుడు అంటూ,
సానబట్టిన భోగి గా ఉండే జ్ఞాన యోగి
ఆతడు...
అని ఎంతో చక్కనైన సంకీర్తనలో మనకు శ్రీనివాసుడి శ్రీకరమైన గురుత్వాన్ని చాటిచెప్పారు.....
306.tAne tAnE yiMdari guruDu-ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
Archive Audio link : G Balakrishnaprasad
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||
చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి|
తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి ||
చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి ||
ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి ||
చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై |
వినరగ సంసార యోగము గృపసేయు | అనిమిషగతుల నభ్యాసయోగి ||
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 🙏😊

No comments:

Post a Comment